రామ్ చరణ్

18:16 - October 4, 2018

హైదరాబాద్ : తెలుగు బిగ్ బాస్ 2'లో కౌశల్ ఒక సునామి. ఒంటరిపోరులో విజయం సాధించిన విజేత కౌశల్. అప్పటి వరకూ సాధారణ సెలబ్రిటీగా వుండే కౌశల్ బిగ్ బాస్ 2 తరువాత ఆ గేమ్ కొనసాగుతున్న నేపథ్యంలోను కూడా బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయిపోయాదు. ఇది సాధారణంగా వచ్చిన క్రేజ్ కాదు.ఇది కేవలం అతని వ్యక్తిత్వం..నమ్మినదానినే ఆచరించటం..సాటి వ్యక్తుల పట్ల వుండే గౌవరం..సాటివారికి సహాయం చేసే సహజగుణం కౌశల్ లక్షణం.. వీటితోనే అతని వ్యక్తిత్వం బిగ్ బాస్ తో వెలుగులోకి వచ్చింది. మరింతగా ఇనుమడించింది. దీనిపై గిట్టనివారు ఎన్ని విమర్శలు చేసిన అది వారు అసూయతో చేసేదే తప్ప మరేమీ కాదని అశేష అభిమానులు సాటి చెప్పారు. 16మంది పాల్గొన్న ఈ గేమ్ షోలో ఒక్క కౌశల్ కే ఇంతటి క్రేజ్ వచ్చింది అంటే మిగతా కంటెస్టెన్స్ లో ఎక్కడో ఒక్క చోట అయినా ఫేక్ నెస్ కనిపించకమానలేదు అని ఫ్రూవ్ అయింది. ఇదిలా వుంటే బిగ్ బాస్ కౌశల్ వ్యక్తిత్వానికి దర్పణంగా నిలిచిన నేపథ్యంలో అతని క్రేజ్ తో కెరీర్ మరింతగా బాగుంటుందని నమ్మవచ్చు. ఈ నేపథ్యంలో ఈ క్రేజ్ కారణంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఆయనపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. చరణ్ హీరోగా బోయపాటి చేస్తోన్న సినిమాలో కౌశల్ తో ఒక ముఖ్యమైన రోల్ చేయించనున్నట్టు టాక్ వచ్చింది. నెగెటివ్ షేడ్స్ తో ఈ పాత్ర ఉంటుందని సినీ వర్గాల సమాచారం. 

11:21 - September 22, 2018

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని దృష్టిలోపెట్టుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా,భారీబడ్జెట్ కేటాయించి నిర్మించాలని డిసైడ్ అయిపోయాడు. 
ఇదిలాఉంటే ఎన్టీఆర్ హీరోగా రామ్ చరణ్ ఒక సినిమా నిర్మించే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్త ఒకటి ఫిలింనగర్ లో వినిపిస్తుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తూనే,కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ చేసి, తండ్రి చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చిరుతో సైరా మూవీని నిర్మిస్తున్నాడు. దాని తర్వాత తన బ్యానర్లో ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనుకుని చరణ్,ఎన్టీఆర్ ని అడగడం ఎన్టీఆర్ ఓకే చెప్పడం జరిగిందట.కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై హై బడ్జెట్ సినిమాలు,మరో సెకండ్ బ్యానర్లో స్మాల్ అండ్ మీడియం సినిమాలు నిర్మిస్తానని గతంలో చరణ్ చెప్పాడు. చిన్న సినిమాల సంగతేమో కానీ,ఎన్టీఆర్ హీరో గా,చరణ్ నిర్మాణం అంటే, ఆటోమేటిక్ గా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. వీళ్లిద్దరూ కలిసి రాజమౌళి #RRR లో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేస్తున్న అరవిందసమేత అక్టోబర్10న, బోయపాటితో చరణ్ చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.. 

18:25 - August 29, 2018

హైదరాబాద్ : హరికృష్ట మరణం తన మనసుని కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హరిక్రిష్ట పార్దీవదేహానికి నివాళులర్పించిన అనరంతరం చిరంజీవి మాట్లాడుతు..ఆయన మరణంతో ఆప్యాయంగా పలకరించే ఓ మంచి మిత్రుడు అకాలంగా మరణించటం చాలా బాధాకరమని చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ కనిపించినా సరదాగా జోకులు వేసే హరికృష్ణ ఇక కనిపించరంటే చాలా బాధగా వుందన్నారు. కాగా చిరంజీవి వెంట ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా హరికృష్ణకు నివాళులర్పించారు.  ఇప్పటికే హరికృష్ణకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. 

