మెదక్

06:24 - December 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిషన్ కాకతీయ నాలుగో దశకింద ఆదిలాబాద్‌లో 26, మెదక్‌లో 8 కొత్త చెరువుల నిర్మాణం చేపట్టనున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద పాత చెరువుల పునరుద్ధరణతోపాటు కొత్త చెరువులను నిర్మించనున్నారు. ఈ పథకం నాల్గో దశలో కొత్త చెరువుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా 26 చెరువుల తవ్వకానికి అనుమతులతో పాటు.. నిధులు మంజూరు చేసినట్టు నీటిపారుదల శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఈ పథకం కింద ఉమ్మడి మెదక్ జిల్లాలో కంగ్టి మండలం సుకల్ తీర్థ్ గ్రామంలో కొత్తగా కాకివాగు చెరువును నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వంద ఎకరాలకు పైగా భూమిని సేకరించనుంది. అలాగే ఇర్కపల్లి గ్రామంలోనూ కొత్త చెరువుకోసం 96 ఎకరాలు, కేశ్వర్ గ్రామంలో వంద ఎకరాలు, ఊటపల్లి గ్రామంలో 285 ఎకరాల భూమి, ఎస్గి గ్రామంలో 72 ఎకరాలను ప్రభుత్వం సేకరించనుంది. నారాయణఖేడ్ మండలం జగన్నాధపూర్ గ్రామంలోనూ భూసేకరణకు చర్యలు తీసుకోనున్నారు. ఈ కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరిగతగిన పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు, ఇంజినీర్లకు మంత్రి హరీష్ విజ్ఞప్తి చేశారు. 

11:58 - December 5, 2017

మెదక్ : జిల్లా మనోహరాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌హెచ్‌ 44 పక్కనే ఉన్న బయోమాస్‌ బ్రిక్స్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఉయదం 7.30కు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది. ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే రంపపు పొట్టుకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. 

11:14 - December 4, 2017

మెదక్‌ : జిల్లాలోని తూఫ్రాన్‌ మండలం రావెళ్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. ఏడునెలల గర్బీణీపై దుండగులు అత్యాచారయత్నం చేశారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న డీసీఎం వాహనం నుంచి బాధితురాలు కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రావెళ్లి పంచాయతీ పరిధి పోతరాజ్‌పల్లికి చెందిన ఉడే రేగొండ, కళావతి దంపతులు పాతదుస్తులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. శనివారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో పాతదుస్తులు విక్రయించిన కళావతి... రాత్రి 10 గంటల సమయంలో తన 7సంవత్సరాల  కుమార్తెతో కలిసి హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న డీసీయంలో ఎక్కింది.  అందులో ఉన్న డ్రైవరు, మరో వ్యక్తి కళావతి పై అత్యాచారయత్నం చేశారు. 44వ జాతీయ రహదారిపై రావెళ్లి శివారులో కరీంగూడ వద్ద ఆమె దిగాల్సిన చోట వాహనం ఆపకుండా ముందుకు వెళ్తుండటంతో భయాందోళనకు గురై ఒక్కసారిగా కిందకు దూకింది. అరకిలో మీటరు ముందుకెళ్లిన తర్వాత దుండగులు.. బాలికను, పాతదుస్తుల మూటను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలించారు. కాగా  మృతురాలిది నిరుపేద కుటుంబం కావడంతో పోతరాజుపల్లి గ్రామస్తులే చందాలు వేసుకుని అంత్యక్రియలను పూర్తిచేశారు. 

 

14:44 - December 1, 2017
11:10 - November 25, 2017

ఆదిలాబాద్ : కడెం వద్ద ఓ స్కూల్ ఆటో బోల్తా కొట్టింది. ఈఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులను ఆటోలో స్కూల్ కు వెళుతున్నారు. నర్సాపూర్ వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆటో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల్లో ఒకరికి చేయి విరగగా..మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్లం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. బస్సుల్లో తీసుకెళ్లకుండా చిన్న చిన్న ఆటోల్లో ప్రమాదకరంగా తీసుకెళుతున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఖానాపూర్ ప్రభుత్వసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. 

