మేలు

12:25 - May 17, 2017

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు రకాల ఆకు కూరల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయి. అలాంటి ఆకు కూరల్లో పొన్నంగంటి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఏ, బి 6, సి, ఫొలేట్, రైబో ఫ్లెవిన్, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో దోహదం చేస్తుంటుంది. గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. పొన్నగంటి ఆకులను ఓ
గ్లాస్‌ నీటిలో ఉడికించి, మిరియాల పొడిని కలుపుకొని తాగితే ఆ సమస్య నుండి దూరం కావచ్చు.
శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.
పొన్నగంటి కూరలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ..ఆస్టియో పోరోసిస్ ను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులో లభించే నూనె పదార్థాలు రక్తపోటును తగ్గించి, గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి.
బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

19:58 - February 3, 2017

పెద్దపల్లి : ఓపెన్‌కాస్ట్‌ గనుల వల్ల కాంట్రాక్టర్లకే ప్రభుత్వం మేలు చేకూర్చుతుందన్నారు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతున్న రెండో అంతర్జాతీయ గని కార్మికుల సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ కోదండరాం.. మైనింగ్‌ పాలసీని ప్రభుత్వం తుంగలో తొక్కి కొందరి స్వార్థం కోసం పాలసీలను మారుస్తున్నారని విమర్శించారు. ఈనెల 22న జరిగే నిరుద్యోగ యువకుల ర్యాలీని విజయవంతం చేయాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు దాదాపు 30 దేశాల నుండి విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 

 

13:34 - January 10, 2017

నీరు..అద్భుత వరం. నీరు లేకపోతే మనిషి మనుగడే లేదు. పరగడుపున నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వేడి నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం...

  • ఉదయాన్నే పర గడుపున వేడి నీరు తాగితే.. శరీరంలోని జీర్ణక్రియ వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది.
  • శరీరం బరువు తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
  • గొంతు నొప్పి, జలుబు, కఫము వంటి సమస్యలు రావు. అంతేకాక సంబంధింత వ్యాధులు కూడా దూరమవుతాయి.
  • శరీరంలో ఉన్న వేడిని చెమట రూపంలో బయటకు పంపిస్తుంది.
  • చర్మంపై ఉన్న ముడతలు, మొటిమల సమస్యలు దూరమౌతాయి.
  • శ‌రీర మెట‌బాలిజం వేగవంత‌మ‌వుతుంది. క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేసేందుకు ఉపయోగ‌ప‌డుతుంది. ప్రధానంగా కిడ్నీలకు చాలా మంచిది.
09:34 - July 25, 2016

యాలకులు..కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తీపిపదార్థాలకు రుచి, మంచి వాసన ఇచ్చే ఈ యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
దీనిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతేగాక జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుముఖం పడుతాయి.
నోట్లో అల్సర్లు, ఇన్ ఫెక్షన్ల లాంటివి ఉన్నప్పుడు రెండు యాలకులని నోట్లో వేసుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయి.
వికారం, కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పుడు యాలకులు తీసుకుంటే అవి దూరమవుతాయి.
శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో యాలకులు మించిన సుగంధ దినుసు లేదని పేర్కొంటున్నారు. చూశారా.. యాలకులు ఎంత మేలు చేస్తాయో...

12:30 - July 18, 2016

సీజన్ వారిగా దొరికే పండ్లు..అన్ని రకాల సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొన్ని పండ్లలో విత్తులు ఉంటాయనే విషయం తెలిసిందే కదా. కొంతమంది ఈ విత్తనాలను పారేస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దామా..
గుమ్మడి విత్తనాలు తినడం వల్ల డిప్రెషన్ తో పాటు శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయి.
నిమ్మకాయ గింజలు, కివి సీడ్స్ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
పుచ్చకాయ విత్తనాలు పారేయకుండా తినడం వల్ల జట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కడుపులో ఉండే నులిపురుగులు కూడా నశిస్తాయంట.
వైద్యుల సలహాతో చిన్నపిల్లలకు ఈ గింజలు ఇవ్వడం మంచిది.
బొప్పాయి పండులోని విత్తనాలను కూడా తినవచ్చని వారు సూచించారు. ఈ విత్తనాల్లో ఉండే పొట్రియోలిక్‌ ఎంజైమ్‌ ల వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.

10:04 - May 18, 2016

కామన్‌గా కనిపించే కలబందంతో అందం, ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే కలబందను సబ్బులు, మాయిశ్చరైజర్‌ క్రీముల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా! ముడతలను నివారించడమే కాదు... ఎలర్జీలను దరిచేరనివ్వదు. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కలబంద రసాన్ని ముఖానికి అప్లైచేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. కాలిన గాయాలపై కలబంద రసం పూతలా పూస్తే గాయాలు మాయమవుతాయి. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేదా చందనం పౌడర్‌ కలిపి ముఖంపై రాస్తే మృతకణాలు తొలగి చర్మం నిగనిగలాడుతుంది.
కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో ప్యాక్‌లా వేస్తే.. చర్మంపై ఉన్న నల్లని మచ్చలు తగ్గుతాయి.
రోజ్‌ వాటర్‌లో కలబంద రసాన్ని కలిపి ముఖానికి మర్దన చేయాలి. పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.

07:38 - May 9, 2016

ఏమిటీ మీరీ మధ్య తరచూ మర్చిపోతున్నారా ? ఏ వస్తువు ఎక్కడ పెట్టిందీ గుర్తుకు రావడం లేదా? అయితే బొప్పాయితో దానికి చెక్‌ పెట్టేయొచ్చంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ బొప్పాయి పండు తింటే మతిమరుపు ఉష్‌కాకి. బొప్పాయి పాలల్లో ఔషధ గుణాలున్నాయి. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుది. బొప్పాయి పాలకు పేరిన నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుంది. కాలేయ పెరుగుదలను అరికట్టే గుణం బొప్పాయి పాలకు ఉంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. 

