మహాజనపాదయాత్ర

18:48 - March 21, 2017

నల్గొండ: సీపీఎం తెలంగాణ రాష్ర్ట కమిటీ సభ్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్మికోద్యమ నేత తిరందాస్ గోపి అంత్యక్రియలు అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య ముగిశాయి. గోపిని కడసారి చూసేందుకు సీపీఎం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. తిరుమలనగర్‌లోని గోపి నివాసం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వెనక ఉన్న శ్మశానవాటికి వరకు కార్యకర్తల నినాదాలు, ప్రజా కళాకారుల విప్లవ గీతాల నడుమ అంతిమయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, వివిధ ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు గోపి మృతదేహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. నిన్న భువనగిరి నుంచి నల్లగొండ వస్తుండగా.. రామన్నపేట వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో గోపి దుర్మరణం చెందారు. గోపి మరణం సిపిఎం పార్టీకి.. కార్మికోద్యమానికి తీవ్రమైన లోటని.. ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిని తాము కోల్పోయామని.. తమ్మినేని వీరభద్రం తెలిపారు. యాదాద్రి జిల్లాలో మహాజన పాదయాత్ర జయప్రదంగా సాగడానికి గోపి కృషి మరువలేనిదన్నారు.

20:35 - March 20, 2017

సమరభేరి మోగింది. మాటలతో.. కల్లబొల్లి కబుర్లతో నడిపే ప్రభుత్వం పై సమర భేరి మోగింది. అధికారం అనుభవించడం.. అయినవాళ్లతో కలిసి పదవులు పంచుకోవడం తప్ప నిజమైన అభివృద్ధి అంటే సంకల్పం ఒక్కటే. సమర భేరి షురూ అయ్యింది. ప్రశ్నించే గొంతుకలను పిడికిలిలో భిగించి నియతృత్వ పోకడులపై నిలిచే పాలకులపై సమర భేరి మోగింది. బంగారు తెలంగాణ అంటూ బతుకే లేని తెలంగాణను మిగుల్చుతున్న సర్కారీ విధానాలపై సరూర్ నగర్ వేదిక సాక్షిగా సమరభేరి మోగింది. ఇదే అంశంపై నేటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

17:57 - March 19, 2017

హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో సన్నాసుల రాజ్యం నడుస్తోందని తెలంగాణను కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సరూర్ నగర్ లో జరుగుతున్న సమర సమ్మేళనం సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణను దోచుకుంటున్న సీఎం కేసీఆర్ ను తన్ని తరమే రోజు వస్తోందని హెచ్చరించారు. కేంద్రంలో పెళ్లి కాని ఒక సన్నాసి, యూపిలో మరో సన్నాసి సీఎం అయ్యారని, కానీ ఇక్కడ ఉన్న సన్నాసికి పెళ్లయి పిల్లులున్న తెలంగాణ సీఎం సన్నాసికేమయిందని ఉద్వేగ భరిత ఉపన్యాసం చేశారు. సామాజిక యుద్ధం ఈ వేదిక నుండి ప్రారంభం అయ్యిందని స్పష్టం చేశారు. ఖబ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు. దమ్మూ ధైర్యం, చేవలేని ప్రభుత్వం తెలంగాణ లో నడుస్తోందని అందూ ఆలోచించాలని సూచించారు.

16:51 - March 19, 2017

హైదరాబాద్: మహాజన పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు అసమానతలు మా దృష్టికి వచ్చినట్లు సీపీఎం నేత జాన్ వెస్లీ పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర ముంగిపు సభ సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతోంది ఈ సందర్భంగా ఆయన ఆమట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోమని పిలుపు ఇచ్చినా జయప్రదం చేసినందు ప్రజలకు విప్లవ జేజేలు చెప్పారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను నిర్వహించాం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను సమగ్రంగా అమలు చేయాలని, సరైన నిధులు కేటాయించాలని యాత్రను నిర్వహించాం. పాదయాత్ర ద్వారా దళితులు, గిరిజనులు, వెనకబడి వర్గాలు, అగ్రకుల పేదల స్థితిగతులను అధ్యయనం చేవామని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై పలు అసమాతలు మా దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వైద్యం అందక ప్రజలు పిట్టలు రాలినట్లు రాలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

16:35 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం, సంక్షేమం కోసం చేపట్టిన సీపీఎం నేత తమ్మినేని ఆధ్వర్యం లో చేపట్టిన మహాజన పాదయాత్రను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్, ఎంపి కవిత ప్రకటించినా అద్వితీయంగా జరిగిందని తెలిపారు. అంతే కాకుండా టీఆర్ ఎస్ నాయకులు నీడనిచ్చి, అన్నం కూడా పెట్టారని తెలిపారు. పార్టీల తో నిమిత్తం లేకుండా మహాజన పాదయాత్రను విజయవంతం చేశామని తెలిపారు. సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సమరం సృష్టించేందుకు సామాజిక సమర సమ్మేళనం పేరుతో సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు.

15:30 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సామాజిక సమ్మేళనం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్ర విజయవంతం అయ్యింది. సీపీఎం నేత సాగర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేపట్టిన తరువాత ప్రభుత్వం ఎంబీసీ లకు సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బీసీ కమిషన్ ను నియమించిందన్నారు. సకల వృత్తులకు సంబంధించిన అంశాలకు నిధుల కేటాయింపునకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానంది. కానీ దానికి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. 93 శాతం ఉన్న అభివృద్ధి చెందకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు.

