మహాకూటమి

15:05 - December 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి ఎన్నికల పండుగ జరగనుంది. అదే గతంతో వాయిదా పడిన పంచాయితీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వాతావరణ రానుంది. ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ బిజీగా గడిపిన నాయకులు తమ స్వస్థలాలలో కూడా తమ పార్టీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయితీ ఎన్నికలకు పార్టీల నేపథ్యంలో అవసరం లేకపోయినా ఇప్పుడు పంచాయితీ ఎన్నికలంటే అసెంబ్లీ ఎన్నికలంత హడావిడి జరుగుతుండటం చూస్తునే వున్నాం. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిగా వున్న టీజేఎస్ పార్టీ పంచాయితీ ఎన్నికల్లో స్వతంత్ర్యంగానే పోటీకి సిద్ధపడుతోంది. 
ఈ మేరకు ఆ పార్టీ అధినేత కోదండరాం సంకేతాలు ఇచ్చారు.పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడిందని... సైద్ధాంతికంగా కూటమి కొనసాగుతుందని కోదండరాం తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చేలా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
 

 

11:30 - December 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ పోలింగ్ ప్రశాతంగా పూర్తయింది. దీంతో ఫలితాల కోసం నేతలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా వున్న క్రమంలో సీఎం పదవి ప్రమాణస్వీకారం కోసం ముహూర్తాలను కూడా ఖరారు చేసేసుకుంటున్నారు. పంచమి తిథి, బుధవారం మంచి రోజు కావటంతో ప్రమాణస్వీకారం కోసం బుధవారం డిసెంబర్ 12న ముహూర్తం పెట్టేసుకుంటున్నారు. 
ఫలితాల అనంతరం ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసేసుకుంటున్నారు.టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మరోమారు సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారు. ప్రజాఫ్రంట్ గెలిస్తే కనుక కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌నే ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది. మరి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇప్పటివరకూ క్లారిటీ లేకపోయినా వారు కూడా బుధవారం రోజునే ప్రమాణస్వీకారం ముహూర్తం పెట్టకున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. 
బుధవారం పంచమి కావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత మంచి రోజులు లేకపోవడంతో బుధవారమే ప్రమాణ స్వీకారం కానిచ్చేందుకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కూటమి కనుక విజయం సాధిస్తే మంగళవారమే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. 12న ఆ నేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందినట్టు చెబుతున్నారు.  కూటమిలోని పార్టీలు గెలిచిన సీట్లను బట్టి మంత్రి పదవుల పంపకం ఉంటుందని సమాచారం.  
 

07:37 - December 10, 2018

హైదరాబాద్ : అందరిలోనూ ఉత్కంఠ..ఎవరు గెలుస్తారు..ఎవరు ఓడుతారు..ఎవరు అధికారంలోకి వస్తారు...ఎన్నికల కౌంటింగ్ కోసం రాజకీయ పార్టీలు..అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అందరి అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరలా టీఆర్ఎస్ అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నా..కాదు..కాదు..తామే అధికారంలోకి రానున్నామని మహాకూటమి పేర్కొంటోంది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు..అభ్యర్థుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 
డిసెంబర్ 7న పోలింగ్...
డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 11వ తేదీ ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియలో అన్ని పార్టీల వారు అప్రమత్తమయ్యారు. పార్టీల ఏజెంట్లకు పార్టీ అధిష్టానం సలహాలు..సూచనలిస్తోంది. లెక్కింపు కేంద్రాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని..ఏ మాత్రం పొరపాటు జరిగినా..మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తోంది. ప్రధానంగా గులాబీ దళం...కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనేది ఆసక్తి కనిపిస్తోంది. అధికారం ఎవరు చేజిక్కించుకుంటారనే దానిపై జోరుగా బెట్టింగ్‌లు కూడా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 11న ఈ ఉత్కంఠకు తెరపడనుంది. 

  • రాష్ట్రంలోని 31 జిల్లాలు..119 నియోజకవర్గాలు..1821మంది అభ్యర్థులు..
  • టీఆర్‌ఎస్‌ 119 మంది అభ్యర్థులు..
  • కాంగ్రెస్‌ 99 మంది...
  • టీడీపీ 13 స్థానాలు..
  • సీపీఐ 3 స్థానాలు..
  • ఎంఐఎం 8 స్థానాలు..
  • బీజేపీ 118 స్థానాలు..
  • బీఎస్పీ 107 స్థానాలు...
  • బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) 107 మంది... ఇందులో సీపీఐ(ఎం) 26 స్థానాలు..బహుజన లెఫ్ట్‌ పార్టీ(బీఎల్పీ) 81 స్థానాలు...
  • సత్వంత్రులు, ఇతరులు 1306 మంది...
18:40 - December 9, 2018

విజయవాడ: తెలంగాణలో అధికార మార్పిడి ఖాయం అని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. ప్రజాకూటమి విజయం తథ్యమన్నారాయన. వైసీపీ అధినేత జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. టీఆర్ఎస్‌కు లోపాయికారిగా సహకరించినా.. ప్రజలు మహాకూటమికే పట్టంకట్టబోతున్నారని బుద్దా వెంకన్న చెప్పారు. తెలంగాణలో ప్రజాకూటమి గెలవబోతోందన్న బుద్దా వెంకన్న.. దానికి ముఖ్యకారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని చెప్పారు. తెలుగువారు దమ్ము, ధైర్యంతో మహాకూటమి ఏర్పాటు చేసి.. తెలుగు ప్రజలంతా ఐక్యమంతంగా ఉండాలని, తెలుగు ప్రజలకు ద్రోహం జరక్కుండా చూసేందుకు చంద్రబాబు మహాకూటమిలో భాగస్వామ్యం అయ్యారని బుద్దా వెంకన్న చెప్పారు.

