రాజస్థాన్

19:24 - November 14, 2018

రాజస్థాన్‌ : రాష్ట్రంలో బీజేపీకి షాక్ తగిలింది. అదికూడా మామూలు షాక్ కాదు. రాజుల స్థానం రాజస్థాన్ లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పట్టుదలగా వుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. బలమైన రాజకీయ వ్యూహాలతో బీజేపీకి జోరుకు కాంగ్రెస్ కళ్లెం వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కమలదళానికి ఎంపీ హరీష్ చంద్ర మీనా హ్యాండిచ్చారు. బుధవారం మాజీ సీఎం అశోఖ్ గెహ్లాట్, కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

Related image2014లో బీజేపీలో చేరిన హరీశ్ చంద్ర మీనా మాజీ ఐపీఎస్ అధికారి అయిన మీనా 2009 నుంచి 2013 వరకు రాజస్థాన్ డీజీపీగా పనిచేశారు. మీనాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దౌసా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో  తూర్పు రాజస్థాన్‌లో కూడా మీనాలు ఎక్కువమంది ఉండటంతో.. హరీశ్ చంద్ర చేరికతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్‌లో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇలాంటి సమయంలోనే సీనియర్ నేతగా ఉన్న హరీష్ మీనా పార్టీని వీడటం బీజేపీకి ఎదురు దెబ్బేనని చెప్పాలి. మరి హరీశ్ చంద్ర మీనా ఝలక్ తో బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
 

11:47 - November 10, 2018

ఢిల్లీ : ఐదు  రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో  ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈ నెల 12వ తేదీన..రాజస్థాన్, తెలంగాణ శాసనసభలకు డిసెంబర్ 7న జరిగే ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగియనుంది. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం విధించింది. 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి డిసెంబర్‌ ఏడో తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
 

 

12:06 - November 4, 2018

ఉత్తర్ ప్రదేశ్ : అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు మొదలవుతాయంటూ ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయం కోసం ప్రతొక్కరూ దీపావళి పండుగ సందర్భంగా దీపం పెట్టాలని సూచించారు. రాజస్థాన్‌ బికనేర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 
ఆయన వ్యాఖ్యలపై అక్కడి ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సుప్రీంకోర్టులో అయోధ్య రామ మందిరంపై విచారణ సాగుతోందని, ఈ తరుణంలో సీఎం పదవిలో ఉన్న వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని నేతలు పేర్కొంటున్నారు. మరోసారి ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మరింత ముదురుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

12:19 - October 26, 2018

రాజస్థాన్ : మహిళల విషయంతో తనకో కోరిక వుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. మహిళా ఓటు బ్యాంకులతో అధికారంలోకి వస్తున్న పార్టీలంతా మహిళల కోసం అది చేస్తాం ఇది చేస్తామంటు బీరాలు పలుకుతుంటారు. కానీ మహిళలకు చట్ట సభలకు పంపించేందుకు మాత్రం ఏ పార్టీలు ముందుకు రావు. రాహుల్ గాంధీ మాత్రం  మాట్లాడుతు..కేవలం చట్ట సభలే కాదు రాజ్యాధికారంలో కూడా మహిళలే వుండాలంటున్నారు. అంతేకాదు దాని కోసం తాను కృషి చేస్తానంటున్నారు. పార్టీ పదవుల్లో ఆడాళ్లకు పెద్ద పీట వేయాలని తాను నిర్ణయించుకున్నట్లు రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సగం మంది ముఖ్యమంత్రులు ఆడాళ్లు ఉండాలన్నదే తన కోరిక అన్నారు. ఇప్పటికి ఇది సాధ్యం కాకపోయినా వచ్చే అయిదారేళ్లలో దీనికి సాకారం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. 

Related imageరాజస్ధాన్ మహిళా కాంగ్రెస్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ గురువారం మాట్లాడుతు..ఆడాళ్లను ఇళ్లకే పరిమితం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ఆరెస్సెస్ సమావేశాల్లో ఒక మహిళ కూడా కనిపించదన్నారు. బీజేపీకి మహిళా విభాగం ఉన్నప్పటికీ అందులో నిర్ణయాలు తీసుకునేది మగవారేనన్నారు. రాజస్ధాన్ లో బీజేపీకి మహిళా సీఎం ఉన్నా, ఆమె తీసుకొనే నిర్ణయాలన్నీ మగవారికే అనుకూలంగా ఉంటాయన్నారు. పార్టీ పదవుల నియామకం విషాయానికొస్తే ఆడవారి తరపునే తాను ఉంటానన్నారు. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ దశలను దాటుకుని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎక్కువ మంది ఆడాళ్లనే పోటీకి పెట్టాలని తాను నిర్ణయించుకుంటున్నట్లు రాహుల్ చెప్పారు. ఆడాళ్లు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది అపోహ మాత్రమేనని రాహుల్ అన్నారు.
 

