మహిళలు

18:32 - January 21, 2018

హైదరాబాద్ : పేరుకు విశ్వనగరం.. మురికివాడల్లో జనానికి నిత్యం నరకం.. కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా కనీస సౌకర్యాలులేని అభాగ్యులు ఎందరో..! సొంత ఇంటికోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బస్తీవాసులు. కాగితాలకే పరిమితం అయిన ప్రభుత్వాధినేతల ప్రకటనలు. హైదరాబాద్ అడిక్‌మెట్‌ ఏరియాల్లో మురికివాడల పరిస్థితిపై టెన్‌టీవీ ఫోకస్‌..
టీ.సర్కార్‌పై ప్రజలు మండిపాటు
ప్రపంచ నగరం, దేశానికే రెండో రాజధాని అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై హైదరాబాద్‌ ప్రజలు మండిపడుతున్నారు. నగరంలోని అడిక్ మెట్, వడ్డెర బస్తీ లో నిరుపేదలు తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు . ఉండటానికి సొంత ఇళ్లులేక ..ఇరుకైన గుడిసెల్లో ..వానకు తడుస్తూ..ఎప్పుడు కూలుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు..   
చాలీ చాలనీ ఆదాయంతో జీవనం 
అడిక్‌మెట్‌ మురికివాడలోని పేదలంతా ఇండ్లలో పని చేస్తూ చాలీ చాలనీ ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. కనీసీం తాగునీరు కూడా దొరకని పరిస్థితినెలకొంది. వేసవి రాకముందే ఈ బస్తీలో నీటి ఎద్దడి మొదలైంది. మంచి నీటి సంగతి అలా ఉంచితే.. బస్తీలో డ్రైనేజి వ్యవస్థల సరిగా లేక జనం అనారోగ్యాల పాలవుతున్నారు. మరోవైపు వేసవి రాకముందే నీటి ఎద్దడి మొదలైంది . వారం రోజుల కొకసారి వచ్చే నీటితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . మురికి నీరు వాడలేక..డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 
మహిళలు అనేక అవస్థలు
ఇక్కడి మురకివాడలో మహిళలకు కనీసం టాయిలెట్ , మరుగుదొడ్డి సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నారు .ప్రక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైక కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళితే రైలు డీకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు . ఎన్ని సార్లు ,ప్రజా ప్రతినిధులు,అదికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు.  
మహిళలకు పింఛన్‌ అందని పరిస్థితి 
ఇక పేదల చెంతకు సంక్షేమపథకాలు చేరాలంటే.. అదో యజ్ఞమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉన్న ఒంటరి మహిళలకు పింఛన్‌ అందని పరిస్థితి నెలకొంది. దాంతోపాటు బస్తీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి సొంతభనం కూడా లేకుండా పోయింది.  ప్రస్తుతం అద్దెభవనంలోనే అంగన్‌వాడీ కేంద్రం నడుస్తోంది. అదికూడా శిథిలావస్థకు చేరుకుంది. ఎపుడు కూలి మీదపడుతుందోనని చిన్నారులు, గర్భిణీస్త్రీలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమకు సమస్యలు తీర్చాలని అడిక్‌మెట్‌ వడ్డెర బస్తీ వాసులు కోరుతున్నారు. 

 

21:24 - January 15, 2018

హర్యానా : మహిళలపై సామూహిక అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కురుక్షేత్రలో 15 ఏళ్ల దళిత బాలికపై కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు. గత వారం ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైన టెన్త్‌ క్లాస్‌ బాలిక జింద్‌ జిల్లాలోని ఓ గ్రామం సమీపంలోని కెనాల్‌ వద్ద శుక్రవారం శవమై తేలింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె ప్రయివేటు భాగాల్లో పదునైన వస్తువులతో గాయపరిచనట్లు వైద్యులు తెలిపారు. మరో ఘటన పానిపట్‌లో శనివారంనాడు జరిగింది. చెత్తను డంప్‌ చేయడానికి వెళ్లిన 11 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారం జరిపారు. కామాంధుల కాటుకు ఆ బాలిక మృతి చెందింది. ఈ ఘోరంపై ఇద్దరు నైబర్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫరీదాబాద్‌లో ఆదివారం మరో ఘటన వెలుగు చూసింది. 22 ఏళ్ల మహిళ ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కిడ్నాప్‌కు గురైంది. నలుగురు వ్యక్తులు నడుస్తున్న ఎస్‌యువి స్పోర్ట్స్‌ కారులోనే గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం బల్లబ్‌గఢ్‌ వద్ద ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

14:37 - January 4, 2018

ఈ ఆధునిక కాలంలో కూడా ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతున్న మన దేశంలో ఓ అద్భుతం అవిష్కృతమైంది. విద్యా వ్యవస్థలో ఆమ్మాయిల ప్రతినిధ్యం ఘణనీయంగా పెరుగుతోంది. విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే ఆడపిల్లల సంఖ్య పెరగడం ఆనందించాల్సిన విషయం. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకుంటున్నారు. విద్యావ్యవస్థలో మహిళల పాత్ర మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:57 - December 28, 2017

