మిస్తీ చక్రవర్తి

12:36 - November 23, 2018

ఈ రోజుల్లో చిన్నదైనా, పెద్దదైనా ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గతకొద్ది రోజులుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన సినిమాగా ప్రమోట్ చేసుకున్న శరభ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సీనియర్ నటి జయప్రద ఇంపార్టెంట్ రోల్ చెయ్యడంతో సినిమాపై ఆడియన్స్‌కి ఆసక్తి కలిగింది. మరి, ఆ ఆసక్తి సినిమా కలిగించిందా, లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.


కథ :


సిరిగిరిపురం అనే పళ్ళెటూరు పాడిపంటలతో, సుఖసంతోషాలతో కళకళలాడుతుంటుంది. ఎప్పటినుండో క్షుద్ర సామ్రాజ్య స్థాపన చెయ్యాలని ప్రయత్నిస్తున్న మాంత్రికుడు చండ్రాక్ష (పునీత్ ఇస్సార్) చూపు సిరిగిరిపురంపై పడుతుంది. ఇంకొక్క బలి ఇస్తే తను కోరిక నెరవేరుతుందని, ఆ ఊరికి చెందిన కాంతమరాయుడు (నెపోలియన్)ని చంపేసి, అతని భార్య పార్వతమ్మ (జయప్రద)ని, ఆమె కడుపులో పెరుగుతున్నబిడ్డని కూడా చంపాలనుకుంటాడు. 
ఆ ప్రయత్నంలో అతని బారినుండి తప్పించుకున్న పార్వతమ్మ, పండంటి మగబిడ్డ శరభ (ఆకాశ్ కుమార్)కి జన్మనిస్తుంది. పెరిగి పెద్దవాడైన శరభకి, పార్వతమ్మ తన తండ్రి చావు గురించి ఏం చెప్పింది. చండ్రాక్ష తను అనుకున్నది సాధించాడా అనేది ఈ శరభ కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 


దాదాపు 11 ఏళ్ల తర్వాత జయప్రద తెలుగులో నటించిన సినిమా ఇది. ప్రమోషన్స్‌లో ఆమె.. ఈ సినిమా, నటిగా నాకు పునర్జన్మనిచ్చింది అని చెప్పినట్టుగానే, శరభలో ఆమె క్యారెక్టర్ ఉంది. ఓ వైపు భాధ్యతగల తల్లిగా ఉంటూనే, తనలోకి ప్రేతాత్మ ప్రవేశించే సీన్‌లో ఆమె నటన అద్భుతంగా ఉంది. జయప్రద తర్వాత, హీరోయిన్ మిస్తీ చక్రవర్తి కూడా రెండు కోణాలున్న పాత్రలో చాలాబాగా నటించింది. హీరో ఆకాశ్ కొత్తవాడు కావడంతో చాలామటుకు ఒకేరకమైన ఎక్స్ ప్రెషన్‌తో సరిపెట్టాడు. చండ్రాక్షగా, పునీత్ ఇస్సార్.. అతనికొడుకు రక్తాక్షగా చరణ్ దీప్ మెప్పించారు. కోటి నేపథ్య సంగీతం, రమణ సాల్వ కెమెరా పనితనం సినిమాకే హైలెట్ అయ్యాయి. సాయి మాధవ్ బుర్రా మాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాత అశ్వని కుమార్ బడ్జెట్ పరంగా కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు నరసింహరావు తను వ్రాసుకున్న కథకి, సాంకేతిక అంశాలను జోడించి, చక్కటి టెక్నికల్ టీమ్‌తో క్వాలిటీ అవుట్‌పుట్ రాబట్టుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కథ, విఎఫ్ఎక్స్, జయప్రద, మిస్తీ చక్రవర్తిల నటన, క్లైమాక్స్ సీన్స్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. దుష్టశక్తికీ, దైవ శక్తికీ మధ్య పోరాటం అనే పాయింట్‌తో తెరకెక్కిన శరభ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

తారాగణం : ఆకాశ్ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నెపోలియన్, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, నాజర్, షియాజి షిండే తదితరులు..

కెమెరా     :  కోటి

సంగీతం  : రమణ సాల్వ

నిర్మాత    :  అశ్వని కుమార్ సహదేవ్

మాటలు సాయి మాధవ్ బుర్రా 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎన్.నరసింహరావు    

రేటింగ్      :    2/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

11:10 - October 13, 2015

హైదరాబాద్: సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం 'కొలంబస్'....'డిస్కవరింగ్ ల‌వ్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం షూటింగ్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటుంది. ఆర్. సామల దర్శకునిగా సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ఇందులో కథానాయికలు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరి. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్ మంచి నటన కనబర్చడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో న‌టించాడు. ఇష్క్ సినిమా ర‌చ‌యిత‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌.సామ‌లను ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం అని తెలిపాడు. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. త్వ‌ర‌లో పాట‌లను, వ‌చ్చే నెల 13న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర

Don't Miss

Subscribe to RSS - మిస్తీ చక్రవర్తి