మహారాష్ట్ర

12:22 - December 10, 2018

మహారాష్ట్ర : రైతన్నలకు కోపం వస్తే పీఎం అయినా ఒకటే సీఎం అయినా ఒక్కటే. ఎవరినీ ఖాతరు చేయరు. తమ కష్టాన్ని దోచేసుకుంటున్న  దళారులు అనే విషయం తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత..దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మిన్నకుండి పోతే శాంతస్వాభావి అయిన రైతన్నకు కోపం వస్తే ఏం చేస్తారో..వారి నిరసనను ఎలా వ్యక్తం చేస్తారో చేసి చూపించారు ఉల్లి రైతులు. 
ఉల్లిపాయలు మనం కొనుక్కుంటే రూ.10 నుండి రూ.30లు. ఉల్లి పండించిన రైతు అమ్ముకుంటే కేవలం ఒకే ఒక్క రూపాయి. ఏమిటీ దారుణం. అటు కష్టించి పండించిన రైతు నష్టాల్లో కూరుకుపోతుంటే మరోపక్క కొనుగోలు చేసిన వారు కూడా అదే తరహాలో నష్టపోతున్నారు. మోస పోతున్నారు. రైతులకు..వినియోగదారులకు మధ్యంలో దళారులు మాత్రం కష్టాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. రైతుల రక్తాన్ని పిండేస్తున్నారు. దీంతో ఒళ్లు మండిన రైతన్నలు తమ నిరసనను వినూత్నంగా వ్యక్తంచేశారు. 
నష్టపోయిన అభ్యుదయ రైతు నిరసన..
ఓ ఉల్లి రైతు తన రెక్కల కష్టానికి ప్రతిఫలం నాలుగు నెలలకు 1,064 రూపాయలు. తాను పండించిన 750 కేజీల ఉల్లిపాయలను మార్కెట్‌లో అమ్ముకుంటే వచ్చిన మొత్తం అక్షరాలా 1,064 రూపాయలు. తన శ్రమకు దక్కిన ఈ అల్పాదాయంతో ఆ రైతు కడుపు రగిలిపోయింది. వెంటనే ఆ మొత్తాన్ని ప్రధానమంత్రికి మనియార్డర్‌ చేశారు. మహారాష్ట్రకు చెందిన సంజయ్‌ సాఠేకు ఎదురైన ఈ బాధాకర అనుభవం దేశంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న అన్నదాతల కష్టాలకు నిలువెత్తు నిదర్శనం. దేశంలోని ఉల్లి ఉత్పత్తిలో ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాదే దాదాపు 50 శాతం. అదే జిల్లా నిఫాడ్‌కు చెందిన సంజయ్‌ ఓ అభ్యుదయ రైతు. 
2010లో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన సందర్భంగా ఆయనతో ముచ్చటించేందుకు వ్యవసాయ శాఖ ఎంపిక చేసిన రైతుల్లో ఆయన ఒకరు. ప్రస్తుత సీజన్‌లో 4 నెలలు శ్రమించి తాను పండించిన ఉల్లిని కొద్ది రోజుల క్రితం నిఫాడ్‌ టోకు మార్కెట్‌కు తీసుకెళ్లగా వర్తకులు కేజీ రూపాయికి అడిగారు. చివరకు బేరమాడటంతో రూ. 1.40కి ఒప్పందం కుదిరింది. ఆ రైతు చేతికి వచ్చింది రూ.1,064 మాత్రమే. దీంతో ఆయనకు కడుపు మండింది. నిరసన తెలుపుతూ ఆ మొత్తాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన విపత్తు సహాయ నిధికి పంపించారు. దీనికి మనియార్డర్‌ చేయడానికి అదనంగా 54 రూపాయలు భరించారు.
మహారాష్ట్రలో మరో రైతన్న నిరసన..
మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని అభిలాలే అనే రైతు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్కు 6 రూపాయల నగదు ఎంవో చేశాడు. జిల్లాలో టోకు మార్కెట్లో కిలో 1 రూపాయల మేరకు 2,657 కిలోల ఉల్లిపాయలు విక్రయించిన తర్వాత మార్కెట్ ఖర్చులు సర్దుబాటు చేసిన తరువాత ఆయన కేవలం రూ 6 మాత్రమే మిగిల్చారు. ఆ ఆరు రూపాయల్ని సీఎం ఫడ్నవీస్ కు ఎంవో పంపించి తమ నిరసనను వ్యక్తంచేశాడు. తమ పరిస్థితి సీఎంకు తెలియాలనే రూ.6 లను పంపించానని సదరు బాధిత రైతు తెలిపాడు.  కాగా ఉల్లిపాయల ఉత్పత్తిలో మహారాష్ట్ర పేరొందిన విషయం తెలిసిందే.
 

