మేడిపల్లి

17:51 - January 12, 2018
16:13 - January 12, 2018

మేడ్చల్ : హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. చంగిచర్ల వద్ద నిలిపి ఉన్న డీజిల్ ట్యాంకర్..గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. కొద్ది క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున్న పొగ వ్యాపించింది. మంటల్లో పలువురి చిక్కుకుని గాయపడ్డారు. లారీలోని సిలిండర్లు పేలుతుండడంతో పెద్ద పెద్ద శబ్దాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు..పోలీసు అధికారితో టెన్ టివి మాట్లాడింది. ఏం జరిగిందనే దానిపై తెలుసుకోవాలంటే సమయం పడుతుందని పోలీసు అధికారి పేర్కొన్నారు. పెట్రోల్ దొంగతనంగా సరఫరా చేస్తున్నారని..సమాచారం వస్తోందని ఇదే నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదంలో ఒక భవనం దెబ్బతిన్నదని..కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయని..ఒకరికి సీరియస్ గా ఉన్నారని...ఇతర వివరాలు త్వరలో తెలియచేస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:47 - January 12, 2018
15:24 - January 12, 2018

మేడ్చల్ : జిల్లా శివారు ప్రాంతమైన మేడిపల్లి శుక్రవారం మధ్యాహ్నం వణికిపోయింది..బోడుప్పల్ ప్రాంతంలోని చెంగిచెర్లలో భారీ పేలుడు సంభవించింది..అకస్మాత్తుగా పెట్రోల్ వాహనానికి మంటలు అంటుకున్నాయి.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. పెట్రోల్ ట్యాంకర్ పేలడం..పక్కనే ఉన్న సిలిండర్ల లారీలకు మంటలు వ్యాపించాయి. భారీగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. రోడ్డుపై వెళుతున్న వారిపై పడడంతో హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో ఐదుగురు కాలిపోయారని..వారి పరిస్థితి విషమంగా ఉందని ఓ ఫైర్ సిబ్బంది టెన్ టివికి తెలిపారు. ఏడు వాహనాలు దగ్ధమయ్యాయని, పది మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

పెట్రోల్ కంపెనీ నుండి బయటకు వచ్చాక ప్రైవేటు గోడౌన్ లో పెట్రోల్ దొంగిలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రమాదంలో మంటలు అంటుకుని పలు వాహనాలు దగ్ధమయ్యాయి. భారీ పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోనళకు గురయ్యారు. దీని గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఘటన గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

08:12 - December 15, 2017

హైదరాబాద్ : గుప్త నిధులు ఉన్నాయా ? ఈ ప్రశ్నకు ఉన్నాయని..లేవని జవాబులు వినిపిస్తుంటాయి. కానీ అవి అంత ఈజీగా దొరికేవి కావని పలువురు పేర్కొంటుంటారు. గుప్త నిధుల గురించి తరచుగా వింటూనే ఉంటాం. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ పలువురు పట్టుబడుతుంటారు. తాజాగా యాచారం మండలం మేడిపల్లిలో అర్ధరాత్రి ఓ పాడుపడిన భవనంలో తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలోకి చేరుకున్న పోలీసులకు ఓ మహిళ..ముగ్గురు యువకులు తవ్వకాలు జరుపుతున్నట్లు గమనించారు. గుంటూరు జిల్లాకు చెందిన వీరంతా కుషాయిగూడలోని ఓ ఆశ్రమానికి చెందిన వారీగా నిర్ధారించారు. గుప్తనిధులున్నాయనే పక్కా సమాచారం మేరకు తవ్వకాలు చేసినట్లు వారు పేర్కొంటున్నట్లు సమాచారం. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

12:15 - December 14, 2017

మేడ్చల్ : వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని పేర్కొంటూ హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై బంధువులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఫీర్జాదిగూడలో అంకుర ఆసుపత్రిలో అంకుర ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. బాలుడి మృతదేహంతో కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీనితో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

