మార్క్సిజం

22:09 - May 10, 2018

ఢిల్లీ : మార్క్సిజం అంటే అభివృద్ధికి మూలసూత్రం... మార్క్సిజం అంటే పోరాట ఆలోచనా విధానం.. మార్క్సిజం అంటే  క్యాపిటలిజం వెనుక ఉన్న అసత్యాన్ని నిలదీస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 'ఆసియాఖండం- భారత్‌లో మార్క్సిజం అవసరం ' అనే అంశంపై ఢిల్లీలో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. అస్ట్రో ఫిజిక్స్‌ నుంచి నానో టెక్నాలజీ వరకు ప్రపంచం సాధిస్తున్న అభివృద్ధి వెనుక మార్క్సిజం ఇమిడి ఉందన్నారు.  ఒకప్పుడు ఆసియా జబ్బుమనిషిగా పేరుపడి.. అత్యంత వెనుకబడిన దేశంగా ఉన్న చైనా.. మార్క్సిజం బాటలో నడిచి నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించిందన్నారు.

 

14:49 - October 22, 2017

దేవుడనేది అబద్ధమని ప్రముఖ రచయిత్రి రంగానాయకమ్మ పేర్కొన్నారు. టెన్ టివి రంగనాయకమ్మతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు విశేషాలు తెలియచేశారు. అందులో నాస్తికత్వంపై స్పందించారు. 20 ఏళ్ల వరకు నమ్మకాలు..ఉండేవన్నారు. కానీ కందుకూరి వీరేశిలింగం గారి పుస్తకం తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. కందుకూరి నాస్తికుడు కారని, కానీ ఆ బుక్ లో కొన్ని ప్రశ్నలున్నాయన్నారు. అందులో కొన్ని ప్రశ్నలు తాను అప్పటి వరకు గ్రహించలేదని..ఎవరూ తనకూ చెప్పలేదన్నారు. తనకు..కుటుంబసభ్యులకు -14 కంటి సైట్ ఉందని..సూర్య నమస్కారం చేస్తే సమస్య పరిష్కారమౌతుందని పలువురు చెప్పారని పేర్కొన్నారు. కానీ చేసినా మార్పు రాలేదన్నారు. తరువాత నాస్తికత్వం అలవాటై పోయిందని..అలా నాస్తికత్వం పుస్తకాలు చదువుతూ చివరకు దేవుడు అబద్ధమనే అభిప్రాయం వచ్చిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:31 - May 5, 2017

హైదరాబాద్: ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన కారల్‌ మార్క్స్ జన్మించి సరిగ్గా 200ఏళ్లు.. కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న వ్యాఖ్యలు తప్పని రుజువుచేస్తూ 21వ శతాబ్దంలో మార్క్సిజం కొత్త వెలుగులు విరజిమ్ముతోంది.. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పారిశ్రామికోత్పత్తి పడిపోయి నవతరం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.. ఇదే సమయంలోనే మళ్లీ జనానికి మార్క్స్‌ కనిపిస్తున్నారు..

2017 సంవత్సరానికి మూడు ప్రత్యేకతలు

2017 సంవత్సరం కమ్యూనిజానికి చాలా ప్రత్యేకమైన ఏడాది.. అక్టోబర్‌ మహా విప్లవానికి ఏడాదితో నూరేళ్లు పూర్తికాగా.... మార్క్స్‌ పెట్టుబడి గ్రంథం రాసి నూటయాభై ఏళ్లు... మార్క్స్‌ జన్మించి రెండు వందల ఏళ్లయింది.. ఈ మూడు మహా ఘటనలు ప్రపంచాన్ని 20వ శతాబ్దంలో గొప్ప మలుపు తిప్పాయి.

21వ శతాబ్దంలో కొత్త వెలుగులు విరజిమ్ముతున్న మార్క్సిజం

కమ్యూనిజం పని అయిపోయిందన్న విమర్శలు తప్పని రుజువుచేస్తూ... 21వ శతాబ్దంలో మార్క్సిజం తిరిగి కొత్త వెలుగులు విరజిమ్ముతోంది. 2008 నుంచి ఆరంభమైన పెట్టుబడిదారి సంక్షోభంతో కమ్యూనిస్టు వ్యతిరేకతకు కాలం చెల్లింది. పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రపంచీకరణ ఆత్మరక్షణలో పడ్డాయి. తద్వారా మార్క్స్‌ సిద్ధాంతం సజీవమని నిరూపితమైంది.

నవతరాన్ని వెంటాడుతున్న పెట్టుబడిదారి సంక్షోభం ...

నిజానికి నేడు, కమ్యూనిస్టు వ్యతిరేకత కన్నా పెట్టుబడిదారి సంక్షోభం నవతరాన్ని వెంటాడుతోందన్నది విశ్లేషకుల భావన. నిరుద్యోగానికి తోడు వ్యవసాయ సంక్షోభం, పారిశ్రామికోత్పత్తి పడిపోవడం దేశాన్ని పీడిస్తున్న తరుణంలో మళ్లీ జనం మార్క్స్‌ సిద్ధాంతం వైపు ఆకర్షితులవుతున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం.

1818 మే 5న జర్మనీలోని ట్రయర్‌ పట్టణంలో మార్క్స్ జననం...

