రజనీ

15:43 - May 26, 2017

చెన్నై : రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి కెమెరాల ముందు కనబడాలనే ఆరాటం ఎక్కువని కమల్‌ కామెంట్‌ చేశారు. అంతేకాదు.. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీ ప్రత్యక్షమవుతారని చెప్పాడు. రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నవేళ.... కమల్‌హాసన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. కబాలి రాజకీయాల్లోకి రావడాన్ని కొందరు ఆహ్వానిస్తుండగా.... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే కమల్‌ వ్యాఖ్యల వెనుక పరమార్ధం ఏంటని తమిళులు చర్చల్లో మునిగిపోయారు. కెరీర్‌ ప్రారంభం నుంచీ రజనీకాంత్, కమల్‌హాసన్‌ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. అంతేకాదు.. ఇంతవరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు. అలాంటిది ఉన్నట్టుంది రజనీ రాజకీయ ఆరంగేట్రంపనై కమల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో కమల్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో హాట్‌టాఫిక్‌గా మారాయి.

 

14:48 - May 26, 2017

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తోటి సహా నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా రజనీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఇటీవలే అభిమానులతో వరుసగా నాలుగు రోజుల పాటు భేటీలు జరిపారు. అభిమానులతో కలిసి రజనీ ఫొటోలు కూడా దిగార. దేవుడు ఆదేశిస్తే చూద్దామంటూ రజనీ పేర్కొన్నారు. తాజాగా తోటి నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి కెమెరాల ముందు కనపడాలన్న ఆసక్తి ఎక్కువని ఓ టివి ఛానల్ ఇచ్చిని ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం రేగుతోంది.

 

15:38 - May 22, 2017

చెన్నై : తమిళ పాలిటిక్స్‌లోకి రజనీకాంత్‌ ఎంట్రీ ఇస్తున్నారన్న ఊహాగానాలతో.. చెన్నైలో తమిళ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రజనీ కన్నడికుడని తమిళ సంఘాలు అంటున్నాయి. తలైవాకు వ్యతిరేకంగా తమిళ సంఘాలు ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టాయి. రజనీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కబాలి రాజకీయాల్లోకి రావొద్దంటూ నినదించారు. దీంతో పోలీసులు నిరసన కారులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమిళ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రజనీకాంత్‌ నివాసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

07:59 - May 20, 2017

చెన్నై : చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమంటపంలో అభిమానులతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ భేటి చివరి రోజున కూడా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మంచి నేతలున్నా వ్యవస్థలో మార్పు రావడంలేదని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని... ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుందని రజనీకాంత్‌ చెప్పారు. యుద్ధం ఆరంభమయ్యేనాటికి మనమంతా సిద్ధంగా ఉందామని అభిమానులకు పిలుపునివ్వడం ద్వారా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

పక్కా తమిళుణ్ణే...
తన స్థానికతపై వస్తున్న విమర్శలను రజనీకాంత్‌ తిప్పికొట్టారు. తాను పక్కా తమిళుణ్ణేనని స్పష్టతనిచ్చారు. ఇరవైమూడేళ్లపాటు కర్నాటకలో ఉన్నా, 43 ఏళ్లుగా తమిళనాడులో నివసిస్తున్న విషయాన్ని రజనీకాంత్‌ గుర్తు చేశారు. కర్నాటక నుంచి వచ్చిన తనను తమిళుడిగానే ప్రజలు ఆదరించారని చెప్పారు. తాను ఉంటే మంచిమనసులున్న తమిళనాడులో ఉంటానని, లేకుంటే రుషులు సంచరించే హిమాలయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారాయన. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అభిమానులతో రజనీకాంత్‌ భేటీ అయ్యారు. చెన్నైలో గత ఐదురోజులుగా అభిమానులను కలుసుకున్నారు. తనతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులకు అవకాశం ఇచ్చారు. 

11:27 - May 19, 2017

చెన్నై : నేడు రజనీ అభిమానులతో చివరి సమావేశం నర్వహించనున్నారు. చివరి రోజు భేటీకి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సంద్భరంగా రజనీకాంత్ తమిళనాడు రాజకీయాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మంచి నేతలు ఉన్నా వ్యవస్థలో మార్పు రాలేదని, ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని అన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాక్షించారు. కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నా, తమిళనాడులో 43ఏళ్ల నుంచి ఉంటున్నానని తెలిపారు. కర్ణాటక వాడినైనా తమిళనాడు ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

