రంగస్థలం

12:18 - May 24, 2018

తెలుగు సినిమా రేంజ్ పెరిగింది . ఎమోషన్స్ తో స్టోరీ లు తెరకెక్కించి కోట్లు కలెక్ట్ చేస్తుంది. బాగున్నా సినిమాలకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది . రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి..ఇక్కడే కాదు అటు అబ్రాడ్ లో కూడా కలక్షన్స్ కురిపిస్తున్నాయి..

మన తెలుగు సినిమాల్లో చేంజెస్ వచ్చాయి రెగ్యులర్ మాస్ మసాలా ఊర రోడ్డ కొట్టుడు సినిమాలు కొట్టుకుపోతున్నాయి. డిఫెరెంట్ సినిమాలు కొత్త డైరెక్టర్స్ కొత్త థాట్స్ తో సినిమాలు వచ్చి హిట్ టాక్ ని తెచ్చుకుంటున్నాయి .మహానటి.. ఈ బిరుదుకు అర్హత ఉన్న ఒకే ఒక నటీమని సావిత్రి అని చాటి చెప్పేలా... ఓ సినిమా టీమ్ అంతా కలిసి కన్న ఓ కల, చేసిన ఓ నిజాయితీ గల ప్రయత్నం తెర మీదకు వచ్చింది.. ఆ సినమానే మహానటి. తాజాగా ‘మహానటి’ సినిమా యు ఎస్ మార్కెట్ లో 2 మిలియన్ మార్కును దాటి దూసుకెళ్తోంది అట .

రెగ్యులర్ సినిమాలు చేస్తున్న రోజుల్లో హీరో రాంచరణ్ తేజ్ కి ఇంత క్రేజ్ రాలేదు ఎప్పుడైతే డిఫెరెంట్ సినిమాలు చెయ్యడం స్టార్ట్ చేసాడో సూపర్ హిట్ సినిమా రంగస్థలం తో గట్టిగ బాక్స్ ఆఫీస్ ని కొట్టాడు అలానే కలక్షన్స్ కూడా ఇప్పటికి తగ్గకుండా నాన్ బాహుబలి రికార్డు ని సొంతం చేసుకున్నాడు.సమ్మర్ సీజన్లో రిలీజైన ‘రంగస్థలం’ అంచనాల్ని మించిపోయి ఏకంగా యు ఎస్ మార్కెట్ లో 3.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది అట . 

09:33 - May 10, 2018

బెంగళూరు : కర్నాటక రాష్ట్ర ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. రాష్ట్రంలో బాగేపల్లి నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుండి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం రెడ్డి బరిలో నిలిచారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రజల మనిషిగా పేరు గడించిన ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ సందర్భంగా శ్రీరాంరెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఈసారి ఎన్నికలు జరిగే ఎన్నికలను..రాజకీయాలను వ్యాపారంగా మారుస్తున్న వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఎలాంటి విశేషాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:29 - April 8, 2018

'సుకుమార్' దర్శకత్వంలో 'రామ్ చరణ్' నటించిన సినిమా 'రంగస్థలం'. ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇందులో నటించిన చరణ్ తో పాటు ప్రతొక్కరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాంటి వారిలో నటుడు 'శత్రు' చేసిన ఫుల్ లెంగ్త్ రోల్ కూడా ఒకటి. ఈ సందర్భంగా టెన్ టివి 'శత్రు'తో ముచ్చటించింది. ఈ సినిమా సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు..ఇతరత్రా వాటిని తెలియచేశారు. సినిమా మొదట్లో హీరోతో గొడవపెట్టుకునే పాత్ర అతనిది. కానీ ఎన్నికల్లో హీరోకి..అతని అన్నకు సపోర్టు చేసే శత్రు నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. గతంలో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న 'శత్రు' 'బాహుబలి-2’, 'లెజెండ్’, 'ఆగడు’ వంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన తమిళ హీరో 'కార్తీ' చేయనున్న ఓ సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇంకా పూర్తిగా విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:16 - March 31, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌లో హీరో రామ్ చరణ్ సందడి చేసారు. థియేటర్‌లో ప్రేక్షకులతో కలసి రంగస్థలం సినిమాను వీక్షించారు. రామ్ చరణ్‌ను చూసిన అభిమానులు కేరింతలు పెట్టారు. తమ అభిమాన హీరోతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.

