మాజీ స్పీకర్

14:40 - October 11, 2018

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఆయన పార్టీలో చేరితే కృ‌ష్ణా, గుంటూరు జిల్లాలో సామాజిక సమీకరణాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కానీ నాలుగేళ్లుగా పవన్‌తో నాదెండ్ల మైత్రి పూర్వక సంబంధం కొనసాగిస్తున్నారు. పవన్ నిర్వహించే సభలు..సమావేశాలకు మనోహర్ సూచనలు చేస్తున్నారు. జనసేన భావజాలం, పవన్ వ్యక్తిత్వం..నాదెండ్ల నిర్ణయానికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కులాల మధ్య సఖ్యత పెంచాలని ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉందనే చెప్పవచ్చు. అంతేగాకుండా జనసేనకు దూరంగా ఉన్న సామాజిక వర్గాన్ని అక్కున్న చేర్చుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నాదెండ్ల మనోహర్ వ్యక్తిగతంగా వివాదరహితుడిగా పేరొందారు. మరి నాదెండ్ల ఎంతమేరకు సక్సెస్ అవుతారు ? ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

17:10 - September 12, 2018

హైదరాబాద్: ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు చేరిన ముఖ్యనేతలకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు పార్టీలోకి ఆహ్వానించారు.

కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి, నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు తెరాసాలో చేరారు. పలువును నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

13:13 - September 7, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లోకి చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ ఎస్ లో చేరారు. కేటీఆర్ సురేష్ రెడ్డిని పార్టీకిలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు అభివృద్ధిలో భాగస్వామిని అయ్యేందుకే టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ వచ్చాక అభివృద్ధిపరంగా నిశబ్ధ విప్లవాన్ని చూశానని తెలిపారు. తెలంగాణకు ఇది క్రిటికల్ టైమ్ అని పేర్కొన్నారు.

 

13:54 - August 13, 2018

నిజామాబాద్ : క్రమ శిక్షణకు ఆయన మారుపేరు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి స్పీకర్‌గా మెప్పించారు. అయినా గత రెండు ఎన్నికల్లో ఆయన ఓటమిచెందారు. లోకల్‌ నియోజకవర్గాన్ని కాదని వెళ్లిన ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురైంది. దీంతో మరోసారి లోకల్‌ నియోజకవర్గంపై దృష్టి సారించారు.  బాల్కొండ నుంచి మరోసారి బరిలోకి దిగాలని యోచిస్తున్న సురేష్‌రెడ్డి పాలిటిక్స్‌పై కథనం..
సురేష్‌రెడ్డి ఎన్నికల పోటీపై ఆసక్తి 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డి ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆయన.. అదే నియోజకవర్గం నుంచి వరుసగా 1989, 1994,1999,2004 ఎన్నికల్లో గెలుపొందారు.నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో స్పీకర్‌గా పనిచేసి మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అనిపించుకున్నారు. 2009 ఎన్నికల్లో సురేష్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గాన్ని వదిలి ఆర్మూర్‌ నియోజకవర్గానికి షిఫ్ట్‌ అయ్యారు. అంతే  అప్పటి వరకు కొనసాగిన ఆయన జైత్రయాత్ర అక్కడితో ఫుల్‌స్టాఫ్‌ పడింది. 2009,2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు.  9ఏళ్లుగా ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జీగా కొనసగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోకీలకనేతగా ఉంటూ... జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాలపై కన్నేసిన ఆయన... రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏ నియోజకవరగం నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. నాలుగుసార్లు గెలిచిన బాల్కొండ సేఫ్‌ జోన్‌గా ఉంటుందా.. లేక రెండుసార్లు ఓడిపోయిన ఆర్మూర్‌ లో సానుభూతి వర్కవుట్‌ అవుతుందా అన్నది ఆయన తేల్చుకోలేక సతమతమవుతున్నారు. 
బాల్కొండపై కన్నేసిన ఈరపతి అనిల్‌
సురేష్‌రెడ్డి ఆర్మూర్‌కు షిఫ్ట్‌కాగానే... బాల్కొండ నియోజకవర్గంలో ఈరపతి అనిల్‌ జెండా పాతారు. నియోజకవర్గ ఇంచార్జీగా కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్న సురేష్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని తన అనుచరులకు పదవుల ఇప్పించుకోవడం, సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం, బాల్కొండ నుంచే  సురేష్‌రెడ్డి పోటీ చేస్తారన్న  ప్రచారం జోరుగా సాగుతోంది. సురేష్‌రెడ్డి ఆర్మూర్‌లో కాకుండా బాల్కొండపై ఫోకస్‌ పెట్టడంతో నియోజకవర్గ ఇంచార్జీ అనిల్‌ అతనిపై గుర్రుగా ఉన్నారు. తన నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఏంటంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ మధ్యే కాంగ్రెస్‌లోచేరిన రాజారాం యాదవ్‌ సైతం బాల్కొండ టికెట్‌ ఆశిస్తున్నారు.  అనిల్‌, సురేష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.  మరోవై
ఆర్మూర్‌పై దృష్టిపెట్టిన ఆకుల లలిత
ఆర్మూర్‌ నుంచి బాల్కొండకు సురేష్‌రెడ్డి షిఫ్ట్‌ అవుతారనే  సమాచారంతో ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్‌పై కన్నేసింది. మరో సీనియర్‌ నాయకురాలు తన వారసుడిని నిలబెట్టి ఎమ్మెల్యే చేయడానికి టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. మొత్తానికి సురేష్‌రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి సార్వత్రిక సమరంలో పోటీ చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

 

10:39 - August 13, 2018

హైదరాబాద్ : లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ (89) కన్నుమూశారు. కోల్ కతాలోని ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చటర్జీ బాధపడుతున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 2004 నుంచి 2009 వరకు లోక్ సభ స్పీకర్ గా పని చేశారు. 10సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1968లో సోమ్ నాథ్ సీపీఎంలో చేరారు.

20:45 - April 8, 2018

సురేష్ రెడ్డి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. 2004లో 12వ శాసనసభకు స్పీకర్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ? టి.కాంగ్రెస్ ఎలాంటి వ్యూహం అనుసరించబోతోంది ? తదితర విషయాలు తెలుసుకోనేందుకు మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. స్పీకర్ అధికారాలు దుర్వినియోగం అవుతున్నాయా ? కోమటిరెడ్డి, సంపత్ లు చేసింది తప్పు కాదా ? ఫిరాయింపులను ఏమీ చేయలేమా ? కాంగ్రెస్ తో పదవికి లాబీయింగే అర్హతా ? ఇలాంటి ఎన్నో విషయాలపై ఎలాంటి విషయాలు..వెల్లడించారు ? తదితర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss

Subscribe to RSS - మాజీ స్పీకర్