15:27 - December 7, 2018

ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్ధతకు గురయ్యారు. శుక్రవారం గడ్కరీ మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని మహాత్మా పూలే  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.  ఆ కార్యక్రమంలో జాతీయగీతం ఆలపించే సమయంలో లేచి నిలబడినప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవటంతో ఆయన స్టేజీమీద కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు ఆయన పడిపోకుండా చేయి అందించి పైకి లేపే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న సహాయక సిబ్బంది ఆయన్ను వెంటనే  ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
ప్రస్తుతం తాను డాక్టర్ల పర్యవేక్షణలో క్షేమంగానే ఉన్నానని గడ్కరీ ట్వీట్ చేసారు. తాను కోలుకోవాలవి కోరుకున్నవారందరికీ  నితిన్ గడ్కరీ  కృతజ్ఞతలు తెలిపారు. 

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

12:45 - December 3, 2018

ముంబై : సంకల్ప బలం వుంటే దేనైనా సాధించవచ్చు అనేది పెద్దల మాట. కష్టాలు వచ్చినియని కృంగిపోకుండా వాటిపై పోరాడి విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరుగా వుంటుంది. ఏ కష్టమైనా రానీ నా ధైర్యం మాత్రం దిగజారిపోదు అనే మనోధైర్యంతో తనకు వచ్చిన దీర్ఘకాలిక వ్యాధితో పోరాడేందుకు సిద్ధమైంది బాలివుడ్ నటి సోనాలిబింద్రే. కొన్ని తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించి సోనాలి భయంకరమైన క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయినా తనకొచ్చిన వ్యాధితో పోరాడతానని దానికి సంబంధించిన వైద్యం చేయించుకునేందుకు విదేశం వెళ్లిన సోనాలి తిరిగి వచ్చింది అంతే ఆత్మవిశ్వాసంతో. దీనికి సంబంధించిన ఆమె ఫోటోలు ఇన్ స్ట్రా గ్రామ్ లో అభిమానులు పోస్ట్ చేయటంతో ఆమెపై ప్రశ్నంసల జల్లు కురుస్తోంది. 

ముంబైలో సోనాలి బింద్రే ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు ఆమె అభిమానులు. పైగా క్యాన్సర్ మహమ్మారితో ఆమె పోరాడిన విధానంపై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రాణాల మీదకు వస్తున్నా కూడా ఏ రోజు కూడా భయపడలేదని.. తాను ధైర్యంగా పోరాడుతూ ఇప్పుడు ప్రాణాలు కాపాడుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె మనోధైర్యమే కాపాడిందని చెబుతున్నారు వైద్యులు. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని సోనాలికి సూచించారు డాక్టర్లు. అవసరం అనుకున్నపుడు మళ్లీ న్యూయార్క్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోనుంది సోనాలి బింద్రే. కాగా ట్రీట్ మెంట్ నేపథ్యంతో తన వెంట్రుకలను కత్తిరించుకునే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన సోనాలి ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకుని ముంబై రావటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తు ఇన్ స్ట్రా గ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఆమె మరింత ఆరోగ్యంగా వుండాలని..ఆనందంగా వుండాలని పోస్ట్ లు పెడుతున్నారు. 

14:22 - December 1, 2018

మహారాష్ట్ర : కలకాలం తోడునీడుగా ఉండాల్సిన భర్త భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని పెళ్లి పీటల సాక్షిగా చేసిన వాగ్ధానాన్ని మరిచాడు. ఆమె ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. ఎవరైనా తమ భార్య అనారోగ్యానికి గురైతే..ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయిస్తారు. కానీ ఓ మూర్ఖపు భర్త తన భార్యకు హెచ్‌ఐవీ వైరస్‌ ఎక్కిచ్చాడు. ఆమెను అనారోగ్యానికి గురి చేశాడు. తన భర్త తనకు హెచ్‌ఐవీ వైరస్‌ను ఎక్కిచ్చాడని పేర్కొంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన డాక్టర్ భర్తే స్లైన్ ద్వారా ఈ వైరస్‌ను శరీరంలో చొప్పించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన పూణెలో చోటుచేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం...మహారాష్ట్రలో మహిళకు హోమియోపతి వైద్యుడైన వ్యక్తితో 2015లో వివాహమైంది. భర్త, అతని తల్లిదండ్రులు  కట్నం కోసం ఆమెను వేధించేవారు. అక్టోబర్ 2017లో ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు ఇంట్లోనే భర్త ఆమెకు స్లైన్ పెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె మరోసారి అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె పరీక్షలు చేయించుకుంటే హెచ్‌ఐవీ పాజిటివ్ గా రిపోర్టు వచ్చింది. అయితే తన భర్తే తనకు ఈ వైరస్ ఎక్కించాడని బాధిత మహిళ ఆరోపించింది. అతడు ఇప్పుడు ఆమె నుంచి విడాకులు కోరుతున్నాడు. ఫిర్యాదు స్వీకరణ అనంతరం భార్యభర్తలను హెచ్‌ఐవీ పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌కు  పంపారు. పరీక్షలో ఇద్దరికీ హెచ్‌ఐవీ ఉందని తేలింది. కాగా ప్రభత్వం ఆధ్వర్యంలో నడిచే కేంద్రానికి పంపగా భార్యకు మాత్రమే వైరస్ ఉన్నట్లు వచ్చిందన్నారు. నిందితుడిపై సెక్షన్ 328 (పాయిజన్ ద్వారా గాయపర్చడం), సెక్షన్ 498(వరకట్న వేధింపులు)ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