19:33 - March 30, 2018

సుకుమార్ లాంటి విలక్షణ డైరెక్టర్ ..రామ్ చరణ్ లాంటి మాస్ హీరోతో రంగస్తలం అనే క్లాసీ టైటిల్ ఎనౌన్స్ చెయ్యగానే అంతా ఆశ్చర్యపోయారు.ఇక మొదటి టీజర్ నుంచి  లాస్ట్ సాంగ్ వరకూ అన్నీ ఆడియన్స్ ఊహలకు మించి ఉండడంతో అంచనాలు తారా స్తాయికి చేరాయి. అలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకొచ్చింది రంగస్తలం. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిందా..? లేక మిస్ ఫైర్ అయ్యిందా అన్నది ఇప్పుడు చూద్దాం. 
కథ..
సినిమా కథ విషయానికొస్తే..రంగస్తలం అనే ఊరిలో 30 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా ఉంటూ,,,అక్రమాలు, అన్యాయాలు చేస్తూ..అమాయక ప్రజలను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఎదురులేని వ్యక్తిగా చలామణి అవుతాడు ఫణీంద్రభూపతి. అతని మీద ప్రెసిడెంట్ గా పోటీ చేద్దామనుకున్నవాళ్లను దారుణంగా చంపేస్తాడు.  అయితే అదే ఊర్లో ఈ అక్రమాలను చూసిన చిట్టిబాబు అన్న కుమార్ బాబు..ప్రెసిడెంట్ పదవి కోసం నామినేషన్ వేస్తాడు.చిట్టిబాబు సాయంతో కుమార్ బాబు ఎన్నికలకు రెడీ అవుతాడు. కానీ  కుమార్ బాబును కూడా కొంతమంది హత్య చేస్తారు. ఇంతకీ కుమార్ బాబును చంపిందెవరు..? ఈమిస్టరీని చిట్టిబాబు ఎలా చేధించాడు..? చివరికి రంగస్తలానికి  కొత్త ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికయ్యారు వంటి ఆసక్తికర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు..
నటీనటుల విషయానికొస్తే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రంగస్తలం మెమరబుల్ గిఫ్ట్ గా మిగిలిపోయే సినిమా.  ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ జీవించాడనే చెప్పాలి.  చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. నటనలో ఈజ్, చిట్టిబాబు క్యారెక్టర్ని చరణ్ ఓన్ చేసుకున్న విధానం , సూపర్బ్ అనిచెప్పొచ్చు.  చిట్టిబాబు క్యారెక్టర్ ద్వారా రంగస్తలానికి ప్రాణం పోసిన చరణ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. ఇక రామలక్ష్మి పాత్రలో కనిపించిన సమంత.. పల్లెటూరి అమ్మాయి పాత్రలో  ఒదిగిపోయింది. చరణ్, సమంతల జోడీ మాత్రం బాగా సెట్ అయ్యింది. రంగమ్మత్తగా అనసూయ  ఫుల్ లెన్త్ స్ట్రాంగ్ రోల్ దక్కింది. అనసూయలోని అసలు నటి ఈ సినిమాలో కనిపించింది.  ఈ మధ్య విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో  మెప్పిస్తున్న ఆది పినిశెట్టి..ఈ సినిమాలో చేసిన కుమార్ బాబు పాత్ర సినిమాకు ప్లస్ అయ్యింది. చరణ్ కు అన్నగా, ఎడ్యుకేటెడ్ సిటిజన్ గా తన నటనతో మెప్పించాడు ఆది పినిశెట్టి. జగపతి బాబు తన విలనిజంతో 80 ల కాలం నాటి పాత ప్రతినాయక పాత్రలను గుర్తుకుతెచ్చాడు.  ఇక జబర్దస్త్ మహేష్ కి త్రూ ఔట్ క్యారెక్టర్ దక్కింది. జిగేల్ రాణి గా పూజా హెగ్డే  పర్ఫామెన్స్ ఓకే అనిపించినా,, మాస్ జనాలకుమాత్రం ఫుల్ గా కిక్కిచ్చేలా ఉంది. ఇక ప్రకాష్ రాజ్ తో సహా.. మిగతా నటీనటులంతా పాత్రల పరిధి మేరకు డీసెంట్ గా పర్ఫామ్ చేశారు.
