రవితేజ

16:58 - November 17, 2017

సినిమా : మాస్ రాజా రవితేజ చాలా కాలం తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో హిట్టు కొట్టారు. ఈ సినిమా విజయం తర్వాత రవితేజ వరుసు సినిమాలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో శ్రీను వైట్లతో ఓ సినిమా చేస్తున్నారని వార్తాలు వచ్చాయి. వీరి సినిమా ప్రొడ్యుస్ చేయాడానికి మైత్రి మూవీస్ ముందుకొచ్చింది. అయితే రవితేజ, శ్రీనువైట్లకు రెమ్యూనేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇస్తామని ప్రపొజల్ పెట్టింది. దాని వారు ఒప్పుకున్నట్టు కూడా తెలిసింది. అయితే ఇందంతా జరిగింది రాజ ది గ్రేట్ సినిమా విడుదల కాకముందు కానీ ఇప్పుడు ఆ ప్రపొజల్ రవితేజ ఒప్పుకోవడం లేదని టాక్. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

13:09 - October 31, 2017

సినిమా : రవితేజ హీరోగా తాజాగా నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ మూవీ మొత్తం రాష్ట్రమంతట 25కోట్ల షేర్ సాధించింది. ఒక్ నైజమ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను వసూలు చేసింది. రవితేజకు నైజంలో ఇంత పెద్ద మొత్తంలో షేర్ రావడం ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. రవితేజ తర్వాతి సినిమా టచ్ చేసి చూడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

17:54 - October 25, 2017

టెన్ టివి సినిమా : పవన్ కళ్యాణ్ తో మల్టీస్టార్ మూవీ చేయడానికి సిద్ధమని ప్రముఖ హీరో రవితేజ హింట్ ఇచ్చారు. బుల్లితెర పై ప్రసారమౌతున్న ఓ షోలో పాల్గొన్న ఆయన ఈ విషయం తెలిపారు. రాజ ది గ్రేట్ ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవి తేజను యాంకర్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోతో మీరు మల్టీస్టార్ సినిమా చేస్తారు అని అడగగా ప్రతి హీరోతో చేస్తానని రవితేజ చెప్పాడు.

ఇప్పటికిప్పుడు ఏ హీరోతో చేలంటే ఎవరితో చేస్తారు అని యాంకర్ మళ్లీ అడిగింది. పవన్ కళ్యాణ్ అని ఒక సెకన్ కూడా అగకుండా రవితేజ సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ షోకు వచ్చిన అడియన్స్ చప్పట్లతో మ్రోగిపోయాయి.

 

08:25 - October 15, 2017

అగ్ర హీరోల చిత్రాలను భారీ మొత్తం చెల్లించి పంపిణీ చేయడంలో 'దిల్' రాజుకు పెట్టింది పేరు. దసరా సీజన్‌లో 'దిల్' రాజు పంపిణి చేసిన చిత్రాల్లో 'జై లవకుశ'..'స్పైడర్'..'మహానుభావుడు' చిత్రాలు ఉన్నాయి. త్వరలో విడుదల కాబోతున్న 'పవన్ కల్యాణ్' చిత్రానికి సంబంధించిన హక్కులను కూడా ఈయనే దక్కించుకున్నట్లు సమాచారం.

'దిల్' రాజు నిర్మాణంలో 'రాజ ది గ్రేట్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా 'దిల్' రాజు మాట్లాడుతూ...తనకు తెలిసి ఇప్పటివరకు ఎవ్వరికీ రాని విధంగా తమకు ఈ ఏడాది మంచి విజయాలు వచ్చాయని అన్నారు. 'శతమానం భవతి', 'ఫిదా', 'డీజే', 'నేను లోకల్'.. ఇలా వరుసగా విజయాలు వచ్చాయని తెలిపారు. తనకు రవితేజతో త‌న‌కు 20 ఏళ్లుగా అనుబంధం ఉంద‌ని పేర్కొన్నారు. తెలుగు సినిమాలో హీరో అంధుడిగా న‌టిస్తే అస‌లు ఆ సినిమా ఆడుతుందా? అని కొంద‌రు అన్నార‌ని తెలిపారు. మొత్తం సినిమాలో 'రవితేజ' అంధుడిగా కనిపిస్తాడని, కళ్లు వస్తాయా ? రావా ? అని చాలా మంది డౌట్ పడ్డారని తెలిపారు. మొదటి నుంచి శుభం కార్డు ప‌డే వ‌ర‌కు 'ర‌వి తేజ' అంధుడిగానే ఉంటాడంటే వారు న‌మ్మ‌లేక‌పోయార‌ని అన్నారు.

