రాంగోపాల్ వర్మ

12:51 - November 8, 2017

క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తన సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మరోసారి స్టార్ హీరోతో సినిమా ఫిక్స్ చేసాడు. ఒకప్పటి ట్రెండ్ సెట్టింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి రెడీ అవుతుంది అని ఫాన్స్ హోప్స్ తో ఉన్నారట. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు తీసే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. సినిమాలు అనౌన్స్ చేసి ఆసక్తిని రేపే ఈ డైరెక్టర్ ఈ మధ్య కలంలో ఘోరంగా డౌన్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు అనే టాక్ ఉంది. మంచి సినిమాలు తీసిన ఈ ఒకప్పటి డైరెక్టర్ ట్రెండ్ మిస్ అయ్యాడు. ఈ తరం ఆడియన్స్ ని కాచ్ చెయ్యడం లో ఫెయిల్ అయ్యాడు అనే టాక్ కూడా ఉంది. ట్రైలర్స్ మాత్రం రిలీజ్ అవుతున్నయి సినిమాలు మాత్రం రిలీజ్ అవ్వట్లేదు అని ఫిలిం వర్గాలు నవ్వుకుంటున్నాయంట.

రాజు గారి గది సినిమాతో ఎలాంటి పాత్ర అయినా తాను రెడీ అని మరోసారి నిరూపించాడు హీరో నాగార్జున. తన పాత్ర పరిధి మేరకు నటించే మెప్పించే ఈ హీరో ఇప్పుడు రాంగోపాల్ వర్మతో సినిమా చెయ్యబోతున్నాడు. ఒకప్పుడు 'శివ' సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఈ డైరెక్టర్ అండ్ హీరో ఇప్పుడు మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. '1988లో నేను వర్మతో సినిమా చేస్తానని అన్నపుడు అందరూ షాక్ తిన్నారు. ఇప్పుడు చాలామంది సంతోషిస్తున్నారు.. ఇంకా చాలామంది షాక్ తింటున్నారు. లెట్స్ రాక్ వర్మ' అంటూ ఓ పోస్ట్ పెట్టారు నాగ్.

10:33 - October 12, 2017

ఎన్టీఆర్ బయోపిక్..ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చొంది. ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలని ఆయన కుమారుడు 'బాలకృష్ణ' ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ వివాదంలో ఉండే 'రాంగోపాల్ వర్మ' కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్' బయోపిక్ నిర్మించే దర్శకుడి కోసం 'బాలయ్య' వెయిట్ చేశారని తెలుస్తోంది.

తొలుత 'క్రిష్'..లేదా 'తేజ'కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని 'బాలయ్య' యోచించారని టాక్. కానీ 'క్రిష్' మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో 'ఎన్టీఆర్' బయోపిక్ పై దృష్టి పెట్టే టైం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలను తాజాగా 'తేజ' స్వీకరించినట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో టాక్. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

13:42 - October 10, 2017

చిత్తూరు : జిల్లాలో రాంగోపాల్ వర్మ హల్ చల్ చేశారు. ఆయన ఎన్టీఆర్ మూవీ నిర్మాత రాకేశ్ రెడ్డి తో భేటీ అయ్యారు. రాకేశ్ రెడ్డి పలమనేరు వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. వీరి భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:00 - October 10, 2017

 పవన్ రాసిన ఆ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ..ఇజం పుస్తకం కంటే పవనిజమే నచ్చిందని, ప్రస్తుతం సొసైటీకి కావాల్సింది వంద శాతం పవనిజమే నని రాసుకొచ్చాడు డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. పవన్ పార్టీ పెట్టిన మొదలు ఆయన ప్రసంగం వరకు ఇలా అనేక అంశాలను అందులో ప్రస్తావించాడు. మీరు పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు, భావాలను చదివాక నాకు ఒక్కటే అర్థమైందని, పుస్తకంలో ఉన్నదానికంటే ఎక్కువ జ్ఞానం మీలోవుందని గుర్తుచేశాడు. కంక్లూజన్‌లో ‘ఇజం’ పుస్తకం తనను నిరాశపరిచిందని, కానీ తనకు పవనిజంపై నమ్మకం ఉందని వర్మ ఓపెన్ లెటర్ ఒకటి పోస్ట్‌ చేశాడు.

14:53 - August 30, 2017

కొత్త సినిమాలతో హిట్ ట్రాక్ లో నడుస్తుంది టాలీవుడ్. కొత్త టాలెంట్ కొత్త వరదలా వచ్చేస్తూ హిట్స్ కొట్టేస్తుంది. కథల్లో కొత్తదనం, కథనం లో వైవిధ్యం. వీటిని బేస్ చేసుకొని ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు న్యూ ఫిలిం మేకర్స్. మరి ఇలాంటి టైం లో హాట్ హాట్ కామెంట్స్ తో ఆన్లైన్ లోకి వచ్చాడు ఈ డైరెక్టర్. 'విజయ్ దేవరకొండ' 'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ అయింది ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. 'విజయ్ దేవరకొండ' హీరోగా..వంగ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాను ఆకాశానికెత్తేశారు. ఈ సినిమా తెలుగు సినిమా గమనాన్నే మార్చేస్తుందని నమ్మిన ఫిలిం మేకర్ నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రెజెంట్ ఆడియన్స్ తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పు ఇప్పటికే చూస్తున్నారు. ఈ అర్జున్ రెడ్డి సినిమా మరో స్థాయికి తీసుకువెళ్లేది లా ఉంది అని అంటున్నారు ఇండస్ట్రీ పీపుల్.

