మార్పులు

16:43 - December 6, 2018

ఢిల్లీ  : ఆధార్ కార్డుతో దేశంలో పలు మార్పులొచ్చాయి. ఏ గుర్తింపుకైనా ఆధార్ కార్డే ఆధారం. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయాలంటే ఆధార్ వుండాల్సిందే. ఇక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధారే ఆధారంగా వుంది. కాగా విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ వర్తించాలంటే ఈ ఆధార్ కార్డే ఆధారం. 
ఇటీవ‌ల ఆధార్‌ చట్టబద్దతపై సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువరించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఆధార్ చ‌ట్టంలోని 57వ సెక్ష‌న్‌ను రాజ్యాంగ ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. పౌరుల ఆధార్ డేటా వివరాలను ప్రైవేటు సంస్థ‌లు వినియోగించుకోరాద‌ని త‌న ఆదేశంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కూడా ధ‌ర్మాస‌నం వ్య‌తిరేకించింది. 
కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు..
దీంతో ఆధార్ చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. చ‌ట్టంలో కొత్త ప్ర‌తిపాద‌న‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి కూడా. దీంతో దేశ పౌరులు త‌మ ఆధార్ నెంబ‌ర్‌ను విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌నుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు బ‌యోమెట్రిక్స్‌తోపాటు డేటాను కూడా వెన‌క్కి తీసుకునే వెసులుబాటును క‌ల్పించాల‌ని కేంద్రం భావిస్తోంది. 
18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం..
దీంతో ఆధార్ విత్‌డ్రా చేసుకునే విషయమై యూడీఏఐ కొత్త ప్ర‌తిపాద‌నలు చేసింది. 18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఎవ‌రైనా త‌మ ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెల‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌నున్న‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించిన న్యాయ‌శాఖ‌.. దీన్ని ప్ర‌తి పౌరుడికి వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. 
పాన్ కార్డు లేని వారికి కొత్త నిబంధ‌న ఉప‌యోగం..
అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పాన్ కార్డు లేని వారికి మాత్రం ఈ కొత్త నిబంధ‌న ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. దేశవ్యాప్తంగా 2018 మార్చి 12 వరకు 37.50 కోట్లు పాన్ కార్డులు జారీచేయగా, వీటిలో వ్యక్తిగత కార్డలు 36.54 కోట్లు. ఇప్పటి వరకు 16.84 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్ విషయంలో ఒక న్యాయనిర్ణేత అధికారిని నియమించాలని కేంద్రం భావించింది. జాతీయ భద్రత దృష్ట్యా పౌరుల వివరాలను బహిర్గతం చేసే ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(2)ను సైతం సుప్రీంకోర్టు రద్దుచేసింది. 

07:40 - November 15, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక చిహ్నంలో ప్రభుత్వం మార్పులు చేసింది. చిహ్నంలోని ఏపీ గవర్నమెంట్‌ అని రాసి ఉన్న ఆంగ్ల పదాలను మార్చింది. తెలుగులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్యమేవ జయతే అనే పదాన్ని, పూర్ణకుంభంలోని పదాలనూ తెలుగులోకి మార్చింది. 

11:21 - October 22, 2018

బెంగళూరు : మంచి చెడులు అనేవి రెండు విభిన్నమైనకోణాలు. అలాగే ప్రతీ అంశంలోను రెండు కోణాలు వుంటాయి. బాధ, వేధన అనేవి అందరికీ ఒకలాగనే వుంటాయి. ప్రతీ మనిషిలోను మంచి చెడులు వుంటాయి. అలాగే బాధ అనేది స్త్రీ పురుషులిద్దరికి వుంటుంది. కానీ ఎక్కువగా బాధింపబడే నేపథ్యంలో మహిళలు కొన్ని తరతరాలుగా బాధలను, వేదనలను, అణచివేతలను ఎదుర్కొంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో సాధికారతవైపుగా అడుగులు వేస్తున్న మహిళలు తమపై జరుగుతున్న వేధింపులపై గళమెత్తుతున్నారు. ‘మీటూ ’ అంటు ఇక బాదలను, వేధింపులను సహించం అంటు నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాకూ బాధలున్నాయి. మేము వేధింపులను ఎదుర్కొంటున్నామంటు పురుషులుకూడా ‘మెన్ టూ’ను ప్రారంభించారు. దీనిపై ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. 

