మూసివేత

18:16 - December 6, 2018

ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ సంస్థ ఒక్కో సర్వీస్‌ని క్లోజ్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే గూగుల్ ప్లస్, హ్యాంగౌట్స్ మేసేజింగ్ యాప్‌లను మూసివేన గూగుల్ తాజాగా మరో మేసేజింగ్ యాప్ ''అల్లో''ను మూసివేయాలని నిర్ణయించింది. 2019 మార్చి నుంచి ‘అల్లో’ పూర్తిగా కనిపించకుండా పోతుంది. 2016 సెప్టెంబర్‌లో గూగుల్ సంస్థ ఈ చాట్ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో దీనికి ఆదరణ లభించలేదు. దీంతో ఈ యాప్‌ను క్లోజ్ చేసేందుకు మొగ్గుచూపింది. ఏప్రిల్ నుంచి పెట్టుబడులు నిలిపివేసిన గూగుల్.. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తిగా యాప్ కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు అధికారిక బ్లాగ్‌లో తెలిపింది. అదే సమయంలో ఎస్ఎంఎస్‌ పంపిణీ నిర్వహణ తీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. అల్లో స్థానంలో ఆర్‌సీఎస్ తీసుకొని వస్తోంది. ఆండ్రాయిడ్ డివైజస్‌లో ఐమేసేజ్‌లకు ఇది ఉపయోగపడుతుంది.

 

12:01 - November 30, 2018

హైదరాబాద్ : నగరంలోని వీఎం హోగ్రౌండ్ మూసివేతకు నిరసనగా నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. వినూత్నంగా నిరసన చేపట్టారు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీల్లేకుండా చేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై 2 వేల మంది నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. కొత్తపేట చౌరస్తాలోని ప్రధాన రహదారిపై వ్యాయామాలు చేసి, నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా సంఘాలు నిరుద్యోగ యువతకు మద్దతుగా నిలిచాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని, ఆందోళనను విరమింపజేశారు.

 

14:40 - September 27, 2018

ఢిల్లీ : రైల్వే అధికారుల ఆలోచనా తీరు ఎలా వుందీ అంటే వేలు కాలితే కాలు తీసేసిన చందంగా వుంది. సమ్యలుంటే పరిష్కరించాల్సింది పోయి ఆ సమస్యను మరింతగా జటిలం చేసేలా రైల్వే అధకారుల తీరు వుంది. సాధారణంగా రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగించేందుకు మరింతగా కృషి చేస్తారు. కానీ మన రైల్వే అధికారులు మాత్రం డిఫరెంట్. రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం కోసం మన అధికారులు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ పరిశుభ్రత కేటగిరిలో మంచి ర్యాంకు పొందిన ఓల్డ్ ఢిల్లీ అధికారుల నిర్ణయంపై పబ్లిక్ నుండి తవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాయ్ లెట్ల పరిశుభ్రతగా వుండేందుకు రాత్రిపూట టాయిలెట్లను మూసేయాలని నిర్ణయించారు. నిత్యం ప్రయాణికులు వెళుతూ ఉండే ఈ స్టేషన్ లో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ స్టేషన్ లో మరుగుదొడ్లను మూసేస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అధికారుల నిర్ణయంతో అసలు మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన ఉద్దేశమే దెబ్బతింటోందని ప్రజలు వాపోతున్నారు.

 

19:44 - July 27, 2018

హైదరాబాద్ : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. శనివారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం సుప్రభాత సేవతో భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నారు.

ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం మూసివేత..
చంద్రగ్రహణం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేశారు. శనివారం ఉదయం సంప్రోక్షణ తిరుమంజనం పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు కల్పించనున్నారు. శనివారం ఉదయం సుప్రభాత సేవను రద్దు చేసినేట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శనివారం ఉదయం నుండి భక్తులకు దివ్య దర్శనం, తీర్థ ప్రసాదాలు అందజేస్తామన్నారు.

