మామ

10:28 - July 9, 2018

వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..రెండు నెలలకే విడిపోయారు..అయినా ఆ వ్యక్తి మాత్రం ఆమెనే వేధిస్తున్నాడు..ఇది చూసి భరించలేని తండ్రి అతడిని నరికిచంపాడు. ఈ ఘటన చీటకోడూరులో చోటు చేసుకుంది. సీతకోడూరుకు చెందిన లావణ్య...యాదాద్రి జిల్లా ఆలేరు ప్రాంతానికి చెందిన ఉదయ్ లు ప్రేమించుకున్నారు. వీరు వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. అనంతరం ఇరువురు విడిపోయారు. కానీ ఉదయ్..లావణ్యను తరచూ వేధించడం ప్రారంభించాడు.

సోమవారం కూడా ఇలాగే వేధించడం ప్రారంభించాడు. మామ ఎల్లేష్ వారించడానికి వెళ్లగా ఇద్దరి మధ్య వాగ్వాదం..ఘర్షణ చోటు చేసుకుంది. ఆపడానికి వెళ్లిన అత్త, లావణ్యలపై ఉదయ్ దాడి చేశాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎల్లేశ్ గొడ్డలితో దాడి చేశాడు. దీనితో ఉదయ్ అక్కడికక్కడనే మృతి చెందాడు. గతంలో ఉదయ్ ప్రవర్తన తీరును..వేధింపుల విషయాన్ని ఎల్లేష్ పెద్దలకు తెలియచేసినట్లు...పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిలో పరివర్తన రాలేదని తెలుస్తోంది. ఘటన జరిగిన అనంతరం ఎల్లేశ్..అతని కుమారులు జనగామ పీఎస్ లో లొంగిపోయారు. 

18:23 - December 11, 2017

హైదరాబాద్ : గిరిజనుడి ఆవకాశాలను కొల్లగొట్టిన కేటీఆర్ మామపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ వియ్యంకుడు పాకాల హరినాథ్‌ ఎస్టీ సర్టిఫికెట్‌తో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిగా ఉద్యోగం సంపాదించి ప్రభుత్వాన్ని మోసం చేశారన్నారు. రిటైర్డ్‌ అయ్యి ఇప్పటికీ దాదాపు 50 వేల రూపాయల పెన్షన్‌ తీసుకుంటున్న హరినాథ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలకులు వారి మీద, వారి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు పారదర్శికంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. 

17:32 - November 26, 2017

కామారెడ్డి : జిల్లా దేవునిపల్లిలో దారుణం జరిగింది. మామ లైంగిక వేధింపులు భరించలేక కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మామ కత్తితో కడుపుపై కోసుకున్నాడు. కుంచం పోచయ్య అనే వ్యక్తి కోడలు కౌసల్యను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారనే భయతో పోచయ్య కత్తితో కడుపుపై కోసుకున్నాడు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న కామారెడ్డి డాక్టర్లు హైదరాబాద్ గాంధీకి రిఫర్ చేశారు. పోచయ్య భార్య అతని వేధింపులు భరించలేక వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

17:02 - July 25, 2017

కరీంనగర్ : సభ్య సమాజం తలదించుకొనే ఓ ఘటన కరీంనగర్ జిల్లాలో వీణవంక (మం) బ్రాహ్మణ పల్లిలో చోటు చేసుకుంది. తమ్ముడి భార్యను ఓ బావ ఏకంగా వివస్త్ర చేశాడు. అంతేగాక అత్యాచార యత్నం చేయబోయి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘోరాతి ఘోరమైన ఘటనకు వ్యక్తి భార్య..తల్లిదండ్రులు..సోదరి సహకరించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాధితురాలు హెచ్చార్సీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 25వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీపీకి హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంపై బాధితురాలు టెన్ టివితో మాట్లాడి తనకు జరిగిన ఘోరాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేసే చెప్పింది.

2న ఘటన..

ఈనెల 2వ తేదీన ఈ ఘటన జరిగింది. పొలంలో పనిచేస్తుండగా మా అత్త..మా బావ..మా యారాలు..మా మామ..లు దాడి చేశారు. బావ మళ్లీ మీద పడి ఒంటిపై దుస్తులు ఊడపీకాడు. అత్యాచారయత్నానికి పాల్పడడమే కాకుండా తన గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. పెళ్లి అయినప్పటి నుండి తనను వేధిస్తున్నారు. తన భర్త ఏమీ అనకుండా చిన్న చిన్న వాటికి వేధించే వారు. సమస్యలు తీరుతాయని భావించాం. ఆధారాలు లేకపోవడం వల్ల తాము ఎవరికీ చెప్పలేదు. గతంలో పోలీసులకు..పెద్ద మనుషులకు చెప్పిని పట్టించుకోలేదు. దీనితో తమకు సపోర్టు ఇవ్వలేదు. ఎస్ఐ..పెద్ద మనుషులు తమ వైపుకు మాట్లాడలేదు. తనకు పాప..బాబు ఉన్నారు. ఘటన జరిగే సమయంలో తన తల్లి కూడా అక్కడనే ఉందని..వారిని కూడా చితకబాదారు. తనపై నిందలు వేస్తున్నారు. మూడో తేదీన పిటిషన్ ఇవ్వడం జరిగింది. వీణమంక మండలం ఎస్ఐ పట్టించుకోవడం లేదు. రెండు..మూడు రోజులు పీఎస్ చుట్టూ తిరిగినం’. అని బాధితురాలు వాపోయింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:23 - June 8, 2017