15:42 - November 29, 2018

మహారాష్ట్ర : మరాఠాలకు ప్రభుత్వం శుభవార్తనందించింది. వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు కొద్ది నెలల క్రితం భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019లో ఎన్నికలు రానున్న తరుణంలో మరాఠాలకు రిజ్వషన్స్ కల్పిస్తు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నవంబర్ 18న శీతాకాల సమావేశాల సందర్భంగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పలికింది. మరాఠాలకు విద్య, ఉదోగ్యాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు మహారాష్ట్ర శాసనసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతు తెలిపాయి. తర్వాత ఈ బిల్లును శాసనమండలికి పంపనున్నారు. ఈ బిల్లు ద్వారా కేవలం విద్య, ఉద్యోగాల్లో మాత్రమే మరాఠాలకు రిజర్వేషన్లు లభించనున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు వర్తిస్తుండగా.. మరాఠాలకు మాత్రం రాజకీయంగా ఈ రిజర్వేషన్లు వర్తించటంలేదు. ఈ నేపథ్యంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం.. మహారాష్ట్ర రాష్ట్ర బీసీ కమిషన్ సూచనల మేరకు ఫడ్నవీస్ సర్కారు ఎస్‌ఈబీసీ  అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతిని ఏర్పాటు చేసింది. దీని వల్ల ఓబీసీల రిజర్వేషన్లకు విఘాతం కలగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
కాగా వచ్చే ఏడాది అంటే 2019లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మరాఠాల డిమాండ్‌ పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీంతో మరాఠాల ఓట్ల కోసం ఫడ్నవీస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయవర్గాల సమాచారం. 
 

13:17 - November 20, 2018

మహారాష్ట్ర : దేశంలోనే అతిపెద్ద సైనిక ఆయుధాగారం మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో పుల్గావ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 వరకు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. మందుగండు సామగ్రిని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. గాయపడిన 10మందిలో మరో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో పుల్గావ్ ఆయుధ గోదాంలో ఈ మంగళవారం అంటే నవంబర్ 20వ తేదీ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

పేలుడు దాటికి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. గడువు తీరిన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలుళ్లు జరిగినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. 
2016లో జరిగిన ప్రమాదం..16మంది మృతి
కాగా పుల్గావ్‌ ఆయుధ గోదాంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2016 మేలో ఇదే గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో రక్షణ శాఖకు చెందిన 16 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పుల్గావ్‌ గోదాం దేశంలో సైన్యానికి చెందిన అతిపెద్ద ఆయుధ గోదాం. బాంబులు, గ్రనైడ్లు, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను ఇక్కడ నిల్వ చేస్తారు. దేశంలోని పలు ఫ్యాక్టరీల్లో తయారు చేసిన ఆయుధాలను ఇక్కడకు తీసుకొచ్చి భద్రపరుస్తారు. అక్కడి నుంచి ఫార్వర్డ్‌ బేస్‌లకు తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోవటం జరుగుతోంది. అలాగే పలువురు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. దీనిపై అధికారులు తగిన జాగ్రర్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
 

