రాజా

15:56 - December 6, 2018

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. 
పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకోవటమే కాకుండా రాజాకు ధైర్యం చెప్పారు. 
అంతేకాదు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులను తెలిపారు సీఎం నారాయణ స్వామి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి జరిగింది. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

17:47 - October 17, 2018

వరుణ్ తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్స్‌గా, ఘాజీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి డైరెక్షన్‌లో, దర్శకుడు క్రిష్ సమర్పణలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ అంతరిక్షం 9000KMPH.
తెలుగులో  మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న అంతరిక్షం టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిహర స్పేస్ ప్రాజెక్ట్ టీమ్‌లో ఉండే  వరుణ్, తన టీమ్ మేట్స్‌తో స్పేస్‌కి చేరుకోవడం, అక్కడ సమస్యలు ఎదురవడం, వాటని ఎలా సాల్వ్ చేస్తాడు అనే ఆసక్తికర అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అంతరిక్షం టీజర్.. టీజర్‌లో వరుణ్‌తో పాటు, అదితి రావు, సత్యదేవ్, రాజా కనబడ్డారు కానీ, లావణ్య త్రిపాఠిని చూపించలేదు.. గ్రాఫిక్ వర్క్, విజువల్స్‌తో పాటు, ఆర్ఆర్ కూడా బాగుంది.. డిసెంబర్‌లో ప్రేక్షకులను స్పేస్‌లోకి తీసుకెళ్ళబోతోంది అంతరిక్షం టీమ్...

 

16:25 - April 6, 2018

ఢిల్లీ : వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలపై లెఫ్ట్ నేతలు ఆందోళన వెలుబుచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, స్వేచ్చగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ గడువు పొడిగించాలని, హైకోర్టుల్లో ఎన్నికలపై పిటిషన్ లు దాఖలయ్యాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్..రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడే విధంగా పోలీసులు చూడాలన్నారు.

12:01 - March 22, 2018

ఢిల్లీ : 2జీ స్కాం కేసులో మాజీ కేంద్రమంత్రి ఏ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు మరో 17 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ స్కాం కేసులో ఇటీవల ప్రత్యేక సీబీఐ కోర్టు రాజాతో పాటు ఇతరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐతో పాటు ఈడీలు హైకోర్టులో అప్పీలు చేశాయి. ఈడీ సిబిఐ అప్పీలు మేరకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ మార్చి 25కి వాయిదా వేసింది. 2జీ కేసులో తాము సరైన ఆధారాలు ఇచ్చినా.. ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సరిగా లేదని సీబీఐ పేర్కొంది. 2 జి కేసులో గత ఏడాది డిసెంబర్ 21న రాజా, కనిమొళిలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 

 

15:30 - December 26, 2017

ఢిల్లీ : సీపీఐ 92వ ఆవిర్భావ దినోత్సవం  ఘనంగా జరిగింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం అజయ్‌ భవన్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ రాజా జెండా ఎగురవేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ, కార్మిక సంఘ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల పరిరక్షణకు సీపీఐ పోరాడుతోందని ఈ సందర్భంగా రాజా చెప్పారు. దేశంలో నిరంకుశపాలన సాగుతోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకంకావాలని రాజా పిలుపుఇచ్చారు. 

 

21:55 - December 23, 2017
15:54 - December 21, 2017

ఢిల్లీ : సంచలన  2జీ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ఏ.రాజా, కనిమొళిలకు ఊరట లభించింది. వారిద్దరిని నిర్దోషులుగా నిర్ధారిస్తూ పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో డీఎంకే నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కేసులో నిందితులకు ఉన్న అందరినీ నిర్ధోషులుగా తేల్చింది కోర్టు. ఆరు సంవత్సరాల అనంతరం సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. వినోద్‌రాయ్ నేతృత్వంలో 2010లో సీబీఐ తొలి చాటర్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ.రాజాతో పాటు టెలికాం కార్యదర్శి సిద్దార్ధ్ బెహూరా, మరో 12 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. స్పెక్ట్రం ధరలు నిర్ణయించడంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక సమర్పించింది. స్వాన్ టెలీకాంకు అర్హత లేకపోయినప్పటికీ 15 కోట్ల 37 లక్షలకే లైసెన్సులకు అనుమతులిచ్చినట్లు నివేదిక తెలిపింది. బిడ్ దక్కించుకున్న 9 కంపెనీలు ప్రభుత్వానికి రూ.10 వేల 772 కోట్లు మాత్రమే చెల్లించాయి. తప్పుడు పత్రాలతో ఆ కంపెనీలు లైసెన్సులు పొందినట్లు విచారణలో వెల్లడైనట్లు కాగ్ నివేదిక తెలిపింది. అయితే ఈ నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయినందుకు అందరినీ నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.  

 

13:24 - December 21, 2017

చెన్నై : 2జి స్కాం కేసులో పాటియాల కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పేర్కొన్నారు. ఈ కేసులో కనిమొళి, రాజాతో పాటు నిందితులందరినీ నిర్దోషులగా ప్రకటించింది. ఈసందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు, డీఎంకేను అంతం చేయాలని చూసిన వారికి తీర్పు చెంప పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. పాటియాల కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 

13:20 - December 21, 2017

చెన్నై : 2 జి స్కాం కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ పాటియాల కోర్టు నిర్దోషులగా ప్రకటించడంపై లాయర్లు సంతోషం వ్యక్తం చేశారు. నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలం చెందిందని, ఆరేళ్ల తరువాత వాస్తవాలు బయటకొచ్చాయని తెలిపారు. కేవలం రాజకీయ దురేద్ధశ్యంతోనే ఇది జరిగిందని పేర్కొన్నారు. ఇంకా వారి మాటల్లోనే వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

తిరుచ్చి శివ సంతోషం...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2 జి స్కాంలో పాటియాల కోర్టు తీర్పును వెలువరించింది. రాజా, కనిమొళితో పాటు నిందితులందరినీ నిర్దోషలుగా ప్రకటించింది. కోర్టు తీర్పుపై డీఎంకే స్పందించింది. ఈ కేసులో ఎలాంటి స్కాం జరగలేదని కోర్టు ద్వారా నిరూపితమైనందుకు సంతోషంగా ఉందని డీఎంకే నేత తిరుచ్చి శివ పేర్కొన్నారు. దేశ ప్రజల ముందు ఏ తప్పు చేయలేదని ఈ తీర్పు ద్వారా వెల్లడైందన్నారు. 

20:50 - November 8, 2017

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న  నిర్ణయంతో  దేశం సర్వనాశమైందని వామపక్షాలు మండిపడ్డాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారని, ధరలు పెరిగాయని ఆవేదన వెలిబుచ్చారు. పెద్దనోట్లు రద్దు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా వామపక్షాలు బ్లాక్‌ డే పాటించాయి. వేలాది మంది ఉపాధి కోల్పోయారని సీపీఐ జాతీయ నేత రాజా అన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. మోదీ నిర్ణయంతో నల్లధనం తెల్లధనంగా మారిందని తెలిపారు. పేదలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రాజా