రకూల్ ప్రీత్ సింగ్

09:56 - July 21, 2017

టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకపోయిన హీరోయిన్లు..వీరు..’కాజల్'..’రకూల్ ప్రీత్ సింగ్'...కాజల్ అగ్ర హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతుండగా 'రకూల్ ప్రీత్ సింగ్' కూడా వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటూ బిజీ బిజీగా మారిపోతోంది. టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో ఆడిపాడిన 'రకూల్' పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.

ఈ ముద్దుగుమ్మలిద్దరూ లండన్ లో కలిశారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ‘రకూల్ ప్రీత్ సింగ్' ‘అయారీ' సినిమాలో నటిస్తోంది. షూటింగ్ నిమిత్తం 'రకూల్' లండన్ కు చేరుకుంది. అయితే ఈ సమయంలో అక్కడనే ఉన్న 'కాజల్' ను 'రకూల్' కలుసుకున్నారు. విదేశాల్లో ఇలా కలిసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో.. అంటూ 'కాజల్‌'తో దిగిన ఫొటోను 'రకుల్‌' పోస్ట్‌ చేశారు. 'చాలా అద్భుతంగా సమయాన్ని గడిపాం' అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ప్రస్తుతం రకూల్ ప్రీత్ సింగ్ పలు సినిమాల్లో నటిస్తోంది. మురుగదాస్ 'స్పైడర్' లో మహేష్ బాబుకు జతగా 'రకూల్' నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్‌ పూర్తయినట్లు తెలుస్తోంది.

15:16 - July 20, 2017

పంజాబీ బ్యూటీ 'రకూల్ ప్రీత్ సింగ్' జోరు కొనసాగుతోంది. గత ఎడాది వరుస విజయాలతో జోరు చూపించిన ఈ బ్యూటీ 2017లో వరుస ఆఫర్లు దక్కించుకొంటోంది. ప్రస్తుతం ఈ పొడుగు సుందరికి పోటీ ఇచ్చే హీరోయిన్స్ కూడా లేరని చెప్పాలి. గత ఎడాది 'ఎన్టీఆర్' తో నటించిన 'నాన్నకు ప్రేమతో’, 'బన్నీ'తో నటించిన 'సరైనోడు’, 'రామ్ చరణ్' కి జోడిగా చేసిన 'ధృవ' బిగ్ సక్సెస్ లు గా నిలిచాయి. ఇలా హ్యట్రిక్ సక్సెస్ లతో ఈ పంజాబీ బ్యూటీ ఒక్కసారిగా తారపథంలోకి దూసుకుపోయింది.

రకుల్ జోరు మాములుగా లేదు .. ఆమె సక్సెస్ గ్రాఫ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగులో అగ్రహీరోలతో వరుస సినిమాలు చేసేస్తోన్న రకుల్, తమిళంలోను ఆ స్థాయి దూకుడు చూపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'రకూల్' ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళంలో 'విజయ్' సరసన కూడా ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘మురుగదాస్’ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా 'రకూల్' ని తీసుకోవాలని మురుగదాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 'మురుగదాస్' దర్శకత్వంలో 'రకుల్'.. 'స్పైడర్' చేస్తున్న సంగతి తెలిసిందే.

15:02 - July 14, 2017

గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ , బాలీవుడ్ మాత్రమే కాదు..తెలుగు సినిమా చూస్తే గ్రాఫిక్స్ అంటే తెలుస్తుందని బాహ్యా ప్రపంచానికి తెలియచెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. గ్రాఫిక్స్ తో థియేటర్ల వద్దకు ప్రేక్షకులను రప్పించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. విమర్శకుల చేత ఔరా అనిపించుకున్న సందర్భాలున్నాయి. టాలీవుడ్ లో కూడా గ్రాఫిక్స్ లతో పలు సినిమాలు నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు'..మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది. మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. షూటింగ్ మొదలు పెట్టి ఇప్పటికే సంవత్సరం పూర్తయ్యింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు బయటకు రాలేదు. దీనితో ‘మహేష్’ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అనంతరం చిత్ర పోస్టర్..టీజర్ ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయ త్నం చేశారు. తాజాగా 'స్పైడర్' లో గ్రాఫిక్స్ సన్నివేశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకనే చిత్ర రిలీజ్..ఇతరత్రా విషయాల్లో లేట్ అవుతుందని తెలుస్తోంది.

ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ చూస్తే నిజమే అనిపించక మానదు. ఆరు దేశాల్లో గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ చేస్తున్నట్లు టాక్. రెండు పాటల్లో ఒక పాటను ఇటీవలే పూర్తి చేశారని, ఆగస్టు నెలలో మరో పాట షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 27న 'స్పైడర్' రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరీ 'మహేష్' ‘స్పైడర్' లో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

14:02 - July 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సరసన చేయాలని కొంతమంది హీరోయిన్లు ఆశ పడుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే అవకాశం దక్కుతుంటుంది. ‘పవన్' తో ఒక్క సినిమా చేస్తే చాలు అనే వారు కూడా ఉంటుంటారు. టాలీవుడ్ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న నటి 'రకూల్ ప్రీత్ సింగ్'...తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోలతో చేసే అవకాశాలు దక్కించుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', 'అల్లు అర్జున్' తో 'సరైనోడు..’రామ్ చరణ్' తో 'ధృవ'..ప్రస్తుతం 'మహేష్ బాబు'తో 'స్పైడర్' సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తరువాతి చిత్రంలో నటించేందుకు 'రకూల్' ను ఎంపిక చేశారని టాక్. ప్రస్తుతం 'పవన్ కళ్యాణ్'..’త్రివిక్రమ్' కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే మూవీకి 'పవన్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని..ఇందులో 'రకూల్' ను చిత్ర యూనిట్ ఎంపిక చేసిందని తెలుస్తోంది.
తమిళ చిత్రం 'వీరమ్' ని రీమేక్ చేసిన 'పవన్’ 'విజయ్' మూవీని రీమేక్ చేస్తాడని టాలీవుడ్ టాక్. మంచి విజయం సాధించిన 'థేరి' చిత్రాన్ని 'పవన్' తెలుగులోకి తీసుకురానున్నాడని, కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి 'పవన్' సరసన 'రకూల్' నటించనుందా ? లేదా ? అనేది చిత్ర యూనిట్ స్పందిస్తే గాని తెలియరాదు.

11:08 - July 10, 2017

టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ పొందిన హీరోయిన్లలో 'రకూల్ ప్రీత్ సింగ్' ఒకరు. టాలీవుడ్ యంగ్ హీరోల సరసన 'రకూల్' నటించింది. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న ఈ భామ ఇతర భాషల చిత్రాల వైపు దృష్టి సారిస్తోంది. బాలీవుడ్..తమిళ చిత్రాల్లో నటించాలని 'రకూల్' ఉత్సుహకత చూపిస్తున్నట్లు టాక్. ఇప్పటికే తమిళంలో పలు సినిమాల ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 'కార్తీ' హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో 'రకూల్' హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో 'ఖాకీ' పేరిట విడుదల కానుంది. సెప్టెంబర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
2014 'అలా మొదలైంది' రీమెక్ చిత్రంలో నటించిన 'రకూల్' తరువాత నటిస్తున్న చిత్రమిదే. అంతేగాకుండా మరికొన్ని తమిళ సినిమాల ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'రకూల్ ప్రీత్ సింగ్' టాలీవుడ్ ప్రిన్స్ నటించిన 'మహేష్ బాబు' 'స్పైడర్' చిత్రంలో నటిస్తోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు..తమిళ భాషల్లో రూపొందుతోంది. సెప్టెంబర్ లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ వేస్తోంది. ఒకే నెలలో 'రకూల్ ప్రీత్ సింగ్' రెండు సినిమాల ద్వారా తమిళ ప్రేక్షకులను అలరించనుంది. మరి ఆ రెండు చిత్రాలు అలరిస్తాయా ? లేదా ? అనేది చూడాలి.

13:09 - June 19, 2017

టాలీవుడ్ లో తమ తమ చిత్రాలను వెరైటీగా ప్రమోట్ చేస్తూ..ప్రచారం నిర్వహిస్తూ చిత్రాలపై మరింత ఉత్కంఠ రేకేత్తిస్తున్నారు. మొదటగా మోషన్ పిక్చర్ అంటూ..తరువాత మూవీకి సంబంధించిన పలు లుక్స్ విడుదల చేస్తుండడంతో ఆయా చిత్రాలపై క్యూరియాసిటీ పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న 'స్పైడర్' చిత్రాన్ని కూడా అదే బాటలో పయనిస్తోంది. మొదట లుక్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఎలాంటి మాటలు లేకుండానే టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఒకటో తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'మహేష్‌' పుట్టిన రోజు ఆగస్టు తొమ్మిదో తేదీన రెండో టీజర్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అందులో 'మహేష్‌' పలికే డైలాగ్స్ ఉంటున్నట్లు సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'మహేష్ బాబు'.. 'రా'అధికారిగా నటిస్తున్నాడు. ఇతనికి జోడిగా 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది.

