రాంచరణ్

21:54 - December 6, 2018

హైదరాబాద్: టాలీవుడ్‌ హీరోలంతా ఎలక్షన్‌ పోలింగ్‌ సెంటర్ల బాట పట్టనున్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినిమాలే కాదు రాజకీయ అవగాహన కూడా ఉందని చాటి చెప్పేందుకు తెలుగు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.
జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో మెగాస్టార్, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో సూపర్‌స్టార్:
తెలుగు సినిమా తారాగణం.. ఓటు వేసేందుకు క్యూ కట్టనుంది. సినిమాలే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉందని నిరూపించనుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో చాలా మంది హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరంతా శుక్రవారం(డిసెంబర్ 7) జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటును వేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లిహిల్స్‌లో ఓటును వేయనున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున, స్టైలిష్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ జూబ్లీహిల్స్‌లోని వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఓటు వేయనున్నారు. వీరితో పాటు చాలా మంది టాలీవుడ్‌ సినీ స్టార్స్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇలా సినీ ప్రముఖులంతా సమజా పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వారికి కేటాయించిన పోలింగ్‌ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని.. అభిమానులకు ఓటు విలువ తెలియచేయనున్నారు.

 

14:31 - October 26, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ఆయన సతీమణి ఉపాసన...సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సినిమాలకు సంబంధించిన విశేషాలు...వారి కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వాటిపై పోస్టు చేస్తుంటారు. తాజాగా ఉపాసన ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోను చూసిన చెర్రీ అభిమానులు సంతోష పడుతున్నారు. 
ఆ ఫొటోలో ఉపాసన వెయిట్ తగ్గి కనిపిస్తోంది. 2012లో అపోలో హాస్పటిల్స్ అధినేత వారసురాలు అయిన కామినేని ఉపాసనకు...రామ్‌చరణ్‌కు పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉపాసన చాలా లావుగా ఉందనే విమర్శలు వచ్చాయి. 
గత కొన్ని రోజులుగా ఉపాసన ‘మిసెస్ సీ’... జిమ్‌లో వ్యాయామాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలను కూడా పోస్టు చేసింది. ‘అదే శారీ... అదే నేను... ఎప్పుడు ఆనందమే, పాజిటివ్! కేవలం 14 కిలోలు తగ్గారు. శరీరం, మనసు, ఆత్మ! ’ అంటూ ఉపాసన పోస్ట్ చేసిన ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

15:11 - September 23, 2017

తన మొదటి సినిమా నుండి కష్టపడుతూ యాక్టింగ్ ని లుక్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ మెగా హీరో. సినిమాల్లో వైవిధ్యం చూపిస్తూ డిఫెరెంట్ కథలతో వస్తున్న ఈ హీరో అటు ప్రొడ్యూసర్ గా కూడా హిట్ కొట్టేసాడు. తాను చేస్తున్న రీసెంట్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ లో ఉన్నాడు. మెగా హీరోల్లో సినిమా హిట్ ట్రాక్ లో పెట్టి మెగా టైటిల్ కి న్యాయం చేస్తున్న ఈ మెగా యంగ్ హీరో 'రాంచరణ్'. 'ధ్రువ' సినిమా 'రామ్ చరణ్' ని మార్చేసింది అని చెప్పాలి. 'రామ్ చరణ్' లుక్ తో పాటు యాక్టింగ్ లో కూడా డిఫెరెంట్ చూపిస్తూ తన కెరీర్ ని పక్క ప్లానింగ్ లో పెట్టుకున్నాడు. తనలో యాక్టింగ్ స్కిల్స్ ని చూపించే మంచి అవకాశాన్ని 'ధ్రువ' సినిమా ద్వారా యూస్ చేసుకున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'తనీ ఒరువన్' సినిమాని తెలుగు లో 'ధ్రువ' పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

'ధ్రువ' సినిమాలో 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు ఆ తరువాత ఆయన చెయ్యబోయే సినిమాలమీద ఇంటరెస్ట్ కూడా చూపిస్తున్నారు. రామ్ చరణ్ - సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'రంగస్థలం 1985'. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఏడెనిమిది నెలలవుతోంది. ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. దసరా కానుకగా 'రంగస్థలం' తొలి చూపును పరిచయం చేస్తారట. ఇందులో సుకుమార్ మార్కు ఉంటుందని.. కచ్చితంగా మెగా అభిమానుల్ని ఈ లుక్ అలరిస్తుందని అంటున్నారు.

