మేఘన

15:28 - April 7, 2018

అఘ్నాతవాసితో దెబ్బతిన్న త్రివిక్రమ్.. కథతో, పవన్ కళ్యాణ్ నిర్మాణంలో యూత్ స్టార్ నితిన్ తన 25 వ సినిమాగా చేస్తున్నాడంటేనే..అందర్లో క్యూరియాసిటీ ఏర్పడింది. దానికి తగ్గట్టు గానే.. ఫస్ట్ లుక్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకూ ఫ్రెష్ రోమ్ క్యామ్ టచ్ తో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది సినిమా టీమ్. ప్రీ రిలీజ్ కు పవన్ రాకతో .. అన్ని రకాలుగా సినిమాకు కావల్సిన క్రేజ్ ఏర్పడింది. అలా అంచలంచెలుగా అంచనాలు పెంచి థియేటర్ లోకి వచ్చిన 'చల్ మోహన్ రంగ'.. హుషారుగా చల్ అన్నాడా.. లేక డల్ అయ్యాడా అన్నది తెలుసుకుందాం...

సినిమా కథ...
సినిమా కథ విషయానికొస్తే..పనీ పాటా, చదువూ సంధ్యా అంటూ ఏమీ లేకుండా లైఫ్ ని లైట్ గా లీడ్ చేసే మోహన్ రంగ చిన్నతనంలోనే ..మేఘ ను చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆమె కోసం అమెరికా వెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సినిమాటిక్ గానే మేఘ తో పరిచయం, ప్రేమ, ఆ ప్రేమ ను వ్యక్తపరచలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. దాంతో మేఘ ఇండియా వచ్చేస్తుంది. ఆమెను వెతుక్కుంటూ ఇండియా వచ్చేసిన మోహన్ రంగ ఆమెను ఎలా కలుసుకున్నాడు..? తన ప్రేమను ఎలా వ్యక్తపరచాడు..? అతని ప్రేమను ఆమె యాక్సెప్ట్ చేసిందా..? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల అభినయం...
నటీనటుల విషయానికొస్తే..యూత్ స్టార్ నితిన్ ఈ సినిమాలో నటన పరంగా చాలా పరిణితి కనపర్చాడు. స్టైలింగ్ కూడా బావుంది. కాకపోతే తన గాడ్ అయిన..పవన్ కళ్యాణ్ ని చాలా ఎక్కువగా వాడేశాడు. చాలా చోట్ల ఇమిటేట్ కూడా చేశాడు. నితిన్ మిగతా సినిమాలతో పోలిస్తే.. కామెడీ టైమింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. ఇక లై సినిమాలో తన లుక్స్ తో అందరినీ ఇంప్రెస్ చేసిన మేఘ ఆకాష్..ఈ సినిమాలో కూడా లుక్స్ తో ఆకట్టుకుంది. కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చాలా పేలవంగా అనిపించింది. సిచ్యువేషన్ కి సింక్ గాని ఎక్స్ ప్రెషన్స్ తో కన్ ఫ్యూజ్ చేసింది. చాల రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన లిజి.. ఏ ప్రత్యేకతా లేని సాదాసీదా క్యారెక్టర్ లో కనిపించింది. నితిన్ ప్రెండ్స్ గా నటించిన మధు నందన్, పమ్మిసాయి, మంచి కామెడీ జనరేటర్స్ గా ఉపయోగపడ్డారు. ఇక రావు రమేష్, నరేష్, నర్రాశీను క్యారెక్టర్స్ సినిమాను సేవ్ చేసే ఎలిమెంట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో రావు రమేష్, నర్రాశీనుల మధ్య వచ్చే ఎపిసోడ్స్..సెకండాఫ్ మొత్తాన్ని కాపాడింది. సత్య కామెడీ అక్కడక్కడా...నవ్వించినా.. కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. మిగతా నటీనటులందరూ..డైరెక్టర్ చెప్పిన విధంగా ..తమపాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. టైటిల్స్ లో ఈ కథ త్రివిక్రమ్ దే అని వేశారు. సినిమా చూశాక మాత్రం అసలు ఈ కథ త్రివిక్రమ్ దేనా..అని డౌట్ రావడం కామన్. క్లారిటీ లేని క్యారెక్టరైజేషన్, సెంటర్ పాయింట్ లేని స్టోరీ.. త్రివిక్రమ్ ఇచ్చాడు అంటే నమ్మడం కష్టం. ఇక ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కృష్న చైతన్య ..స్క్రీన్ ప్లే లో ఎలాంటి మెరుపులు యాడ్ చెయ్యలేదు. ఫస్టాఫ్ లో u.s యాంబియెన్స్ వల్ల, కృష్ణ చైతన్య కామెడీ టైమింగ్ వల్ల సినిమా అలా అలా నడిచిపోతుంది. ఇంట్రవెల్ కార్డ్ తోనే సినిమాలో ఉన్న లోపాన్ని బయట పెట్టిన డైరెక్టర్, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి ఫ్లాట్ గా స్టోరీ ని నడిపించేశాడు. మిత్ర క్యారెక్టర్ ఎంట్రీ వరకూ..సినిమా అసలు ఎటు పోతుందో అర్దం కాదు. సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పడంతో, స్టోరీలో కొత్తదనం లేకుండా పోవడంతో ఒక సగటు సినిమాగా నిలిచింది చల్ మోహన రంగ. అయితే సినిమాను నిలబెట్టడానికి..ఆర్.ఆర్ పరంగా బాగా హార్డ్ వర్క్ చేశాడు తమన్. కానీ సీన్స్ లో బలమైన కంటెంట్ లేకపోవడంతో ఆర్.ఆర్ కూడా ఓవర్ లౌడింగ్ అనిపిస్తుంది. నటరాజ్ సుబ్రమణ్యన్ సినిమాటోగ్రఫీ..చల్ మోహన రంగా టెక్నీషియన్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. U.S ని గానీ, ఊటీ అందాలను గానీ.. అతను ప్రజెంట్ చేసిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ఏరియల్ షాట్స్..విజువల్ ట్రీట్ గా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి ల నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే జనరల్ స్టోరీలైన్, క్లారిటీ లేని స్క్రీన్ ప్లే, అసలు ఆకట్టుకోలేని ఎమోషన్స్, అనేక బలహీనతలతో తెరకెక్కిన 'చల్ మోహనరంగా' కి క్యామెడీ బ్యాకింగ్ ఒక్కటే అండగా నిలిచింది. ఆ కామెడీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుంది అనే దానిపై మోహనరంగా బాక్సాఫీస్ స్టామినా ఆధారపడి ఉంది.

