మెడిసిన్

17:41 - July 30, 2018

అవసరానికి మించి మెడిసిన్ వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరం.. కంబైన్డ్ డ్రగ్స్, పెయిన్ కిల్లర్ విషయంలో జాగ్రత్తలు అవసరం... సిటి స్కాన్ విషయంలో మరింత చైతన్యం రావాలి. వైద్యం రంగంలో నైతిక విలువలు..మెడిసిన్ తో జాగ్రత్త..! అనే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో డా.శాతవాహన చౌదరి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'మొట్ట మొదటి యాంటి బయాటిక్.. పెన్సిలిన్. రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా ఎసిడిటి మందులు వాడొద్దు. మందులు విడివిడిగా వేసుకుంటేనే మంచింది.. కాంబినేషన్ మందులు వేసుకోవడం మంచికాదు' అని అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని విలువైన వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:40 - July 11, 2018

పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అలాగే వయసుతో తారతమ్యం లేకుండా పాలు అన్ని వయసులవారికి చాలా అవసరం. సాధారణంగా మనం ఎక్కువ ఆవు, గేదె పాలను వాడుతుంటాం. అంతగా కాకుంటే మేకపాలు, గొర్రెపాలు వాడుతుంటాం. ఆవుపాలు పిల్లలకు, పెద్దవారికి కూడా ఎంతో శ్రేష్టమయినవి. పాలు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. ఇది అందరికీ తెలుసు. పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమేని నిరూపించబడింది. ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 45-60 మధ్య వయసు వున్న 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడంతో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అందుకే పాలలోని కాల్సియం, విటమిన్‌ డి-బరువుతగ్గడములో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు అనే సామెతను మనం వింటుంటాం. కానీ ఆవుపాలకు మించిన డిమాండ్ ఒంటెపాలకు వచ్చింది.

ఆవు పాలకు మించిన డిమాండ్‌ ఇప్పుడు ఒంటె పాలకు..
ఆవు పాలకు మించిన డిమాండ్‌ ఇప్పుడు ఒంటె పాలకు ఉంది. ఆ ‘డిమాండ్‌’ను రూపాయల్లో లెక్కించాలంటే.. లొట్టిపిట్ట అంటే ఒంటె. దీనినే ఎడారి ఓడ అని కూడా అంటారు. ఒంటె పాలు లీటరు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 3వేల వరకూ పలుకుతోందట. అమెరికాలో అయితే రూ. 3500 వరకూ వెళ్తోంది. ఒంటెపాలతో పాటు పాల పౌడర్‌కూడా మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. రాజస్థాన్‌లోని ఒంటెల యజమానులకు ఈ డిమాండ్‌ వరంగా మారింది. దీంతో వారు ఒంటె పాలతో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.

పాల తయారీకోసం కొత్తగా యూనిట్లు..
బికనీర్‌, కచ్‌, సూరత్‌ ప్రాంతాల్లో పాల తయారీకోసం కొత్తగా యూనిట్లు కూడా వెలిశాయి. అసలేంటి ఈ ఒంటె పాల విశిష్టత అంటే.. వీటిలో సహజసిద్ధమైన ఇన్సులిన్‌ ఉందట. డయాబెటిస్‌ ఉన్న వారికి ఈ పాలు చాలా ఆరోగ్యకరమని కొన్ని జంతువులపై చేసిన పరీక్షల్లో తేలిందని పరిశోధకులు తెలపటంతో ఒంటెపాటకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది.

పలు దీర్ఘకాలిక వ్యాధులకు ఔషదంగా ఒంటెపాలు..
ఇదే కాక ఆటిజం, కీళ్లనొప్పుల పరిష్కారానికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఉపకరిస్తాయని పరిశోధకులు అంటున్నారు. మిగిలిన పాలతో పోలిస్తే లాక్టోజ్‌ శాతం కూడా చాలా తక్కువగా ఉన్న కారణంగా.. లాక్టోజ్‌ సహించని వారికి ఒంటెపాలు మంచి ప్రత్యామ్నాయమని వారు చెబుతున్నారు. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఒంటెపాలను నేరుగా అస్సలు తాగకూడదు. మానవ శరీరంలోకి వెళ్లకూడని అనేక మలినాలు వీటిలో ఉంటాయట. ఈ పాలను శుద్ధి చేసిన తర్వాతే తాగడానికి వీలుగా తయారవుతాయి. 