11:00 - October 25, 2018

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో సీనియర్లను పోటీలో దింపరాదని నిర్ణయించింది. సీనియర్ల సేవలను ప్రచారానికి వినియోగించుకోవాలని చూస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలను నిరోధించేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో పిసిసి చీఫ్‌లు కూడా ఉన్నారు. సీనియర్లంతా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. Image result for madhya pradesh and rajasthan congressమధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌ నాథ్, ఎంపి జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌, సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్, సిపి జోషిలు అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరిని సిఎం అభ్యర్థిగా ప్రకటించాలో అర్థంకాక కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతోంది.
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీనియర్‌ నేతలను తమ తమ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా ...రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేలా కొత్త ఫార్ములాను అమలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఈ ప్రణాళికను 2 వందలపైకి అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో అమలు చేయనుంది. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం వల్ల తమ నాయకుడు ఎవరన్న ప్రశ్న తలెత్తదని...పార్టీ కార్యకర్తలంతా గెలుపు కోసం కృషి చేస్తారని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. 

Image result for Madhya Pradesh And Rajasthan Assembly Election Congress Senior leaders

కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యంగా రాజస్థాన్‌లో నాయకత్వ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గెహ్లాట్‌ సీనియర్‌ నేత కాగా...పైలెట్‌ యువనేతగా పార్టీలో పేరు తెచ్చుకున్నారు. మాజీ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ను ఎఐసిసి కార్యదర్శిగా రాహుల్‌గాంధీ నియమించారు. గెహ్లాట్‌కు ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలతో సంబంధాలున్నాయి. ఆయన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూడా...2013 ఎన్నికల్లో అశోక్‌ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ యువనేతగా రాజస్థాన్‌ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేశారని గుర్తింపు పొందారు.
Image result for madhya pradesh congressఇక మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌...వీరిద్దరూ ఎంపీలే కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో వీరు పోటీ చేయాలా వద్దా అన్న ప్రశ్న కాంగ్రెస్‌ పార్టీకి తలెత్తడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్‌ నేతలు పోటీ చేయొద్దన్న నిర్ణయం ఇదే తొలిసారి కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 1998లో అశోక్‌ గెహ్లాట్‌  రాజస్థాన్‌ సిఎం అయ్యారు. ఎంపీగా ఉన్న గెహ్లాట్‌ను పార్టీ హైకమాండ్‌ సిఎంగా పంపిన విషయాన్ని గుర్తు చేశాయి. 2012 లో ఎంపీగా ఉన్న విజయ్‌ బహుగుణ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకున్నా కాంగ్రెస్‌ ఆయనను సిఎంగా నియమించింది. అనంతరం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
Image result for madhya pradesh congressకాంగ్రెస్‌ పార్టీకి కాంగ్రెస్‌ పార్టీయే శత్రువని పేరుంది. సిఎం అభ్యర్థిగా ఏ  ఒక్కరి పేరు ప్రకటించినా....అసమ్మతి రాజుకోవడం ఖాయం. అంతర్గత కలహాలు పార్టీని దెబ్బతీయకుండా ఉండేందుకే కాంగ్రెస్‌ అధిష్టానం సీనియర్లను బరిలోకి దింపకూడదనే నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వృద్ధతరం నేతలను పక్కన బెట్టాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ ఈ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది.

12:32 - October 23, 2018

రాజస్థాన్ : కొన్నేళ్ళ క్రితం వరకూ ప్రపంచాన్ని వణికించింది స్వైన్ ఫ్లూ హెచ్1ఎన్1 అనే వైరస్.  స్వైన్ ఫ్లూ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోయాయి. స్వైన్ ఫ్లూ దాడికి గురై అనేక మరణాలు సంభవించిన దేశాల్లో భారత దేశం కూడా ఒకటి. ఇప్పటికీ స్వైన్ ఫ్లూ వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.ఈ స్వైన్ ఫ్లూ బారినుంచి కొద్దిగా బయట పడి ఊపిరి తీసుకుందో లేదో వెంటనే ఎబోలా వైరస్ విజృంబించింది ఆఫ్రికా దేశాల్లో కొన్ని వందల మందిని బలి తీసుకుందీ ఈ వైరస్. అదే క్రమం లో ఇప్పుడు జికా వైరస్ అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ వైరస్ పూర్తి ప్రపంచాన్ని ఆక్రమించేందుకు పెద్దగా సమయం పట్టక పోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో  రాజస్థాన్ లో  120 మందిలో జికా వైరస్‌ను గుర్తించామని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి కలిచరణ్ సరఫ్ వెల్లడించారు. కాగా బ్రెజిల్ లో దాదాపు 10 లక్షలమందిని చుట్టుముట్టింది. 

