మెహరీన్

19:14 - November 28, 2018

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా, వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై, శ్రీనివాస్ మామిళ్ళ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా, కవచం.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కి రెస్పాన్స్ బాగానే ఉంది. బెల్లంకొండ మొట్టమొదటిసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈరోజు కవచంలోని ఫస్ట్‌సాంగ్‌ని లాంచ్ చేసింది మూవీ యూనిట్. నా అడుగే పడితే, అణుయుద్థం అనే పాటని రఘ దీక్షిత్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాసారు. హీరో క్యారెక్టరైజేషన్‌ని తెలియచేస్తూ సాగిన ఈ సాంగ్‌లో, నేను హడావిడి చేసేవాణ్ణి కాదు, అణుకువగా ఉండేవాణ్ణి అంటూ, హీరో తన గురించి తనే చెప్పుకుంటూ  సాగింది.  డిసెంబర్‌ 7న కవచం రిలీజ్ చెయ్యాలనుకున్నారు. ఆరోజు తెలంగాణా అసెంబ్లీ ఎలక్షన్స్ కావడంతో, అదే రోజు సినిమా విడుదలవుతుందా, లేదా అనే డౌట్ నెలకొంది. ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ 7నే వస్తాం అని క్లారిటీ ఇస్తూ, ఆల్బమ్‌లో‌ని ఫస్ట్‌సాంగ్ రిలీజ్ చేసింది కవచం టీమ్.

వాచ్ సాంగ్...

16:46 - November 16, 2018

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా, వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై, శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, కవచం... హీరోగా సాయికిది అయిదవ సినిమా. కెరీర్‌లో ఫస్ట్‌టైమ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కీ, టీజర్‌కీ రెస్పాన్స్ బాగానే వస్తోంది. టీజర్‌కి దాదాపు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
రీసెంట్‌గా కవచం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, షాక్ ఇచ్చింది మూవీ యూనిట్.  డిసెంబర్ 7న సినిమాని విడుదల చెయ్యనున్నట్టు మేకర్స్ చెప్పారు. ఇంకా ట్రైలర్, సాంగ్స్ ఏవీ రిలీజ్ చెయ్యకుండా, ఇంత తొందరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడానికి రీజన్ ఏంటంటే, డిసెంబర్లో, మీడియం నుండి చిన్న బడ్జెట్ సినిమాలు చాలా వరకు షెడ్యూల్ అయిపోయాయి. వాటి మధ్యలో వచ్చి ఇరుక్కునే కంటే, కాస్త ముందుగానే వస్తే బెటర్ అనే ఉద్దేశంతో, డిసెంబర్ 7కి ఫిక్స్ అయిపోయారు. కవచంలో, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ రోల్ చేస్తున్నాడు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాతోనైనా సాయి హిట్ కొడతాడేమో చూడాలి.

వాచ్ టీజర్...

 

 

11:40 - November 13, 2018

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా, వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై, శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, కవచం.. మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. టీజర్ లాంచ్ ఈవెంట్ స్టేజ్పై అనుకోని సంఘటన ఒకటి జరిగింది. సీనియర్  కెమెరా‌మెన్ చోటా కె. నాయుడు,  హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి వేదికపై ముద్దు పెట్టాడు. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. కానీ కాజల్ మాత్రం, ఏ మాత్రం బెరుకెు లేకుండా చాలా హుందాగా బిహేవ్ చేసింది. కవచం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కాజల్, చోటా కెమెరా వర్క్ గురించి పొగుడుతుండగా, పక్కనే ఉన్న చోటా, కాజల్ నడుము చుట్టూ రెండు చేతులూ  వేసి, ముద్దు లాంటి ముద్దు పెట్టుకున్నాడు. కాజల్ కూడా చోటా చేసిన పనిని సమర్ధిస్తున్నట్టుగా, అతను మా ఫ్యామిలీ మెంబర్ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. చోటా చేసిన పాడు పనికి, కాజల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతగాడిని ఒక రేంజ్‌లో అల్లాడిస్తున్నారు. చోటా చీప్ పబ్లిసిటీ కోసమే ఇలా చేసాడనీ, అతను మీడియా సమక్షంలో కాజల్‌కి సారీ చెప్పాలనీ డిమాండ్ చేస్తూ, అతణ్ణి తెగ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి చోటా వల్ల, కవచం సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చినట్లైంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ రోల్ చేస్తున్నాడు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న కవచం, డిసెంబర్‌లో విడుదలకు ముస్తాబవుతోంది.

