రామకృష్ణVijayawada

18:39 - April 16, 2018

విజయవాడ : ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం దిగిరావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని...పార్లమెంట్ లో చేసిన చట్టాలను అమలు చేయాలని చెప్పారు. 2014 ఏప్రిల్ 20న ఏ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీ నేతలు అర్ధసత్యాలు, అవాకులు, చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. ఏపీ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఆ పార్టీ నేతలు చదువుకోవాలని.. మ్యానిఫెస్టోను అమలు చేయాలన్నారు. లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని, విజయవంతం చేసినందకు అభినందలు తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట..లేకుంటే మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆధ్వాన్నంగా మాటమార్చుతున్నారని చెప్పారు. మాటమార్చుకోవడం మానుకోవాలని హితవుపలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తమను ప్రశ్నిస్తున్న చంద్రబాబు ఏపీలో దీక్ష ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు. మోడీ, చంద్రబాబు పాపాలు చేశారని చెప్పారు. ఈ  పాపంలో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవపట్టించారని... మభ్య పెట్టారని మండిపడ్డారు. ఇద్దరి పాపాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మోడీకి దిమ్మతిరిగే విధంగా బ్లాక్ డే పాటిస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు బిజిలీ బంద్ పాటించాలన్నారు.

 

14:41 - April 6, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేకహోదా సాధించే వరకు పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. పాదయాత్ర ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో బోఫోర్స్ అంశంపై నిరవధికంగా పార్లమెంట్ గందరగోళంలో చిక్కుందని..మళ్లీ ఇప్పుడు అని అన్నారు. పవన్ కళాక్యణ్ చెప్పిన అవిశ్వాసం చుట్టు రాజకీయాలు తిరిగాయని అన్నారు. మోడీకి ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పై గౌరవ ఉంటే పార్లమెంట్ లో చేసిన చట్టాలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని చెప్పారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు సీపీఎం, సీపీఐ, కార్యాలయాలకు వెళ్లలేదన్నారు. ఏపీలో ఏపీ ఉద్యమమే జరగాలన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేమన్నారు.

 

21:49 - April 4, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమ సెగలు ఢిల్లీని తాకాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. లెఫ్ట్‌పార్టీలతో కలిసి చేపట్టబోయే ఆందోళనలతో  కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సిందే అన్నారు.  ఢిల్లీలో టీడీపీ, వైసీపీలు చేస్తున్న హంగామా వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు లెఫ్ట్‌పార్టీ నేతలు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు రాజకీయ ప్రయోజనాలకోసమే డ్రామాలాడుతున్నాయని ధ్వజమెత్తారు. జనసేనతో కలిసి ఈనెల ఆరున రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపడతామని  కమ్యునిస్టు నేతలు ప్రకటించారు. 
ఐక్యంగా ఉద్యమం 
ఏపీకి ప్రత్యేక హోదా, విభజనహామీలపై పోరాటాన్ని ఉధృతం చేయడానికి లెఫ్ట్ పార్టీలు, జనసేనపార్టీలు కార్యచరణ ప్రకటించాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఐ, సీపీఎం రాష్ట్రకార్యదర్శులు రామకృష్ణ, మధుతో విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం... భవిష్యత్‌  ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.  
టీడీపీ, వైసీపీ విమర్శలతోనే కాలక్షేపం 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తే.. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిని మరిచిపోయి.. పరస్పరం విమర్శలకు దిగుతున్నాయని జనసేన అధినేత పవన్‌  విమర్శించారు.  ప్రత్యేక హోదా సాధనలో భాగంగా  ఏప్రిల్‌ 6న రాష్ట్ర వ్యాప్తంగా  జాతీయ రహదారులపై పాదయాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. రాబోయే రోజుల్లో వామపక్షాలతో కలిసి నిర్వహించే  ప్రత్యేక హోదా పోరు సెగలు ఢిల్లీనీ తాకుతాయన్నారు పవన్‌ కల్యాణ్‌.   
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని బలహీనపర్చే కుట్రలు
కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని వామపక్షాల నేతలు ఆందోళన వెలిబుచ్చారు.  చట్టాలను బలహీనపరుస్తూ .. దళితులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  ఏపీ అంటే అమరావతి,పోలవరం అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీ అంటే అనంతపురం నుంచి పార్వతీపురం అని ఆయన తెలుసుకోవాలన్నారు. అభివృద్ధిని అమరావతి చుట్టే కేంద్రీకృతం చేస్తూ.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని లెఫ్ట్‌ నేతలు విమర్శలు గుప్పించారు. అటు విపక్ష వైసీపీ కూడా రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రత్యేకహోదా, పార్లమెంటులో అవిశ్వాసం అంటూ డ్రామాలు మొదలు పెట్టిందని వామపక్షనేతలు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల వైఖరిని ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా  సభలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మేధావులు, యువతను సమన్వయం చేస్తూ ఉద్యమాన్ని నడిపిస్తామని తెలిపారు. మొత్తానికి జనసేనానితో కలిసి  ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన కమ్యూనిస్టుపార్టీలు.. ఏపికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లతామని స్పష్టం చేశారు. 

 

Don't Miss

Subscribe to RSS - రామకృష్ణVijayawada