రాజశేఖర్

12:48 - August 17, 2018

జీవితా రాజశేఖర్. వీరిద్దరిని విడి విడిగా చూడలేం. సినిమా పరిశ్రమలో ఏ జంటకు లేని ప్రత్యేకత వీరిద్దరికి వుంది. హీరోగా రాజశేఖర్, నటిగా..దర్శకురాలిగా పలు విభిన్న పాత్రల్లో జీవిత రాజశేఖర్ కు అన్నీ తానై అండగా వుంటుంది. సినిమా పరిశ్రమే మా జీవితం అంటున్న ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు..ఇప్పటికే పెద్ద కుమార్తె శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా వుంది. ఈ క్రమంలో అక్క బాటలోనే రెండో కుమార్తె శివాత్మిక కూడా పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా పరిశ్రలోకి ఎంట్రీ ఇచ్చేందుకు శివాత్మిక కూడా వచ్చేస్తున్నట్లుగా సినీ వర్గాల సమాచారం.

అడవి శేష్ జోడీగా శివాని ..
తెలుగులో అడవి శేష్ జోడీగా శివాని ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఇక తమిళంలోను శివాని కథానాయికగా పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా నటన వైపే ఆసక్తిని చూపుతోందట. ఈ విషయాన్ని జీవిత రాజశేఖర్ స్వయంగా చెప్పారు. అక్క మాదిరిగానే శివాత్మిక కూడా నటనపట్ల ఆసక్తిని చూపుతుండటంతో, ఆ దిశగానే ఆమెను ప్రోత్సహించేందుకు జీవిత రాజశేఖర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

14:48 - August 2, 2018

హిట్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ ఇప్పటికీ బిజీ బిజీగా వుంది. తేజా దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేసిన కాజల్ అప్పటి నుండి తిరిగి చూసుకోలేదు. అగ్రకథానాయకులతోనే వరుస సినిమాలు చేస్తూ 10 సంవత్సరాల నుండి అగ్రహీరోయిన్ గా వెలుగొందుతోంది. హిట్ హీరోయిన్ గా పేరొందిన కాజల్ డేట్స్ కోసం నిర్మాతలు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో హిట్స్ లేక సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న హరో రాజశేఖర్ 'గరుడ వేగ'తో హిట్ అందుకున్నాడు. తరువాత సినిమా కూడా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు. ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినా కాజల్ స్థాయికి తగిన అవకాశాలు మళ్లీ పెరగడం .. సక్సెస్ లు పలకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ సినిమా కోసం ఆమెను అడిగారట. అయితే కాజల్ నుంచి నో అనే ఆన్సర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

'గరుడవేగ' హిట్ తరువాత..మంచి కథ కోసం రాజశేఖర్ గ్యాప్ తీసుకున్నారు. 'అ!' వంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రశాంత్ వర్మ, ఇటీవలే ఒక విభిన్నమైన కథకు రాజశేఖర్ కనెక్ట్ అయ్యాడట. దీంతో ఈ సినిమా చేయడానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ని అడిగితే డేట్స్ లేవని చెప్పడంతో, శ్రియను ఓకే చేసినట్టుగా సమాచారం.

11:15 - May 20, 2018

చిత్తూరు : ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నిజాయితీపరుడిగా, మంచివాడుగా పేరున్న రాజశేఖర్ మృతి పట్ల తోటి ఉద్యోగులంతా విచారం వ్యక్తంచేస్తున్నారు. ఎస్పీ క్యాంప్ లో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ తుపాకీతో కాల్చుకుని రాజశేఖర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్పీ ఎస్పీ రాజశేఖర్ బాబు స్పందించారు. చాతీలో బుల్లెట్ దిగటం వల్లనే రాజశేఖర్ మృతి చెందాడని ఈ మృతిపై విచారణ జరుపుతున్నామనీ తెలిపారు. మృతిరోజు ముందురోజే సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్న రాజశేఖర్ ఇంతలోనే మృతి చెందటం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎస్పీ విచారణ చేపట్టారు. కాగా పోస్ట్ మార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని ఎస్పీ రాజశేఖర్ తెలిపారు. 