08:03 - June 2, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' తాజా సినిమా 'స్పైడర్' కోసం చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా ? అని ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకు దర్శకుడు మురుగదాస్ ఫుల్ స్టాప్ పెట్టాడు. గురువారం ఉదయం 10.30గంటలకు 'స్పైడర్' సోషల్ మాధ్యమాల్లో టీజర్ ను విడుదల చేశారు. 'రోబో స్పైడర్' ను చూడగానే .. ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఆడియన్స్ కి అర్థమైపోయింది. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే వైరల్ అయిపోయింది. 5 గంటల్లోనే ఈ సినిమా టీజర్ వ్యూస్ పరంగా మిలియన్ మార్క్ ను దాటేసింది. శుక్రవారం ఉదయం 40,66,351 మంది వ్యూయార్స్ చూడగా 1,80,806 లైక్స్..15,644 డిస్ లైక్స్ ఉండడం విశేషం. ఈ టీజర్ కి లభిస్తోన్న విశేషమైన స్పందన చూసి ఈ సినిమా టీమ్ తో పాటు, మహేశ్ అభిమానులంతా ఆనందంతో పొంగిపోతున్నారు. మరి చిత్రం ఎలా ఉండనుందో తెలుసుకోవాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.

08:40 - June 1, 2017

టాలీవుడ్ ప్రిన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గడియలు రానే వచ్చేస్తున్నాయి. కొద్ది గంటల్లో 'స్పైడర్' టీజర్ విడుదల కాబోతోంది. ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'మహేష్' పోలీస్ ఇంటిలెజిన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా ఆయన సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తున్నారు. షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులు అయినా చిత్రానికి సంబంధించిన ఏ విషయమూ బయటకు పొక్కనీయడం లేదు. అంతేగాకుండా చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయలేదు. అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురి కావడంతో ఇటీవలే పలు పోస్టర్స్ రిలీజ్ చేశారు. మే 31వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు హఠాన్మరణంతో టీజర్ విడుదలను వాయిదా వేసుకున్నారు. గురువారం ఉదయం 10.30గంటలకు టీజర్ విడుదల కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

10:36 - May 10, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' చిత్రం ఎప్పుడు చూస్తామా ? ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా లుక్స్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. కానీ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాలు మాత్ర బయటకు పొక్కడం లేదు. ఇదిలా ఉంటే 'స్పైడర్' చిత్ర టీజర్ సూపరన్ స్టార్ కృష్ణ బర్త్ డే అయిన మే 31వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన ఆడియో లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా 'మహేష్' కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలతో తెరకెక్కించే మురుగదాస్ ఈ చిత్రంలో ఎలాంటి సామాజిక అంశాన్ని సృశించారో తెలియరాలేదు. ఆగస్టు 11న రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. 

15:11 - May 7, 2017

అక్కినేని నాగార్జున తనయుడు 'నాగ చైతన్య' మెగా ఫ్యామిలీ వారు వెళుతున్న దారిలో వెళుతున్నాడా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే మెగా హీరోలు నటించిన పలు చిత్రాల ఆడియో వేడుకలు నిర్వహించకుండానే యూ ట్యూబ్ లలో రోజుకొకటి..రెండు రోజుల ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'నాగ చైతన్య' నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా పాటలను కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. 'బుగ్గచుక్క పెట్టుకుంది సీతమ్మా. సీతమ్మా!.. కంటి నిండా ఆశలతో మా సీతమ్మ... తాళిబొట్టు చేతబట్టి.. రామయ్యా!.. రారండోయ్ వేడుక చూద్దాం. సీతమ్మను, రామయ్యను ఒకటిగా చేద్దామంటూ'.. .సాగే టైటిల్‌ సాంగ్‌ను శనివారంనాడు ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు.
నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో బేనర్‌లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'సోగ్గాడే చిన్నినాయన' ఫేమ్‌ కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పాటకు సంబంధించిన 30 సెకన్ల టీజర్‌ రిలీజ్‌ చేస్తామని, త్వరలోనే ఇదే పాటకు 90 సెకన్ల వీడియోను విడుదల చేస్తామని నిర్మాత నాగార్జున వెల్లడించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రకూల్ ప్రీత్ సింగ్