మైక్రోమ్యాక్స్

14:14 - October 11, 2018

ఢిల్లీ : ఇప్పుడు ప్రపంచం అంతా స్మార్ట్ అయిపోయింది. అందరి చేతుల్లోను స్మార్ట్ ఫోన్సే. ఇంటిలోను స్మార్ట్ ఐటెమ్సే. స్మార్ట్ అభిమానులకోసం మైక్రోమ్యాక్స్ సంస్థ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలను తాజాగా విడుదల చేసింది. చూపరులను కట్టిపడే స్మార్ట్ టీవీని విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ అనుబంధ యూ టెలీ వెంచర్స్, 'యూఫోరియా' పేరిట భారత మార్కెట్లో 40 అంగుళాల స్మార్ట్ టీవీని ఆకర్షణీయ ధరలో విడుదల చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడే ఈ టీవీ ధర రూ. 18,999 కాగా, పాత టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో భాగంగా మార్చుకుంటే రూ. 7,200 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుందని సంస్థ తెలిపింది. 

Image result for amazon
ఇక ఈ స్మార్ట్ టీవీలో మీడియా ఫైల్స్ ను డైరెక్టుగా ప్లే చేసుకోవచ్చు. తమకు నచ్చిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఈ టీవీలో 40 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ ప్లే, 5000:1 కాంట్రాస్ట్‌ రేషియో, డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్ కో ప్రోసెసర్‌ కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, మూడు హెచ్‌డీఎం పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక వీజీఏ పోర్ట్, 24 వాట్స్‌ ఆడియో అవుట్‌ పుట్‌ సదుపాయాలుంటాయి. మరి ఇంకేంటి మీ పాత టీవీని ఇచ్చేయండి. కొత్త ఫుల్ హెచ్చ డీ స్మార్ట్ టీవీని ఇంటికి పట్టుకెళ్ళండి.

15:13 - September 7, 2016

రంగారెడ్డి : ఎలాంటి కారణాలు తెలుపకుండానే 'మైక్రోమ్యాక్స్' ఉద్యోగులను తొలగించడంపై కలకలం రేగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మహేశ్వరంలోని రావిరాల ప్రాంతంలో మైక్రోమ్యాక్స్ కంపెనీ ఉంది. ఇక్కడ పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులను బుధవారం ఉదయం గేటు వద్దే ఆపివేశారు. ఉద్యోగాల నుండి యాజమాన్యం తొలగించిందని..లోనికి రావద్దని సెక్యూర్టీ గార్డులు చెప్పడంతో ఉద్యోగులు హతాశులయ్యారు. యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గేటు ఎదుటే బైఠాయించారు. విషయం తెలియడంతో సీపీఎం నేతలు వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం నేతల ఆందోళన..ఉద్యోగుల నిరసనతో మైక్రోమ్యాక్స్ యాజమాన్యం దిగొచ్చింది. వారితో చర్చలు ప్రారంభించింది. స్టాఫ్ ఎక్కువగా ఉన్నారని అందుకే తొలగించడం జరిగిందని యాజమాన్యం తెలిపింది. ఇలా చేయడం కరెక్టు కాదని సీపీఎం నేతలు ఖరాఖండిగా చెప్పడంతో తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు యాజమాన్యం అంగీకరించింది. కానీ రెండు నెలల పాటు కొద్దిపాటి జీతం ఇస్తామని..అనంతరం మూడు నెలల నుండి పూర్తి జీతం ఇస్తామని యాజమాన్యం పేర్కొంది. కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని మాత్రమే ఉద్యోగాల నుండి తొలగించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

Don't Miss

Subscribe to RSS - మైక్రోమ్యాక్స్