07:06 - December 8, 2018

హైదరాబాద్ : ఓ వైపు అధికారిక కార్యక్రమాల్లో బిజీ..బిజీ...మరోవైపు ఎన్నికల్లో ఏం జరుగుతోంది...ప్రజల నాడి..ఎలా ఉంది...ఓటర్ ఎటువైపు ఉన్నాడు..గెలుపు మనదేనా..అంటూ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు పార్టీ నేతలతో చర్చలు జరిపారు. డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై బాబు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. పార్టీ నేతలకు పలు సూచనలు చేసిన బాబు సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై తెలంగాణ పార్టీకి సంబంధించి కీలక నేతలతో సమాలోచనలు జరిపారు.
మహాకూటమిదే విజయమన్న బాబు...
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత చూశానని చెప్పిన బాబు...మహాకూటమి విజయం తథ్యమని పేర్కొన్నారంట...అంతేగాకుండా 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ఎలా జరిగింది..అక్కడ ఎంత మేర పోలింగ్ శాతం నమోదైందని ఆరా తీశారు. ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాదని పార్టీ నేతలతో పేర్కొన్నారు. 2014 జాతీయ మీడియా, ఏపీ మీడియా పసిగట్టలేకపోయాయని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. 
పోలింగ్ పర్సంటేజ్‌ను తెలుసుకున్న బాబు...
13 నియోజకవర్గాల పోలింగ్ పర్సంటేజ్‌ను తెలుసుకున్నారు...హైదరాబాద్...రంగారెడ్డి జిల్లాల్లో ఓటింగ్ తక్కువగా నమోదు కావడంతో టీడీపీ నేతలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేసినట్లు...అనూహ్యంగా ఓటింగ్ పెరగడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. 
> అమరావతి నుండి తెలంగాణ ఎన్నికలపై బాబు సమీక్ష...
పర్సంటేజ్ పెరిగితే గెలుపు అవకాశాలు సులభమని సూచనలు...
ఎగ్జిట్ పోల్స్‌పై పార్టీ నేతలతో బాబు చర్చలు...
> ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాదని బాబు అభిప్రాయం...

06:48 - December 8, 2018

హైదరాబాద్ : తమదే గెలుపు..కాదు..తామే గెలుస్తాం..ప్రత్యర్థులను మట్టికరిపిస్తాం..ఈసారి అధికారంలోకి వచ్చేస్తున్నాం..అంటూ ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 2014లో టీఆర్ఎస్‌కు పట్టం కట్టిన ప్రజలు 2018లో జరిగిన ఎన్నికల్లో సైతం గులాబీకి జై కొడుతారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి..అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం భిన్నంగా వచ్చాయి...దీనితో విజయంపై హస్తం నేతలు ధీమాగా ఉంటున్నారు. 62-70 స్థానాల్లో విజయం సాధిస్తామని..ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని నేతలు పేర్కొంటున్నారు. సంతోష పడే హక్కు మంత్రి కేటీఆర్‌కు ఉందని సీపీఐ నేత నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 80 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొమటిరెడ్డి రాజగోపాల్...ప్రజలంతా తమ వైపు ఉన్నారంటూ ఆయన ధీమాగా ఉన్నారు...62-74 స్థానాల్లో గెలుస్తామంటూ గూడూరు నారాయణ రెడ్డి భిన్నంగా వ్యాఖ్యానించడం విశేషం. 
డిసెంబర్ 7న పోలింగ్...
డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిడయంతో ఎన్నికల అధికారులు..ఈసీ ఊపిరిపీల్చుకుంది. పోలింగ్ ఇలా ముగిసిందో..లేదో..అలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. గెలుపు మళ్లీ టీఆర్ఎస్‌దేనని కొన్ని పేర్కొంటుండగా మరికొన్ని భిన్నంగా పోల్స్ ప్రకటించాయి. దీనితో తమదే విజయం అంటూ అధికార పార్టీ..కాదు..తమదే విజయమని ప్రతిపక్ష నేతలు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్‌ని ఎదుర్కొనేందుకు మహాకూటమి పేరిట కాంగ్రెస్, టీ.టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఒక్కటైన సంగతి తెలిసిందే...డిసెంబర్ 11న ఎవరు అధికారంలోకి వస్తారనేది తెలుస్తుంది..
> మొత్తం నియోజకవర్గాలు 119
పోటీలో ఉన్న అభ్యర్థులు 1821
టీఆర్ఎస్ 119
టీడీపీ 13
కాంగ్రెస్ 99
సీపీఐ (ఎం) 26
సీపీఐ 03
బీఎల్‌పీ 81
ఎంఐఎం 08
బీఎస్పీ 107

