రాజ్యసభ

11:07 - April 23, 2018
15:28 - April 8, 2018

ఢిల్లీ : అమరావతి నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కూడా త్యాగాలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగాలు చేస్తే సరిపోదని, మూడేళ్లలో వచ్చే లాభాలను రాజధాని నిర్మాణ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేశారు.

22:01 - April 5, 2018

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడిన తర్వాత టీడీపీ ఎంపీలు సభలోనే ఉండి ఐదు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర వైఖరిని నిరసిస్తూ రాజ్యసభలో నిరసన తెలుపున్న ఎంపీలను  రాత్రి 8 గంటల సమయంలో మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. రాజ్యసభ సభ్యుల నిరసనకు సంఘీభావంగా పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో టీడీపీ లోక్‌సభ సభ్యులు ఆందోళన చేశారు. వీరిని కూడా మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. 

17:03 - April 5, 2018

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడ్డా సభలోనే టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఎంపీలను బయటకు తీసుకెళ్లేందుకు మార్షల్స్‌ ప్రయత్నిస్తున్నారు. 

15:25 - April 5, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. విపక్ష ఎంపీలు పోడియం వద్దకు దూసుకవచ్చి ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని తెలుగు ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

 

11:26 - April 5, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఉభయసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన లోక్ సభ అరనిమిషంలోపే వాయిదా పడింది. స్పీకర్ సుమిత్ర మహజన్ కుర్చీలో కూర్చొకముందే అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. కొద్దిసేపు చూసిన అనంతరం సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. ఇక రాజ్యసభ కొద్దిసేపు కార్యకలాపాలు నడిచాయి. అనంతరం అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభను మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:44 - April 4, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రాజ్యసభలో మళ్లీ గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను మళ్లీ 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

 

14:49 - April 4, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. ప్రశ్నాపత్రం లీకేజీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అంశంపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.

 

12:21 - April 4, 2018

ఢిల్లీ : 12 రోజులు..పార్లమెంట్ ఉభయసభల్లో ఊహించిందే జరుగుతోంది. వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. శుక్రవారం నాడు సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనైనా 'అవిశ్వాస తీర్మానాన్ని' అనుమనిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సాధ్యం కాక పోవచ్చని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు పెద్ద పెట్టున సభలో ఆందోళన చేస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

బుధవారం నాడు ప్రారంభమైన లోక్ సభ కొద్దిసేపటికే వాయిదా పడింది. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. తిరిగి సమావేశం కాగానే కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు...ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ టిడిపి..వైసిపి..కాంగ్రెస్..సభ్యులు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే కొన్ని బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అవిశ్వాస తీర్మానం తీసుకోవడానికి అవకాశం లేదని..సభ్యులను లెక్కించే పరిస్థితి లేదని స్పీకర్ తెలిపారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు రాజ్యసభ ప్రారంభం కాగానే నూతన సభ్యుల చేత ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ సభ్యులు ఆందోళన చేశారు. సభ్యులు తీరుపై వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తం చూస్తోందని..చర్చకు అధికారపక్షం ఒప్పుకున్నా సభ్యులు ఆందోళన చేయడం తగదన్నారు. సభలో ముఖ్యమైన బిల్లులు ప్రవేశ పెట్టాల్సి ఉందని..సభ్యులు సహకరించాలని కోరారు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

11:35 - April 4, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభన నెలకొంటోంది. లోక్ సభలో అవిశ్వాస తీర్మాన నోటీసులను స్పీకర్ పరిగణలోకి తీసుకోవడం లేదనే సంగతి తెలిసిందే. బుధవారం నాడు సేమ్ సీన్స్ రిపీట్ అయ్యాయి. లోక్ సభ ప్రారంభమైన అర నిమిషానికే వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆసీనులయ్యే సమయానికే అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ, కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అర నిమిషంలోనే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక రాజ్యసభ సమావేశం కాగానే ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఇటీవలే ఎన్నికైన నూతన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌లు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రాజ్యసభ