మహేందర్ రెడ్డి

19:03 - September 4, 2017

హైదరాబాద్ : భాగ్య నగరంలో గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని... సిటీ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు.. నిమజ్జనం భద్రతా విధుల్లో 24వేల మంది పోలీసులున్నారని చెప్పారు.. అత్యాధునిక టెక్నాలజీతో భద్రతను పర్యవేక్షిస్తామని సీపి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:51 - August 24, 2017

హైదరాబాద్ : ఓవైపు గణేశ్ ఉత్సవాలు.. మరోవైపు బక్రీద్.. రెండు పండుగల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. 24 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జియో ట్యాగింగ్,క్యూఆర్ కోడ్‌ టెక్నాలజీ ద్వారా గణేశ్ మండపాల వద్ద అనుక్షణం పర్యవేక్షణ చేస్తామని మహేందర్ రెడ్డి అన్నారు. పోలీసులకు అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజలు సహకరించాలని కోరారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

06:43 - August 12, 2017

హైదరాబాద్ : ఆర్టీసీకి అసలే అప్పుల కుప్పలు. ఆపై నష్టాల తిప్పలు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ఆర్టీసీ పై జీఎస్టీ పిడుగులు. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్సీఈకి పన్నుల భారం తడిసిమోపెడవుతోంది. ఆర్టీసీకి జీఎస్టీ ప్రభావంపై 10 టీవీ ప్రత్యేక కథనం. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రగతి రథ చక్రం.. ఆర్టీసి ప్రభుత్వ విధానాలతో కుదేలేవుతోంది. సంస్థను పటిష్టం చేయాల్సిన సర్కారు... ప్రైవేటు మాదిరిగానే ఆర్టీసీపై పన్నుల భారం మోపుతోంది. దీంతో సంస్థ సంక్షోభంలో చిక్కుంది. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన జిఎస్టీ ఆర్టీసికి శాపంగా పరిమణించింది. కోటి మందికి పైగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడంలేదు. ఆదాయ వ్యయాలకు మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ ఆర్టీసీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది.. జీఎస్టీ అమల్లోకి వచ్చి నలభై రోజులు గడిచినప్పటికీ ఆర్టీసిపై దాని ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయంపై యాజమాన్యానికి స్పష్టత లేకపోయినా... ప్రజా రవాణ వ్యవస్థ విస్తరణకు జీఎస్‌టీ అవరోధంగా పరిమించే అవకాశం లేకపోతేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ వినియోగించే డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకపోవడంపై అభ్యంతం వ్యక్తమవుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డీజిల్‌పై అమ్మకం పన్ను వసూలు చేస్తున్నారు. తెలంగాణలో డీజిల్‌పై 24.5 శాతం అమ్మకం పన్ను విధిస్తున్నారు. డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉందని పది వేలకు పైగా బస్సులు కలిగిన ఆర్టీసి కొత్త బస్ బాడీలు తయారు చేసేందుకు విడిభాగాలు, టైర్లు, ట్యూబ్‌లను పలు సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిపై 18 నుండి 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. ఇంతకు ముందు అమల్లో ఉన్న వ్యాట్‌తో పోలిస్తే, జీఎస్‌టీ చాలా ఎక్కువ. బస్ బాడీ తయారీకి వ్యాట్‌ ఐదు శాతం ఉంటే, జీఎస్టీలో ఇది 28 శాతానికి చేరింది. ఇది సంస్థకు భారమే.

జీఎస్టీ చట్ట నిబంధనల్లో 10 అంతకంటే ఎక్కువ సీట్లు సామర్థ్యం కలిగిన వాహనాలకు 15 శాతం సెస్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి 28 శాతం కలిపితే మొత్తం 43 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సంస్థకు అదనపు భారమే. కొత్తగా కొనుగోలు చేయనున్న 1350 కొత్త బస్సుల కూడా జీఎస్‌టీ ప్రభావం పడుతుంది. మొత్తం మీదీ జీఎస్‌టీ ఆర్టీసీకి భారంగానే పరిణమించే అవకాశాలు ఉన్నాయి. 

07:33 - June 25, 2017

రంగారెడ్డి : చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో మీనా పడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయిందని మంత్రి ప్రకటించారు. దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయని, చిన్నారి రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నించినట్లు తెలిపారు. సంఘటన జరిగిన అనంతరం తాను, ఎంపీ, కలెక్టర్, ఉన్నతాధికారులు ఇక్కడకు చేరుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సహాయక చర్యలు కొనసాగాయన్నారు. 40-50 ఫీట్ల మధ్య మోటార్ తీయాలని అనుకోవడం జరిగిందని, మోటార్ తో పాటు పాప వస్తుందని అనుకున్నట్లు కానీ అలా జరగలేదన్నారు. 180 ఫీట్ల వరకు కెమెరాలను పంపించినట్లు, కానీ ఆ ఫలితం నెరవేరలేదన్నారు. 420 ఫీట్ల వరకు చిన్నారి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఫ్లషింగ్ సహాయంతో తీయాలని ప్రయత్నించగా మీనా డ్రస్..శరీర భాగాలు బయటకు రావడం జరిగిందన్నారు. ఇలా జరగడం బాధాకరమని, చిన్నారి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామన్నారు.

07:16 - June 25, 2017

క్షణక్షణం ఉత్కంఠ..చిన్నారి మీనా క్షేమంగా బయటకు రావాలి..అంటూ ప్రతొక్కరిలో ఆశ...మీనా..నేను అమ్మను..నేను వస్తున్నా..అంటూ ఆ తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలు..బోరు బావి చుట్టూ తవ్వకాలు..ఆత్యాధునిక కెమెరాలతో పరిశీలన..కానీ ఇవన్నీ ఏవీ నెరవేరలేదు..ఆ చిన్నారి మీనా అనంతలోకాలకు వెళ్లిపోయింది..60గంటలుగా కొనసాగిన రెస్క్యూ చివరికి విషాదంతో ముగిసింది.
 