విలక్షణ దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మ' ప్రతి సెన్సేషన్ లో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 'సర్కార్ 3' తో మళ్లీ ఫ్లాప్ టాక్ తో ఉన్న డైరెక్టర్ 'వర్మ' ఇప్పుడు ఇలా రీసెంట్ సినిమాలపైన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలంగాణలో తప్పకుండా ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పడుతుందని చెప్పేశాడు. ఎందుకంటే తెలంగాణలో కూడా యువ దర్శకులు హీరోలు చాలా వినూత్నంగా సినిమాలు తీస్తూ.. అందరిని ఆకట్టుకుంటున్నారని చెప్పాడు. 'వర్మ' ఈ కామెంట్స్ తో ఎం సందేశం ఇచ్చాడో మరి.

17:16 - July 25, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న 'డ్రగ్స్' కేసుపై మళ్లీ దర్శకుడు 'రాంగోపాల్ వర్మ' మరో పోస్టు చేశారు. ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పై ఇటీవలే 'వర్మ' వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్ బుక్ లో మరో పోస్టు పెట్టారు. హైదరాబాద్ లో జరుగుతున్న తీరుపై దేశ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని, పంజాబ్ కన్నా హైదరాబాద్ ఇంత బ్యాడా అంటూ ముంబై వాసులు తనతో అంటున్నారని పోస్టులో పేర్కొన్నారు. కొంతమందిని టార్గెట్ చేసి విచారణ జరపడం వల్ల తెలంగాణ ప్రతిష్ట మసకబారుతోందని, సిట్ ను సెట్ చేయాలని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిష్ట మసకబారకుండా చూడాల్సిన బాధ్యత చంద్రవదన్, అకున్ సబర్వాల్ పై ఉందన్నారు.

21:34 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణను తప్పుపడుతూ రాంగోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ వివాదాస్పదమయ్యింది. అకున్‌ సబర్వాల్‌ను.. మీడియా బాహుబలి తరహాలో పొగిడేస్తుందని అక్కసు వెల్లగక్కాడు. అకున్‌ సబర్వాల్‌తో రాజమౌళి.. బాహుబలి-3 తీస్తాడేమోనని చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్‌శాఖ తీవ్రంగా స్పందించింది. తమకు సినీ ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదని... డ్రగ్స్‌ను నివారించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే... వర్మపై ఎక్సైజ్‌శాఖ రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఆత్మస్థైరాన్ని దెబ్బతీసున్న వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
డ్రగ్స్ విచారణ తీరుపై వర్మ ఆరోపణలు 
డ్రగ్స్‌ కేసు వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తుండగా... తాజాగా రాంగోపాల్‌వర్మ ట్వీట్లు మరింత వివాదాస్పదమవుతున్నాయి. అకున్‌ సబర్వాల్‌, ఎక్సైజ్‌ అధికారుల విచారణ తీరుపై సోషల్‌ మీడియాలో వర్మ ఆరోపణలు చేశాడు. పూరీ జగన్నాథ్‌, సుబ్బరాజులను విచారించినట్లు డ్రగ్స్‌ తీసుకున్న పిల్లలను కూడా విచారిస్తారా ? అని ఎక్సైజ్‌ అధికారులను ప్రశ్నించాడు. ఎక్సైజ్‌శాఖ సినీ పరిశ్రమను టీజర్‌, ట్రైలర్‌లా వాడుకుని ఉనికి చాటుకుంటుందన్నారు. మీడియాలో వస్తున్న కథనాలకు అకున్‌ సబర్వాల్‌ ఎందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం లేదని ప్రశ్నించారు. సబర్వాల్ మౌనంతో ఇండస్ట్రీలో కొందరి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందన్నారు. అకున్‌ సబర్వాల్‌ను మీడియా అమరేంద్ర బాహుబలి స్థాయిలో చూపిస్తుందన్నారు. అకున్‌ సబర్వాల్‌తో రాజమౌళి బాహుబలి-3 తీస్తాడేమోనని చమత్కరించాడు. అయితే.. ఈ ట్వీట్‌పై మీడియాలో దుమారం చెలరేగగా... గంట తర్వాత వర్మ మరో కామెంట్‌ను పోస్ట్‌ చేశాడు. అకున్‌ సమగ్రతను ఎవరూ తప్పుపట్టడం లేదని వ్యాఖ్యానించాడు. అయితే... సరైన రుజువులు లేకుండా... వారి ప్రతిష్టను దిగజార్చేలా మీడియాకు లీక్స్‌ ఇస్తున్నారన్నారు వర్మ. 
విచారణను నీరుగార్చే ప్రయత్నం చేయవద్దు : చంద్రవదన్ 
ఇక వర్మ కామెంట్స్‌పై ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ స్పందించారు. విచారణను నీరుగార్చే ప్రయత్నం చేయవద్దన్నారు. కొంతమంది ట్వీట్లు చేస్తూ విచారణాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే కేసును మరింత లోతుగా విచారిస్తున్నామన్నారు. కేసు విచారణ పూర్తయ్యేవరకు అందరూ సంయమనం పాటించాలన్నారు. 
వర్మ కామెంట్స్‌పై రిటైర్డ్‌ ఉద్యోగులు మండిపాటు 
ఇదిలావుంటే... వర్మ కామెంట్స్‌పై ఎక్సైజ్‌శాఖ రిటైర్డ్‌ ఉద్యోగులు మండిపడ్డారు. విచారణాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కామెంట్‌ చేసిన వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వర్మపై చర్యలు తీసుకునే వరకు తాము పోరాడుతామన్నారు. 
డ్రగ్స్‌ పాపం కాంగ్రెస్‌దే : నాయిని
ఇక డ్రగ్స్‌ పాపం కాంగ్రెస్‌దే అన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. సమాచారం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్‌... పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారన్నారు. టీఆర్‌ఎస్‌కు నేతలకు డ్రగ్స్‌ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే... డ్రగ్స్‌తో ఎవరికీ లింక్‌లు ఉన్నా చర్యలు తప్పవన్నారు నాయిని. మొత్తానికి వర్మ కామెంట్స్‌ ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అయితే.. వర్మపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తుండడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