టెక్నీషియన్స్..    
టెక్నీషియన్స్ విషయానికొస్తే..తన డీటెయిలింగ్ తో  పాత్రల డిజైనింగ్ తో , రియలిస్టిక్ అప్రోచ్ తో ..హీరోలకు ఫేవరెట్ డైరెక్టర్ గా మారిన సుకుమార్ ..ఈ సినిమా బ్యాక్ డ్రాప్ తోనే అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే పాత్రలు క్రియేట్ చేసి ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ తో  ఆడియన్స్ ని మెప్పించాడు. కాకాపోతే..సినిమా లెన్త్ మరీ ఎక్కువగా ఉండడంతో ఓవర్ డీటెయిలింగ్, సెకండాఫ్ లాగింగ్ సీన్స్, డ్రమటిక్ క్లైమాక్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిన రంగస్తలానికి స్పీడ్ బ్రేకర్స్ వేశాడు. 1980 నాటి సెటప్ ను రీ క్రియేట్ చెయ్యడంలో మాత్రం ఆర్ట్ డైరెక్టర్ అండ్ సుకుమార్ ల కృషిని మెచ్చుకుని తీరాల్సిందే. ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. ఫస్ట్ సింగిల్ నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు బిగ్గెస్ట్ సపోర్ట్ గా నిలిచాడు. పాటలతో ఆల్రెడీ జనాలను శాటిస్ఫై చేసిన దేవీ,, ఆర్,ఆర్ లో సైతం అదేరేంజ్ అఫర్ట్ పెట్టాడు.  ఇక కెమెరా మెన్ రత్నవేల్  ప్రతిభ, అంకితబావం ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. చిన్న చిన్న ఎమోషన్స ని కూడా అద్భుతంగా కాప్చర్ చేశాడు. ఎమోషన్స్ అన్నింటినీ పర్ ఫెక్ట్ గా ఎలివేట్ చెయ్యడంలో తన 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాడు. ఇక ఫైట్ మాస్టర్ రామ్, లక్ష్మణ్ లుకూడా ఎక్కడా ఓవర్ స్టెప్పింగ్ లేకుండా రియలిస్టిక్ ఫైట్స్ తో సినిమాకు ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చారు. ఎడిటర్ నవీన్ నూలి.. సినిమా నిడివి తగ్గించడానికి ఇంకాస్త్ ఫ్రీ హ్యాండ్ తీసుకుని ఉంటే బావుండేది. మిగతా టెక్నీషియన్స్ అందరూ..సుకుమార్ విజన్ లో రంగస్థలం రక్తి కట్టడానికి తమవంతు పని పర్ ఫెక్ట్ గా చేశారు. 
ఓవరాల్ గా...
ఓవరాల్ గా చెప్పాలంటే..ఒక మాసీ విలేజ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన రంగస్తలం..విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ..చాలా మంచి అనుభూతిని తిరిగి గుర్తు చేస్తుంది.  ఇంకో పక్క  క్లాస్ ఆడియన్స్..డిఫరెంట్ అటెంప్ట్ గా మాస్ ఆడియన్స్ కి చాలా చేరువగా.. రెండు విధాలుగా మెప్పించే విధంగా  రంగస్తలం ఉంది. కాకపోతే ఈసినిమా లెన్త్... రంగస్తలం సక్సెస్ రేషియోని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా మారడం  గమనించాల్సిన విషయం. బాక్సాఫీస్ పరంగా  టాలీవుడ్  కి కొత్త లెక్కలు  పరిచయం చేసే రేంజ్ లో రంగస్తలం ఉందనేది ఒప్పుకోవాల్సిన విషయం.
ప్లస్
రామ్ చరణ్ పర్ఫామెన్స్
1980 బ్యాక్ డ్రాప్
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
ఆర్ట్ వర్క్
మైనస్
సినిమా నిడివి
సెకండాఫ్ లాగ్స్