08:41 - November 14, 2018

మహారాష్ట్ర : ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్తే..పులి వెంటబడింది. ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల వాహనాన్ని పులి వెంబడించింది. ఒకానొక దశలో వాహనానికి, పులికి మధ్య దూరం కొన్ని మీటర్లు మాత్రమే ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో వైరల్‌‌ అవుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా తడోబా-అంధారీ టైగర్‌ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తడోబా-అంధారీ టైగర్‌ రిజర్వ్‌కు వెళ్లారు. అయితే ఒక్కసారిగా పులి పర్యాటకుల వాహనం వెంటపడింది. పులి వెంటపడుతోన్న విషయాన్ని గ్రహించిన పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురై, కేకలు వేస్తున్నట్లు ఆ వీడియోలో వెల్లడవుతోంది. ఈ ఘటనపై రేంజ్‌ ఫారెస్ట్ అధికారి రాఘవేంద్ర స్పందించారు. పర్యాటకులు వాహనం దగ్గరగా రావడంతో మూడున్నర సంవత్సరాలున్న ‘ఛోటీ మధు’ ఆందోళన చెంది వారి వాహనాన్ని వెంబడించి ఉంటుందని వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిట్లు ఆయన తెలిపారు. దీంతో వెంటనే టూరిస్టు గైడ్లు, డ్రైవర్లకు అధికారులు కొన్ని హెచ్చరికలు చేశారు. పులులు ఉండే ప్రదేశానికి తగినంత దూరం పాటించాలని సూచించారు. అలాగే ఈ ఘటనకు కారణమైన రహదారిని ఒక వారం పాటు మూసివేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

14:32 - November 12, 2018

మహారాష్ట్ర : సాధారణంగా అత్యంత రద్దీగా ఉండే పుణెను పరిశుభ్రంగా ఉంచడానికి పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) సరికొత్త పద్ధతి తీసుకొచ్చింది. స్వచ్ఛ పుణెగా మార్చేక్రమంలో ఇప్పటికే కొన్ని నిబంధనలు విధించింది. రోడ్లపై ఉమ్మేసేవారికి ప్రాంతాన్ని బట్టి రూ.200 నుంచి 1,000 వరకు జరిమానా విధిస్తోంది.

అయితే జరిమానా విధించినప్పటికీ ప్రజల నుంచి సరైన స్పందన రాకపోగా, రోడ్లమీద ఉమ్మేస్తూ రోడ్లను అపరిశుభ్రంగా చేస్తున్నారు. దీంతో పీఎంసీ మరో కఠిన నిబంధనతో ముందకు వచ్చింది. రోడ్లపై ఎవరైతే ఉమ్మేస్తారో వారితోనే శుభ్రం చేయిస్తోంది. అంతేకాకుండా 150 రూపాయల జరిమానా కూడా విధిస్తోంది. ఈ పద్ధతి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 156 మంది రోడ్లపై ఉమ్మేస్తూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.  
గతవారమే ఈ పద్ధతి అమల్లోకి వచ్చిందని..ఇప్పటికి దీన్ని అత్యంత రద్దీగా ప్రాంతాల్లోనే అమలు చేస్తున్నామని వేస్ట్ మేనేజ్‌మెంట్ అధికారి ధ్యానేశ్వర్ మోలక్ తెలిపారు. ఈ నిబంధనలు బిబ్వేవాడి, ఆంధ్, ఎర్వాడ, కస్బా, ఘోల్ రోడ్ తదితర ప్రాంతాల్లో అమల్లో ఉన్నాయని తెలిపారు.

 

09:25 - November 12, 2018

మహారాష్ట్ర : మగవాళ్లను ‘నపుంసకుడు’ అని పిలిస్తే వారి పరువుకు నష్టం కలిగించినట్లేనని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పదం మగవాళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఇలాంటివి ఉపయోగిస్తే పరువు నష్టం కేసుల్లో చర్యలు ఎదుర్కొనక తప్పదని కోర్టు తెలిపింది. ఒక విడాకుల కేసుకు సంబంధించి ఈ తీర్పు చెప్పింది. 

2016లో నాగ్‌పుర్‌కు చెందిన దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో విడాకులు కోరుతూ సదరు మహిళ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే వారి కుమార్తె సంరక్షణ బాధ్యతలను కోర్టు  తాత్కాలికంగా భర్తకే అప్పగించింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె బొంబాయి హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ ధర్మాసనంలో పిటిషన్ వేశారు. తన భర్త నపుంసకుడని పిటిషన్‌లో ఆమె ఆరోపించారు. దీంతో ఆమెతోపాటు ఆమె బంధువులపైనా భర్త పరువు నష్టం కేసు వేశారు. దీన్ని కొట్టివేయాలని ఆమె నాగ్‌పుర్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ‘‘అగౌరవ పరిచాలనే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించలేదు. మా పాప కూడా అధునాతన సంతాన చికిత్స ద్వారా జన్మించింది.’’ అని అభ్యర్థనలో ఆమె వివరించారు. ఈ అభ్యర్థనపై జస్టిస్‌ సునిల్‌ శుక్రే విచారణ చేపట్టారు.  వైద్య స్థితిని తెలియజేసేందుకే ఆ పదాన్ని ఉపయోగించినప్పటికీ.. దాంతో జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేకుండా ఉండలేమని ఆయన స్పష్టీకరించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - మహారాష్ట్ర