10:03 - September 18, 2017

తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మికల్యాణం సినిమాతో తెలుగ తెరకు పరిచయమైన కాజల్ అగార్వల్ మగధీరతో పాపులార్ హీరోయిన్ గా పేరు సంపధించింది. ఆ తర్వాత సినిమాలు బాగానే చేసింది. కానీ ఆ మధ్య కొచ్చెం ఆమెకు ఆవకాశలు తక్కువైయ్యాయి. ఆమె ఈ ఏడాది చాలా జోరు మీద వున్నారు. ఖైదీ నంబర్ 150, వివేకం, చిత్ర నేనే రాజు..నేనే మంత్రి..సినిమాతో మరోసారి రేసులోకి వచ్చారు. ఆమె తమిళ నటుడు అజయ్ తో నటించిన అదిరింది సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం కాజల్ యం.ఎల్.ఎ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కల్యాణ్ రామ్ కథానాయకుడిగా, ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రాబోతోంది. ఇకి కాకుండా కాజల్ క్వీన్ తమిళ్ రీమేక్ లోనూ నటిస్తున్నారు.

ఇది ఇలాఉంటే ఆమెకు మరో చిత్రంలో నటించే అవకాశం వరించినట్లు చిత్ర వర్గాల సమాచారం. రవితేజ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కథానాయక పాత్ర కోసం కాజన్ అగార్వల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాకి కాజల్ ఒప్పుకున్నారో లేదో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది....!

10:20 - August 2, 2017

టాలీవుడ్ లో మాస్ మహారాజగా పేరొందిన 'రవితేజ' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'బెంగాల్ టైగర్' సినిమా అనంతరం ఆయన ఏ సినిమా ఒప్పుకోలేదనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు.

కథలు నచ్చకపోవడం..ఇతరత్రా కారణాలతో 'రవితేజ' కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అనంతరం 'రాజా ది గ్రేట్'..'టచ్ చేసి చూడు' సినిమాలకు మాస్ మహారాజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకుడిగా..దిల్ రాజు నిర్మాతగా 'రాజా ది గ్రేట్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో 'రవితేజ' అంధుడిగా నటించనున్నాడు. 'మెహరీన్' హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ లో చిత్ర షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 12న సినిమాను విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా 'రాజా ది గ్రేట్' సినిమా టీజర్ ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. స్టోరీ లైన్ సస్పెన్సు మైంటైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
చాలా కాలం అనంతరం ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'రవితేజ' 'రాజా ది గ్రేట్' టీజర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. 

14:30 - July 29, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా సెలబ్రెటీలను సిట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాలో కెల్విన్ ముఠా పట్టుబడడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా టాలీవుడ్ కు డ్రగ్స్ లింక్ ఉందని సిట్ భావిస్తూ పలువురు సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, శ్యామ్ కె.నాయుడు, నవదీప్, రవితేజలను విచారించిన సంగతి తెలిసిందే.

శనివారం రవితేజ దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్ శ్రీనివాస రావును సిట్ విచారించింది. ఉదయం నుండి కొనసాగిన ఈ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. విచారణలో డ్రగ్స్ కు సంబంధించిన విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ను శ్రీనివాస రావు తీసుకొచ్చి రవితేజకు ఇచ్చాడని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ అంశాలే కాకుండా ఇతర వాటిపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోమవారం తనీష్..మంగళవారం నందులను సిట్ బృందం విచారణ జరుపనుంది. 

21:19 - July 28, 2017

హైదరాబాద్ : తొమ్మిదో రోజు...తొమ్మిది గంటలు...ప్రముఖ సినీ నటుడు రవితేజను సిట్ విచారించింది...తమ్ముడు భరత్‌కు డ్రగ్స్ సంబంధాలతో మొదలుకుని కెల్విన్‌తో కాంటాక్ట్స్‌పై పూర్తి వివరాలు ఆరా తీశారు..రకరకాల ప్రశ్నలతో రవితేజను కౌంటర్ చేసిన సిట్ అధికారులకు టాలివుడ్‌లో మత్తుపై సమాచారం దొరికినట్లు తెలుస్తోంది...ఒక్కటి కాదు..రెండు కాదు...గుచ్చి గుచ్చి ప్రశ్నలతో సినీనటుడు రవితేజను సిట్ అధికారులు ముచ్చెమటలు పెట్టించినట్లు తెలుస్తోంది...రవితేజ సోదరుడు...ఈ మధ్యనే ప్రమాదంలో మరణించిన భరత్‌ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే..ఆ సమయంలోనే టాలివుడ్‌లో మత్తు సరఫరాపై ఆధారాలు వచ్చాయి...దీనికి తోడు చిత్రసీమలో మత్తు జాడలు కూడా కన్పించాయి...ఆ తర్వాత కంటిన్యూ అవుతున్న డ్రగ్స్‌పై కొనసాగుతున్న శోధనలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన జిషాన్‌ రవితేజ పేరు చెప్పడంతో నోటీసులు అందించారు...తొమ్మిదో రోజున రవితేజను విచారించిన అధికారులు తొమ్మిది గంటలపాటు యక్ష ప్రశ్నలు వేశారు..ఉదయాన్నే పదిన్నరకు నాంపల్లిలోని అబ్కారీ ఆఫీస్‌కు వచ్చిన రవితేజను రాత్రి ఎనిమిది వరకు ప్రశ్నించారు.