13:00 - August 22, 2017

హైదరాబాద్: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 151 సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ 'సై రా' అని పెట్టారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. సై రా.. మెగా లుక్ వచ్చేసింది..! ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవివర్మన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, సీనియర్ హీరో జగపతి బాబు, సాండల్ వుడ్ స్టార్ సుధీప్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

14:41 - June 9, 2017

ప్రముఖ దర్శకుడు సుకుమార్, నటుడు రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా కొనసాగుతోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. దీనితో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ శాతం షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో 'చెర్రీ'కి జోడిగా 'సమంత' నటిస్తోంది. ఈ సినిమాకు 'రేపల్లే' అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. దీనితో పాటు నాలుగు టైటిల్స్ అనుకున్నట్లు..ఒక టైటిల్ ను ఫిక్స్ చేయాలని ఈ మధ్యే రామ్ చరణ్ తన అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ఓ టైటిల్ ను ఫిక్స్ చేశారు. 'రంగస్థలం 1985' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథ 1985 నేపథ్యంలో ఉంటుంది కనుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కనుక .. 'సంక్రాంతి' కి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. 

12:08 - January 17, 2017

అనుకున్నట్లుగానే మల్లు బేబి 'అనుపమ పరమేశ్వరన్' బిగ్ ఛాన్స్ అందుకుంది. రెండే రెండు చిన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ లేటేస్ట్ గా క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చాన్స్ పట్టేసింది. తెలుగులో 'అనుపమ పరమేశ్వరన్' హవా సాగేలా కనిపిస్తోంది. 'అ ఆ' సినిమాలో చేసింది చిన్న పాత్రే అయిన ఈ కేరళ బ్యూటీ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ వెంటనే 'నాగచైతన్య' తో ప్రేమమ్ రీమేక్ లో నటించి తెలుగు యూత్ కి మరింత దగ్గరైంది. ఇక 'శర్వానంద్' తో నటించిన 'శతమానం భవతి' మూవీ సంక్రాంతికి రిలీజైంది. అయితే లేటేస్ట్ గా బ్యూటీ భారీ అవకాశం అందిపుచ్చుకున్నట్లు సమాచారం. 'అనుపమ పరమేశ్వరన్' 'రామ్ చరణ్' తో జోడికట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దర్శకుడు సుకుమార్, చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా ఈ కేరళ బ్యూటీని ఎంపిక చేశారు. కొన్ని రోజులుగా ఈ మూవీలో 'అనుపమ'నే హీరోయిన్ గా తీసుకుంటారనే వార్తాలు షికారు చేశాయి. అయితే ఫైనల్ గా సుక్కు, చెర్రీ ఈ బ్యూటీ వైపే మొగ్గు చూపారు. 'చెర్రీ'తో జోడి కట్టుతున్న మాట వాస్తవమేనని 'అనుపమ పరమేశ్వరన్' ట్వీట్ తో మరీ తన సంతోషాన్ని తెలుపడం విశేషం. చూస్తుంటే తెలుగులో నెమ్మదిగా 'అనుపమ పరమేశ్వరన్' గా గాలి వీచేలా కనిపిస్తోంది. 'చెర్రీ' సినిమాతో పాటు ఈ బ్యూటీ బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తోంది. అదే విధంగా మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్లు సమాచారం. చరణ్, ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీస్ కనుక హిట్టు అయితే అనుపమ స్టార్ హీరోయిన్స్ లీగ్ లోకి ఎంటర్ అయినట్లే. 