కమ్యూనిజం సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మార్క్స్‌ జన్మించి సరిగ్గా 200ఏళ్లయింది.. మార్క్స్ 1818 మే 5న జర్మనీలోని ట్రయర్‌ పట్టణంలో జన్మించారు. తన చదువును, మేధావిత్వాన్ని ప్రపంచ మానవాళి విముక్తి కోసం ఉపయోగించాలనుకున్నారు. పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. భార్య జెన్నీవాన్‌ వెస్ట్‌ఫాలెన్‌ సహా దేశ బహిష్కరణకు గురయ్యారు. బెల్జియం, ఫ్రాన్స్‌ తదితర దేశాలు తిరిగి అక్కడ నిలువనీడ కోల్పోయి లండన్‌లో స్థిరపడ్డారు. నాటి నిరంకుశ దోపిడీ పాలకులపై దండయాత్ర చేసి పేదరికాన్ని కోరి తెచ్చుకున్నారు . పిల్లలకు పోషకాహారం లేక తాను అమితంగా ప్రేమించే కొడుకును కోల్పోయారు. చనిపోయిన కొడుక్కి అంత్యక్రియలకు కూడా డబ్బులేక ఇంట్లో సామాను అమ్మేశారు.

మార్క్స్‌కు వెన్నంటి నిలిచిన జెన్నీ ....

ధనిక కుటుంబంలో జన్మించిన జెన్నీ అన్నీ తానై మార్క్స్‌ వెన్నంటి నిలిచింది. స్నేహితుడు, సహచర సిద్ధాంతవేత్త ఎంగెల్స్‌ తన ఆదాయంతో మార్క్స్‌ కుటుంబానికి అండగా నిలబడ్డారు. మార్క్స్‌ తన 64వ యేట 1883 మార్చి 14న చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు ఎంగెల్స్‌ సహా పదకొండు మంది మాత్రమే హాజరయ్యారంటే, నాటి పాలకుల దుర్నీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

తనకు తాను ప్రపంచ పౌరుడిగా చెప్పుకున్న మార్క్స్‌ ...

చనిపోయేనాటికి ఏ దేశపౌరసత్వమూ లేని మార్క్స్‌ తనకు తాను ప్రపంచ పౌరుడినని చెప్పుకున్నారు. బ్రిటిషు మ్యూజియం గ్రంథాలయంలో కూర్చొని నిరంతరం అధ్యయనం చేశారు. భారతదేశాన్ని గురించి అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా చదివారు. తన వ్యాసాలు, గ్రంధాలలో ప్రస్తావించారు.. భారతదేశం బ్రిటిష్‌ శృంఖలాలు తెంచుకొని విముక్తి సాధిస్తుందని ఆయన ఘంటాపథంగా చెప్పాడు. మార్క్స్ తాను జీవించిన కాలంలో సోషలిజాన్ని చూడలేకపోయారు. 20వ శతాబ్దపు తొలి సంధ్యలో సోవియట్‌ యూనియన్‌ అవతరించింది. ఆపై వరుసగా చైనా, వియాత్నం, క్యూబా... ఇలా అనేక దేశాల్లో సోషలిజం ఆవిర్భవించింది.

నిర్దిష్ట పరిస్థితిని నిర్దిష్టంగా విశ్లేషించడమే మార్క్సిజంఅన్న లెనిన్‌...

నిర్దిష్ట పరిస్థితిని నిర్దిష్టంగా విశ్లేషించడమే మార్క్సిజం యొక్క సజీవ సిద్ధాంతమని లెనిన్‌ చెప్పారు. దాన్ని ఆయన రష్యాలో అమలుచేసి చూపించారు. వివిధ రకాల జాతులున్న రష్యాలో మార్క్సిజం వర్తించదన్న ప్రచారాన్ని ఆయన పటాపంచలు చేశాడు. అలాగే మావో బాగా వెనుకబడిన చైనాలో నిర్దిష్టంగా అమలు చేశారు. అక్కడ ప్రజలు కన్ఫ్యూసియస్‌ సిద్ధాంతం, బౌద్ధ మతాల ప్రభావం నుంచి బయటపడి చైనాను విముక్తి చేశారు. లాటిన్‌ అమెరికాది మరో అనుభవం. ఇలా వివిధ దేశాల్లో అనేక రకాల అనుభవాలు. కానీ అన్నింటి సారం ఒక్కటే. మార్క్సిజం ప్రపంచ సిద్ధాంతం. ఆయా దేశాల నిర్దిష్ట పరిస్థితులకు దాన్ని వర్తింపజేసే విధానాన్ని బట్టి దాని విజయం ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో భారతదేశమూ అదే బాటలో నడుస్తుంది. అదే నడుస్తోన్న చరిత్ర సారం.

16:18 - November 7, 2016

విజయవాడ : లెనినిజం, మార్క్సిజంపై పెట్టుబడిదారులు దాడి చేస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. పెట్టుబడిదారుల కుట్రలకు వ్యతిరేకంగా తొమ్మిది దేశాల్లో కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయన్నారు. చారిత్రాత్మక అక్టోబరు సోషలిస్ట్ విప్లవం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్‌లో అన్ని వామపక్ష పార్టీలు లెనిన్‌కి ఘనంగా నివాళి అర్పించారు. అంతర్జాతీయంగా గ్లోబిలైజేషన్ తరువాత పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని.. అది కోలుకునే పరిస్థితులు కూడా లేవని నిపుణులు చెబుతున్నారన్నారు. 

 

21:22 - April 9, 2016

నల్గొండ : తెలంగాణకు ద్రోహం చేసేవారిపై కూడా తెలంగాణ ప్రజలు తిరగబడతారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం హెచ్చరించారు. నల్గొండ జిల్లా నకిరెకల్‌లో నర్రా రాఘవరెడ్డి తొలి వర్థంతి కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు. మరుగున పడిపోయిన అంబేద్కర్‌ ఆశయాలు, సిద్ధాంతాలను రాబోయో కాలంలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. అంబేద్కరిజం, మార్క్సిజం కలగలిపి ప్రజలకు మేలు చేసేలా పార్టీ ప్రణాళిక రూపొందిస్తోందని తమ్మినేని ప్రకటించారు. 

Don't Miss

Subscribe to RSS - మార్క్సిజం