ప్లస్..
ఫస్టాఫ్
కామెడీ
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనస్
రొటీన్ కథ
స్క్రీన్ ప్లే
కనెక్ట్ కాని ఎమోషన్స్
కన్ ఫ్యూజింగ్ క్యారెక్టర్స్

రేటింగ్...విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...
 

16:35 - February 21, 2018

సంగారెడ్డి : స్కూల్లో పిల్లలు అల్లరి చేసినా..చదవకపోయినా..ఇతరత్రా కారణాలు ఏవైనా ఓపికతో నచ్చచెప్పాల్సిన టీచర్లు కిరాతకంగా మారిపోతున్నారు. చిన్న పిల్లలని చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా చావబాదుతున్నారు. పటన్ చెరువులోని మంజీరా స్కూల్ లో ఓ టీచర్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది.

పటన్ చెరులోని మంజీరా స్కూల్ లో ఓ టీచర్ దారుణానికి తెగబడింది. యూకేజీ చదువుతున్న విద్యార్థిని పుష్పాంజలిని మేఘన టీచర్ తీవ్రంగా కొట్టింది. చిన్నారి బట్టలు విప్పగా ఈ విషయం తెలుసుకన్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థి సంఘాలు..కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. చేతులు..వీపుపై వాతలు వచ్చేలా కొట్టిందని, ఆసుపత్రిలో చూపించి పటన్ చెరు పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 

11:32 - November 26, 2017

విశాఖపట్టణం : పిచ్చికుక్క దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మేఘన చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈనెల 6న చోడవరం (మం) గోవాడలో ఇంటికి వస్తుండగా పిచ్చికుక్క కరిచింది. ఇంట్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అనంతరం మరోసారి 21వ తేదీన అస్వస్థకు గురైంది. మలేరియా..డెంగ్యూ వ్యాధులు సోకడంతో ఆమె మృతి చెందింది. 

