మహాజనం

19:40 - October 17, 2017
09:21 - March 20, 2017

సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర చరిత్రాత్మక పాదయాత్ర అని, 150 రోజులకు పైబడి సాగిన ఈ యాత్ర చరిత్ర సృష్టించిందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు ఆదివారం వచ్చారు. ఈసందర్భంగా టెన్ టివి అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్ ఆయనతో ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర నినాదాలపై ఆసక్తిని కనబరిచి వారు మద్దతిచ్చారని తెలిపారు. కిలోమీటర్ల కొద్ది పాదయాత్రతో కలిసి సాగారని, ఏది ఏమైనా ఇది ఘనవిజమన్నారు. కేరళ రాష్ట్రంలో పేదలు లబ్దిపొందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు చాలా సమస్యల్లో ఉన్నారని, సామాజిక న్యాయం అన్నది తమ దృష్టిలో ప్రధానాంశమన్నారు. అభివృద్ధి సామాజిక న్యాయంపైనే ఆధారపడిందని, ఈ దిశగా తాము నాలుగు మిషన్లను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా తాము నవ కేరళలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం పినరయి స్పష్టం చేస్తున్నారు.

07:52 - March 16, 2017

తెలంగాణ రాష్ట్ర మంత్రి..ఉద్యోగాలిచ్చే కేటీఆర్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని మహాజన పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా తమ్మినేనితో 'మల్లన్న' ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు. కేటీఆర్ పరిశ్రమలు పెడుతానని చెప్పారు..టీ పాస్ లు..ఐపాస్ లు అంటున్నాడు...ఏమీ లేదు..దద్దమ్మ మంత్రిలా ఉన్నాడని విమర్శించారు. ఒక్కరికి ఒక్క ఉద్యోగం లేదన్నారు. ఉద్యోగాల మంత్రి ఈయనే కదా..కేసీఆర్ ఏమో ఉన్న ఉద్యోగాలిస్తారు..మరి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వందల స్కూళ్లు తిరగడం జరిగిందని తమ స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు పేర్కొంటున్నారని, ట్రైనింగ్ తీసుకుని ఖాళీగా ఎంతో మంది టీచర్లు ఉన్నారు. ఒక్క సంతకం పెడితే అయిపోతది కదా అని తమ్మినేని పేర్కొన్నారు. తమ్మినేని మాటల్లోనే వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

17:31 - March 15, 2017

యాదాద్రి : సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రలో మహిళా నాయకురాలు రమ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. గత 150 రోజులుగా పాదయాత్ర జరుగుతోంది. గ్రామాల్లోని మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలపై పోరాటం చేసేలా వారిని సంఘటితం చేయాల్సినవసరం ఉందని రమ పేర్కొన్నారు. పాదయాత్ర విరామ సమయంలో ఆమె టెన్ టివితో మాట్లాడారు. మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రమతో టెన్ టివి మాట్లాడింది. ఈ సందర్భంగా పలు విశేషాలు..విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:31 - March 14, 2017

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కేసీఆర్‌ చెబుతున్న అభివృద్ధి గ్రామాల్లో ఎక్కడ కనిపించడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రలో సామాజిక అంశాలు లెవనెత్తడంతో..తన సీఎం కుర్చికి ఎసరొస్తుందని కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. తమ అజెండా చాలా శక్తివంతమైందన్నారు. అట్టడుగు కులాలకు సంక్షేమంతో పాటు చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న తమ్మినేని టెన్ టివితో మాట్లాడారు. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss

Subscribe to RSS - మహాజనం