అన్నవరంలో సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని మూసివేత..
చంద్రగ్రహణం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని మూసివేశారు. శనివారం ఉదయం సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. 

21:43 - July 17, 2018

చిత్తూరు : మహాసంప్రోక్షణ కోసం శ్రీవారి ఆలయం మూసేయాలన్న నిర్ణయంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రోక్షణ కోసం 8రోజులపాటు భక్తులకు అనుమతి లేదన్న టీటీడీ నిర్ణయంపై భక్తుల్లో విమర్శలు తలెత్తడంతో.. మరోసారి సమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ... గతంలో మాదిరిగానే మహాసంప్రోక్షణ చేపడతామని అధికారులు ప్రకటించారు. 

మహా సంప్రోక్షణ సందర్భంగా.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎనిమిది రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని టీటీడీ ఇదివరకే తీసుకున్న  నిర్ణయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సీఎం చంద్రబాబు స్పందించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మహాసంప్రోక్షణ నిర్వహించాలని టీటీడీ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో పునరాలోచనలో పడ్డ టీటీడీ.. భక్తులకు అనుమతి విషయంలో వెనక్కి తగ్గింది.

తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై  హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులతోపాటు భక్తుల్లోనూ  తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీటీడీ చైర్మెన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకమైనప్పటినుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటున్నారని  వైసీపీ విమర్శించింది.  ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం.. మహాసంప్రోక్షణకు గతంలో పాటించిన నియమాలనే పాటించాలని టీటీడీని ఆదేశించారు. 

సీఎం ఆదేశాలతో శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఉంచాలనే నిర్ణయానికి టీటీడీ వచ్చింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అందుబాటులో ఉన్న సమయంలో దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, చైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లు తెలిపారు. ఇకనైనా సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. ఈనెల 24 న జరగనున్న పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు టీటీడీ అధికారులు. అదేవిధంగా భక్తుల నుంచి సూచనలు, సలహాలు కూడా  స్వీకరిస్తామని అన్నారు. 

10:53 - June 15, 2018

కేంద్రం ప్రభుత్వం ఆశ పథకాన్ని మూసివేయ్యాలని చూస్తుందా ? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇదే అనుమానాన్ని ఆశ వర్కర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. 10సంవత్సరాలు పనిచేసిన ఆశ వర్కర్లు తమ విధులోనుంచి తప్పుకుంటే 20వేలు ఇస్తామని కేంద్రం నిర్ణయం తీసుకోవటం, దానినే ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టే పని చేయ్యటం వారిలో ఈ అనుమానానికి కారణమైంది. ఇదే అంశంపై ఆశా వర్కర్స్ యూనియన్‌ నాయకురాలు జయలక్ష్మీ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:54 - March 2, 2018

కృష్ణా : డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ తీరును నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల చిత్ర పరిశ్రమ థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. సర్వీస్‌ ప్రొవైడర్ల విధానాలతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో...డిజిటల్‌ ప్రొవైడర్స్‌ చార్జీలు తగ్గించేవరకు బంద్‌ కొనసాగిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెబుతున్నారు. వీపీఎఫ్‌ ధరలు తగ్గించే వరకు థియేటర్ల బంద్‌ పాటిస్తామని అంటున్నారు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్ల బంద్‌పై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

 

11:32 - March 2, 2018

హైదరాబాద్ : సినిమా థియేటర్లు బోసిపోయాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్‌ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి జేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు బంద్ అయ్యాయి. ఈ సందర్భంగా థియేటర్ల బంద్ కారణంగా ఎలాంటి పరిస్థితి నెలకొన్నందనే విషయం తెలుసుకొనేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్యా థియేటర్ వద్దకు టెన్ టివి వెళ్లింది. థియేటర్ కు రూ. 50వేలు, ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా రూ. 25వేలు నష్టమొస్తుందని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. థియేటర్ల మూసివేత కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:48 - January 31, 2018
12:55 - January 31, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - మూసివేత