యూటర్న్

09:30 - June 24, 2017

ముంబై : సీనియర్ నటి శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటే చూడాలనుందని చేసిన వ్యాఖ్యల చర్చలకు దారి తీశాయి. కూతురు భవిష్యత్ అభివృద్ధి కోరుకోకుండా సాధారణ తల్లిగా ఉండాలని భావిస్తున్నారంటూ శ్రీదేవి పై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె తన వ్యాఖ్యల పై యూటర్న్ తీసుకుంది. తన పై వచ్చిన విమర్శల శ్రీదేవి స్పందించారు. జాన్వీ కపూర్ గురించి తను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని, తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. మహిళలకు పెళ్లే జీవిత పరమార్థం చెప్పినట్లు ప్రచారం చేయడం నన్ను బాధిస్తోందని ఆమె తెలిపారు. తన కూతుళ్లు వారి కాళ్ల పై నిలబడితే చూసి ఆనందించాలని ఉందని, ఎందుకంటే మహిళలు వారికంటూ స్వంత గుర్తింపు తెచ్చుకోవడం మంచిదని అన్నారు. మీరు ఎంచుకున్న కెరీర్ లో నిలదొక్కులకోవాలని తన కూతుళ్లుకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లకు తరుచుగా చెబుతుంటానని శ్రీదేవి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్లు గడిచినా మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే వారికి భద్రత కరువు అయిందని శ్రీదేవి తెలిపారు. 

18:58 - May 19, 2017

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడతారా? పార్టీ అధినేత గతంలో చెప్పినట్టుగా రాజీనామాస్త్రం ప్రయోగిస్తారా? తాజాగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ ఎంపీలు.. రాజీనామాపై వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్‌ యూ టర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటనే అంశంపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

ఆసక్తికరంగా మారిన రాజీనామా అస్త్రం

నవ్యాంధ్ర ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు.. రాజీనామా అంశంపై ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. హోదాపై కేంద్రప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో.. వైసీపీ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. అంతిమ అస్త్రంగా రాజీనామాస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమయ్యింది.

రాజీనామాల కోసం ఎంపీలను ప్రిపేర్‌ చేసిన జగన్‌

వచ్చే పార్లమెంట్ సమావేశాల తర్వాత రాజీనామా చేసేందుకు రెడీ కావాలని.. ఎంపీలను జగన్‌ ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ వ్యూహాలను మార్చినట్టుగా తెలుస్తోంది. అంతిమ అస్త్రంగా ఎంపీలతో రాజీనామాల అస్త్రం ప్రయోగించాలి అనుకున్న జగన్.. ఈ అంశంపై పూర్తిగా వెనక్కి తగ్గారు. హోదాపై తమ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో పోరాడేది ఎవరు అని జగన్ అంటున్నారు.

ప్రధాని మోదీని కలిసిన జగన్

గతంలో అరు నూరయినా ఎంపీలతో రాజీనామా చేయించి.. కేంద్రప్రభుత్వంపై పోరాడతామన్న జగన్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కొత్త ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్‌ ప్రధాని మోదీని కలిసిన తరువాత ఇద్దరి మధ్య.. రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. హోదాపై కేంద్రానికి ఉన్న అభ్యంతరాలు జగన్‌కు ప్రధాని వివరించారు. జగన్‌కు సంబంధించిన ఇతర వ్యక్తిగత అంశాలపై ఏనాడు లేని విధంగా పీఎం ప్రాధాన్యత ఇవ్వడంతో.. జగన్ వైఖరిలో మార్పు వచ్చినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద రాజీనామాల పై రూట్ మార్చిన జగన్‌ వ్యూహం.. ఏ విధంగా మలుపు తిరుగుతోందనే అంశం ఆసక్తికరంగా మారింది. 

Don't Miss

Subscribe to RSS - యూటర్న్