13:25 - August 21, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. టీజర్ ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రామచరణ్, శ్రీజ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ 'ఈ సినిమా నాన్న డ్రీమ్ ప్రాజెక్టు అని అన్నారు. సినిమా బడ్జెట్ ఎంత అనేది చెప్పలేను...కానీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడబోమని చెప్పారు. ప్రాఫిట్ వస్తే బోనస్..రాకుంటే సంతోషం అన్నారు. సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేస్తామన్నారు. అన్ని సౌత్ ఇండియా ల్యాంగ్వేజ్ లలో సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు. 

 

14:31 - August 2, 2018

మోగా స్టార్ రీఎంట్రోలో రెండవ సినిమా అయిన 'సైరా' లో హేమా హేమీ నటులు నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మాణంలో వస్తున్న సైరాలో బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు.

బిగ్గెస్ట్ స్టార్లతో సైరా..
అగ్రహీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార కథానాయికగా నటిస్తుండగా, ముఖ్య పాత్రల్లో అమితాబ్..జగపతిబాబు..సుదీప్..విజయ్ సేతుపతి నటిస్తున్నారు. వీరి వీరి పాత్రలు ఇప్పటకే ఖరారైనట్లుగా తెలుస్తున్నా..తమిళ నటుడు విజయ్ సేతుపతి పాత్రపై ఉత్కంఠ నెలకొంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన విజయ్ సేతుపతికి తమిళనాట మంచి క్రేజ్ వుంది. నటుడిగా, నిర్మాతగా, పాటల రచయితగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
'ఓబయ్య' గా విజయ్ సేతుపతి..
ఈ సినిమాలో ఆయన 'ఓబయ్య' అనే తమిళుడి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఆంగ్లేయులతో పోరాట సమయంలో తెలుగువారిని .. తమిళులని ఏకం చేయడానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రయత్నంలో భాగంగా సైరా కుడిభుజంగా ఓబయ్య వ్యవహరిస్తాడని సినీ పరిశ్రమ సమాచారం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పాత్రను తీర్చిదిద్దారని..విజయ్ సేతుపతి కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్రగా నిలిచిపోతుందని సమాచారం. 

14:18 - August 2, 2018

రీ ఎంట్రీతో వచ్చి మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి తన రెండో సినిమాను బయోపిక్ తో వస్తున్న విషయం తెలిసందే. బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 'సైరా' చిత్రం తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడపాదడపా చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఉయ్యాలవాడ వంశీకుల నుంచి నిరసనల పర్వం ఎదురవుతోంది.

కంటతడి పెట్టిన ఉయ్యాలవాడ వంశీకులు..
తమ వంశానికి చెందిన ఓ గొప్ప వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుడటంతో ఉయ్యాలవాడ వంశీలుకు సంతోషపడుతున్నారు. కానీ తమను ఏమాత్రం గుర్తించడంలేదని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తు..ఆవేదన వ్యక్తం చేస్తు కంటతడి పెట్టారు. తమను కర్నూలు నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నామని... చిరంజీవి కానీ..రామ్ చరణ్ కానీ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవిగారు వచ్చి మాట్లాడతారని చెబుతూనే ఉన్నారని... ఇంతవరకు అది జరగలేదని వాపోయారు. 

10:38 - July 23, 2018

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న వేళ సోషల్ మీడియాలో చిన్ని చిన్న పొరపాట్లు జరుగతుండటం సహజంగా జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్ ను సెలబ్రిటీలు తమ సందేశాలుగా వినిగిస్తుండటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ట్విట్టర్ లో చిన్నిపాటి అంతరాయం ఏర్పడినా దానిపై కూడా సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో మోగా పవర్ స్టార్ భార్య ఉపాసన ట్విట్టర్ లో తలెత్తిన అసౌర్యంపై స్పందించారు. తన భర్త రామ్ చరణ్ పెట్టిన ఓ వీడియో ప్లే కావడం లేదని ట్విట్టర్ కు ఫిర్యాదు చేశారు ఉపాసన కామినేని. నిన్న ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పుట్టిన రోజు కావడంతో, 'హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ అభయ్ రామ్. హ్యావ్ ఏ సూపర్ బర్త్ డే' అని క్యాప్షన్ పెడుతూ, ఓ వీడియోను రామ్ చరణ్ పోస్టు చేశాడు.

అయితే ట్విట్టర్ లో అది ప్లే కావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన ఉపాసన, 'ట్విట్టర్ సపోర్ట్'ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. వీడియో లోడ్ కావడం లేదని చెబుతూ, ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న అదే వీడియో లింక్ ను పోస్ట్ చేశారు. అంతకుముందు వేల మంది రామ్ చరణ్ వీడియోను చూసేందుకు ప్రయత్నించి విఫలమై, వీడియో రావడం లేదని కామెంట్లు పెట్టారు.