‘మెన్ టూ ప్రారంభించిన దర్శకుడు వారాహి..
సినీ పరిశ్రమలోనే కాక దాదాపు అన్ని రంగాల్లోను ‘మీ టూ’ ఉద్యమం కాక పుట్టిస్తున్న సమయంలో మరో సరికొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది. తమిళ పరిశ్రమలోని ఓ దర్శకుడు ఈ ఉద్యమన్ని ప్రారంభించారు. ‘మీటూ’ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మహిళలు బెదిరింపులకు పాల్పడుతున్నారని..దీని బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘మీ టూ మెన్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తమిళ సినీ దర్శకుడు వారాహి తెలిపారు. 

 బెంగళూరులో మెటూను ప్రారంభించిన జాగిర్ధార్..Image result for men too
ఇప్పుడు ఇటువంటి తరహా ఉద్యమమే మరోటి పురుడు పోసుకుంది. అయితే, ఇది పురుషుల చేతిలో అన్యాయానికి గురైన మహిళలకు సంబంధించినది కాదు.. మహిళల చేతిలో కష్టాలు పడుతున్న పురుషులకు సంబంధించింది. దీనిపేరు ‘మెన్ టూ’. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘క్రిస్ప్’ అనే స్పచ్ఛంద సంస్థ దీనిని తెరపైకి తీసుకొచ్చింది. ఈ సంస్థ నిర్వాహకుడైన కుమార్ జాగిర్దార్.. మరో 15 మందితో కలిసి ఆదివారం దీనిని ప్రారంభించారు. ‘మీటూ’కు ‘మెన్ టూ’ ఏమాత్రం వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా జాగిర్దార్ పేర్కొన్నారు. తప్పుడు కేసులు, ఆరోపణలతో మానసిక క్షోభ అనుభవిస్తున్న పురుషుల ఆవేదనను వెలికి తీసుకొచ్చేందుకే దీనిని ప్రారంభించినట్టు వివరించారు. 
అకౌంటెంట్ అయిన జాగిర్దార్... స్టాక్ మార్కెట్ నిపుణుడు కూడా. భార్యా బాధితుల సంఘం, భారతీయ కుటుంబ సంక్షేమ సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాలలో సవరణలు చేయాలంటూ గత 15 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఆయనను వదిలి కుమార్తెతో కలిసి వెళ్లిపోయిన భార్య ఓ క్రికెటర్‌ను పెళ్లాడింది. తన కుమార్తె సంరక్షణ భారాన్ని తనకు అప్పగించాలంటూ పోరాడి విజయం సాధించారు. కాగా, ‘మెన్ టూ’ వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ ఉండడం విశేషం. సొంత కుమార్తెనే లైంగికంగా వేధించాడంటూ పాస్కల్‌పై ఆయన భార్య కేసు పెట్టింది. 2017లో కేసును కొట్టేసిన కోర్టు పాస్కల్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.
 

13:09 - October 16, 2018

ఢిల్లీ : వాట్సాప్‌‌ మార్పులు చేస్తోంది. ‘సందేశాల డిలీట్‌’ సదుపాయంలో వాట్సాప్‌ మార్పులు చేస్తోంది. ఇతరులకు పంపిన సందేశాలు/ సమాచారం వారు చూడకముందే తొలగించేందుకు ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ ఫీచర్‌ తోడ్పడుతోంది. దీన్ని గత ఏడాదే ప్రవేశపెట్టారు. పొరపాటున వేరేవారికి లేదా తప్పుడు సందేశాలు/సమాచారం పంపినప్పుడు ఇది ఉపయోగపడుతోంది. సందేశ ఉపసంహరణ సమయం మొదట దీనిలో ఏడు నిమిషాలుగా నిర్ణయించారు. తర్వాత దీన్ని గంట ఎనిమిది నిమిషాల 16 సెకన్లకు పెంచారు. అంటే ఈ సమయంలోపు మన సందేశాన్ని వెనక్కు తీసుకోవచ్చు. దీనిలో తాజాగా వాట్సాప్‌ మార్పులు తీసుకొచ్చినట్లు వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ తెలిపింది. 

ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం కొత్తగా సిద్ధం చేసిన బీటా వెర్షన్‌లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. తాజా మార్పుల ప్రకారం.. సందేశాలు డిలీట్‌ చేసేందుకు ఎదుటివారికి వాట్సాప్‌ వినియోగదారుడు ఓ అభ్యర్థనను పంపాల్సి ఉంటుంది. దీన్ని 13 గంటల ఎనిమిది నిమిషాల 16 సెకన్లలోపు అవతలి వ్యక్తి ఆమోదించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సందేశాలు డిలీట్‌ చేయడం కుదరదు. ఎదుటి వ్యక్తులు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసినప్పుడు ఈ సమయం మించిపోయే అవకాశముందని, ఫలితంగా డిలీట్‌ సదుపాయం పనిచేయదని వాబీటాఇన్ఫో వివరించింది.

 

12:57 - May 4, 2018

అనంతపురం : జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుడటంతో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. అందుకోసం పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు.. నియోజక వర్గ సమన్వయ కర్తలలో మార్పులు చేస్తోంది. దీంతో ఇంతకాలం నియోజక వర్గాలకు సమన్వయ కర్తలుగా పనిచేసిన వారిలో ఆందోళన మొదలైంది.

అనంతపురం జిల్లాలోని వైసీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అధినేత జగన్‌.. పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయ కర్తలను మారుస్తుడటంతో పార్టీలో కోలాహలం నెలకొంది. ఇంత కాలం అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని అసెంబ్లీ సమన్వయ కర్తగా నియమించారు. ఇన్నాళ్లు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న నదీం అహమ్మద్‌ను హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించారు. ఇక  హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా వ్వవహరిస్తున్న రంగయ్యను అనంతపురం పార్లమెంట్ సమన్వయ కర్తగా నియమించారు.

అనంత వెంకటరామిరెడ్డిని అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా పార్టీ అధినేత జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో అనంతపురం వైసీపీ కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది. వెంకటరామిరెడ్డి స్వగృహంలో వైసీపీ నేతలు హడావుడి చేస్తూ.. ఆయనను పూల మాలలతో సత్కరించారు. దీంతో అనంతపురం రాజకీయాల్లో అసలైన ఆట మొదలయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అనంతపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయడమే కాక రానున్న ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం వెంకటరామిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారానికి తెరదించుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అనంతపురం పార్లమెంట్‌ నియోజక వర్గానికి వైసీపీ తరుపున రంగయ్యను బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి వైసీపీ సమన్వయ కర్త నదీం అహమ్మద్‌ను నియమించినప్పటికీ టికెట్ల కేటాయింపు సమయానికి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక కదిరి నియోజకవర్గం నుంచి మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలనే ఎన్నికల రణక్షేత్రంలోకి పంపాలని వైసీపీ చూస్తోంది.
 
వచ్చే ఎన్నికల్లో తాజాగా నియమించిన సమన్వయకర్తలే పోటే చేస్తారనే ప్రచారం వైసీపీలో ఊపందుకుంది. దీంతో నాలుగేళ్లుగా నియోజకవర్గ సమన్వయ కర్తలుగా పనిచేస్తున్న నాయకుల్లో కలవరం మొదలయింది. ఇంత కాలం పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన తమను కాదని కొత్త నేతలను సమన్వయ కర్తలుగా నియమిస్తే తమ పరిస్థితి ఏంటని నేతలు మదనపడుతున్నారు.

