మావోయిస్టులు

11:29 - August 10, 2018

ఛత్తీస్ ఘడ్ : దంతేవాడలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. లారీ అసోసియేషన్ కార్యాలయంలో నిలిపిన లారీలకు నిప్పుపెట్టారు. 5 లారీలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.

15:55 - August 6, 2018

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందా ? మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు పై చేయి సాధిస్తున్నారా ? అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజం అనిపిస్తోంది. ఇటీవలే కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ ఘటన మరిచిపోకముందే మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా గొల్లపల్లి - కుంట మధ్య పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు తారసపడడం..ఇరువురి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో పోలీసుల కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. మావోయిస్టుల మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

12:32 - August 6, 2018

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులపై కేంద్రం, రాష్ట్రాలు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మరో భారీ ఎన్ కౌంటర్ సోమవారం చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవలే మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గట్టి నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు విశ్వసనీయ సమచారం మేరకు సోమవారం ఉదయం ఓ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ దీనిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. 

20:32 - July 28, 2018

విశాఖపట్టణం : మావోయిస్టుల అమరల సంస్మరణ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. ఇన్ఫార్మర్‌ అనే నేపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రజా ప్రతినిధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు హింసాత్మకంగా ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం కుంకుమపూడి గ్రామానికి చెందిన జయరాం అనే గిరిజనుడిని ఇన్ఫార్మర్‌ అనే నేపంతో మావోయిస్టులు హత్య చేశారు. నిద్రపోతున్న జయరాంను బయటకు తీసుకు వెళ్లి గొంతు కోశారు. జయరాంను కాపాడేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించగా.. గాల్లోకి కాల్పులు జరిపి దగ్గరకు రావొద్దని హెచ్చరించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌ సరిహద్దు ప్రాంతంలో రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత పోలీస్‌స్టేషన్లకు అదనపు బలగాలను పంపించారు. మావోయిస్టుల నుంచి ముప్పుఉన్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు స్వస్థలాలను వదలి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మావోయిస్టు వారోత్సవాలను ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కరపత్రాలు, గోడపత్రికలు ఏర్పాటు చేశారు. రెండేళ్ల కిందట అక్టోబర్‌ 24న రామ్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి పేరిట స్తూపాలను నిర్మించి నివాళులర్పిస్తారని సమాచారం. రాష్ట్రంలో మిగతా చోట్ల మావోయిస్టు పార్టీ ప్రభావం లేకపోయినా విశాఖ జిల్లాలో మాత్రం అడపా దడపా మావోయిస్టు పార్టీ తన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంది. విశాఖ జిల్లాలో మావోయిస్టుల లొంగుబాట్లు, అరెస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినా మావోయిస్టులు చాపకింద నీరులా వారి కార్యకలాపాలను కొన్ని చోట్ల నిర్వహిస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా జీకే వీధి, కొయ్యూరు, చింతపల్లి, జీ. మాడుగుల లాంటి ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సంచారం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా గాలికొండ, కోరుకొండ దళాలు ఈ ప్రాంతాల్లో తిరుతునట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గిరిజనులకు అండగా ఉండాల్సిన మావోయిస్టులు ఇన్ఫార్మర్‌ నెపంతో వారిని హతమార్చడం సరైంది కాదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

20:25 - July 28, 2018

విజయవాడ : అడ్డగోలుగా భూసేకరణ చేస్తే మహారాష్ట్ర తరహాలో పోరాటం చేస్తామని... ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని ముట్టడించి ఆందోళన చేస్తామని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. లక్ష మంది రైతులకు సంబంధించిన అంశాలపై పోరాడాల్సిన సమయం వచ్చిందని విజయవాడలో.. '2013 భూ సేకరణ చట్టం - పరిరక్షణ' పేరిట జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇష్టమొచ్చినట్లు.. అవసరానికి మించి భూసేకరణ చేస్తున్నారన్నారు. దీనిపై రైతులతో కలిసి ఆందోళన చేస్తామని... అన్ని జిల్లాల నుంచి వచ్చే రైతులతో సీఎం ఇంటి వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఇష్టారాజ్యం దోపిడీ చేయడానికి ఇది సీఎం సొంత రాజ్యం కాదని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు.