06:47 - December 7, 2018

హైదరాబాద్: తెలంగాణలో కీలక ఘట్టానికి తెరలేసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్‌కు అధికారులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల విధుల్లో 2 లక్షలమంది సిబ్బంది ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో(13 నియోజకవర్గాల్లో) మాత్రం 4 గంటలకే నిలిపివేస్తారు. ఈ ఎన్నికల్లో తొలిసారి వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల తన ఓటు ఎవరికీ పడిందీ తెలుసుకునే వీలు ఓటరుకు ఉంటుంది.
తెలంగాణలో మొత్తం 55,329 బ్యాలెట్ యూనిట్లు, 42,751 వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు.  శేరిలింగంపల్లిలో అత్యధిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి బరిలో అత్యధికంగా 42మంది, బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 3,873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 280 పోలింగ్ కేంద్రాలున్నాయి.
మొత్తం 119 నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ 119 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 99, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3, ఎంఐఎం 8, బీజేపీ 118, బీఎస్పీ 107,  సీపీఎం 26, ఎన్‌సీపీ 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
25 నియోజకవర్గాల్లో 15 మంది లోపే పోటీ చేస్తుండగా, 76 నియోజకవర్గాల్లో 16 నుంచి 31 మంది పోటీ చేస్తున్నారు. 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో 32 కంటే ఎక్కువమంది బరిలో ఉన్నారు. మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,41,56,182 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,39,05,811 మంది. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించనున్నారు. మరోసారి అధికారం తమదే అని టీఆర్ఎస్, ఈసారి గెలుపు తమదే అని ప్రజాకూటమి నేతలు విశ్వాసంగా ఉన్నారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

10:19 - December 6, 2018

హైదరాబాద్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన మరోసారి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికలకు రూ. 1200 కోట్లను చంద్రబాబు తరలించారంటూ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డిసెంబర్ 6వ తేదీన బాబుపై మరో ట్వీట్ చేశారు.
మరో రూ. 500 కోట్లు...
‘‘టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే చర్లపల్లి జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు టెన్షన్ పడుతున్నాడు...ఓటుకు నోటు కేసు దర్యాప్తు చివరి దశకు వచ్చినందున నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు... రూ. 1200 కోట్లు సరిపోకపోతే మరో రూ. 500 కోట్లను ఏర్పాటు చేస్తానని నిన్న రాత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని తన నివాసానికి పిలిపించుకుని మరీ చెప్పారు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 
బాబు ప్రచారం...
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పేరిట టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కలిసిన సంగతి తెలిసిందే.
అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా నిర్వహించారు. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

07:05 - December 6, 2018

జూపూడి ఇంట్లో డబ్బుల కలకలం...
ఇంటి వెనుక నుండి పారిపోతున్న యువకులను పట్టుకున్న టీఆర్ఎస్ నేతలు...
జూపూడిని అరెస్టు చేయాలన్న గులాబీ నేతలు...

హైదరాబాద్ :
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది..ఇక ప్రలోభాలకు తెరలేచింది. ఆఖరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు..మద్యం..బంగారు ఆభరణాలు పట్టుబడుతున్నాయి. డిసెంబర్ 5వ తేదీ రాత్రి కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ఇంట్లో భారీగా డబ్బులున్నాయనే ప్రచారం కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు డబ్బు సంచులతో పారిపోతుండగా పట్టుకోవడం జరిగిందని..అందులో ఒకరు దొరికారని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని..వెంటనే జూపూడిని అరెస్టు చేయాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వ్యక్తులు ఎవరు ? డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనేది తెలియాల్సి ఉంది. 

11:48 - December 5, 2018

ఖమ్మం : కేసీఆర్ అందితే జట్టు..లేకపోతే కాళ్లు పట్టుకుంటాడని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్‌తొ పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్...55 సీట్లలో 25 గెలిచారు...2009లో టీడీపీ పొత్తు పెట్టకుని 44 సీట్లలో 10 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొందని..టీఆర్ఎస్ చిత్తు చిత్తుగా ఓడిపోయి...ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందన్నారు. కొత్తగూడెం అశ్వరావుపేటలో బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 37 సంవత్సరాలుగా కాంగ్రెస్‌తో పోరాడిన టీడీపీ..ప్రస్తుతం దేశ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న బాబు...తెలంగాణకు 64 శాతం సర్వీస్ సెక్టార్ వల్ల ఆదాయం వస్తోందన్నారు.
హామీలను విస్మరించారు...
టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను ముందే ప్రకటించారని..అందులో చెడ్డవారు లేరా ? అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రజాప్రతినిధులు..ప్రభుత్వం అందుబాటులో ఉండాలన్నారు. బస్సు యాక్సిడెంట్..అయినా..తిరగలేని కేసీఆర్..ఇప్పుడు మాత్రం హెలికాప్టర్‌ల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో పది లక్షలు నివాసాలు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ముందుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని ఓడించి తీరుతామని..ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - మహాకూటమి