మహిళ

11:44 - April 3, 2018

హైదరాబాద్‌ : ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని నందనగర్‌లో సౌమ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సౌమ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఇంటి బయటవైపు తలుపు గడియపెట్టి ఉండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... ఇంట్లో రక్తపు మరకలు, కెమికల్‌ పదార్థాలు గుర్తించారు. 

15:55 - March 29, 2018

విశాఖ : జిల్లాలోని చీడికాడ మండలం కోణం వారాంతపు సంతలో దొంగ నోట్లను మారుస్తున్న మహిళను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహిళ వద్ద రూ. 3 లక్షల రెండు వేల నగదు రూ. 500 జిరాక్స్‌ నోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

07:32 - March 28, 2018

హైదరాబాద్ : భర్త నుంచి విడాకులు కావాలంటూ హైదరాబాద్‌ తార్నాకలో మహిళ హల్‌చల్‌ చేసింది. కొంతకాలంగా భర్తతో ఘర్షణ పడుతున్న మహిళ.. భర్తను తార్నాకుకు రావాల్సిందిగా ఫోన్‌చేసింది. భర్త అక్కడకు చేరుకోగానే డైవోర్స్‌ పేర్లపై సంతకం పెట్టాలంటూ పట్టుబట్టింది. సంతకం పెట్టకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించింది. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు కల్పించుకున్నారు. భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని ఓయూ పీఎస్‌కు తరలించారు. 

13:57 - March 23, 2018

అనంతపురం : మహిళలు అచ్చంగా మణులే... కృషి, పట్టుదల ఉంటే సాదించలేనిది లేదని నిరూపించారు అనంతపురం జిల్లా మహిళామణులు. ఆటో డ్రైవింగ్‌తో  నెలకు  పది వేలరూపాయల సంపాదనతో... తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆదర్శంగా నిలుస్తున్నారు.. వారి ఉత్సాహాన్ని పసిగట్టిన ప్రభుత్వం, అధికారులు రెట్టింపుస్థాయిలో ప్రోత్సహిస్తున్నారు... మంత్రి పరిటాల సునీత స్వయంగా షీ ఆటోలో ప్రయాణించి మహిళా డ్రైవర్లలో మరింత ఆత్మస్థైర్యం నింపారు.
షీ ఆటో డ్రైవింగ్ శిక్షణ 
 ఆటో డ్రైవింగ్‌తో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు అనంతపురం మహిళలు..  వారి ఆసక్తిని గుర్తించిన ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. డ్వాక్రా సంఘాల్లో చేరిన మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్న ప్రభుత్వం...  డ్రైవింగ్ శిక్షణపట్ల  మహిళలు ఆసక్తి చూపడంతో.. వారికి  డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పిస్తోంది.  మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత ఆదేశాల మేరకు 32 మందికి  డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా షీ ఆటో డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. పరిటాల సునీత షీ ఆటోలో ప్రయాణించి మహిళా డ్రైవర్లలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. 
శిక్షణ పొందే మహిళలకు ఉచిత భోజనం
డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవింగ్ శిక్షణ పొందిన పలువురు డ్వాక్రా మహిళలు ఆటో నడుపుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.పేదరికం వల్ల రోజువారీ కూలీ పనులతో పాటు...ఇళ్ళలో పాచిపనులు చేసే మహిళలు ఆటో డ్రైవింగ్‌పై మక్కువ చూపుతున్నారు. దీనివల్ల తమకెంతో గౌరవం దక్కుతోందని అంటున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్... బ్యాంకు రుణం.. ఆటో 
మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు అధికారులు సైతం తోడ్పడుతున్నారు. ఆటో డ్రైవింగ్‌ పై ఆసక్తి చూపుతున్న మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు... బ్యాంకు రుణంతో ఆటో కూడా  ఇప్పిస్తున్నారు. ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల  సంపాదన ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా షీ ఆటోలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పేదరికంలో మగ్గుతున్న తమకు ఆటో డ్రైవింగ్‌ ఎంతో ఆసరగా ఉందంటున్నారు మహిళలు... పాచిపనులపై ఆధారపడ్డతమకు ఆటోడ్రైవింగ్‌తో గౌరవప్రదమైన జీవితం దక్కిందంటున్న అనంతపురం మహిళ ఆదర్శనీయం.