అడ్డగోలుగా భూసేకరణ చేస్తే మహారాష్ట్ర తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం శ్రీకాకుళం, అనంతపురం నుంచి ఉప్పెనలా వస్తామన్నారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడానికి సీఎం సొంత రాజ్యం కాదన్నారు.

తన సభలకు భద్రత కుదరదని చెప్పే పోలీసులపై తనకెలాంటి వ్యతిరేకతా లేదన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా వ్యవహరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. భీమవరంలో ఇప్పటివరకు చెత్త డంపింగ్‌ యార్డు లేదన్న పవన్‌.. బాధ్యతాయుతమైన అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమని, పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కలుషితమైన రాజకీయాలను మార్చడానికే వచ్చానన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కన్నీటి కథలే వినబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించేవారిని భయపెడుతున్నారన్నారు. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ సీఎస్‌ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

12:14 - July 28, 2018
09:34 - July 19, 2018

ఛత్తీస్ ఘఢ్ : దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లో తుపాకీ మరోసారి ఘర్జించాయి. భద్రతా బలగాలకు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెల్లవారుఝామున స్పెషల్ బెటాలియన్ కూబింగ్ జరుపుతున్న నేపథ్యంలో మావోలు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మావోలు కూడా వున్నట్లుగా భద్రతాబలగాలు గుర్తించాయి. మావోల నుండి భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గతకొంతకాలం నుండి అటవీప్రాంతాన్ని వీడి మరో స్థలానికి వలస వెళ్లి గతకొంతకాలంగా వారి ఉనికి స్థబ్దుగా వున్న మావోలు తిరిగి తమ స్థావరాలకు చేరుకున్నట్లుగా సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఈరోజు పక్కా ప్లాన్ తో కూబింగ్ చేపట్టిన క్రమంలో మావోలు ఎదురు కాల్పులు జరపిన ఘటనలో ముగ్గురు మహిళా మావోలతో సహ మొత్తం ఏడుగురు మావోలు మృతి చెందారు.  

09:56 - May 21, 2018

విశాఖపట్నం : ఏపీ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ఎస్ జడ్సీ అధికార ప్రతినిధి జగబందు మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఎన్నికల గారడీలతో రాదని, దీర్ఘకాలిక, సమరశీల పోరాటాల ద్వారా మాత్రమే లభిస్తుందని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. బంద్ కు మావోలు పిలుపునివ్వటంతో ఏవోబీ వద్ద పోలీసులు భారీగా మోహరించి పట్టిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంఛనీయం ఘటనలు జరగకుండా పోలీసుయంత్రాంగం పట్టిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. కాగా బంద్ ప్రభావం లేకుండా విశాఖ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభుత్వం బస్ లను కొనసాగిస్తున్నాట్లుగా తెలుస్తోంది. 

14:51 - May 20, 2018

చత్తీస్‌గడ్‌ : దంతెవాడలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చోల్నార్‌ గ్రామంలో పోలీసుల వాహనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై పాతిపెట్టిన ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఐదు మంది జవాన్లు మృతి చెందారు. చత్తీస్‌గడ్‌ ఆర్మ్‌ఫోర్స్‌కు చెందిన ముగ్గురు జవాన్లు, డీస్ట్రీక్ట్‌ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎల్ఈడీ బాంబు పేలడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

14:48 - April 24, 2018

మ‌హారాష్ట్ర : రాష్ట్రంలోని ని గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఇంద్రావతి నది వద్ద మరో 11 మంది నక్సల్స్ మృతదేహాలను గుర్తించారు. దీంతో గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారి సంఖ్య 33కు పెరిగింది. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టుల మృతిచెందగా.. ఆ ఎన్‌కౌంటర్ జరిగిన కొద్ది గంటల్లోనే అహేరీ తాలూకా రాజారాంఖన్లా అటవీప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. సోమవారం రాత్రి ఏడు-ఎనిమిది గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. మృతుల్లో దామన్ దళ కమాండర్ నందు ఉన్నట్టు తెలుస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - మావోయిస్టులు