Mosquitosవీరిలో 105 మంది చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి జికా వైరస్‌కు సంబంధించిన అవగాహన కలిస్తున్నామని, వైరస్ సోకిన వారు తగిన చర్యలు తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే ఉపశమనం పొందచ్చని అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. తగిన విశ్రాంతి, బాగా నీళ్లు తాగడంతో పాటు పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారని సరఫ్ వెల్లడించారు.

Image result for జికా వైరస్జికా లక్షణాలు..
‘ఆడెస్’ అనే దోమలు కుట్టడం వల్ల జికా వైరస్ వ్యాప్తితో పాటు వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఈ దోమలు పగటి పూట కుడతాయి. ఈ వైరస్ వ్యాపిస్తే జ్వరం, దద్దుర్లు, కళ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భంతో ఉన్న మహిళలకు జికా వైరస్ వ్యాపిస్తే పిల్లలు కొన్ని లోపాలతో జన్మించే అవకాశాలు ఉంటాయి. అలాగే గర్భిణీల్లో పలు సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ముందే ప్రసవం కూడా జరిగే అవకాశాలుంటాయి. తలనొప్పి,కీళ్ల నొప్పులు,జ్వరం,వాంతులు,కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.జికా వైరస్ ఒంట్లో చేరిన అందరిలోను లక్షణాలు కనిపించకపోవచ్చు. జ్వరం వంటి లక్షణాలు వారం రోజుల లోపు తగ్గిపోతాయి. ఇటువంటి బహు ప్రమాదకర లక్షణాలు ఈ జికా స్పెషల్. సో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వుండటం ఎంతైనా మంచిదని ఆరోగ్య శాఖ హెచ్చిరిస్తోంది.
 

11:04 - October 22, 2018

రాజస్థాన్ : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామాంధుల చేతుల్లో ఎంతో మహిళలు నలిగిపోతున్నారు. పలువురిని దారుణంగా హత్య చేసేస్తున్నారు. రాజస్థాన్‌లో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు రెచ్చిపోయారు. వీరి నుండి తప్పించుకోవాలని ఓ యువతి నగ్నంగా భవనంపై నుండి కిందకు దూకేసింది. తీవ్రగాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. 
నేపాల్‌కు చెందిన 23 ఏళ్ల యువతి జైపూర్‌లో ఓ సంస్థలో పని చేస్తోంది. ఈమెను ముహానా ప్రాంతంలో ఓ ఇంట్లో ఇద్దరు యువకులు అనంతరం ఒకరు తరువాత మరొకరు అత్యచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను హింసించారని తెలుస్తోంది. వీరి నుండి తప్పించుకొనేందుకు భవనం మూడో అంతస్థు నుండి కిందకు నగ్నంగా దూకేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచారానికి పాల్పడిన వారు లోకేశ్ శైని కమల్ శైని యువకులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

