రాజభోగాలు

14:31 - August 21, 2017

చెన్నై : బెంగళూరులోని పరప్పన జైలులో తమిళనాడు దివంగత సిఎం జయలలిత నెచ్చెలి శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపణలు చేసిన ఐపిఎస్‌ అధికారిణి రూప దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టారు. జైలులోని సిసిటివి ఫుటేజీని అవివీతి నిరోధక శాఖకు అందజేశారు. శశికళ, ఆమె బంధువు ఇళవరసి జైలు బయటకి వెళ్లి.. కొద్దిసేపటి తర్వాత లోపలికి వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇద్దరూ జైలు దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో ఉండడడం గమనార్హం. శశికళ వెంట ఓ బ్యాగ్‌ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. శశికళ అధికారులకు లంచం ఇచ్చి జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారని జైళ్ల శాఖ డిఐజిగా ఉన్న సమయంలో రూప ఆరోపణలు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను ట్రాఫిక్‌ విభాగానికి బదిలీచేశారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

14:36 - July 17, 2017

బెంగళూరు : సెంట్రల్‌ జైలులో అన్నాడిఎంకె ప్రముఖ నేత శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని నివేదిక ఇచ్చినందుకు జైళ్ల డిఐజి రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసింది. ఓ అధికారి రెండు కోట్లు లంచం తీసుకుని శశికళకు ప్రత్యేక వంటగది, స్పెషల్‌ బెడ్‌, స్వేచ్ఛగా తిరగడానికి సౌకర్యాలు కల్పించారని రూప ఆరోపించారు. పరప్పన జైలులో జరుగుతున్న అక్రమాలపై ఆమె ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. డిఐజి రూప జైలులో అక్రమాలను బయటపెట్టినందుకు ప్రభుత్వం బదిలీ వేటు వేసిందని విపక్షాలు విమర్శించాయి. సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నేరస్థులను సిద్ధరామయ్య ప్రభుత్వం కాపాడుతోందని జెడిఎస్‌ విమర్శించింది.

13:48 - July 13, 2017

చెన్నై : అక్రమ ఆస్తుల కేసులో పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడిఎంకె నేత శశికళ జైలులో రాజ భోగాలు అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ డిఐజి రూపా మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. జైళ్లశాఖలోని ఓ సీనియర్‌ అధికారి శశికళ నుంచి 2 కోట్ల నగదు తీసుకుని జైలులో వివిఐపి ట్రీట్‌మెంట్‌ కల్పించారని లేఖలో డిఐజి ఆరోపించారు. ప్రత్యేక వంటగది, గదిలో పరుపు, స్వేచ్ఛగా తిరిగేందుకు వసతులు కల్పించారని కర్ణాటక పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ రూప్‌ కుమార్‌ దత్తకు ఫిర్యాదు చేశారు. శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని డిజిపి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss

Subscribe to RSS - రాజభోగాలు