'పవన్ కళ్యాణ్'...'త్రివిక్రమ్' కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న 'త్రివిక్రమ్' సినిమా అంటే పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో అత్త..మామ..ఇలా కొన్ని పాత్రలు అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టైటిల్ నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో 'పవన్' ఇంజినీర్ గా నటిస్తున్నాడని టాక్. ఇక ప్రధాన పాత్రలో 'ఖుష్బూ' నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర అత్త అని తెలుస్తోంది. ఇక మామ పాత్రకు ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతోందని తెలుస్తోంది. కోలీవుడ్..బాలీవుడ్..ఇతర వుడ్ లకు సంబంధించిన ప్రముఖ హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మమ్ముటి..మోహన్ లాల్ తారల పేర్లు వినిపిస్తున్నాయి. మరి 'పవన్' కు మామగా ఎవరు నటిస్తారనే విషయం త్వరలో తెలియనుంది.

10:57 - April 27, 2017

బీహార్ : రాష్ట్రంలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది..మామ..కోడలు పరారై పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన పుర్ణియాలో చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా మామ..కోడలి మధ్య ప్రేమ చిగురించింది. దీనితో వీరిద్దరూ ఇంటి నుండి పారిపోయి ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. దీనితో తన సొంత తండ్రిపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఫిర్యాదుతో అతని తండ్రిని అరెస్టు చేశారు. సమాచారం తెలుసుకున్న సదరు మహిళ పీఎస్ కు వెళ్లి తన భర్తను విడిపించుకుంది. విడుదల అనంతరం కలిసి జీవిస్తామని ప్రమాణం చేశారు.

22:00 - December 31, 2016

కృష్ణా : సమాజంలో మానవ సంబంధాలపై నానాటికి విలువలు దిగజారిపోతున్నాయి. తండ్రి స్థానంలో వున్నవారు..వుండాల్సినవారు కూడా పశువుల్లా వ్యవహరిస్తున్నారు. తండ్రీ..సోదరుడు..మామ అనే వరుసలు మరచిపోయి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగింది. కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మామ వేధింపులు తట్టుకోలేని కోడలు కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మామ వేధింపుల పట్ల భర్తకు...అత్తకూ చెప్పినా ఫలితం లేకపోవటంతో దిక్కుతోచని మనస్తాపానికి గురై ఆ అమాయకురాలు ఏడే సంవత్సరాల బిడ్డను అనాధను చేసి ఆత్మహత్య చేసుకుని ప్రాణం విడిచింది. మల్లంపాటి కిరణ్ కు ఫణికి 2007 వ సంవత్సరంలో వివాహం అయ్యింది. వీరికి ఏడు సంవత్సరాల బాబుకూడా వున్నాడు. ఫణిశ్రీ ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. అత్తకు ఈ విషయాన్ని తెలిపినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఫణిశ్రీ మృతి చెందింది. ఫణిశ్రీ పుట్టింటివారి ఫిర్యాదు మేరకు ఫణి భర్త కిరణ్ ..అత్త రమాదేవి, ప్రధాన నిందితుడు మా నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టిరు. మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పుట్టింటివారు కోరుతున్నారు. 

20:13 - November 6, 2016
20:06 - October 9, 2016
15:56 - May 22, 2016

మహబూబ్‌నగర్‌ : ఇద్దరూ అమ్మాయిలే పుట్టారంటూ ఓ భర్త తన భార్యను ఇంటినుంచి గెంటేశాడు. కూతురి కాపురం సరిచేద్దామని వెళ్లిన మామపై గొడ్డలితో దాడి చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో ఈ ఘటన జరిగింది. ఆరేళ్లక్రితం అనితకు, మురళితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ఇద్దరూ అమ్మాయిలే పుట్టారంటూ భార్యపై మురళి వేధింపులు పెంచాడు. ఆమెను తీవ్రంగా కొట్టి పుట్టింట్లో వదిలేశాడు. ఎన్నిసార్లు తీసుకువెళ్లాలని పద్మ కోరినా పట్టించుకోలేదు. పంచాయితీలో పెద్దలు బుద్ధి చెప్పినా వినలేదు. ఇలా ఏడాది గడచిపోవడంతో పద్మ తండ్రి కూతురిని అత్తారింట్లో దిగబెట్టాలని వచ్చాడు. అతన్నిచూసి ఆగ్రహించిన మురళి గొడ్డలితో మామ తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటు భర్త తీరుతో విసిగిపోయిన భార్య అతని ఇంటిముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - మామ