వాచ్ వీడియో...

12:45 - November 9, 2018

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా, వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాకి,  కవచం అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. హీరోగా  శ్రీనివాస్‌కిది అయిదవ సినిమా. కవచం‌లో తొలిసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పోలీస్ యూనిఫామ్‌లో గాగుల్స్ పెట్టుకుని స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్న శ్రీనివాస్ లుక్ బాగుంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ రోల్ చేస్తున్నాడు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకుడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న కవచం, డిసెంబర్‌లో విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ సినిమాకి కెమెరా : చోటా కె. నాయుడు, ఆర్ట్ : చిన్నా.  

13:32 - November 4, 2018

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే విదేశాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని, హైదరాబాద్ చేరుకుంది మూవీ టీమ్. ఎఫ్2లో వెంకీ, వరుణ్‌లు తోడల్లుళ్ళుగా కనిపించబోతుండగా, వారికి జంట అయిన తమన్నా, మెహరీన్ ఇద్దరూ అక్కా,చెల్లెళ్ళుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా, నవంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు, ఎఫ్2 - ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యనున్నట్టు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. దీపావళి కొంచెం ముందుగా అంటూ, ఎఫ్2 ఫస్ట్‌లుక్  అప్‌డేట్‌తో ఒక పోస్టర్ పోస్ట్‌చేసాడు. అందులో, వి2, వెంకటేష్, వరుణ్ తేజ్ అని మెన్షన్ చేసారు. లోగో డిజైనింగ్ టైటిల్‌కి తగ్గట్టుగా సెట్ అయింది.  ఇప్పటికే దిల్ రాజు, అనిల్ కాంబోలో, సుప్రీమ్, రాజా ది గ్రేట్ లాంటి రెండు హిట్స్ వచ్చాయి. ఎఫ్2తో, హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.  

17:49 - October 6, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా మూవీ నిన్న ప్రేక్షకులముందుకొచ్చింది.. ఊహించినంత కాదుగానీ, ఓ‌ మోస్తరు టాక్ తెచ్చుకుంది.. తమిళ్‌లోనూ పర్వాలేదనిపించుకుంది.. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, టాక్‌తో సంబంధం లేకుండా, అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు, ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి.. ఫస్ట్‌డే నోటాకి వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే... ఏపీ, తెలంగాణ షేర్ - 4.55 కోట్లు, తమిళనాడు-రూ.1‌కోటి, కర్ణాటక- 60 లక్షలు, యుఎస్- 75 లక్షలు, మిగతా ఏరియాలు - 45లక్షలు, వరల్డ్‌‌వైడ్ షేర్ - 7.3 కోట్లు..షేర్ వివరాలిలా ఉంటే, వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ దాదాపు 14‌ కోట్లని తెలుస్తోంది.. గీత గోవిందం బజ్‌ తో ఓపెనింగ్స్ రావడం వరకూ ఓకే కానీ, డివైడ్ టాక్‌తోనూ తొలిరోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటే, విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.. వీకెండ్ కాబట్టి శని,ఆది వారాల్లోనూ మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.
 

09:22 - October 6, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగుతోపాటు తమిళ్‌లోనూ రిలీజ్ అయింది..
విజయ్ క్రేజ్ దృష్ట్యా తెలుగులో ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ, మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది..
ప్రస్తుతం నోటాకి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి టాలీవుడ్‌లో బాబు పాస్ అయిపోతాడు...
ఇక కోలీవుడ్ విషయానికొస్తే, అక్కడ ఈరోజు విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96, విష్ణు విశాల్, అమలా పాల్ నటించిన రాక్షసన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి..96 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా, రాక్షసన్ తమిళ్‌లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఒకటి అంటున్నారు..
విజయ్.. గీత గోవిందంతో తమిళ్ లోనూ గుర్తింపుతెచ్చుకున్నాడు.. ఈ రెండు సినిమాల తాకిడిని తట్టుకుని, విజయ్ దేవరకొండ నోటా ఏమేరకు నిలబడతుందో చూడాలి మరి...