'సాంకేతిక రంగం'....సరికొత్త ఉత్పత్తులకు వినూత్న ఆవిష్కరణలకు వేడుక. ఈ సాంకేతిక రంగం ప్రపంచాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో..ఆధునిక ప్రపంచ పోకడలను తనలో అనుసంధానం చేసుకుని మానవ అవసరాలకు చిరునామాగా మారింది. అంతటి శక్తివంతమైన సాంకేతిక రంగంలో మహిళలు అత్యున్నతస్థాయిలో రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళల పాత్ర అంశంపై టెన్ టివి మానవిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమ పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:37 - December 21, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం జరిగింది. వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. అప్పు తీర్చాలంటూ మూడు రోజులుగా మహిళలను గృహనిర్బంధం చేశాడు. బట్టల దుకాణం కోసం కృష్ణహరి అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి ఆంజనేయులు వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. వస్త్ర వ్యాపారంలో నష్టం రావడంతో కృష్ణహరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పు తీర్చాలంటూ కృష్ణహరి భార్య, తల్లిని వడ్డీవ్యాపారి వేధిస్తున్నాడు. అప్పు తీర్చాలని ఆ ఇద్దరు మహిళలను ఇంట్లో వేసి మూడు రోజులుగా గృహనిర్బంధం చేశాడు. వడ్డీవ్యాపారి ఆంజనేయులు వేధింపుల నుంచి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడని వాపోయారు. 

 

17:02 - December 18, 2017

తూర్పుగోదావరి : సారా మహమ్మారిని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తుని వీరవరపుపేటలో మహిళలు కదం తొక్కారు. తమ పేటలో అక్రమంగా సారా విక్రయిస్తున్న దుకాణాలలోకి అబ్కారి సిబ్బందితో కలిసి వెళ్లి సారా ప్యాకెట్లను ధ్వంసం చేశారు. సారా తాగొచ్చి ఇళ్లలోని మగవారు వేధించడంతో పాటు.. యువకులు దానికి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమంగా సారా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

19:10 - December 13, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఆకివీడు సమతానగర్‌లో మద్యం షాపును తొలగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మద్యం షాపునకు అనుమతి ఇవ్వవద్దంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ప్రజల సమస్యలను పట్టించుకోని సర్పంచ్‌... మద్యం షాపును ప్రారంభించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రమైతే... రోడ్డుపై నడవలేని పరిస్థితి ఉందని మహిళలంటున్నారు. ఆలయం ఉన్నా ఎలా అనుమతి ఇచ్చారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. 

17:49 - December 12, 2017

రంగారెడ్డి : మాయా లేదు.. మంత్రం లేదు.. డాక్టర్లు.. మందులతో పనే లేదు.. ఎంత పెద్ద రోగమైనా ఈ బాబా చేయి తాకితే పారిపోవాల్సిందే...రోగం నయం చేసే పేరుతో ఓ దొంగ బాబా చేస్తున్న వికృత చేష్టలకు పరాకాష్ట ఇది. ఏదో మారుమూల పల్లెల్లో ఇలాంటి దొంగబాబాల ఆగడాలు విన్నాం. చూసాం.. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో తన చేతివాటంతో ఈ ముసలి దొంగబాబా కామ వాంఛలు తీర్చుకుంటున్నాడు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని మాటలు నమ్మిన అమాయక మహిళలను లోబర్చుకుంటూ దందా చేస్తున్నాడు. తాజాగా ఇతగాడి బాగోతం 10టీవీ కెమెరాకు

పేద, మధ్య తరగతి మహిళలే టార్గెట్‌
పేద, మధ్య తరగతి మహిళలే టార్గెట్‌గా ఈ నకిలీ బాబా కొన్నేళ్ల క్రితం మొయినాబాద్‌లో మకాం పెట్టాడు. మహిళలు, టీనేజర్లు, చిన్నారులు ఇలా ఎవరు పడితే వారిని రోగాలు నయం చేస్తానని నమ్మించి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. చికిత్స పేరుతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఇక మంత్రం వేశానంటూ తాయెత్తుల పేరు చెప్పి వందల రూపాయలు దండుకుంటున్నాడు. కాలం వేగంగా పరుగులు పెడుతున్నా.. ఇంకా మూఢనమ్మకాలు మాత్రం రాజ్యమేలుతున్నాయనడానికి ఈ ఉదంతం ఓ ఉదాహరణ. ఇప్పటికైనా ఇలాంటి బాబాల ఆగడాలకు జనం చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఈ బాబా వికృత చేష్టలు చూసిన సిటీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా మనం వేచి చూడాలి. 

13:46 - December 12, 2017

సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఖాకీలు ప్రజలపై జులుం ప్రదర్శించారు. నిరసన తెలుపుతున్న ప్రజలపై లాఠీలు ఝలిపించారు. దొరికిన వారికి దొరికినట్టు చితకబాదారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురికి గాయాలు అయ్యాయి. నారాయణఖేడ్‌లో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. అయితే ఇక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని...  పోలీసులు సంతను తరలించారు. దీంతో ప్రజలు సంతను తరలించరాదంటూ ఆందోళనకు దిగారు. ప్రజలంతా ధర్నా నిర్వహించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్‌ చేశారు. మహిళలని చూడకుండా చితకబాదారు. పలువురుకి గాయాలయ్యాయి. దీంతో నారాయణఖేడ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:38 - December 10, 2017

విశాఖ : మహిళా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఫ్యాషన్ షోపై మహిళలు ఆందోళన చేపట్టారు. స్త్రీని అంగడి సరుకుగా చూసే ఫ్యాషన్ షో నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్యాషన్ షో నిర్వహించకూడదని ఆందోళన నిర్వహించారు. ఫ్యాషన్ షో అడ్డుకుంటామని హెచ్చరికలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాస్ నివాసం ఎదుట మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఫ్యాషన్ షోకు గంటా వెళ్లడం సరికాదని మహిళలు అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - మహిళలు