 

06:37 - November 24, 2017

హైదరాబాద్ : ఐదురోజులుగా అత్తింటి అరాచకాలపై పోరాటం చేస్తున్న సంగీత ఆందోళనపై ఉత్కంఠ రేపుతుంది...న్యాయం జరిగేవరకు కదిలేది లేదంటున్న సంగీతకు ప్రజాసంఘాలు అండగా నిలిచాయి...మరోవైపు సంగీతకు న్యాయం చేసేందుకు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు...కొన్ని గంటల్లోనే ఈ ఆందోళనకు తెరపడేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడలేదు..మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది...ప్రజాసంఘాలు.. మరోవైపు ప్రజాప్రతినిధులు..ఇంకోవైపు పోలీసులు..అన్ని రకాలుగా చర్చలు జరుపుతూ సంగీతకు న్యాయం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి...ఐదో రోజుకు ఆందోళన చేరడంతో ఉత్కంఠగా మారింది..రోజు రోజుకు సంగీతకు పెరుగుతున్న మద్దతుతో పాటు యావత్ రాష్ట్రం మొత్తం ఆమెకు చేసే న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు...దీంతో రంగంలోకి దిగిన ఎంపీ మల్లారెడ్డి సంగీతను కలిసి న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదిలా ఉండగా రెండు కుటుంబాల వైపు నుంచి చర్చలు జరుపుతూనే సంగీత చేస్తున్న డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎంపీ మల్లారెడ్డి మరోసారి ఆమెను పరామర్శించారు...కొన్ని గంటల్లోనే ఆమె పోరాటానికి తెరపడుతుందంటున్నారు. భర్త చేసిన మోసంపై ఐదు రోజులుగా హైదరాబాద్‌ బోడుప్పల్‌లో అత్తారింటి ముందు ఆందోళన చేస్తున్న సంగీత తన కూతురు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆర్థికపరమైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది..మరోవైపు శ్రీనివాసరెడ్డి భార్యగా తనకు సమాన హక్కులు కల్పించాలంటోంది...స్థిర,చర ఆస్తుల్లో సమాన భాగం కల్పించాలంటున్న సంగీత న్యాయం జరిగితేనే కదిలేదంటోంది.

ఇక మరోవైపు సంగీత పెట్టిన కేసులో పోలీసులు మామ బాల్‌రెడ్డి,అత్త ఐలవ్వలతో మరిదిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు..ఏ 2గా కేసులో ఉన్న ఐలవ్వపై కేసులు పటిష్టంగా ఉండడంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది..ఇక మామ బాల్‌రెడ్డి,మరిదికి బెయిల్ ఇచ్చింది...అయితే ఇంతదాకా వచ్చాక చట్టపరంగానే చూసుకుంటామంటున్న బాల్‌రెడ్డి సంగీతతో సెటిల్‌మెంట్‌కు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది..మరోవైపు సంగీతకు మద్దతు తెలుపుతున్న వివిధ సంఘాలు పోరాటం కంటిన్యూ చేస్తామంటున్నాయి.

13:28 - November 23, 2017

హైదరాబాద్ : భర్త, మెట్టినింటి వేధింపులపై పోరాటం చేస్తున్న సంగీత ఆందోళనకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తుంది..నాలుగో రోజున సంగీత ఆందోళనకు ప్రజాప్రతినిధులు..మహిళా సంఘాల నుంచి అండ లభించింది...న్యాయం చేస్తామంటూ ఆమె వెన్నంటే ఉన్నారు. భర్త నుంచి న్యాయం చేయాలంటూ బోడుప్పల్‌లో ధర్నా చేస్తున్న సంగీత విషయంలో టీఆర్ఎస్‌ అగ్రనాయకత్వం కదిలింది. దీనిపై ఏదో ఒక విధంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై టెన్ టివి సంగీత ఇంటి వద్దనున్న పలువురు మహిళా నేతలతో మాట్లాడింది. భార్య బతికి ఉండగా వేరే వివాహం చేసుకోవడం చెల్లదని..దీనిపై సంగీత న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందన్నారు. ఇక ఆర్థికపరంగా కూడా పోరాటం చేయవచ్చని, సంగీతకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. తుది నిర్ణయం మాత్రం సంగీత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:25 - November 23, 2017

