రాముడు

14:58 - October 22, 2017

'రాముడు'లో మంచితనం లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె రచించిన 'రామయణ విషవృక్షం' పై స్పందించారు. రాజు అనే పెద్ద దొర అని..అతనికి ఆస్తి..భూమి విపరీతంగా ఉంటుందన్నారు. రాముడు..రావణుడులు ఇద్దరు రాజులని, ఇందులో గొప్ప ఏముందన్నారు. రాజు అనే వాడు దోపిడి దారుడని..రాముడులో ఒక మంచితనం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ రాముడిపై కవి ఎందుకు రాశాడు అంటే అతనికి అంతకంటే జ్ఞానం లేదన్నారు. రామాయణంలో ఏ చెడ్డ క్యారెక్టర్లు అన్నారో అవి మంచి క్యారెక్టర్లు అని..ఏవీ గొప్ప క్యారెక్టుర్లు అని పేర్కొన్నారో..అవి చెడ్డ క్యారెక్టర్లని విమర్శించారు. సీత..ఊర్మిళ..వీరి తప్పేమి లేదని..భర్తలు ఎలా చెబితే అలా విన్నారని పేర్కొనడం జరిగిందన్నారు. మతం అనేది ద్రోహం..రాజు పెద్ద ద్రోహి అని, మార్క్సిజం చదివిన అనంతరం ఈ పుస్తకం రాసి 'రామాయణ విషవృక్షం' అని పేరు పెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి పేరు పెట్టవద్దని ముద్రణ చేసే వ్యక్తి కోరడం జరిగిందన్నారు. ముందు శ్రీశ్రీతో మాట్లాడాలని అతను సూచించడం జరిగిందని కానీ తాను శ్రీశ్రీని ఇష్టపడనని..అతని కవిత్వం బాగుండొచ్చన్నారు. ఎవరితోనూ మాట్లాడనని ఖరాఖండిగా చెప్పడం జరిగిందన్నారు. చివరకు ముద్రణ వేయడం..మంచి అమ్మకాలు జరిగాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:28 - August 15, 2017

ఢిల్లీ : రాముడు, కృష్ణుడు ఆదర్శ పురుషులని.... ఆలమందను కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడని ప్రధాని గుర్తుచేశారు... పరిపానల అంటే ఇలా ఉండాలంటూ రాముడు ఆచరించి చూపారని మోదీ చెప్పారు.. 125 కోట్ల మంది భారతీయులందరం ఒక్కటై కొత్త సంకల్పంతో ఏదైనా సాధించగలమని.. ఆ దిశగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

13:11 - April 5, 2017

భద్రాద్రి : పుణ్య దంపతులుగా భక్తులు భావించే సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో ఈ కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సిగ్గులొలికే సీతమ్మ మెడలో అందాల రాముడు మూడుముళ్లు వేశాడు. ముత్యాల తలంబ్రాలు సీతారాముల శిరస్సులపైనుంచి జాలువారాయి. వేదమంత్రోచ్ఛరణలతో భద్రాద్రి మారుమోగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి లు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతరు అధికారులు పాల్గొన్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12.00 గంటలకు అభిజిత్ లగ్నమున సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. శిల్పకళా శోభితమై అలరారే కల్యాణమండపంలో జరిగే జగదభి రాముడి కల్యాణాన్ని కనులారా తిలకించి తరించేందుకు భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.

08:18 - April 5, 2017

హైదరాబాద్ : ఈసారి భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరు కావడం లేదు. ప్రభుత్వం తరపున శ్రీరాముడికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. కానీ బుధవారం ఉదయం వరకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు కాలేదు. ఆఖరి నిమిషంలో పర్యటన రద్దయ్యింది. దీనితో ప్రభుత్వం తరపున శ్రీరాముడికి పట్టువస్త్రాలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి దంపతులు అందచేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:51 - December 7, 2016

కర్నూలు : ఫ్యాక్షన్ కక్షలకు కేంద్ర బిందువుగా వుండే రాయలసీమలో మరోసారి పాతకక్షల నేపథ్యంలో ఫ్యాక్షన్ రాజకీయాలు బైటపడ్డాయి. టీడీపీ నేతను ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్నూలు నగర శివారులోని హంద్రినీవా కాలువ వద్ద చోటుచేసుకుంది. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ పార్టీ ఇన్ చార్జ్ ముఖ్య అనుచరుడిగా వుండే కురువ రాముడు అనే వ్యక్తిని ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి అనంతరం రాడ్డులతో మోది.. దారుణంగా హత్య చేశారు. రాముడు పనిమీద కర్నూలు వెళ్లి స్వగ్రామం రుద్రవరానికి వస్తుండగా దారిలో కాపుకాసిన ప్రత్యర్ధులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. రాముడి హత్యతో రుద్రవరంలో ఉద్రిక్తత నెలకొంది. కాగా రాముడు కల్లూరు మండలం రుద్రవరం గ్రామ జడ్పీటీసీ మాధవికి మామ అవుతాడు. ప్రత్యర్ధులు హత్యచేసిన ప్రమాదంగా మార్చటానికి యత్నిస్తున్నారని హతుడి బంధువులు పేర్కొంటున్నారు. 

