మురళీకృష్ణ

12:11 - October 7, 2018

ఈ వారం నోటాతో పాటు రిలీజ్ అయిన మరో సినిమా.. భలేమంచి చౌక బేరమ్.. దర్శకుడు మారుతి కథ అందించాడు.. ఇంతకుముందు మారుతి కథలిచ్చిన రోజులుమారాయి, బ్రాండ్ బాబు సినిమాలు పరాజయం పాలయ్యాయి... రోజులుమారాయిని డైరెక్ట్ చేసిన మురళీకృష్ణ దర్శకత్వంలో, కేరింత నూకరాజు, నవీద్, రాజారవీంద్ర, యామిని భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా,  తెరకెక్కిన భలే మంచి చౌక బేరమ్ ఎలా ఉందో చూద్దాం..

కథ :      

దుబాయివెళ్ళి డబ్బు సంపాదించి, తమకుటుంబాలని బాగా చూసుకోవాలనుకునే ఇద్దరు కుర్రాళ్ళు, సలీమ్(నూకరాజు), పార్ధు(నవీద్)..
ఒక బ్రోకర్ మోసం చెయ్యడంతో, హైదరాబాద్‌లో ఒకేరూమ్‌లో ఉంటూ.. ఒకరు వ్యాన్ డ్రైవర్‌గా, ఇంకొకరు కొరియర్ బాయ్‌గా పనిచేస్తుంటారు.. ఒకానొక రోజు ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ వ్రాసిన దేశ రహస్యాలు అనే ఫైల్ కొరియర్ బాయ్ అయిన సలీమ్ చేతికొస్తుంది.. దాన్ని అమ్మి సొమ్ము చేసుకుని, లైఫ్‌లో సెట్ అయిపోదామనుకుంటారు.. వాళ్ళ ప్లాన్ ఫలించిందా, లేదా, చివరకి ఆ ఫైల్ ఎవరి చేతికి చేరింది అనేదే  భలే మంచి చౌక బేరమ్ కథ..
నటీనటులు :

కేరింత, నాన్న..నేను..నా బాయ్ ఫ్రెండ్ లాంటి సినిమాల్లో  చక్కటి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న నూకరాజు ఈ సినిమాలోనూ తనస్టైల్ కామెడీతో అలరించే ప్రయత్నం చేసాడు.. నవీద్ కటౌట్ బాగుంది కానీ నటన పరంగా ఏమంత ఆకట్టుకోలేక పోయాడు..
హీరోయిన్ యామిని భాస్కర్ ఉన్నంతలో ఓకే అనిపిస్తే, రాజారవీంద్ర ఫుల్ లెంగ్త్ రోల్‌లో తన క్యారెక్టర్‌తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు..  ఉగ్రవాదిగా చేసిన ముజ్ తబా అలీఖాన్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు..
సాంకేతిక వర్గం :

హరి గౌర పాటలు ధియేటర్‌లోనే మర్చిపోతాం.. ఆర్ఆర్ పర్వాలేదు.. తక్కువ బడ్జెట్ సినిమా అయినా, తన కెమెరా వర్క్తో క్వాలిటీ చూపించాడు కెమెరా మెన్ బాల్ రెడ్డి.. మారుతి కాన్సెప్ట్ కామెడీ పరంగా వర్కవుటయ్యేదే కానీ, టేకింగ్ విషయంలో డైరెక్టర్ తడబడడంతో భలే మంచి చౌక బేరమ్ ఆకట్టుకోలేక పోయింది...


తారాగణం :  పార్వతీశం (కేరింత నూకరాజు), నవీద్, రాజారవీంద్ర, యామిని భాస్కర్..

కెమెరా     :  బాల్ రెడ్డి

సంగీతం   :  హరి గౌర

కథ         మారుతి

నిర్మాత     ఆరోళ్ళ సతీష్ రెడ్డి

స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ : మురళీకృష్ణ
 

రేటింగ్ 2/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

12:32 - April 17, 2018

హైదరాబాద్ : రాచకొండ పోలీసులు తమ మార్క్‌ను చూపిస్తున్నారు. వడ్డీలతో నడ్డి విరుస్తున్న బీజేపీ నేతకు వంతపాడుతూ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో సెటిల్‌మెంట్స్‌ చేస్తున్నారు. బీజేపీ నేత, వడ్డీల వ్యాపారి కొంతం బుచ్చిరెడ్డి ఓ బాధితుడు అప్పు తీర్చినా 2 సంవత్సరాలుగా తాకట్టు పెట్టిన భూమి కాగితాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. న్యాయం చేయాలని వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు షాక్‌కు గురయ్యేలా సెటిల్‌మెంట్‌ చేశారు సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రవీందర్‌రెడ్డిలు. బీజేపీ నేతకు అనుకూలంగా మళ్లీ 13 లక్షలు చెల్లించి భూమి కాగితాలు తీసుకెళ్లాలని తేల్చి చెప్పడంతో బాధితుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.  

18:59 - March 18, 2018

గుంటూరు : ఏసీబీ డిఎస్పీ గోసాల మురళీకృష్ణకు ఉగాది మహోన్నత సేవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 1985 ఫిబ్రవరిలో పోలీసు శాఖలో చేరిన మురళీకృష్ణ ఇప్పటికే పలు అవార్డులను అందుకున్నారు. 2 వేల 11 లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇండియన్‌ పోలీసు మోడల్‌ అవార్డును స్వీకరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో అత్యాధునిక ఆయుధ సామాగ్రిని కాపాడినందుకు పలు రివార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మురళీకృష్ణకు అవార్డు ప్రకటించడంతో అవినీతినిరోధక శాఖ, పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. 

15:38 - February 9, 2017

అమరావతి : ఏపీ సచివాలయంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది... సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల పోలింగ్‌తో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది... అధ్యక్ష పదవికోసం మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి పోటీపడుతున్నారు..

13:27 - May 8, 2016

కర్నూలు :కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీలో చేరారు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ మారారు.. జగన్‌ ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు.. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.. 

20:22 - November 7, 2015

హైదరాబాద్ : జూన్‌లోగా విజయవాడకు వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. కాకపోతే దీనివల్ల వచ్చే సమస్యలను మాత్రమే ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. సచివాలయం మొత్తం ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి.. ఒకే చోట పరిపాలన ఉండేలా చూడాలని కోరామన్నారు. కొంతమంది మా సంఘంతో సంబంధం లేనివారు ఇష్టమొచ్చినట్లు విభేదాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విజయవాడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

 

08:51 - October 4, 2015

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నారు. మార్గంమధ్యలో ఉదయం 5గంటలకు శంషాబాద్‌ మండంల మదనపల్లి వద్ద అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన 32 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. 

Don't Miss

Subscribe to RSS - మురళీకృష్ణ