మోహన్ భగవత్

15:54 - February 12, 2018

ఢిల్లీ : తాము తలుచుకొంటే కేవలం మూడు రోజుల్లో ఆర్మీని తయారు చేయగలమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ స్పందించారు. భగవత్ చేసిన వ్యాఖ్యలు భారత సైనికులను అవమానపరిచేవిగా ఉన్నాయని, దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులను..జాతీయ జెండాను అగౌరవపరిచాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మోహన్ భగవత్ సిగ్గు పడాలని తెలిపారు. ఇదిలా ఉంటే భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్మీని..ఆర్ఎస్ఎస్ తో పోల్చలేదని..బీహార్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన సమావేశంలో మోహన్ భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ తమ జవాన్లను సిద్ధం చేసేందుకు ఆరు నెలలు పడితే అదే ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇస్తే మూడు రోజుల్లో స్వయం సేవక్ తయారవుతారని వ్యాఖ్యానించారు. 

06:48 - March 30, 2017

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ పేరును రాష్ట్రపతి పదవికి పరిశీలించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్డీఏ సర్కార్‌కు సూచించని నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది ఎప్పటికీ జరిగేది కాదని, తాను ఆర్ఎస్ఎస్ కోసం మాత్రమే పనిచేస్తానని భగవత్ తెలిపారు. ఆర్ఎస్ఎస్‌లో చేరేముందే తాను అన్ని తలుపులు మూసేశానన్నారు. రాష్ట్రపతి పదవిపై వస్తున్నవన్నీ వదంతులు మాత్రమేనని... పొరపాటున ఎవరైనా తన పేరు ప్రతిపాదించినా తాను ఎప్పటికీ ఒప్పుకోబోనని ఆయన కుండ బద్దలుకొట్టారు. భారత్ హిందూ దేశంగా ఉండాలన్న కల నెరవేరాలంటే రాష్ట్రపతిగా భగవత్‌ను ఎంపిక చేయాలని శివసేన సూచించిన విషయం తెలిసిందే.

10:30 - December 6, 2015

ఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణ అంశంపై ప్రకటనల జోరు పెరుగుతోంది. ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ ఒకమాటంటే ఆయనకు మద్దతుగా శివసేన మంటలు పుట్టించే వ్యాఖ్యలు చేసింది. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కాషాయ సేన రామమందిర వివాదంలోకి ప్రవేశపెడుతోంది. శివసేన చేసిన కామెంట్స్ పై మోడీ ఎలా స్పందిస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.
మోహన్‌భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు
అయోధ్యలో మందిర నిర్మాణ అంశంపై కాషాయ శక్తులు తమ వ్యాఖ్యల జోరు పెంచుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్ మాట్లాడుతూ తన జీవిత కాలంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణమనే అత్యున్నత లక్ష్యం నెరవేరుతుందని, బహుశా మనం ఆ దృశ్యాన్ని మన కళ్లతోనే చూడగలుగుతామని అన్నారు. మందిరం ఎప్పుడు నిర్మాణమవుతుందో మనం చెప్పలేకపోయినా మనం దానికోసం ఎదురుచూడాలని అన్నారు. దీనిపై సెక్యులర్‌ వాదులు ఘాటుగానే స్పందించారు. అసలే దేశంలో అసహన పరిస్థితులు నెలకొనగా ఇప్పుడీ వ్యాఖ్యలేంటంటూ మండిపడ్డారు. భగవత్ వ్యాఖ్యలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో పెద్దలు నిరసనలు కూడా చేశారు. అయితే తాజాగా మోహన్‌ భగవత్‌కు మద్దతు పలుకుతూ శివసేన రంగంలోకి దిగి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
డేట్ ప్రకటించాలని మోహన్‌ భగవత్‌ కు శివసేన డిమాండ్
అయోధ్యలో మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో డేట్ ప్రకటించాలని శివసేన మోహన్‌ భగవత్‌ను డిమాండ్ చేసింది. మందిరం విషయంలో మోహన్ భగవత్ తీసుకున్న నిర్ణయానికి తాము పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని శివసేన తెలిపింది. ఆయన తేదీని కూడా ప్రకటిస్తే మహబాగా ఉంటుందని ఆ పార్టీ తన అధికార పత్రిక సామ్నాలో తెలిపింది. పైగా మోడీని కూడా ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నాయని మందిరం నిర్మిస్తే ఆయనకు మరింత ప్రజాకర్షణ పెరుగుతుందని శివసేన తెలిపింది.
ఇప్పుడు నిర్మించకుంటే మరెప్పుడూ నిర్మించలేరు : శివసేన సామ్నా
రామ మందిరాన్ని ఇప్పుడు నిర్మించకుంటే మరెప్పుడూ నిర్మించలేరనీ శివసేన సామ్నా ద్వారా కామెంట్ చేసింది. మరి ఈ విషయంలో మోడీ పెదవి విప్పుతారో లేదో చూడాలి. మొత్తమ్మీద అయోధ్య అంశాన్ని తీవ్రతరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ వరుస కామెంట్లు నిరూపిస్తున్నాయి.

 

16:16 - October 4, 2015

విజయవాడ : రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ కార్యాలయంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ తిరునావక్కరసు హాజరయ్యారు. రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని, బీజేపీ ఉద్ధేశ్యపూర్వకంగానే రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని రఘువీరా విమర్శించారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి శాసనమని, ఆయన వ్యాఖ్యలు ఖండించకపోవడం బట్టి చూస్తే రిజర్వేషన్ లను వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

Don't Miss

Subscribe to RSS - మోహన్ భగవత్