15:42 - November 6, 2016

విజయవాడ : మావోయిస్టు నేత ఆర్కే తమ వద్ద లేడనే విషయాన్ని కోర్టుకు తెలిపామని ఏపీ డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. పోలీసులపై బురదజల్లడం మావోయిస్టులకు అలవాటే అన్నారు. మావోయిస్ట్‌లది మొదటి నుంచి ప్రతికార ధోరణే అన్నారు. ఆయుధాలు లేకుండా చర్చలకు రమ్మని మావోయిస్టలును కోరుతున్నామని చెప్పారు. గాయపడిన మావోయిస్ట్‌లు లొంగిపోతే పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామన్నారు. కటాఫ్ ఏరియాలో వారం కిందటే బలగాలను ఉపసంహరించుకున్నామని చెప్పారు. 

15:24 - October 5, 2016

వారణాసి : ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి ? వచ్చిన అవకాశాన్ని వదలరు. అది ఏ కార్యక్రమమైనా అందులో తమ పార్టీని ప్రచారం చేసుకోవాలని అనుకుంటారు. సరిగ్గా అదే జరిగింది. రెండు..మూడు రోజుల్లో 'దసరా' పండుగ రానున్న సంగతి తెలిసిందే. దీనిని చక్కగా వినియోగించుకోవాలని కాషాయ దళం యోచించింది. బుధవారం వారణాసిలో ఓ పోస్టర్ వెలిసింది. బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ పోస్టర్ ను వేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధం చేస్తున్న 'రాముడిగా' చిత్రీకరించారు. మరి రావణుడిని ఎవరు అనుకుంటున్నారా ? పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ను చిత్రీకరించారు. ఓరీ.. రావణా కాసుకో.. ఇంకా ఒకే ఒక్క సర్జికల్ స్ట్రైక్ బాణంతో నీ కథ ముగుస్తుంది అని మోడీ హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి. ఇక రావణుడి కొడుకు మేఘనాథుడిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గా చిత్రీకరించారు. ఇటీవలే భారత ఆర్మీ అధికారులు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్ పై కేజ్రీవాల్ పలు వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్మీ ఆపరేషన్ కు కూడా రాజకీయాలు జోడించడంపై పలువురు నోరెళ్ల బెడుతున్నారు. 

07:32 - July 23, 2016

విజవయవాడ : పోలీస్‌శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాలుగువేలకుపైగా పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే పరీక్షల్లోనూ మార్పులు చేసింది. పోలీస్‌ ఉద్యోగం పట్ల యువతలో ఉన్న భయాలను పోగొట్టడానికి ఈ సారి కొత్త పద్ధతులను అవలంబించనుంది.

రాష్ట్ర విభజన తర్వాత పోలీస్‌శాఖలో 14వేల ఖాళీలు...
రాష్ట్ర విభజన తర్వాత.. పోలీస్‌శాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా 14 వేల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఫలితంగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పని ఒత్తిడి బాగా పెరిగింది. దీంతో అదనంగా పోలీసులు అవసరమని పోలీస్‌శాఖ ప్రభుత్వాన్ని కోరింది.

తొలివిడతగా 4,548 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..
దశల వారీగా పోలీస్‌శాఖలో పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. తొలి విడతగా వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. దాదాపు నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీ డీజీపీ రాముడు విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. హాల్ టిక్కెట్లను కూడా వెబ్ సైట్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

5 కిలోమీటర్ల పరుగుకు స్వస్తి..3 టెస్టు‌లు మాత్రమే నిర్వహణ..
అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే పరీక్షల్లోనూ మార్పులు చేశారు. ఐదు కిలోమీటర్లు పరుగుపై చాలామంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని.. ఈ మేరకు దానికి స్వస్తి చెప్పామని డీజీపీ తెలిపారు. ఆ స్థానంలో కేవలం ఒక మైలు పరుగు మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఐదు ఫిజికల్ టెస్టులకు బదులు మూడు టెస్ట్‌లు మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షలు కారణంగా పోలీసు ఉద్యోగాలకు రావడానికి అనేక మంది భయపడుతున్నారని.. దీనిని దూరం చేయడానికి ఈ కొత్త పద్ధతిని అవలంబిస్తున్నామని డీజీపీ చెప్పారు.

అన్ని పోస్టులూ ఒకేసారి భర్తీకి అవకాశం లేదు : డీజీపీ రాముడు
అన్ని పోస్టులనూ ఒకేసారి భర్తీ చేయడానికి అవకాశం లేదని డీజీపీ తెలిపారు. ఏపీలో పోలీస్‌ అకాడమీ లేనందున..ట్రైనింగ్‌ ఇచ్చే పరిస్థితి లేదని అందుకే విడతల వారీగా పోస్టుల భర్తీ చేయడం జరుగుతుందన్నారు. 

18:49 - July 21, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జీ డీజీపీగా నండూరి సాంబశివరావు నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ జీవీ రాముడు ఈనెల 23న పదవీవిరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో 1984 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సాంబశివరావును ఇంఛార్జ్ డీజీపీ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సాంబశివరావు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాంబశివరావు ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ పూర్తి చేశారు.  

17:13 - May 29, 2016

ఖమ్మం : రాముడి దర్శనం కోసం కొంతమంది భక్తులు వివిధ రకాలుగా భద్రాద్రికి చేరుకుంటుంటారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కొంతమంది భక్తులు పాదయాత్ర ద్వారా భద్రాద్రికి పయనమయ్యారు. 41 రోజుల మాల ధరించిన హనుమాన్ భక్తులు 287 కిలోమీటర్ల వరకు నడచుకుంటూ వెళుతున్నారు. ఎండలు దంచికొడుతున్నా భక్తితో చెప్పులు వేసుకోకుండా వీరు కాలినడక చేస్తున్నారు. పాల్వంచ ప్రధాన రహదారిపైనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఈ భక్తులు భద్రాద్రికి పయనమయ్యారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రాముడు