14:58 - June 28, 2018

సినిమా పరిశ్రమలో జక్కన్నగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. దర్శకుడిగా ఇప్పటి వరకూ ఒక్క ప్లాప్ కూడా రాజమౌళివైపు కన్నెత్తికూడా చూడలేదు. స్టూడెంట్ నంబర్ వన్ నుండి అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బాహుబలి వరకూ విజయాల పరంపరం జక్కన్నకు ఒక్కడికే సొంతమయ్యింది. హిట్ దర్శకులు ఎంతమంది ఉన్నా ఒక్క ప్లాప్ కూడా లేని ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి. అందుకే అతనితో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద హీరోలు కూడా వేచి చూస్తుంటారు. బాహుబలి స్వీక్వెల్స్ తో దాదాపు ఐదు సంవత్సరాల పాటు బైటప్రపంచం గురించి కూడా పట్టించుకోని జక్కన్న నెక్ట్స్ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి జక్కన్న మెగా మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదికూడా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తో . ఇక ప్రేక్షకుల అంచనాలు ఊహకు అందకుండా వున్నాయి. మరి ఈ మెగా మల్టీ స్టారర్ లో ఆ బిగ్గెస్ట్ హీరోలు ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోయింది. మరి వారి రేంజ్ కు తగినట్లుగా హీరోయిన్స్ కూడా వుండాలి కదా మరి!. మరి ఆ హీరోయిన్స్ ఎవరాని ప్రేక్షకులు ఆసక్తికి అంతులేకుండా వుంది.

డిసెంబర్లో షూటింగులో పాల్గొననున్న చరణ్
రాజమౌళి తాజా చిత్రంగా భారీ మల్టీ స్టారర్ చిత్రానికి అందుకు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమా, అక్టోబర్లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. నవంబర్లో ఎన్టీఆర్ .. డిసెంబర్లో చరణ్ షూటింగులో జాయిన్ కానున్నారు. ఈ ఇద్దరు హీరోల సరసన కథానాయికలుగా ఎవరు నటించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది.

12:09 - May 25, 2018

సినిమా పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్. అలాగే పలు సేవాకార్యక్రమాలలో కూడా తన పెద్దమనస్సును చాటుకుంటుంటారు. ఎన్నో గుప్తదానాలు చేస్తుంటారని సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు పేదల కోసం చిరంజీవి ''చిరంజీవి ఫౌండేషన్ ను స్థాపించిన మెగాస్టార్ పలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుని విభిన్నమైన సినిమాలతో అభిమాలను మెప్పిస్తున్న చరణ్ ఇప్పుడు తండ్రి చిరంజీవి బాటలోనే అడుగులు వేయబోతున్నారు. త్వరలోనే తాను కూడా పేదలకు ఉపయోగపడే ఓ ఫౌండేషన్ ను స్థాపించనున్నట్టు చరణ్ ఇటీవల తెలిపాడు. తనకు వచ్చే పారితోషికంలో 15శాతం వరకు ఈ ట్రస్ట్ కు ఇస్తానని ప్రకటించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి సేవ చేసే అవకాశం ఉంటుందని చరణ్ తెలిపాడు.

బైటవారి నుండి ఎటువంటి ఫండ్ తీసుకోవటం లేదు : చరణ్
గత దశాబ్దకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేస్తున్నామని... తమకు వస్తున్న పారితోషికంలో కొంత మొత్తాన్ని ఆ ట్రస్ట్ కు కేటాయిస్తున్నామని రామ్ చరణ్ చెప్పాడు. ఇప్పటి వరకు ఆ ట్రస్ట్ కు బయటవారి నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకోలేదని చరణ్ తెలిపాడు. ఈ సేవలు మరింత ఎక్కువ మందికి చేరాలనే సదుద్దేశంతోనే మరో ఫౌండేషన్ ను స్థాపించబోతున్నట్టు..ఈ ఫౌండేషన్ ను అభిమానులకు అంకితం చేస్తామని అన్నాడు. కొత్త ఫౌండేషన్ ను స్థాపించాలనే ఆలోచన తన తండ్రిదేనని చెప్పాడు. 

06:40 - May 25, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ ప్రకటించారు. 'ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే ప్రచారం చేద్దామనుకున్నానని.. కానీ అప్పుడు బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోలేదన్నారు చెర్రీ. బాబాయ్‌ చాలా కష్టపడుతున్నారని.. అనుమతిస్తే జనసేన తరపున ప్రచారం చేస్తానని చరణ్‌ ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చెర్రీ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. చెర్రీ తాజా వ్యాఖ్యలపై పవన్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రామ్ చరణ్