కెల్విన్‌ను పరిచయం చేసింది జిషాన్‌...
మీకు డ్రగ్స్‌ సంబంధాలు ఉన్నాయా..?. కెల్విన్‌, జీశాన్‌ మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. కెల్విన్‌తో మీకు పనేంటి...ఏ పరిస్థితుల్లో అతడు పరిచయం అయ్యాడు?. షూటింగ్‌ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. ఇలా ఎన్నో ప్రశ్నలు వేసిన సిట్ బృందం కుటుంబ నేపథ్యం.. వ్యవహారాలు..అన్నదమ్ముల మధ్య సంబంధాలు కూడా తెలుసుకున్నారు..దీంతో రవితేజను కాస్త రిలాక్స్ చేసి ఆ తర్వాత మళ్లీ డ్రగ్స్‌పై సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది...

శనివారం రవితేజ డ్రైవర్ విచారణ..
మ‌రోవైపు ర‌వితేజ‌తో పాటు మ‌రో ఇద్దరు ఫ‌య‌ద్ యూనిస్‌, తౌబీర్ అహ్మద్‌ల‌ను కూడా డ్రగ్స్ కేసులో విచారించినట్లు సిట్ అధికారులు తెలిపారు...వీరిద్దరూ డ్రగ్స్ సరఫరాలో పాత్ర ఉందని తేలినట్లు చెబుతున్నారు...ఇక రవితేజకు ఆయన డ్రైవర్ శ్రీనివాసరాజు ద్వారానే డ్రగ్స్ అందినట్లు సిట్‌ శోధనలో తేలింది..దీంతో రవితేజ డ్రైవర్ రాజును శనివారం విచారించనున్నారు.

20:08 - July 28, 2017

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 9గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. డ్రగ్స్ సరఫరాలో కెల్విన్ పట్టుబడడంతో ఈ డొంక కదిలింది. టాలీవుడ్ కు సంబంధం ఉండడంతో పలువురు సెలబ్రెటీలకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు నటీ, నటులను విచారించింది. శుక్రవారం రవితేజను విచారించింది. బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ ను ఇవ్వడానికి రవితేజ నిరాకరించినట్లు తెలుస్తోంది.
రవితేజ కుటుంబ వ్యవహారాలు..సినీ రంగ ప్రవేశం..సోదరుడి విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సోదరుడు భరత్ కు మత్తు మందుల వాడకం ఎప్పటి నుండి ఉంది ? ఈ విషయం ఫ్యామిలీకి తెలుసా ? తదితర అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా కెల్విన్..జీషన్ ఆలీలతో ఎలాంటి సంబంధాలున్నాయి ? వారు ఏ విధంగా పరిచయం అయ్యారు ? దానిపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎవరెవరు మత్తుమందులు వాడుతారనే దానిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. రవితేజతో పాటు ఫయద్ యూనిస్, తౌబీర్ అహ్మద్ లను విచారించడం జరిగిందని, శనివారం రవితేజ డ్రైవర్ ను విచారిస్తామని సిట్ పేర్కొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:21 - July 28, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో రవితేజ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుండడం విశేషం. 9గంటలకు పైగా విచారణ జరుగుతుండడంతో ఉత్కంఠ రేకేత్తిస్తోంది. భిన్న కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నట్లు, రవితేజ కుటుంబ వ్యవహారాలు..సినీ రంగ ప్రవేశం..సోదరుడి విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సోదరుడు భరత్ కు మత్తు మందుల వాడకం ఎప్పటి నుండి ఉంది ? ఈ విషయం ఫ్యామిలీకి తెలుసా ? తదితర అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా కెల్విన్..జీషన్ ఆలీలతో ఎలాంటి సంబంధాలున్నాయి ? వారు ఏ విధంగా పరిచయం అయ్యారు ? దానిపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎవరెవరు మత్తుమందులు వాడుతారనే దానిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రవితేజతో పాటు ఫయద్ యూనిస్, తౌబీర్ అహ్మద్ లను విచారించడం జరిగిందని, శనివారం రవితేజ డ్రైవర్ ను విచారిస్తామని సిట్ పేర్కొంది.

సినీ రంగం టార్గెట్ కాదు..
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్ర‌గ్స్ కేసుపై శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. పోలీసు, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌ను పార‌ద‌ర్శ‌కంగా, చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ వాడ‌కం, స‌ర‌ఫ‌రా వ్యాప్తి చెంద‌కుండా మొగ్గ‌లోనే తుంచేయాలని సూచించారు. తెలంగాణ లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి కి ప్ర‌వేశం లేకుండా చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, డ్రగ్స్ ఎక్కువగా వాడే రాష్ట్రాల్లో తెలంగాణ లేదన్నారు. డ్రగ్స్ మూలాలను పట్టుకొనే ప్రయత్నంలో ఉన్నామని, సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నామనడం తప్పు అన్నారు. కీలక ఆధారాలు..సూత్రధారుల వివరాలు లభించాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రవితేజ