60గంటలు..
రంగారెడ్డి : చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం చిన్నారి మీనా బోరు బావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి మృతి చెందిందని మంత్రి మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రకటించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యాయరు. 60గంటలుగా కొనసాగిన రెస్క్యూ విఫలైమంది. దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫ్లష్ ఔట్ పద్ధతితో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామానికి తరలిస్తామని అధికారులు వెల్లడించారు.

ఆదుకుంటాం - మహేందర్ రెడ్డి..
చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. మీనా కుటుంబాన్ని ఆదుకుంటామని, 420 ఫీట్ల వరకు చిన్నారి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయని, చిన్నారి రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నించినట్లు తెలిపారు. 40-50 ఫీట్ల మధ్య మోటార్ తీసినప్పుడు మోటార్ తో పాటు పాప వస్తుందని అనుకున్నట్లు కానీ అలా జరగలేదన్నారు.

09:12 - June 23, 2017
13:59 - January 6, 2017

హైదరాబాద్ : ఓలా, ఉబర్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని... మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు.. మధ్యాహ్నం మూడుగంటలకు వారితో చర్చలు జరుపుతామని ప్రకటించారు.. ఈ డ్రైవర్ల ఆందోళనను బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి శాసనసభలో ప్రస్తావించారు..సమస్యలమధ్య ఓలా, ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారనీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో కోరారు. రోజుకు 18నుంచి 20గంటల పని చేయిస్తున్నారనీ.. క్యాబ్‌లను పెంచి డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.ఆదాయం లేక డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని తెలిపారు. దీనికి సమాధానంగా మంత్రి మహేందర్ రెడ్డి ఓలా, ఉబర్‌ డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

15:01 - December 28, 2016

హైదరాబాద్‌ : దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని సీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌ సిబ్బంది నిరంతర పరిశ్రమవల్ల 2016సంవత్సరంలో సిటీలో నేరాల శాతం తగ్గిందన్నారు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రజల సహకారంతో.. హైదరాబాద్‌లో నేరాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే విధంగా రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థను మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు సీపీ. శాంతిభద్రతను కాపాడ్డంతోపాటు పౌరులతో స్నేహంగా మెలిగేలా .. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అందింస్తున్నామని మహేందర్‌రెడ్డి అన్నారు. 

09:52 - December 13, 2016

హైదరాబాద్ : రవాణాశాఖలో వందశాతం క్యాష్‌లెస్‌ విధానాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. నగదు రహిత విధాన్నాని అమలు చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. అన్ని శాఖల్లో నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... మంగళవారం అన్ని జిల్లాల ఆర్టీసీ, ట్రాన్స్‌పోర్టు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

07:06 - September 15, 2016

హైదరాబాద్ : గణేష్‌ నిమజ్జానికి సర్వం సిద్ధమైంది. పోలీసులు, జిహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో నిమజ్జనం సాఫీగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 25 వేల పోలీసులను, 12 వేల సీసీ టీవీలను నిమజ్జనం సందర్భంగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు డైరెక్ట్‌ లైవ్‌ సౌకర్యం ఉన్న అత్యంత నాణ్యత గల కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు.

నిమజ్జనానికి.. సర్వం సిద్ధం
గణేష్‌ నిమజ్జనానికి ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాలను సర్కిల్స్‌గా విభజించి ఐపీఎస్‌ అధికారులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 20 కిలోమీటర్ల దూరం వరకు సుమారు 12 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు నేరుగా బషీర్‌బాగ్‌లోని ప్రధాన కమాండ్‌ కంట్రోల్‌కు విజువల్స్‌ పంపించే శాటిలైట్‌ సౌకర్యాన్ని కూడా కల్పించారు. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ద్వారా పరిశీలిస్తూ ఉంటారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా.. శాంతియుతంగా ఉత్సవాలను ముగించుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సూచించారు.
భారీ పోలీస్ బందోబస్తు..
ప్రస్తుతం 4 వేల వైర్‌లెస్‌ సెట్లు ఉండగా దానికి అదనంగా మరో 500 ఏర్పాటు చేశారు. మఫ్టీలో పెద్ద సంఖ్యలో పోలీసులు విధుల్లో హాజరవుతున్నారు. వీరు ప్రజల్లో ఉండి అనుమానితులను అదుపులోకి తీసుకుంటారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా క్షణాల్లో అక్కడికి బలగాలు చేరుకునేలా ప్రత్యేక దళాలను సిద్ధం చేశారు. పాతబస్తీ నుంచి గణేష్‌ విగ్రహాలు తెల్లవారు జామునుంచే బయలుదేరే విధంగా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి కనీసం 50 శాతం విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్‌ గణేష్‌తో సహా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. నిమజ్జన ఊరేగింపు సాగే ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించారు. ఈ నిషేదాజ్ఞలు 16వ తేదీ ఉదయం 8 గంటల వరకు అమలులో ఉంటాయి. ప్రజలు, వినాయక మండప కమిటీలు, ఎన్జీవోలు ఉదయమే పూజా కార్యక్రమాలు ముగించుకుని నిమజ్జనానికి బయలుదేరాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సూచించారు.

సోషల్ మీడియాపై ఖాప్స్ దృష్టి..
ఎన్నడూ లేని విధంగా ఈసారి సోషల్‌ మీడియాపై పోలీసులు దృష్టి సారించారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ లాంటి మీడియా ద్వారా ఎవరైనా వదంతులు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే వారిని కఠినంగా శిక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - మహేందర్ రెడ్డి