18:53 - July 26, 2016

తూ.గోదావరి : డబ్బు కోసం ఓ ఇల్లాలి ప్రాణాలు బలిగొన్నారు రాజకీయ నాయకులు..రాజకీయ రంగు వేసుకున్న ఇద్దరు వేర్వేరు పార్టీల్లో చెలామణి అవుతూ ఓ అమాయకురాలిని పొట్టనపెట్టుకున్నారు..అప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్న ఆమె పసుపుకుంకుమ కింద వచ్చిన ఆస్తిని తనఖా పెట్టించి మోసం చేశారు.. చివరకు డబ్బు విషయంలో గొడవలు పడి ఆత్మహత్య చేసుకునేలా చేశారు..వీరి ఘరానా మోసానికి బలయింది కాకినాడ మేఘన...

రాజకీయుల కక్కుర్తికి బలయిన మేఘన...
నిర్జీవంగా ఉన్న ఈమె మేఘన...తన జీవితాన్ని తాను తీర్చిదిద్దుకుని జరిగిన పొరపాట్లు..జరిగిన నష్టాలను పూడ్చుకోవాలనుకున్న ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు రాజకీయ రంగు వేసుకున్న దుర్మార్గులు...ఆస్తులను కొల్లగొట్టి అమాయకురాలి జీవితంతో ఆడుకున్నారు..చివరకు ఆమె ప్రాణాలు పోయేలా చేశారు....కాకినాడలో జరిగిన ఘోరం ఇప్పుడు కలకలం రేపుతోంది...

భర్త నుంచి విడిపోయి ఇద్దరు పిల్లలతో మేఘన..
పదేళ్ల వైవాహిక బంధంలో ఎన్నో కష్టాలు..ఉంటున్న ఇల్లాలు.. కాకినాడ వెంకటనగరి ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ లో ఉంటున్న తుమ్మలపల్లి మేఘనకు రమేష్‌తో పదేళ్ల క్రితం పెళ్లయింది..వీరికి ఇద్దరు పిల్లలున్నారు..భార్యాభర్తల మధ్య గొడవలతో కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు...

అత్తమామ,భర్త వేధింపులు..
మెట్టినింటి వేధింపులపై కేసులు పెట్టిన మేఘన వెంకటనగరి ప్రాంతంలోని అపార్ట్ మెంట్లో ఉంటోంది... ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ పెళ్లి సమయంలో పుట్టింటి నుంచి వచ్చిన పసుపుకుంకుమ కానుకల ఆస్తులతో ఉన్న మేఘనపై కన్నేశారు రాజకీయులు.. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉంటున్నవారు మేఘనకు దగ్గరయి ఆమె ఆస్తిని తనఖా పెట్టించి డబ్బులిప్పిస్తామన్నారు..కష్టాల్లో ఉన్న మేఘన వారిని నమ్మింది.. అయితే పూర్తిగా నమ్మించినవారు ఆస్తి తనఖా పెట్టించారు కాని డబ్బు మాత్రం ఇవ్వలేదు..

ఆత్మహత్యకు ప్రేరేపించేలా వేధింపులు..
మేఘన ఆస్తి తనఖాపై డబ్బు విషయంలో గొడవలు జరుగుతుండగా ఆమె డబ్బును నొక్కేసిన వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది...కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు... టీడీపీ నాయకురాలు రాయవరపు సత్యభామ, బీజేపీ నాయకుడు సాయిబాబాలు మేఘనను మానసికంగా కృంగిపోయేలా చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపణలు వస్తున్నాయి..వారిపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.

Don't Miss

Subscribe to RSS - మేఘన