10:17 - May 18, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా..ఇంతా కాదు. ఆయన దేశ..విదేశాల్లో సైతం ఆయనకు విశేషమైన అభిమానులున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఆయనకు ఎంతో మంది వీరాభిమానులున్నారు. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మాధ్యమాల్ల చక్కర్లు కొడుతున్నాయి. జయలలిత మరణం తరువాత ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'రజనీ' రాజకీయాల్లోకి రావాలని తీవ్ర వత్తిడి వస్తోంది. దీనితో 'రజనీ' కొన్ని సంవత్సరాల తరువాత అభిమానులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ ఫంక్షన్ హాల్ లో అభిమానులతో ఆయన మాట్లాడారు. ‘దేవుడు ఏది శాసిస్తే అదే చేస్తాను' అంటూ ఆయన పేర్కొన్నారు. అభిమానులు నిజాయితీగా ఉండాలని, రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఆదేశిస్తే వస్తానని స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులతో సమావేశమైన సందర్భంలో ఒక పువ్వుపై బాబా గుర్తు ఫొటో ఉండడం గమనార్హం. రజనీ పార్టీ పెడితే ఇదే గుర్తు ఉంటుందా ? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఈనెల 19వ తేదీన రజనీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 'రజనీ' రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ తమిళనాడు శాఖలు కోరుతున్నాయి. అయితే సొంతపార్టీ పెట్టాలని అభిమానులు 'రజనీకాంత్‌'పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

11:53 - December 12, 2016

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో '2.0' చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వీరి కాంబినేషన్ లో 'రోబో' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి~ సీక్వెల్ గా '2.0' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో 'ఏమీ జాక్సన్' కథాననాయికగా కనిపిస్తుండగా బాలీవుడ్ నటుడు 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తున్నారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మాధ్యమాల్లో చిక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదలైన ఈ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ 'చిరంజీవి' నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత 'చిరు' 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటిస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవలు నటించిన చిత్రాలున్నాయి. ‘రానువ వీరన్', ‘మా పిల్లై'లో చిరంజీవి ప్రత్యేక పాత్ర పోషించారు. గతంలో 'మహేష్ బాబు' నటిస్తారని టాక్ వినిపించింది. ‘చిరంజీవి' ప్రత్యేక పాత్ర పోషిస్తారని కోలీవుడ్ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయం గురించి త్వరలోనే విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

09:26 - June 17, 2016

సూపర్ రజనీకాంత్ ఆరోగ్యానికి ఏమైంది ? అమెరికాలో ఎన్ని రోజులు ఉంటారు ? అక్కడ ఎలాంటి చికిత్స చేయించుకుంటున్నారు ? ఇలా అనేక ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. కుటుంబసభ్యులతో అమెరికా వెళ్లిన రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారని..అందుకే కబాలి ఆడియో సాదాసీదగా జరిపించారనే పుకార్లు వినిపించని సంగతి తెలిసిందే. దీనిపై రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. చివరకు కుటుంబసభ్యులు స్పందించారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవదవద్దని, ఆయన బాగానే ఉన్నారని ప్రకటించారు. దీనితో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కబాలి సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన అనంతరం కుటుంబసభ్యులతో రజనీ అమెరికాకు వెళ్లారు. అక్కడి నుండి తిరిగిరాకపోతుండడం..ఆయన అనారోగ్యానికి గురయ్యారంటూ వదంతలు వ్యాపించాయి. దీనితో తమిళ చిత్రసీమ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వదంతులకు పుల్‌స్టాప్‌ పెడుతూ రజనీ కుటుంబీకులు ప్రకటన విడుదల చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, త్వరలోనే స్వదేశానికి తిరిగి వస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

07:51 - March 20, 2016

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా హాలీవుడ్‌ సినిమాలకు సదరు దర్శక, నిర్మాతలు పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఈ సంప్రదాయం అడపాదడపా బాలీవుడ్‌లోనూ కనిపిస్తుంది. తెలుగులో నాట కూడా అత్యవసర పరిస్థితుల్లోనూ చేసిన సందర్భాలున్నాయి. ఈ ఇన్సూరెన్స్ చేయించే ప్రాసెస్‌లోనూ రజనీకాంత్‌ తన సత్తా చాటారు. రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో అత్యంత భారీ వ్యయంతో 'రోబో 2.0' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. అందరూ ఆశ్చర్యపోయేలా 350 కోట్లరూపాయలకు ఈ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ఇన్సూరెన్స్ చేశారు. దక్షిణాదిన ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేసిన సినిమాగా రజనీ సినిమా నిలవడం విశేషం. 

13:07 - February 18, 2016

శివరాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన హర్రర్‌ థ్రిల్లర్‌ 'శివలింగ' ఇటీవల విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో సంచలన విజయం సాధించింది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని తమిళంలో రజనీకాంత్‌, తెలుగులో నాగార్జున రీమేక్‌ చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారని సమాచారం. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'ఆప్తమిత్ర', 'ఆప్తరక్షక', 'దృశ్య' వంటి తదితర చిత్రాలు అఖండ విజయాన్ని సాధించడమే కాకుండా పలు భాషల్లో రీమేక్‌గా తెరకెక్కి అక్కడ కూడా అదే స్థాయిలో విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఆయన గత చిత్రాలు సాధించిన విజయాలతోపాటు తాజా 'శివలింగ' సైతం అదే రీతిలో ప్రేక్షకాదరణ పొందడంతో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు రజనీ, నాగ్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 'కబాలి' చిత్రం షూటింగ్‌లో రజనీ, 'ఊపిరి'చిత్రం షూటింగ్‌ నాగార్జున నటిస్తూ బిజీగా ఉన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రజనీ