14:31 - February 15, 2016

వేడి ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోంది. ఈ ఎండల్లో దాహం తీర్చుకోవడానికి రకరకాల పానియాలు తాగుతుంటాం. అయితే అన్నింటిలోకి మజ్జిగ చాలా ఉత్తమమైనదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఊబకాయంతో బాధపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్య నుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్‌ బి12, పొటాషియం, ఫాస్పరస్‌, కాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. ప్రతిరోజూ మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదడపుతుంది. మజ్జిగ శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంది. ఇది ఆరోగ్యకరమైన పానియం కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ మజ్జిగను తీసుకునేందుకు ప్రయత్నించండి.

12:42 - February 5, 2016

ఉరుకులు పరుగులతోనే జీవితం సాగిపోతుంది.ఉదయం నిద్రలేవగానే రెడీ అవ్వడం, కాలేజీ, ఆఫీసులంటూ పరుగుతీస్తూ ఆరోగ్యం, అందంపై శ్రద్దపెట్టే సమయం లేకుండా పోయింది. అలాంటప్పుడు ఫంక్షన్స్‌కు హఠాత్తుగా వెళ్ళాల్సి వస్తే మీ ముఖం డల్‌గా.. నిర్జీవంగా.. కనిపిస్తుంది. అప్పటికప్పుడు పార్లర్లకు, స్పాలకు వెళ్లలేం. మనకు మనం రెడీ కావాల్సిందే. అప్పుడు హడావుడిగా వెళ్లడానికి ఏదో ఒక మేకప్‌ వేసుకుని వెళ్తుంటాం. అలాకాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందంగా తయారవ్వొచ్చు.
ఆఫ్రికాట్‌, వాల్నట్‌, బాదాంతో ముఖాన్ని, చేతులను స్క్రబ్‌ చేయడం వల్ల కేవలం బ్లాక్‌ హెడ్స్‌ను తొలగించడం మాత్రమే కాకుండా తక్షణ మెరుపునిస్తుంది.
మీ పళ్ళను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నోటి నుండి వచ్చే చెడువాసన చికాకు కలిగిస్తుంది. కాబట్టి పార్టీకి వెళ్లే ముందు బ్రష్‌ చేయడం మంచిది.
ఆరెంజ్‌ జ్యూస్‌, కొంచెం నిమ్మరసం, తేనె వంటి వాటితోనే పదినిమిషాల్లో తాజాగా మారిపోవచ్చు.ఈ మూడింటిని కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అలాగే పది నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతే ముఖం నిగనిగలాడుతుంది.
ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ముల్తానీ మట్టి మొటిమల మీద తక్షణ ప్రభావం చూపుతుంది. అలాగే సాండిల్‌ వుడ్‌ పేస్ట్‌ తక్షణ ప్రభావాన్ని చూపుతుంది.
ఒక చెంచా పెరుగు, పసుపు, శెనగపిండి వంటివి అద్భుతమైన బ్లీచింగ్‌ ఏజెంట్స్‌గా పనిచేస్తుంది. అంతేకాదు టమాటాలతో ఫేస్‌ని శుభ్రం చేసుకోవడం వల్ల సన్‌టాన్‌ తొలగిపోయి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
చాలా మంది గోళ్ల సంరక్షణ గురించి అంతగా పట్టించుకోరు. గోళ్లను ట్రిమ్‌ చేయరు. కాబట్టి పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లే ముందు గోళ్లు చక్కగా సరైన ఆకారంలో ఉన్నాయో లేదో చూసుకొని, ట్రిమ్‌ చేసుకోవాలి. అంతే.. మీరు అనుకున్న టైంకు ఎంచెక్కా సిద్ధమైపోవచ్చు.

12:40 - February 5, 2016

మారుతున్న ఆహార అలవాట్ల వల్ల చాలామంది అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. అందుకే అధిక కొవ్వును క్రమంగా తగ్గించుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఈ కొవ్వును తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులో నిల్వ వుంటుంది. ఇది షుగర్‌ లెవల్స్‌ను క్రమబద్ధం చేస్తుంది. అలాగే టైప్‌2 డయాబెటిస్‌ను ఉల్లిపాయ నివారిస్తుంది. పచ్చి ఉల్లిపాయ నిత్యం తీసుకుంటే.. అధిక కొవ్వును అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ గొప్ప యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్‌, యాంటీ బయోటిక్‌, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్‌ లక్షణాలను కలిగివుంది. ఇందులో విటమిన్‌ సి, బి1, బి6, విటమిన్‌ కె, బయోటిన్‌, క్రోమియం, క్యాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, డైటరీ ఫైబర్‌ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని పోషక విలువలు కలిగిన ఉల్లిపాయను ప్రతిరోజూ డైటింగ్‌లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ఉల్లిపాయ సాధారణ జలుబు, దగ్గు, శ్వాసనాళపు వాపు, ప్ల్యూమోనియ, అధిక జ్వరం, ఆస్తమా వంటి జబ్బుల్ని నివారిస్తుంది. ఇంకా పొట్ట సమస్యలు, వికారం, డయేరియాను నివారించడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్‌ కారకాలు లివర్‌ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఈ ఉల్లిపాయ కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. బ్యూటీపరంగానూ ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంను అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగే.. చర్మ సమస్యల్ని నివారించుకోవడానికి ఈ ఉల్లిపాయతో ఎన్నో రెమెడీస్‌ చేసుకోవచ్చని కూడా వారు సూచిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - మేలు