18:05 - May 3, 2018

ప్రముఖ కధానాయిక నయనతార,విఘ్నేశ్ శివన్ ప్రేమయాత్రకు హీరో రాజశేఖర్ విలన్ గా మారాడా? గరుడవేగతో హిట్ కొట్టిన డాక్టర్ రాజశేఖర్ రూటు మార్చాడా? ఎన్టీఆర్ కు బై బై చెప్పేసి నాగ్ తో దర్శకుడు తేజ జతకట్టనున్నాడా. ఇత్యాది విశేషాలు మీకోసం..

కాలిఫోర్నియాలో నయన్ ప్రేమయాత్ర..
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నిండా ప్రేమలో మునిగిపోయిన కథానాయిక నయనతార, ప్రస్తుతం ప్రియుడితో కలసి ప్రేమయాత్ర చేస్తోందంటు ఇండ్రస్ట్రీ టాక్?. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరూ కలసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విలన్ గా మారిని రాజశేఖర్
ఇటీవల 'గరుడవేగ' చిత్రంతో హిట్ కొట్టిన సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు తన రూటు మారుస్తున్నాడు. యంగ్ హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో విలన్ గా కీలక పాత్ర పోషించడానికి ఓకే చెప్పాడట.

నాగ్ తో తేజ
ఇటీవల 'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి తప్పుకున్న ప్రముఖ దర్శకుడు తేజ తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జునకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు సమాచారం.   

20:37 - April 18, 2018
11:14 - February 15, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ లో సంచలనం సృష్టించిన 'చిన్నారి నరబలి' కేసు మిస్టరీ వీడిపోయింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కేసును చేధించారు. చనిపోయింది ఆడ శిశువుగా నిర్ధారించారు. రాజశేఖర్ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్...శిశువు బ్లడ్ ఒక్కటే అని అధికారులు తేల్చారు.

భార్య అనారోగ్యం కారణంగానే నరబలి ఇచ్చినట్లు రాజశేఖర్ అంగీకరించాడు. ఓ తండాలో రూ. 40వేలకు ఆడశిశువును తీసుకొచ్చి ఇంట్లోనే నరబలి ఇచ్చాడు. అనంతరం రసాయనాలతో ఇంటిని రాజశేఖర్ శుభ్రం చేశాడు. ఈ కేసులో మొత్తం పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాజశేఖర్..భార్య శ్రీలతతో పాటు ఆరుగురు అరెస్టయ్యారు. ఈ కేసులో నిందితులను సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. 

ఇదిలా ఉంటే ఏ తండా నుండి తీసుకొచ్చారు ? ఆ శిశువు ఎవరిది ? వారికి ఎవరు విక్రయించారు ? వీరికి మధ్య వర్తిత్వం వహించింది ఎవరు ? నరబలి ఇవ్వాలని పురిగొల్పింది ఎవరు ? నిందితులకు ఎవరెవరు సహకరించారు ? తదితర ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. 

10:37 - February 15, 2018
14:07 - February 9, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిన్నారి నరబిలి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ నివాసాల్లో పోలీసులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. చిన్నారి తల భాగాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపారు. ఆ చిన్నారి గతేడాది నవంబర్ లో పాతబస్తీ బహుదూర్ పురాలో కిడ్నాపైనా చిన్నారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:15 - February 2, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ లోని ఓ ఇంటి భవనంపై చిన్నారి తల దొరకడం సంచలనం సృష్టిస్తోంది. అసలు పాప ఎవరు ? ఎవరు చంపేశారు ? పాప మృతదేహం ఇంకా ఎక్కడుంది ? అనే మిస్టరీ వీడడం లేదు. రాజశేఖర్ ఇంటిపై ఈ ఘటన చోటు చేసుకుందనే సంగతి తెలిసిందే. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మిస్టరీని చేధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు చేసి పాపను బలి ఇచ్చారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో అనుమానం ఉన్న మెకానిక్ నరహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:58 - November 3, 2017