 

11:59 - October 5, 2018

‘గీత గోవిందం’ మూవీతో యంగ్‌హీరో ‘విజయ్ దేవరకొండ’ క్రేజ్ కొండెక్కి కూర్చుంది.. 100 కోట్ల క్లబ్‌లోనూ చేరడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.. ఇప్పుడు అందరి చూపు విజయ్ లేటెస్ట్ మూవీ నోటాపైనే ఉంది.. గతకొద్దిరోజులుగా ‘నోటా’ సినిమా రిలీజ్‌పై కొన్నిరాజకీయ పార్టీలు హడావిడి చేసాయి... ఎట్టకేలకు అన్ని అడ్డంకులనీ తొలగించుకుని, శుక్రవారం తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ అయింది ‘నోటా’..మరి సినిమా ఎలా ఉందో చూద్దాం...

కథ :
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు వాసుదేవ్.. ఒక స్వామీజీ సలహామేరకు తన కొడుకు వరుణ్ని ముఖ్యమంత్రిని చెయ్యాలనుకుంటాడు... అయితే అదే టైమ్‌లో అవినీతి ఆరోపణలతో వాసుదేవ్ జైలుకి వెళ్ళడంతో తప్పక తండ్రి స్ధానంలోకి వచ్చిన వరుణ్ ముఖ్యమంత్రిగా ఏం చేసాడు అనేది నోటా కథ..

నటీనటులు :
విజయ్ దేవరకొండ నటుడిగా సినిమా సినిమాకి డెవలప్ అవుతూ ఉన్నాడు... నోటాలో గంభీరంగా కనిపిస్తూ తన శైలి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు..హీరోయిన్ మెహరీన్‌ది గెస్ట్ అప్పీరియన్స్‌లా అనిపిస్తుంది.. అయినా ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది.. సీనియర్ నటులు నాజర్ అండ్ సత్యరాజ్ తమ అనుభవంతో వారి వారి పాత్రలని రక్తి కట్టించారు... మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నంతలో బాగానే చేసారు...శ్యామ్.సి.ఎస్. సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సో సో‌గా ఉన్నాయి.. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ కెమెరా వర్క్ బాగుంది.. రేమండ్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది..దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాని పొలిటికల్ థ్రిల్లర్‌గా మలిచిన విధానం బాగానే ఉంది కానీ, ఓవర్ డ్రామాతో కాస్త సాగదీస్తూ.. సహనానికి పరీక్ష పెట్టాడు..‘నోటా’ దాదాపు 25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.. మన దగ్గర విజయ్ మ్యాజిక్‌తో ఆడేస్తుంది కానీ, తమిళ్‌లో ఏమాత్రం స్కోర్ చేస్తుందో చూడాలి.. ఎందుకంటే, తెలుగులో ఎటువంటి పోటీ లేకుండా రిలీజ్ అయింది నోటా‌.. తమిళ్‌లో ఇవాళే రిలీజ్ అయిన, విజయ్ సేతుపతి, త్రిషల 96, ఎస్.జె.సూర్య రాక్షసన్ మూవీస్ కి హిట్ టాక్ వచ్చేసింది... మరి వాటి మధ్య నోటా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి...

తారాగణం :  విజయ్ దేవరకొండ, మెహరీన్,  నాజర్, సత్యరాజ్..

కెమెరా     :  సంతాన కృష్ణన్ రవిచంద్రన్ 

సంగీతం   :    శ్యామ్.సి.ఎస్.

ఎడిటింగ్   :      రేమండ్ 

నిర్మాత    :   కె.ఇ.జ్ఞానవేల్ రాజా

రేటింగ్  : 2.5\5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి
 
 
10:00 - May 18, 2016

అల్లు శిరీష్‌ హీరోగా ఎం.వి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్రప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్‌ మెహరీన్‌ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఇందులో మా పాత్రలు చాలా భిన్నంగా వినోదాత్మకంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంజయ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్‌ సంగీత సమకూరుస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం పూర్తయిన తర్వాత, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది' అని అన్నారు. 'లవ్‌తోపాటు మంచి కాన్సెప్ట్‌, సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. అల్లు శిరీష్‌, మెహరీస్‌ జోడీ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి' అని దర్శకుడు ఎం.వి.ఎన్‌.రెడ్డి తెలిపారు. నిర్మాత శైలేంద్రబాబు మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో వస్తున్న రెండో తెలుగు చిత్రమిది. మంచి కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోతోపాటు హీరోయిన్‌కి కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది' అని అన్నారు.

Don't Miss

Subscribe to RSS - మెహరీన్