15:55 - November 10, 2016

రాంచరణ్ తేజ తాజా చిత్రం 'ధృవ' ఆడియో పాటలు మార్కెట్ లో విడుదలయ్యాయి. అట్టహాసంగా ఆడియో కార్యక్రమం జరుగుతుందని ఆశించిన మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయినట్లు తెలుస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'తని ఒరువన్‌' చిత్రాన్ని తెలుగులోకి 'ధృవ' పేరుతో 'రామ్‌చరణ్‌' హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 'రాంచరణ్‌' ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం 'చెర్రీ' తన బాడీ ఫిట్‌నెస్‌ దగ్గర్నుంచీ, ఆహారపు అలవాట్ల వరకూ ఎన్నో మార్పులు చేసుకున్నాడని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇతర మెగా హీరోలు హాజరవుతారనే ప్రచారం జరిగింది. కానీ 'ధృవ' ఆడియోను బుధవారం అర్ధరాత్రి డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేశారు. డిసెంబర్ 2న 'ధృవ' చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

14:00 - November 8, 2016

సోషల్ మాధ్యమాల్లో ఈ అంశంపై తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. 'పవన్ కళ్యాణ్' 'ధృవ' ఆడియోకు వెళుతారా ? వెళ్లరా ? అనే దానిపై తెగ చర్చ జరుగుతోందంట. ఇటీవలే ఓ కమెడియన్ చిత్ర ఆడియోకు 'పవన్' హాజరైన సంగతి తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 'ధృవ' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో 'చెర్రీ' పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఆడియోకు 'పవన్ కళ్యాణ్' హాజరవుతారా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. కమెడియన్ 'సప్తగిరి' నటించిన చిత్ర ఆడియోకు 'పవన్' హాజరైన సంగతి తెలిసిందే. 'ధృవ' ఆడియోకు మెగా హీరోలు కూడా అటెండ్ కానున్నారని తెలుస్తోంది. మరి 'పవన్ హాజరవుతారా ? లేదా ? అనేది రేపటికి తెలియనుంది. 

15:58 - August 15, 2016

మెగాస్టార్ తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'ధృవ' చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. పంద్రాగస్టు రోజున ఈ మొదటి లుక్ ను విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన‌ట్టు చిత్ర వ‌ర్గాలు తెలిపాయి. చెర్రీ తన ఫేస్ భుక్ ఖాతా ద్వారా ఫస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
'తుఫాన్‌' తర్వాత రామ్‌ చరణ్‌ 'ధృవ' చిత్రంలో పోలీస్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో యువ హీరో నవదీప్ కూడా ఓ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం చరణ్‌ శాఖాహారిగా మారి కఠినమైన డైట్‌ పాటిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక విదేశీ ట్రైనర్ల సహకారంతో ఫిట్‌నెస్‌ కసరత్తులు కూడా చేశారు. తమిళంలో గతేడాది విడుదలై భారీ హిట్‌ సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దసరాకి 'ధృవ' చిత్రాన్ని తీసుకరావాలని చిత్ర యూనిట్ ప్రయత్నాల్లో ఉంది. 

16:13 - June 23, 2016

మెగాస్టార్ చిరంజీవి చాన్నాళ్లకు మేకప్ వేసుకున్నారు. ఆయన ఎప్పుడు మేకప్ వేసుకుంటారా ? ఎప్పుడు షూటింగ్ ప్రారంభమౌతుందా ? అభిమానుల నిరీక్షణ ఫలించింది. కొద్దిసేపటి క్రితం చిరంజీవి షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు ఆయన తనయుడు రాంచరణ్ తేజ తన ఫేస్ బుక్ ద్వారా తెలియచేశారు. చిత్ర షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను, మెస్సెజ్ ను రాంచరణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని అనుకుంటారని, ఆ సమయం ఇప్పుడు తనకు వచ్చిందని రాంచరణ్ పేర్కొన్నాడు. తన పనికి నాన్న ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారని, నాన్న టించిన చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గతేడాది తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించిన 'కత్తి' చిత్రానికి రీమెక్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, అలాగే మాస్, మసాల అన్ని అంశాలు ఈ చిత్రంలో మిళితమై ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో చిత్రం ఎలా ఉంటుందనే దానిపై చిరు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ లో డ్యాన్స్ వేసి తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని చిరు నిరూపించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రాంచరణ్