10:15 - October 21, 2018

ఢిల్లీ : రాముడు, కృష్ణుడు...సీత, లక్ష్మి, సరస్వతి...తదితర దేవతల పేర్లు పెట్టుకోవడం సహజం. కానీ రాజస్థాన్‌ ఓటర్ల జాబితా పేర్లను చూస్తే మాత్రం విస్తు పోవాల్సిందే. రామాయణ కాలం నాటి దేవతలే కాదు...రాక్షసుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో దర్శనమిచ్చాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. రాజస్థాన్‌లో ఈసీ విడుదల చేసిన  ఓటర్ల జాబితా ఇపుడు చర్చనీయాంశమైంది.
రామాయణ కాలం నాటి పాత్రల పేర్లు ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత, శతృఘ్న, హనుమంతుడి లాంటి పేర్లు ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ....రాక్షసుల పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయి. రావణ్‌, మండోదరి, విభీషణ్‌, మేఘనాథ్‌, కుంభకర్ణ్‌ లాంటి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండడం విస్తు గొలుపుతోంది.  
పూజించే దేవతల పేర్లు పెట్టుకోవడం సహజమే...భారత్‌లో రావణుడిని విలన్‌గా చూడడమే కాదు...దసరా పండగ రోజు ఆయన దిష్టిబొమ్మను కూడా తగులబెడుతుంటారు. అలాంటిది రాజస్థాన్‌ ఓటర్ల జాబితాలో రావణుడి పేరిట 110 మంది ఓటర్లు ఉన్నారు. జాతీయ ఓటర్ల సేవా పోర్టల్‌ ప్రకారం రావణుడి భార్య మండోదరి పేరిట 47 మంది మహిళా ఓటర్లున్నారు. నలుగురు కుంభకర్ణులు, 68 మంది విభీషణులు, 223 మంది మేఘనాథ్‌లు ఉన్నారు. హనుమాన్‌ పేరుతో 64 వేల 637 ఓటర్లున్నారు. సీత పేరుతో లక్షా 90 వేల 77 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా రాముడి పేరుతో 12 లక్షల 81 వేల 679 ఓటర్లున్నారు. లక్ష్మణుడి పేరుతో 44 వేల 194 మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి.
దేశవ్యాప్తంగా రావణుడి పేరుతో 24,873 ఓటర్లు, మండోదరి పేరుతో 6,831 ఓటర్లు... రావణుడి సోదరి శుర్పనఖ పేరుతో ఇద్దరు, మంథర పేరుతో 1233, కైకేయి పేరుతో 644 మంది ఓటర్లు ఉండడం గమనార్హం. పురాణ పాత్రల పేరుతో వ్యక్తుల పేర్లు కలిగి ఉండడం విచిత్రమే మరి. 

19:40 - October 15, 2018

రాజస్థాన్‌ : సాధారణంగా మనుషుల కళ్లకంటే పశువుల కళ్లు చాలా ఆరోగ్యంగా వుంటాయి. పశువులకు కళ్ల జబ్బులు వచ్చినట్లుగా మనం విని వుండం. ఎందుకంటే శాఖాహారం తినే జంతువులైనా..మాంసాహారం తినే మృగాలైనా రా మెటీరల్ మాత్రమే తింటాయి. అంటే ఉడికించని ఆహారం అన్నమాట. అందుకే వాటికి సాధారణంగా కళ్ల జబ్బులే కాదు ఎటువంటి జబ్బులు రావు. కానీ ఓ ప్రాంతంలోని జంతువులకు మాత్రం కంటి జబ్బులు వచ్చాయి. అదే మండోర్‌లో గల ఒక గోశాలలోని ఐదు ఆవులకు వైద్యులు కంటి ఆపరేషన్ చేశారు. వినటానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా..నమ్మల్సిన నిజం. గోశాలలో వుండే ఐదు ఆవులకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. ఫలితంగా వీటిలోని మూడు గోవులు చక్కగా చూడగలుగుతున్నాయట. దీంతో కంటిజబ్బులు వున్న మరో వంద గోవులకు ఆపరేషన్ చేయనున్నారట. దేశంలోని ఒక గోశాలలో ఆవులకు కంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే ప్రధమం. ఈ సందర్భంగా గోశాల కోశాధికారి మాట్లాడుతూ గోశాలలో ఆవులకు కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రత్యేకమైన థియేటర్ ఏర్పాటు చేశాం. గతనెలలోనే దీనిని ప్రారంభించాం. పశువైద్య నిపుణులు సురేష్ కుమార్ బృందం గోవులకు ఆపరేషన్ నిర్వహించిందని తెలిపారు. 
 

 

11:07 - October 14, 2018

సిద్దిపేట : రాజస్థాన్ సేవ సమితి వారు టీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ సిద్దిపేట రైస్ మిల్ అసోసియేషన్‌లో ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. సిద్దిపేట పట్టణంలో 150 రాజస్థాన్ కుటుంబాలు ఉన్నాయి. ఈ మార్వాడీ కుటుంబాలు సిద్దిపేటలో పలు వ్యాపారాలు చేస్తూ సాదాసీదాగా జీవిస్తున్నాయి. ఎప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లని మహిళలు ఇంటిల్లిపాది చేసే వ్యాపారాలకు, ఇంటికి తాళం వేసి తనను ఆశీర్వదించినందుకు సంతోషంగా ఉందన్నారు హరీష్‌ రావు. రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, ప్రైవేట్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు.

Pages

Don't Miss

Subscribe to RSS - రాజస్థాన్