హైదరాబాద్ : భర్త, మెట్టినింటి వేధింపులపై సంగీత చేస్తున్న పోరాటం ఐదో రోజుకు చేరుకుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డిపై రెండో భార్య సంగీత పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరిగేవరకు కదలనంటూ ఆందోళన చేపడుతోంది. దీనితో బుధవారం ప్రభుత్వ పెద్దలు కదిలారు. ఇందులో సంగీతకు న్యాయం జరిగేందుకు టెన్ టివి కూడా చొరవ చూపిస్తోంది.

కానీ తన దగ్గరకు వచ్చిన ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కరించకుండా తనకు ఆప్షన్ ఇస్తున్నారని సంగీత వాపోతోంది. గురువారం ఆమె టెన్ టివితో మాట్లాడారు. అత్తింటి వారు భరోసా ఇవ్వాలని..వారు అరెస్టు అయితే తనకు ఎలాంటి ఉపయోగం రాలేదన్నారు. బెయిల్ పై మామ..మరిది వచ్చారని తెలిసిందని..వారితోనైనా మాట్లాడించాలని కోరారు. తనకు భద్రత కావాలని..తన అమ్మాయికి ఎలాంటి హక్కులివ్వాలని..తనకు ఏవైతో కల్పిస్తామని చెప్పారో అవన్నీ కల్పించాలని కోరుతున్నట్లు సంగీత చెప్పారు. మరి ఈ రోజైనా సంగీతకు న్యాయం జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

17:29 - November 22, 2017

హైదరాబాద్ : గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగీతకు న్యాయం చేసేందుకు టెన్ టివి నడుం బిగించింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డిపై రెండో భార్య సంగీత పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరిగేవరకు కదలనంటూ ఆందోళన చేపడుతోంది. దీనితో బుధవారం ప్రభుత్వ పెద్దలు కదిలారు. సంగీతకు న్యాయం చేసేందుకు టెన్ టివి చొరవ చూపింది. స్థానిక స్టార్ హోటల్ లో చర్చలు చేపడుతున్నారన్న సమాచారం మేరకు టెన్ టివి అక్కడకు వెళ్లింది. ఎంపీ మల్లారెడ్డి..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో టెన్ టివి మాట్లాడింది. న్యాయం చేసేందుకు ఇక్కడకు రావడం జరిగిందని..సంబంధిత వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడి నుండి సంగీత ఇంటికి వెళ్లారు.

అక్కడ సంగీతతో టెన్ టివి మాట్లాడింది. తనకు న్యాయం చేయాలని కోరింది. జైల్లో ఉన్న తన భర్తను చూపించాలని, అత్త మామలను అరెస్టు చేసి చూపించాలని డిమాండ్ చేసింది. తన తరపున మాట్లాడటానికి వచ్చిన వారి ముందే తనకు న్యాయం జరగాలని..తనకు, తన పాపకు రక్షణ కల్పిస్తామని వాళ్లు లిఖిత పూర్వకంగా రాసివ్వాలన్నారు. తనను చంపేస్తామంటూ భర్త, అత్తమామలు తనను బెదిరించారని చెప్పారు. తనకు, తన పాపకు రక్షణ కావాలని కోరారు. మనీ డిమాండ్ చేయడం లేదన్నారు. అత్తామామలను దాచిపెడుతున్న వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకో ఆడదానికి ఇలా జరుగకుండా చూడాలని కోరారు. సంగీత ఏమి కోరుకొంటుందో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టెన్ టివితో ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. ఒక బిల్డింగ్ రిజిష్టర్ చేయిస్తామన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - మేడిపల్లి