15:15 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర ఈ రోజు ముగియనుంది. కాసేపట్లో సర్వ సమ్మేళన సభ పేరుతో సరూర్ నగర్ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో దళితులకు సరైన రక్షణ కల్పించడం లేదు, దళితుపై అగ్రవర్ణాలు పెత్త సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక ఉద్యమం ఆధిపత్యం కోసం ముందుకెల్తామని తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా ఎత్తేసేందుకు ప్రయత్నం చేస్తోందని మండి పడ్డారు.

06:45 - March 15, 2017

హైదరాబాద్: ఆందోళన చేస్తే సస్పెండ్‌ చేస్తానని.. డిమాండ్‌ చేస్తే డీబార్ చేస్తానన్న వర్గాలన్నింటికీ .. సీఎం కేసీఆర్‌ వరాలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు సొంతపార్టీ ఎమ్మెల్యేలకు... మంత్రులకు కూడా సమయమివ్వని సీఎం ఇప్పుడు గంటలకొద్దీ సబ్బండవర్గాలతో గడుపుతున్నారు. ఎందుకిలా..? ఈ ప్రశ్నకు.. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఎఫెక్టే కారణమన్న సమాధానం వస్తోంది. మహాజన పాదయాత్ర కారణంగా.. ప్రజల్లో వచ్చిన చైతన్యం కారణంగానే, కేసీఆర్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారన్న భావన వ్యక్తమవుతోంది.

సొంతపార్టీ నాయకులతోటే సమావేశం కాని కేసీఆర్‌.....

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సొంతపార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కలసి కూర్చొని సమస్యలపై చర్చించిన సందర్భాలు చాలా తక్కువ. ఇక సామాన్య ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులకు సీఎంను కలిసే అవకాశమే లభించలేదు. ఒక సమయంలో సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం సచివాలయంలో విపక్షాలు ధర్నాకు కూడా దిగాయి. కానీ అనూహ్యంగా.. సీఎంలో ఇటీవల చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వివిధ వృత్తులు, కుల సంఘాల ప్రతినిధులతో గంటలకొద్దీ మాట్లాడుతున్నారు. వారితో సహపంక్తి భోజనాలు కూడా చేస్తున్నారు. వారు అడిగిన దానికంటే కొంత ఎక్కువే ఇచ్చి మరీ పంపుతున్నారు. ఇంతటి మార్పుకు కారణం ఏంటి..? అన్న ప్రశ్నకు సీపీఎం మహాపాదయాత్ర ఎఫెక్ట్‌ అన్నదే అందరిలోనూ వస్తున్న ఏకైక సమాధానం.. విపక్షాలే కాదు.. పాలక పక్షంలోని చాలామందిదీ ఇదే అభిప్రాయం.

పాదయాత్రతో సీఎంలో కదలిక....

మహాజన పాదయాత్ర ప్రారంభమయ్యాకనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. చేనేత కార్మికులు, మత్యకారులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, అంగన్‌వాడీల వంటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాస్తవానికి ఈ వర్గాల సమస్యలన్నిటిపై సీపీఎం నాయకులు పాదయాత్రలో తమ గళాన్ని వినిపించారు. ఒక్కో అంశంపై ఒక్కో రోజు పాదయాత్ర నాయకులు సీఎంకు లేఖలు రాస్తూనే ఉన్నారు. కొన్ని ప్రశ్నలతో ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. దీంతో ప్రజలు ప్రశ్నించే స్థాయికి చేరకముందే ఆయా వర్గాలను తమవైపు తిప్పుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది.

అనవసరంగా రొడ్డెక్కి అందోళన చేయవద్దంటూ...

మీ సమస్యలు పరిష్కరించేందుకు మేము రెడీగా ఉన్నాము..మీరు అనవసరంగా రొడ్డెక్కి అందోళన చేయవద్దంటూ కేసీఆర్‌ పరోక్ష సందేశాలు ఇచ్చారు. ఈ మేరకు మహాజన పాదయాత్ర ప్రభుత్వంలో కదలికను కలిగిచింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న మహాజనపాదయాత్ర... ఈ విధంగా సఫలీకృతమైందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

12:44 - March 14, 2017

హైదరాబాద్: పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ.. ఆరోగ్య సమస్యలు వెన్నంటినా మొక్కవోని దీక్షతో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసేందుకు కంకణం కట్టుకుని శ్రామిక మహిళల సమస్యలపై పోరాడుతూ.. కొన్ని నెలల క్రితం సుదీర్ఘ మహాజన పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఈ సంమయంలో తనకు ఎదురై సంఘటనలు, ఊహించని ఘటనలు చిన్నవేనని ఆమె భావించారు. ఈ వారం మానవి' స్ఫూర్'తి ఎస్. రమ ఇతివృత్తం. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

10:31 - March 14, 2017

యాదాద్రి : తెలంగాణ బడ్జెట్‌ సామాజిక న్యాయానికి ఆమడదూరంలో ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సామాజిక న్యాయం దిశగా బడ్జెట్‌ లేదన్నారు. అగ్రవర్ణాలు, కమీషన్ల చుట్టూనే బడ్జెట్‌ తిరిగిందని మండిపడ్డారు. రాష్ట్ర జనాభాలో 52శాతంగా ఉన్న బీసీలకు 5వేల కోట్లు కేటాయిస్తే వారి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3ఎకరాల భూమి హామీల ఊసే లేదన్నారు. తక్షణమే బడ్జెట్‌ ప్రతిపాదనలు సమూలంగా మార్చాలని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - మహాజనపాదయాత్ర