రామ్ నాథ్ కోవింద్

16:25 - July 20, 2017

ఢిల్లీ : భారత 14 వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. 66.65 శాతం ఓట్లతో ఎన్ డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ గెలిచారు. కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈనెల 25న రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:16 - July 17, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశ వ్యాప్తంగా ఓటు వేసేందుకు 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఈనెల 20న ఓట్లను లెక్కించి అదే రోజున ఫలితాన్ని ప్రకటించనున్నారు. 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే తరపున రామ్ నాథ్ కోవింద్, ప్రతిపక్షాల తరపున మీరా కుమార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు.

ఎంపీలు..ఎమ్మెల్యేల ఓటు..
పార్లమెంట్ లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 721 ఎంపీలు ఓటు వేశారు. వివిధ రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా అసెంబ్లీలో ఓటు వేశారు. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ ఎంత నమోదు అయ్యింది ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. అనారోగ్యం..బయట దేశాల్లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఢిల్లీ పార్లమెంట్ కు బ్యాలెట్ బాక్స్ లు చేరుకుంటాయి. ఇదిలా ఉంటే ఓటింగ్ లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కోవింద్ కు 60 శాతం ఓటింగ్ నమోదవుతుందని ఎన్డీయే భావిస్తోంది.

అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేశారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

18:59 - July 4, 2017
18:52 - July 4, 2017
09:33 - June 23, 2017

ఢిల్లీ : నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వెంకయ్య, అరుణ్ జైట్లీ పాల్గోంటారు. రామ్ నాథ్ కోవింద్ ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10గంటల వరకు దేశంలోని బీజేపీ రాష్ట్రాపాలిత ముఖ్యమంత్రులు పార్లమెంట్ కు చేరుకుంటారు. కోవింద్ మద్దతుగా తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కోవింద్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సాయంత్రం ప్రధాని మోడీ విందు ఇవ్వనున్నారు. మరోవైపు విపక్షాల అభ్యర్థి మీరా కుమారి రెండు, మూడు రోజుల్లో నామినేషన్ వేసే అకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:38 - June 19, 2017

ఢిల్లీ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది. కాసపేటి క్రితం రాష్ట్రపతి అభ్యర్థి పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా సమావేశంలో వెల్లడించారు. బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే మిత్రపక్షాలతో సుదీర్ఘ చర్చల అనంతరం రామ్ నాథ్ పేరును ఖరారు చేయడం జరిగిందని షా పేర్కొన్నారు. బీజేపీలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన దళిత వ్యక్తి అని, రామ్ నాథ్ పేరును ఖరారు చేసిన విషయం విపక్షాలకు ఫోన్ లో తెలియచేయడం జరిగిందన్నారు.

మోడీ ఫోన్ లు..
ఎన్డీయే పక్ష ముఖ్యమంత్రులు..తటస్థంగా ఉన్న ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో మోడీ మాట్లాడారు. మరోవైపు సోనియా, మన్మోహన్ తో ప్రధాని మోడీ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేసినట్లు ఎన్డీయే పక్ష..ఇతర పక్షాల నేతలకు ప్రధాని తెలిపారు. మమతా బెనర్జీతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ..అద్వానీ..మురళీ మనోహర్ జోషి..వామపక్ష నేతలతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు మాట్లాడారు. ఆయా పార్టీలు చర్చించి తమకు మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

1945లో జననం..
రాంనాథ్ 1945 అక్టోబర్ 1న ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన దళిత నేత. యూపీ నుండి 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా..బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. హైకోర్టు..సుప్రీంకోర్టులో రాంనాథ్ న్యాయవాదిగా పనిచేశారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం రాంనాథ్ కోవింద్ 23 నామినేషన్ వేయనున్నారు.

14:29 - June 19, 2017

ఢిల్లీ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను బీజేపీ ఖరారు చేసింది. కాసేపటి క్రితం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు విషయంలో టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందించారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ, ఎన్డీయే పక్షాలు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించాయని, పేరుకు సంబంధించిన విషయంలో అద్వానీ, సుమిత్రా మహజన్ తదితర పేర్లు రాజకీయ వర్గాల్లో..మీడియాలో ప్రచారం జరిగిందన్నారు. రాంనాథ్ కోవింద్ కు మూడు అంశాలు కలిసి వచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు. ఇతను రాజ్యసభలో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించడం..1994-2006 ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపిక..బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం..న్యాయపరమైన పరిజ్ఞానం..రాజ్యాంగంపై అనుభవం ఉండడం..కలిసి వచ్చాయన్నారు. ఇంకా మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss

Subscribe to RSS - రామ్ నాథ్ కోవింద్