ముఖ్యమంత్రి కేసీఆర్

21:32 - March 7, 2018

వచ్చెసారి ఓట్ల వర్కుతెలంగాణ రాజకీయం...మూడు కూటములదే అసలైన పోరాటం, కేసీఆర్ను ఉత్కి ఆరేస్తున్న ఉత్తంకుమార్...అంతే స్థాయిల అర్సుకున్న కోదండరాం, ప్రత్యేక నిరసనకు దిగిన చిత్తూరు ఏశకాడు..మోడీ ఇచ్చిన మట్టీ, నీళ్లు వాపసిస్తడట, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏడు కోట్లతోని బస్సు..మళ్లొక్కటి గొనెతందుకు సర్కారు సమాయత్తం, విపరీతంగ వెర్గిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం...బస్సుఆపి మరీ తన్నుకున్న క్యాడర్, అలియాస్ డల్లాసుల ఆగని దోపిడీలు.. హైద్రావాద్ భద్రత అంత డొల్లనే ఉంది.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:43 - October 12, 2017

సూర్యపేట : సమైక్య పాలనలో, కాంగ్రెస్ నేతల హయాంలో దక్షిణ తెలంగాణ దగాపడిందన్నారు సీఎం కేసీఆర్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఆనాడు కాంగ్రెస్ నేతలే దగా చేశారని కేసీఆర్ ఆరోపించారు. సూర్యాపేటలో పర్యటించిన కేసీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

సూర్యాపేటలో పర్యటింటిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. తరువాత కేసీఆర్ 1600కోట్ల రూపాయలతో నిర్మించిన 400 కెవి సబ్‌స్టేషన్‌ను.. ప్రారంభించారు. తరువాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈరోజు నష్టపరిహారం గురించి మాట్లాడుతున్న  ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన నియోజకవర్గంలో భూములు మునిగితే ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష ఉత్తమ్ కుమార్‌ రెడ్డిలు అడ్డుకున్నా సరే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాటి సమైక్యవాదులైన కాంగ్రెస్ నేతలు దగా చేశారని ఆరోపించారు సీఎం కేసీఆర్. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో నీరు పారేదని అన్నారు. అప్పుడు, ఇప్పుడు నల్లగొండ జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. 

21:04 - July 20, 2015

హైదరాబాద్: 20 రోజుల్లో హైదరాబాద్‌లో ఆధార్‌ అనుసంధానం పూర్తి చేస్తామని... ఇందుకు ప్రజలు సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌ సచివాలయంలో సమావేశమైన ఇరువురు.. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధానంపై చర్చించారు. బోగస్‌ ఓటర్ల ఏరివేతలో ఈసీకి పూర్తిగా సహకరిస్తామని కేసీఆర్‌ అన్నారు.

 

Don't Miss

Subscribe to RSS - ముఖ్యమంత్రి కేసీఆర్