మెహబూబా

21:34 - May 15, 2018

దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అమ్మ, నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మెన్‌ లాంటి చిత్రాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే విలక్షణ దర్శకుడు పూరీని సక్సెస్‌లు పలకరించి చాలా కాలమయ్యింది. ఈ క్రమంలో ఆకాష్ పూరీని హీరోగా, నేహా శర్మ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా. మరి మెహబూబా సినిమా టీమ్ తో 10టీవీ స్పెషల్ చిట్ చాట్..

18:58 - May 11, 2018
13:47 - October 11, 2017

ఏ వుడ్ లోనైనా తమ తనయులను హీరోలుగా స్థిరపరచాలని హీరోలు..దర్శక..నిర్మాతలు అనుకుంటుంటారు. కొంతమంది సక్సెస్ కాగా మరికొందరు ఇంకా ప్రయత్నాలు సాగిస్తుంటుంటారు. అలాంటి వారిలో 'పూరి జగన్నాథ్' ఒకరు. తనయుడు 'ఆకాష్ పూరీ'ని హీరోగా తీర్చిదిద్దే పనుల్లో పడిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు నిరాశపరుస్తున్నా నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. పూరీ - బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'పైసా వసూల్' చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

ఈ దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేశాడు. కానీ ప్రస్తుతం సినిమా సినిమాకి 'పూరీ' ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నాడు. హిట్స్ కొట్టడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టే, ఫ్లాప్స్ ఇవ్వడంలోనూ వెరైటీ చూపిస్తున్నాడు. ఆకాష్ పూరీ హీరోగా పూరీ దర్శకత్వంలో 'వైష్ణో అకాడమీ సంస్థ' ఓ చిత్రం నిర్మిస్తోంది. గతంలో వచ్చిన సినిమాలకంటే ఇది భిన్నంగా ఉంటుందని టాక్. 1971 నాటి ఇండియా - పాక్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుందని పూరీ పేర్కొన్నారు. ఈ చిత్ర పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో చిత్ర షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఛార్మీ క్లాప్ కొట్టగా షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. పంజాబ్, రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగనుంది. యుద్ధ వాతావరణం మధ్య సాగే లవ్ స్టోరీని తొలిసారిగా తీస్తున్నట్లు పూరీ పేర్కొన్నారు. మంగుళూరు మగువ నేహా శెట్టి నాయికగా పరిచయమవుతోంది. సందీప్‌ చౌతా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

11:11 - September 28, 2017

టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుల్లో 'పూరీ జగన్నాథ్' ఒకరు. తన చిత్రాల్లో హీరో..హీరోయిన్ల గెటప్..ఇతర విషయాల్లో వెరైటీగా చూపిస్తుంటాడు. తన మార్కును తన చిత్రాల్లో చూపించి ఆయా హీరోలు..హీరోయిన్ల అభిమానాన్ని చూరగొనడంలో 'పూరీ' దిట్ట. గత చిత్రాలు ఆయనకు మంచి విజయాలే అందించాయి కానీ కొన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ఆయన దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన 'పైసా వసూల్' చిత్రం కూడా మరోసారి నిరాశపరిచింది. ఈ చిత్రంలో 'బాలకృష్ణ' హీరోగా నటించారు.

ఇదిలా ఉంటే పూరీ తనయుడు 'ఆకాష్' ను హీరోగా లాంచ్ చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. నేడు పూరీ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'మెహబూబా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 1971 భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో సినిమా ఉండనుంది. మంగళూరు మోడల్ 'నేహా శెట్టి' హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు సందీప్ చౌతా సంగీతమందించనున్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ లలో షూటింగ్ జరుపుకోనుంది. అక్టోబ్ నుండి ప్రారంభమయ్యే ఈ సినిమా విశేషాలు త్వరలో తెలియనున్నాయి. 

21:31 - March 24, 2016

జమ్మూ కాశ్మీర్‌ : ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ పేరు ఖరారైంది. శ్రీనగర్‌లో జరిగిన పిడిపి శాసససభా పక్ష సమావేశం ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెహబూబా ముఫ్తిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. మెహబూబా ముఫ్తి జమ్ముకాశ్మీర్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. పిడిపి సమావేశానికి ముందు అనంత్‌నాగ్‌లో తండ్రి ముఫ్తి మహ్మద్‌ సయీద్‌ సమాధిని సందర్శించి మెహబూబూ నివాళులర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు పిడిపి చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శర్మలకు గవర్నర్‌ వోహ్రా లేఖ రాశారు. శుక్రవారం గవర్నర్‌తో వీరు భేటి కానున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదితో మెహబూబా జరిపిన సమావేశం అనంతరం జమ్ముకశ్మీర్‌లో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి. పిడిపి విధించిన కొత్త షరతులేవీ అంగీకరించడం లేదని బిజెపి స్పష్టం చేసింది.

12:41 - January 7, 2016

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మృతదేహానికి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు ముఫ్తీకి నివాళులర్పించారు. ఆయన కుమార్తె ముఫ్తీ మెహబూబాను పరామర్శించారు. కాసేపట్లో ఢిల్లీ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు ప్రత్యేక విమానంలో ముఫ్తీ మృతదేహాన్ని తరలించనున్నారు. అనారోగ్యంతో డిసెంబర్ 24వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 1936 జనవరి 12వ తేదీన ముఫ్తీ జన్మించారు. 1989లో కేంద్ర హోం మంత్రిగా ముఫ్తీ పనిచేశారు.
79 సంవత్సరాల గల ముఫ్తీ మహ్మద్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 87 స్థానాలు గల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం పీడీపీ, బీజేపీ మధ్య పొత్తులు కుదిరాయి. 2015 మార్చి 1వ తేదీన సీఎంగా ముఫ్తీ బాధ్యతలు స్వీకరించారు. 

Don't Miss

Subscribe to RSS - మెహబూబా