07:51 - January 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు రాజకీయ పార్టీ అవతరిస్తామని టీ జేఏసీ,.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్‌కల్యాణ్‌ ప్రకటించడంతో రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొత్త పార్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై గులాబీ నేతలు ఆరా తీస్తున్నారు. 
అప్పుడే ఎన్నికల వేడి 
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే పలు పార్టీలు ప్రజాక్షేత్రంలోకి తమ కార్యక్రమాలను తీసుకెళ్తున్నాయి. అధికార పార్టీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు అ్రస్తాలను సిద్దం చేస్తున్నాయి. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. మారుతున్న రాజకీయ పరిణామాలతో మరో రెండు పార్టీలు కూడా వచ్చే ఎన్నికలపై కన్నేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
త్వరలో రాజకీయ పార్టీగా టీజేఏసీ  
తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌తో కలిసి ఉద్యమం చేసిన టీ-జేఏసీ త్వరలో రాజకీయ పార్టీగా ఆవిర్బవించనుండడంతో గులాబీ నేతల్లో ఆందోళన మొదలైంది. టీ-జేఏసీ చైర్మన్‌గా గుర్తింపు పొందిన ప్రొ.కోదండరామ్‌ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే పార్టీలో అసంతృప్తి నేతలంతా ఆ వైపునకు వెళ్లే అవకాశం ఉందని నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు కొంతమంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారనే సంకేతాలను టీ-జేఏసీ ఇవ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే ఓవైపు కోదండరామ్‌ బృందం పార్టీ వేదికను సిద్దం చేసుకునే పనిలో పడగా... ఇప్పటివరకు ఏపీకే పరిమితమనుకుంటున్న జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించడంతో రాజకీయ ముఖచిత్రం మారుతున్నట్లుగా కనిపిస్తోంది. 
టీజేఏసీలో చర్చ 
అయితే... పవన్‌ తెలంగాణలో కూడా పోటీ చేస్తానని చెప్పడంతో ఇప్పుడు టీజేఏసీలో చర్చ మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుందామని యోచిస్తున్న తరుణంలో... ఇప్పుడు పవన్‌ తెలంగాణలోనూ పోటీ చేస్తానని ప్రకటించడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీజేఏసీని అడ్డుకునేందుకే అధికార పార్టీ పవన్‌ను రంగంలోకి దింపిందనే అభిప్రాయం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. 
రాబోయే ఎన్నికలకు పార్టీలు వ్యూహాలు 
ఇదిలావుంటే... జరుగుతున్న పరిణామాలను అధికార పార్టీ నేతలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. టీ జేఏసీ, జనసేన ఎన్నికల రంగంలో ఉంటేనే తమకు రాజకీయంగా కలిసివస్తుందనే ధీమా నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే... రాబోయే ఎన్నికలకు ఇప్పుడిప్పుడే పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా భవిష్యత్‌లో రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలి. 

 

16:10 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోకల్‌ క్యాండిడేట్లకు న్యాయం జరిగేలా మార్పులు, చేర్పులు చేసే విషయమై.. సీఎం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎన్ని జోన్లు, క్యాడర్‌లు ఉండాలనే విషయమై.. చర్చించినట్లు చెప్పారు. అక్టోబర్‌ 21న ఈ విషయమై పూర్తి సమాచారంతో సమావేశమవుతామని స్పష్టం చేశారు. 

 

11:57 - September 2, 2017

హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌3న ఆదివారం ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఏడుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు మాజీ మంత్రులు చెబుతున్నారు. మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇదే అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్, బెల్లయ్య నాయక్ టి.కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ప్రకాష్ రెడ్డి, టి. బిజెపి అధికార ప్రతినిధి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

15:52 - September 1, 2017
12:31 - August 15, 2017

హైదరాబాద్: విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు సీఎం కేసీఆర్‌. వ్యవసాయ రంగానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని.. యాసంగి నుంచి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మిగులు విద్యుత్‌ను సాధిస్తుందని కేసీఆర్‌ అన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - మార్పులు