17:55 - February 18, 2017
08:37 - January 6, 2016

పేదలకు ఉన్నతమైన ప్రమాణ విద్య అందాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో విశ్లేషించారు. ఆయన మాటల్లోనే…
''పిల్లలు ఇంజినీరింగ్..డాక్టర్ కావాలి అని తల్లిదండ్రులు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ఇక భవిష్యత్ లేదు అనే వ్యూ విద్యార్థుల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ధోరణి అధికంగా ఉంది. మెడిసన్ లో సీటు వచ్చిన తరువాత డాక్టర్ కావాలి..పీజీ తెచ్చుకోవాలి. ప్రపంచంలో వేరే జీవితం లేదు అనే ధోరణిలోకి వెళుతున్నారు. 994 ర్యాంకు తెచ్చుకున్నా తనకు ఇంజినీరింగ్ సీటు రాలేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఆశలు పడడలో తప్పు లేదు. పిల్లల తెలివితేటలతో సంబంధం లేకుండా చేయడం కరెక్టు కాదు. వారి కెపాసిటీ తగ్గట్టుగా మోటీవేషన్ ఇవ్వాలి. నిరుత్సాహ పడకుండా ఇతర మార్గాల్లో ఎంకరేజ్ చేయాలి. తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడం లేదు అనే వత్తిడిలో విద్యార్థులు ఉంటారు. కార్పొరేట్ కాలేజీలు పిల్లలను వస్తువులుగా చూస్తుంటారు. అనాలోచితమైన శిక్షలు చేస్తున్నారు. ఇష్టమైన దానిలో ఆనందపడాలి. చదువులో మాధుర్యం గుర్తించకపోతే యాంత్రీకమవుతతుంటారు. విద్యారంగంలో తీవ్రమైన అసమనాతలున్నాయి. పేదలకు ఉన్నత ప్రమాణ విద్య ఉండాలి. పేదవాడి కష్టాన్ని థనికులు అర్థం చేసుకుంటారు. నాణ్యతతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

11:51 - October 14, 2015

హైదరాబాద్ : ఆన్ లైన్ లో మెడిసిన్ అమ్మకాలను రద్దు చేయాలని మెడికల్ షాప్ యజమానులు డిమాండ్ చేశారు. ఆన్ లైన్ మందుల అమ్మకాలను నిరసనగా ఇవాళా దేశ వ్యాప్తంగా బంద్ చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ లో మెడికల్ షాప్ ల యజమానులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ లో మెడిసిన్స్ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిస్తుందని..దానికి విరమించుకోవాలని కోరారు. ఆన్ లైన్ లోని డ్రగ్స్ నిరుపయోగం అవుతాయని చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే మందులు ఇవ్వాలని చెప్పారు. మెడిసిన్లను ఆన్ లైన్ చేయడం తప్ప అని అన్నారు. ఆన్ లైన్ లో ఎలాంటి చెక్ అప్ ఉండదని తెలిపారు. ఆన్ లైన్ మందులతో డ్రగ్స్ తో ప్రమాదం, దుష్ప్రభావం.. పొంచివుందన్నారు. కొన్ని డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ తోనే తీసుకోవాలన్నారు. డాక్టరు సలహాలతోనే మందులు వాడాలన్నారు. సైడ్ ఎఫెక్ట్ తో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆన్ లైన్ విధానం రద్దు చేయాలని కోరారు. అలాగే మందులను ఆన్ లైన్ కోనుగోలు చేయడాన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

 

Don't Miss

Subscribe to RSS - మెడిసిన్