 

17:19 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్స్‌పై వివాదం ముదురుతోంది. వర్మ కామెంట్లపై ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం మండిపడుతోంది. ఎక్సైజ్‌శాఖను కించపరిచే విధంగా వర్మ చేసిన కామెంట్లపై ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వర్మ కామెంట్లు విచారణాధికారిని బెదిరించే విధంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇక రాంగోపాల్‌వర్మపై అబిడ్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసే యోచనలో రిటైర్డ్‌ ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:51 - July 4, 2017

ఎప్పుడూ వివాదాల్లో నిలచే 'రాం గోపాల్ వర్మ' ‘ఎన్టీఆర్' జీవిత కథను తెరకెక్కించనున్నారా ? ఆయన దర్శకత్వంలో సినిమా రూపొందనుందా ? ప్రస్తుతం ఈ అంశంపై టాలీవుడ్ లో చర్చ జరగుతోంది. తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై సినిమా తీస్తానని ఆయన తనయుడు 'బాలకృష్ణ' ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్' పాత్ర మాత్రం తానే సులువుగా చేయగలనని కూడా పేర్కొన్నారు. కానీ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేది తెలియరాలేదు. తాజాగా ఈ బయోపిక్ కు 'వర్మ' అయితే పూర్తి న్యాయం చేస్తారని భావించిన బాలయ్య ఆయనతో చర్చలు కూడా జరిపారని ప్రచారం జరుగుతోంది. 'వర్మ' కూడా గ్రీన్‌సిగల్‌ ఇచ్చేశారట. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక 'బాలకృష్ణ' 'పూరీ జగన్నాథ్' దర్శకత్వంలో రూపొందుతోన్న 'పైసా వసూల్‌' చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎన్టీఆర్' బయోపిక్ కు సంబంధించిన విషయాలు త్వరలో తెలియనున్నాయి.

08:41 - June 4, 2017

రాంగోపాల్ వర్మ..ఆయన ఏది చేసినా సంచలనమే. ఫక్తు వివాదాల్లో ఉంటుంటాడు. వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ప్రస్తుతం 'రాంగోపాల్ వర్మ'పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇటీవలే ఆయన తీస్తున్న సినిమాలు పరాజయమవుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఆయన వెబ్ సిరీస్ పై దృష్టి సారించారు. సినిమాల్లో సెన్సార్ కట్స్ వంటివి ఉంటాయని భావించిన 'వర్మ' ఏకంగా యూ ట్యూబ్ లో బూతు నేపథ్యంలో రూపొందిన షార్ట్ ఫిల్మ్స్ ను ప్రసారం చేయడానికి 'వర్మ' సిద్ధమయ్యాడు. ఆయన రూపొందించిన 'గన్స్ అండ్ థైస్' వెబ్ సిరీస్ ట్రైలర్ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ షార్ట్ ఫిలింలో పలు న్యూడ్ సన్నివేశాలున్నాయి. తన సిరీస్ లోనూ సందర్భానుసారం కొన్ని అలాంటి దృశ్యాలు ఉంటాయని, ముంబై మాఫియా గురించి తనకు తెలిసినంతగా ఎవరికి తెలియదని వర్మ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి 'వర్మ' ఈ వెబ్ సిరీస్ పై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో వేచి చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - రాంగోపాల్ వర్మ