గరుడవేగ.. గత వారం రోజులుగా ఈ సినిమా టీం చేస్తున్న ప్రమోషన్స్ తో రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ అని చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ కూడా స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో 30 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన భారీ చిత్రానికి.. అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. ప్రవీణ్ సత్తారు ని నమ్మి నిర్మాతలు భారీగా ఖర్చు పెడితే.. రాజశేఖర్ కూడా కష్టానికి వెనుకాడకుండా ఫుల్ హార్డ్ వర్క్ తో ఈ సినిమాని చేశాడు. సో.. ఇన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన గరుడవేగ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథ..
కథ విషయానికొస్తే..ఫోక్రాన్ అను పరీక్షల తర్వాత జరిగిన ఒక భారీ ఫ్లూటోనియం స్కామ్ కి సంబంధించిన ఇంట్రస్టింగ్ ప్లాట్ తో తెరకెక్కింది పిఎస్ వి గరుడవేగ. కథగా చెప్పుకోడానికి చిన్న పాయింట్ అయినప్పటికీ.. దాన్ని తనమార్క్ స్క్రీన్ ప్లే తో, ప్రజెంట్ జనరేషన్ కి లింక్ చేస్తూ.. ఎన్ ఐఏ అసిస్టెంట్ కమీషనర్ అయిన చంద్రశేఖర్ దాన్ని ఎలా ఛేధించాడు అన్నదే సినిమా టోటల్ స్కీమ్. దీనికి మరోపక్క ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా యాడ్ చేసి ..ఈ థ్రిల్లర్ పాయింట్ కి ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చారు.

నటీనటుల ప్రతిభ..
నటీనటుల విషయానికొస్తే.. చాలాకాలంగా..తనకు కనిపించే తనను నడిపించే పాత్ర కోసం ఎదురుచూసే రాజశేఖర్ కి అలాంటి పాత్రే దక్కింది. ఎన్ ఐఏ అసిస్టెంట్ కమీషనర్ గెటప్ లో జీవించాడు రాజశేఖర్. ఎమోషన్స్ పండించడంలో అక్కడక్కడా తడబడ్డప్పటికీ.. ఓవరాల్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎక్కడా కథను డామేజ్ చెయ్యకుండా,.. డీవియేట్ చెయ్యకుండా దర్శకుడు అనుకున్న కథని అలాగే స్క్రీన్ పై ప్రజెంట్ చెయ్యడంలో పూర్తిగా కోఆపరేట్ చేశాడు. అక్కడక్కడా..తన ఏజ్ తాలూకు ఛాయలు కనిపించినప్పటికీ..హార్డ్ వర్క్ తో ఓవరాల్ తన పాత్రకి, సినిమాకి న్యాయం చేశాడు. ఇక విశ్వరూపం సినిమాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకుమారికి..మళ్లీ అదేరేంజ్ ప్రాజెక్ట్ దక్కింది. లిమిటెడ్ రోల్ అయినప్పటికీ.. కథతో కనెక్ట్ అయి ఉండడంతో ఆడియన్స్ కిబాగానే రిజిస్టర్ అయ్యింది. హోమ్ లీ లుక్స్ తో, గుడ్ పర్ ఫామెన్స్ తో పరవాలేదనిపించింది. చాలా కాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అదిత్.. కు గరుడవేగ మంచి గుర్తింపు తెచ్చింది. తన కెరీర్ లో చెప్పుకునే సినిమాగా నిలిచింది. పోసాని కృష్ణ మురళి, నాజర్ ,పృథ్వి, చరణ్ దీప్, రవివర్మ లకు మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు దక్కాయి. శ్రధ్దాదాస్ క్యారెక్టర్ ని గెస్ట్ అప్పియరెన్స్ గా చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తానికి డియ్యో డియ్యో అంటూ మంచి క్రేజ్ తెచ్చిన సన్నీలియోన్ సాంగ్ సినిమాకి ప్లస్ అయ్యింది. మిగతా నటీనటులందరూ పాత్రల పరిధి మేరకు దర్శకుడి విజన్ లో నటించారు.

టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. ఈ సినిమాకి ఇనీషియేటర్ అండ్ బ్యాక్ బోన్ అయిన ప్రవీణ్ సత్తారు.. స్క్రిప్ట్ గురించి చాలా రీసెర్చ్ చేసి దాన్ని సినిమాగా మలచడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశాడనే చెప్పాలి. చిన్న పాయింట్ ని ఫుల్ లెన్త్ థ్రిల్లర్ సినిమాగా తియ్యడం మామూలు విషయం కాదు. ఫస్ట్ హాఫ్ వరకూ డైరెక్టర్ గా రోమాలు నిక్కబొడుచుకునే స్క్రీన్ ప్లేతో , హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు..సెకండాఫ్ లో మాత్రం కొంచెం తడబడ్డాడు. ఇంటర్వెల్ వరకూ పీక్ లో ఉన్న సినిమా గ్రాఫ్ సెకండాఫ్ కొచ్చేసరికి తగ్గుతుంది. కానీ ఇప్పటి వరకూ తాను తీసిన సినిమాలకు .. పూర్తి భిన్నంగా ఉండే పాయింట్ తో రాజశేఖర్ లాంటి హీరోతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చెయ్యగలిగాడు.

సినిమాటోగ్రఫీ..
సినిమాటోగ్రఫీ విషయానికొస్తే.. డైరెక్టర్ విజన్ ని పూర్తిగా అర్దం చేస్కుని సినిమాకి ఎలాంటి విజువల్స్ కావాలో.. అలాంటి విజువల్స్ ని అందించాడు. ముఖ్యంగా ఛేజింగ్ సీన్స్ లో వాళ్ల పనితనం కనిపిస్తుంది. 30 కోట్ల బడ్జెట్ లో ఆరేంజ్ అవుట్ పుట్ ఇవ్వడంలోనే వాళ్ల టాలెంట్ అర్దమవుతుంది. ఇక సంగీతం విషయానికొస్తే..భీమ్స్ చేసిన రెండు పాటలు కూడా మాస్ జనాలకి కిక్ ఇస్తాయి. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టింది. సీన్ సీన్ కి మారిపోయే సినిమా థీమ్ ని తన ఆర్.ఆర్ తో సక్సెస్ ఫుల్ గా ఎలివేట్ చేశాడు శ్రీచరణ్. టెక్నికల్ వాల్యూస్ పరంగా చాలా హై స్టాండర్డ్స్ లో ఉందీ సినిమా. ఎడిటింగ్ ఇంకాస్త్ షార్ప్ గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. డైరెక్టర్ చెప్పిన కథని, రాజశేఖర్ కాన్ఫిడెన్స్ ని చూసి కథకు తగిన విథంగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఓవరాల్ గా చెప్పాలంటే క్లాసీ టైటిల్ తో తెరకెక్కిన గరుడవేగ.. టేకింగ్ పరంగా క్లాస్ కి, విజువల్ పరంగా మాస్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో వచ్చింది. అయితే థ్రిల్లర్ సినిమా కావడంతో ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో తెలియాలంటే..మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

ప్లస్ లు..
స్టోరీ, స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు
యాక్షన్ సీన్స్..

మైనస్
సెకాండాఫ్ లో కొన్ని సీన్స్
కామెడీ లేకపోవడం
టెక్నికల్ లాంగ్వేజ్
రేటింగ్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - రాజశేఖర్