17:34 - November 24, 2017

మెదక్ : ఇక్కడ కనిపిస్తున్నవి మెదక్‌ జిల్లాలోని రాజ్‌పల్లి తండా వాసుల గిరిజనుల భూములు. యాభై సంవత్సరాల క్రితం ఇక్కడి గిరిజనులకు ప్రభుత్వం ఈ భూమిని పంపిణీ చేసింది. 33/1 సర్వే నంబర్‌లోని ముప్పై ఎకరాల ఈ భూమిలో 15 మంది లబ్దిదారులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి భూములు ఇచ్చినప్పుడు ఇవి రాళ్లు రప్పలతో సాగుచేసుకునేందుకు పనికి రాకుండా ఉండేది. రేయింబవళ్లు కష్టపడి సాగుకు యోగ్యంగా మలచుకొని గిరిజనులు ఇక్కడ పంటలు సాగు చేసుకుంటున్నారు.

మెదక్‌ జడ్పీటీసీ లావణ్యరెడ్డి కన్ను
కష్టపడి సాగు చేసుకుంటున్న గిరిజనుల భూమిపై మెదక్‌ జడ్పీటీసీ లావణ్యరెడ్డి కన్ను పడింది. ఇంకేముంది గిరిజనుల ముప్పై ఎకరాల భూమి చుట్టూ అధికారుల అండదండలతో ఫెన్సింగ్‌ వేసి భూముల్ని ఆక్రమించేసుకుంది. ఇదేంటని ప్రశ్నించిన తమపై బెదిరింపులకు పాల్పడిందని రైతులంటున్నారు. ఉన్నఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.

గిరిజనుల భూముల కోసం
అయితే తాను భూముల్ని కబ్జా చేయలేదని, సీలింగ్‌ భూములపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తమకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని జడ్పీటీసీ లావణ్యరెడ్డి అంటున్నారు. ఇదంతా తరతరాలుగా తమకు సంక్రమించిన ఆస్తి అని చెప్పుకొస్తున్నారు. గిరిజనుల భూముల్ని అన్యాయంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే గిరిజనుల భూముల కోసం పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జడ్పీటీసీ లావణ్యరెడ్డి భూ కబ్జాపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాసంఘాలంటున్నాయి. గిరిజనుల పొట్టకొట్టే ఈ వ్యవహారంపై అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాలి. 

15:47 - November 22, 2017

మెదక్ : పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మూడేళ్ల పదవీకాలంలో ఎలాంటి పనులు చేపట్టారనే విషయంపై టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. రైల్వే సమస్య, నేషనల్ హైవే సమస్యలు ప్రధానంగా ఉండేవన్నారు. ప్రభుత్వం వచ్చిన అనంతరం, తాను ఎంపీ అయిన తరువాత పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్లు, జాతీయ హదారులను త్వరలోనే పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:29 - November 21, 2017

మెదక్ : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చెత్త కంపు కొడుతోంది. పారిశుధ్యసేవలు పూర్తిగా నిలిచిపోవడంతో.. వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్యచర్యలు లోపించడంతో రోగాల బారిన పడుతున్నామని ఆరోపిస్తూ.. మున్సిపాల్టీ కార్యాలయం ఎదుట చెత్త పోసి నిరసనకు దిగారు. నెలల తరబడి చెత్తను తీసుకపోవడానికి సిబ్బంది రావడం లేదని..దీనితో పలు సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని టెన్ టివితో పలువురు పేర్కొన్నారు. ట్యాక్సులు ముక్కులు పండి వసూలు చేస్తూ అవార్డులు తీసుకొంటారని..కమిషనర్ హైదరాబాద్ లో పడుకుంటారని విమర్శించారు. డెంగ్యూ అధికగా ప్రబలుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమని, సంగారెడ్డిలో డంపింగ్ యార్డు లేదని..చెత్త మున్సిపాల్టీ అని విమర్శించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

19:40 - November 18, 2017
15:46 - November 7, 2017

మెదక్ : సింగూరు జలాలను శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కి తరలించ వద్దంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సింగూరు డ్యాంని ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. సింగూరు నీటిని తీసుకెళ్లడమంటే జిల్లా ప్రజలన్ని మోసం చేయడమే అని సంగారెడ్డి జిల్లా సీపీఎం నేతలు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సింగూరు జలాల విషయం లేవనెత్తితే స్థానిక ఎమ్మెల్యేలు చర్చించక పోవడం దారుణమన్నారు. డ్యాం ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - మెదక్