14:30 - February 26, 2018

కరీంనగర్ : ఒక వైపు విజ్ఞాన శాస్త్రం పరుగులు పెడుతుంటే... మరోవైపు పల్లెళ్లలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో మంత్రాల నెపంతో మహిళను గామస్తులు చితకబాదారు. పెద్దపల్లి మండలం రాగినేడులో ఇటీవల అనారోగ్యంతో సోమిశెట్టి లక్ష్మీ చనిపోయారు. మరో మహిళ మంత్రాలు చేయడం వల్లే చనిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహిళను గ్రామస్తులు చితకొట్టారు. దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:23 - February 18, 2018

మేడ్చల్ : జిల్లా ఘట్ కేసర్ మండలం కొర్రెముల మూసీ కాల్వలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని కుత్బుల్లాపూర్ మెట్ కి చెందిన జవాజీ బాలమణిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్నా పోలీసులు విచారణ ప్రారంభించారు. 

09:03 - February 12, 2018
07:28 - February 12, 2018

హైదారబాద్ : కొండాపూర్‌లో సంచలనం సృష్టించిన గర్భిణి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి... భార్య ఉండగానే మహారాష్ట్రకు చెందిన మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గర్భం దాల్చిన ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో.. అడ్డుతొలగించుకునేందుకు అంత్యంత పాశవికంగా హత్య చేశాడు. కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పలు కీలక ఆధారాలతో మృతురాలి వివరాలను సేకరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసులో నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. బైక్‌ నెంబర్ ఆధారంగా.. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఉద్యోగం
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నిందితుడు... భార్య ఉండగానే మహారాష్ట్రకు చెందిన మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. గర్భందాల్చిన ఆమె పెళ్లికి ఒత్తిడి తేవడంతో అడ్డుతొలగించుకునేందుకు గతనెల 28న హత్య చేశాడు. చిన్న చిన్న ముక్కులుగా నరికి, గోనెసంచిలో కుక్కి బైక్‌పై తీసుకొచ్చి బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. హత్య చేసిన రెండు రోజులకే నగరం విడిచివెళ్లిపోయాడు. బైక్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... బౌద్ధనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని నిందితునిగా అనుమానిస్తున్నారు. ఈ హత్య కేసులో మరో వ్యక్తి సహకరించినట్టు పోలీసులు తేల్చారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

12:12 - February 11, 2018

హైదరాబాద్ : కొండాపూర్‌ సమీపంలోని బొటానికల్ గార్డెన్ వద్ద 10 రోజుల క్రితం మహిళ హత్య కేసుకి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. యమహా బైక్‌పై వచ్చిన నిందితులను సీసీ కెమెరాలో గుర్తించారు. మృతురాలు మహారాష్ట్ర వాసిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆమె పూర్తి వివరాల కోసం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, అస్సాంవాసుల్ని పోలీసులు విచారిస్తున్నారు. 10 రోజుల క్రితం మృతురాలిని ముక్కలుగా నరికి చంపిన దుండగులు గోనెసంచిలో పెట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పడేసి పరారయ్యారు. అంజయ్యనగర్, సిద్దిక్‌నగర్‌లలలో కార్డన్ సెర్చ్ పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వందల సంఖ్యలో అస్సాంవాసులు నివాసం ఉంటున్నారు. జాయింట్ సీపీ సానవాజ్‌ ఖాసిం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో..350 మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:11 - January 31, 2018

కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ మహిళా అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బెజ్జూరు మండలం మర్తిడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన స్రవంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే.. తనపై స్థానిక నేతలు ముగ్గురు కిరోసిన్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ముగ్గురు నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా స్థానిక నాయకులు, స్రవంతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం గ్యాస్‌ లీకై స్రవంతి ఇళ్లు దగ్ధమైంది. అయితే... ఆ ప్రమాదానికి నాయకులే కారణమని స్రవంతి తన వాంగ్మూలంలో తెలిపింది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - మహిళ