రేటింగ్.. 3.25

09:04 - March 30, 2018

హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుట్ లో సెన్సేషనల్ రంగస్థలం సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే ట్రైలర్ తో, పాటలతో ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న రంగస్థలంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 5 గంటల నుండి బెనిఫిట్ షోలను ప్రదర్శిస్తున్నారు. దీంతో థియేటర్ల వద్ద మెగా అభిమానులు సందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం నుండి వెలువడిన ఈసినిమాలో హీరో హీరోయిన్లుగా మెగా వారసుడు రామ్ చరణ్, సమంతా నటించగా..కీలకపాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు,ఆదిపినిశెట్టి, ప్రకాశ్ రాజ్ లు నటించారు. 

19:58 - March 27, 2018

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ రామ్ చరణ్ గిఫ్ట్స్ అందుకోవాల్సింది పోయి తనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రజెంట్ టాలీవుడ్  సెన్సేషన్ సుకుమార్ రంగస్థలం సినిమాకు రైటర్స్ గా పనిచేసిన  శ్రీనివాస్, కాశీ,బుచ్చిబాబులకు ఓ పెద్ద అమౌంట్ గిఫ్ట్ ఇచ్చాడట. సుకుమార్ స్ట్రెంథ్ ఈ ముగ్గురు రైటర్సే అని రీసెంట్ గా చెర్రీ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో..సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా వున్న మెగా పవర్ స్టార్..తన హ్యాపీ నెస్ ను ఇలా షేర్ చేసుకున్నాడు.  

10:50 - March 2, 2018

ఇంటలిజెంట్ దర్శకుడు సుకుమార్, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కాంబినెషన్ లో వస్తున్న మూవీ రంగస్థలం. అసలు రంగస్థలం అనే ఊరు ఉందా అంటే లేదని సమాధానం ఇవ్వాలి అంటే ఈ సినిమా 90 శాతం షూటింగ్ సెట్స్ లో చేసినవే.మిగతా 10 శాతం ఏపీలో తీశారు. సినిమా 90 శాతం సెట్స్ లో అంటే సెట్స్ వేయడానికి భారీగా ఖర్చుఅయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో రోజుకు రోజుకు అంచనాలు పెరిగిపపోతున్నాయి. దానికి కారణం రిసెంట్ రిలీజైన ఎంత సక్కగున్నావే పాట. ఈ పాటతో ఈ మూవీపై క్రేజ్ మరింత పెరిగింది. రంగస్థలం మూవీని ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉంది.

16:42 - February 26, 2018

రామ్ చరణ్, సమంత కలసి నటిస్తున్న సినిమా రంగస్థలం. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1980ల్లో ప్రేమ కథ ఎలా ఉంటుందో అలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అయితే ఈ మధ్య ఆ చిత్రం యూనిట్ ప్రేమికుల రోజు సందర్భాంగా ఎంత సక్కగున్నవే లచ్చిమి అనే పాటను విడుదల చేశారు. ఆ పాట ప్రస్తుతం నెట్ వైరల్ గా మారింది. ప్రతి పది మొబైల్స్ లో ప్రతి మూడింటికి ఈ పాట రింగ్ టోన్ గా ఉంది. మొత్తం 2లక్షల లైక్స్ తో కోటి పైగా వ్యూస్ తో ఈ పాట దూసుకుపోతుంది. ఇక రంగస్థలం సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చ్ 30న రిలీజ్ కాబోతోంది.

11:21 - December 29, 2017

ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ హీరో చుట్టూ స్టార్ డైరెక్టర్లు కూడా క్యూ కట్టేస్తారు. అది కూడా ఓ స్టార్ వారసుడైతే ఇంక ఆ హైపే వేరు.. ఇటీవల ఓ మంచి హిట్ తో ఆకట్టుకున్న ఓ స్టార్ వారసుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో అఖిల్, తొలి సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఎలర్ట్ అయిన అక్కినేని ఫ్యామిలీ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కింగ్ నాగార్జున దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు. విక్రమ్ కె కుమార్ దర‍్శకత‍్వంలో తెరకెక్కిన అఖిల్ రెండో సినిమా 'హలో'కు మంచి టాక్ రావటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది.

తాజాగా అఖిల్ నెక్ట్స్ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అక్కినేని ఫ్యామిలీ త్వరలో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు. అఖిల్ తదుపరి చిత్రానికి బోయపాటి శ్రీను లేదా సుకుమార్‌ల దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరు ముందు ఖాళీ అయితే వాళ్లతోనే అఖిల్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. జయ జానకీ నాయక హిట్ తరువాత బోయపాటి శ్రీను ఇంత వరకు తదుపరి చిత్రాన్ని ప్రారంభించలేదు. అయితే రామ్ చరణ్, బాలకృష్ణ లతో బోయపాటి సినిమాపై చర్చలు జరుగుతున్నాయన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. వరుసగా రెండు ప్రయోగాలు చేసిన చరణ్ కూడా బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. దీంతో అఖిల్ తో బోయపాటి సినిమా ఉండే అవకాశాలు తక్కువే.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్న సుకుమార్.. తన తదుపరి చిత్రంపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇతర హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు కూడా లేవు. దీంతో రంగస్థలం తరువాత సుకుమార్ అఖిల్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే రంగస్థలం రిలీజ్ తరువాత సుకుమార్ తో సినిమా చేయటంపై అక్కినేని ఫ్యామిలీ నిర్ణయం తీసుకోనుంది.

Pages

Don't Miss

Subscribe to RSS - రంగస్థలం