మెయ్‌జు సీ9

20:02 - December 5, 2018

ఢిల్లీ : అమెజాన్ కొనుగోలుదారులు, జియో వినియోగదారులు మరో బంపర్ ఆఫర్ పొందనున్నారు. రూ.4,999లకే కొత్త స్మార్ట్ ఫోన్ లభించనుంది. మెయ్‌జు మొబైల్ సంస్థ నూతన స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. నేడు భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఆకట్టుకునే ఫీచర్లతో కేవలం రూ.4,999 ధరకే 'మెయ్‌జు సీ9' పేరిట భారత మార్కెట్లో విడుదలైంది. అమెజాన్ వెబ్ సైట్లో ప్రత్యేకంగా లభించే ఈ ఫోన్ పై అమెజాన్ కొనుగోలుదారులు, జియో వినియోగదారులు పలు బంపర్ ఆఫర్లు పొందనున్నారు. అమెజాన్ కొనుగోలుదారులకి వోచర్ల రూపంలో రూ.2,200 లభిస్తాయి. జియో కస్టమర్లు 50 జీబీ డేటాను పొందనున్నారు.
మెయ్‌జు సీ9 ప్రత్యేకతలు...

  • 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే (1400 x 720 పిక్సల్స్)
  • 2 జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం
  • 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫేస్ అన్‌లాక్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Don't Miss

Subscribe to RSS - మెయ్‌జు సీ9