రఘువీరా రెడ్డి

16:25 - October 31, 2018

విజయవాడ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బద్ధ శతృవులైన కాంగ్రెస్, టీడీపీ జతకట్టాయి. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, టీడీపీ జతకట్టనున్నాయా? కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ గా భిన్న దృవాలైన ఈ రెండు ప్రధాన పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ? బీజేపీని టార్గెట్ గా కేంద్రం ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న ఇరు పార్టీలు కలుస్తాయా? అనేది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో  ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఈ అంశంపై రఘువీరా మాట్లాడుతు..

Image result for raghuveera rahul gandhi72 శాతం మంది ఆంధ్ర ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా కోరుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పప్పు అంటూ కొందరు విమర్శించిన రాహుల్... ఇప్పుడు నిప్పు అయ్యారని చెప్పారు. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం చెప్పిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు అంశాన్ని హైకమాండే చూసుకుంటుందని... పార్టీ పెద్దల ఆదేశాలను తాము పాటిస్తామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిరంజీవి ప్రచారానికి వస్తారని చెప్పారు. జగన్ పై దాడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని అన్నారు. దాడి ఘటనను టీడీపీ, వైసీపీ, బీజేపీలు రాజకీయాలకు వాడుకుంటున్నాయని చెప్పారు.

 
16:37 - June 13, 2018

విజయవాడ : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారాని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌ చాందీ విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మోదీ అమలు చేయకపోవడాన్ని చాందీ తప్పుపట్టారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా హోదా సాధించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. 

19:16 - March 10, 2018

అనంతపురం : ఏప్రిల్ 5 లోపలే.. అన్ని పార్టీలు కలిసి హోదా కోసం పోరాడాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆ తరువాత ఏ పార్టీ ఏ త్యాగం చేసినా ఉపయోగం లేదన్నారు. 2019లో యూపీఏ అధికారంలోకి రాగానే ఏపీకి.. ప్రత్యేకహోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటన చేశారని.. రఘువీరా అనంతపురం జిల్లా మడకశిరలో తెలిపారు. దేశంలో థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదని... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు రఘువీరా. 

 

11:52 - February 9, 2018

ఢిల్లీ : 'మోడీ అంటే మీకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి' అని టీడీపీ, వైసీపీ నేతలను ఉద్ధేశించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఢిల్లీ ఏపీ భవన్ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా ఏపీ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ, వైసీపీ నేతలు మోడీకి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేకహోదా, ప్యాకేజీ అంశం రాష్ట్ర ఎజెండాగా తయారయిందన్నారు. నిన్న జరిగిన వామపక్షాల బంద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చామని.. మిగిలిన పార్టీలు తోకముడుసుకొని బంద్ లో పాల్గొన్నాయని తెలిపారు. విభజన సందర్భంగా తాము రాజకీయంగా నష్టపోయి... రాష్ట్రానికి న్యాయం చేశామని తెలిపారు. రాష్ట్ర విభజనలో బీజేపీ, టీడీపీలు కూడా భాగమనే అని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు కేంద్రంపై ఒత్తిడి చేయలేవని...తాము చేసే పోరాటంలో కలిసిరావాలని పిలుపునిచ్చారు. 

 

11:10 - February 9, 2018

ఢిల్లీ : రాజ్యాంగానికి విఘాతం జరిగిందని ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ను తృణీకరించారని తెలిపారు. కాబినెట్ నిర్ణయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రజలను నమ్మంచి మోసం చేశారని విమర్శించారు. ఏపీ బంద్ విజయవంతం అయిందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని.. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందన్నారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఏకమవుదామని పిలుపునిచ్చారు. బీజేపీని ఒంటరి చేయాలని.. రాష్ట్రం నుంచి బీజేపీని తరిమికొడదామని చెప్పారు. టీడీపీ, వైసీపీ మోడీకి భయపడవద్దన్నారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని సూచించారు. 

 

06:32 - December 20, 2017

విశాఖపట్టణం : గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు గిఫ్ట్‌ అన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ద్రోణంరాజు సత్యనారాయణ 85వ జయంతోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి.. తమ పార్టీ అధినేత రాహుల్‌ను ఆకాశానికి ఎత్తారు. 

21:59 - December 13, 2016
19:54 - March 18, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు.  న్యూఢిల్లీలో మూడు రోజుల పర్యటన అనంతరం రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎపీ ఎక్స్ ప్రెస్‌లో విజయవాడ చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఏపీసీసీ చీఫ్‌కు విజయవాడలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రంలోని పెద్దలను కలవడం సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. టీడీపీ నేతలు ఏపీ ప్రజలను మోసం చేయడం ఆపాలని హితవు పలికారు.

13:56 - February 26, 2016

హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ లో ఎపికి పూర్తిగా అన్యాయం చేశారని ఎపిసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలో ఆందోళనలు జరుగున్నాయని తెలిపారు. ఈ నిరసనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెగలాంటిదన్నారు.

Don't Miss

Subscribe to RSS - రఘువీరా రెడ్డి