రాయలసీమ

13:08 - November 1, 2018

కర్నూలు : రాయలసీమను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 13మంది చనిపోయారు. మరోవైపు ఈ వ్యాధి నెల్లూరు జిల్లాకు వ్యాపిచండంతో.. వైద్య శాఖ అలర్టైంది. గుంటూరు నుంచి ప్రత్యేక వైద్యులను రప్పించి.. వ్యాధి విస్తరణకు గల కారణాలను అన్వేషిస్తోంది. 

కర్నూలు జిల్లాను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. రోజురోజుకు ప్రభుత్వాస్పత్రికి వచ్చే స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. చలిగాలుల తీవ్రత పెరుగుతుండటంతో.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వాధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గ్రామాల్లో పరిస్థితి ఏ  మాత్రం మారడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 37 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదుకాగా... 12 మంది మృతి చెందారు. బుధవారం మరొకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 13కు చేరింది.  మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రామాంజనేయులు, పాములపాడుకు చెందిన క్రిష్టమ్మగా గుర్తించారు.

స్వైన్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. స్వైన్ ఫ్లా వ్యాధి పై  అధ్యాయానికి గుంటూరు డాక్టర్ల కమిటీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది. గుంటూరు నుండి కర్నూలు చేరుకున్న డాక్టర్ల బృందం జిల్లాలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ  కేసులుపై అధ్యయనం చేస్తోంది.  స్వైన్ ఫ్లూ కేసులు పెరగటానికి కారణాలను అన్వేషిస్తోంది. అధ్యయనం తరువాత రిపోర్టును డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అందజేయనుంది. 

మరోవైపు ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ వ్యాధి నెల్లూరు జిల్లాకు విస్తరించింది. జిల్లాలో అధికారికంగా 11 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌, చెన్నై ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించారు. నెల్లూరు నగరంలో ఐదు, చిట్టమూరు, సౌత్‌ మోపూరు,  బుచ్చిరెడ్డిపాళెంలో రెండేసి వంతున స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.  జిల్లాలో స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు  సదస్సులు నిర్వహిస్తున్నారు.  

17:23 - October 10, 2018

అనంతపురం: శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయిదు నదులు అనుసంధానం చేసి మహాసంగమం  సృష్టిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భైరవానితిప్ప వద్ద కుందుర్పి ఎత్తిపోతల పధకానికి శంకుస్దాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గంటడికోటకు నీళ్లిస్తే పార్టీ ఉనికికి ప్రమాదమని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన మనుషులతో కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. 
ఈ రోజు రాయలసీమలో  అన్ని జిల్లాలకు నీళ్లివ్వగలుగుతున్నానని, తాను చేసే అబివృధ్ది పనులకు అడ్డుపడితే బుల్లెట్లా దూసుకుపోతానని చంద్రబాబు అన్నారు. ప్రతి సోమవారం నీరు-ప్రగతి మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నానని, సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని దాని మీద శ్రధ్దపెట్టానని ,ఇప్పటికి 60 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని 2019 కల్లా పోలవరాన్ని పూర్తిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నానని వీటిలో 47 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని,గోదావరి,కృష్ణా, నదులు అనుసంధానం చేసామని, గోదావరి,పెన్నా నదుల అనుసంధానానికి చెందిన పనులు త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్య్తతులో శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా వంశధార,నాగావళి,గోదావరి,కృష్ణ,పెన్నా,నదులు అనుసంధానం చేసి మహా సంగమాన్నిసృష్టిస్తానని  చంద్రబాబు అన్నారు.

12:18 - July 21, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్ధేశ్యం బిజెపికి..తెచ్చే ఉద్ధేశ్యం టిడిపికి లేదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు, పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు. హోదా విషయంలో టిడిపి, బిజెపిలు డ్రామాలు ఆడుతున్నారని, 2019 సంవత్సరంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే ఏపీకి 'హోదా' ప్రకటిస్తుందన్నారు. 

21:05 - July 11, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు సూచించిన నేత ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరవు నేలపై కేంద్ర వివక్ష పేరుతో అనంతపురంలో టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షలో ప్రసంగించిన ఎంపీలు, మంత్రులు... బీజేపీ, వైసీపీ, జనసేనను టార్గెట్‌ చేశారు. రాయలసీమ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు అనంతపురంలో దీక్ష చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. దీక్షా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రారంభించారు.
నిరసన దీక్షలో ప్రసంగించిన సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే... అన్ని హక్కులు సాధించుకోవచ్చన్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తప్పేది చంద్రబాబేనని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని చెప్పారు.

రాయలసీమ.. ముఖ్యంగా అనంతపురం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోడాన్ని ఎంపీ తోట నరసింహం తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఎంపీ నిమ్మల కిష్టప్ప మండ్డిపడ్డారు. కరువు సీమపై కేంద్ర వివక్షకు నిరసనగా టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

09:58 - June 15, 2018

కడప : అంతకుముందు కడప ఉక్కు కర్మాగారం నిర్మించడం సాధ్యం కాదంటూ.. కేంద్రం తేల్చి చెప్పడంతో.. రాయలసీమ వాసులు రగిలిపోతున్నారు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. వామపక్షాల నేతలు.. సీమ నాలుగు జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కడప జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతలు.. వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు. 

కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం.. యూ టర్న్‌ తీసుకోవడంతో రాయలసీమ జిల్లా ప్రజల్లో ఆగ్రహం రగులుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

కడపలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.  అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే బైఠాయించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నేతలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై విరుచుకుపడ్డారు.  

ప్రొద్దటూరులో టీడీపీ ఇంచార్జి నంద్యాల వరదరాజుల రెడ్డి నేతృత్వంలో.. టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

అటు జమ్మలమడుగులోనూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో తెలుగుదేశం నాయకులూ పాల్గొన్నారు. జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ టి . తులశమ్మ ఆద్వర్యంలో స్థానిక గాంధీ సర్కిల్ నుండి ఆర్.డి.ఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్.డి.ఒ నాగన్న కు వినతి పత్రం సమర్పించారు. కడప నగరంలో సీపీఎం నాయకులు కేంద్ర ప్రభుత్వ శవయాత్ర నిర్వహించారు. బుగ్గవంకలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. 

కర్నూలులో సీపీఎం నేతలు కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం దిగొచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. 

అటు అనంతపురంలోనూ సీపీఐ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. టవర్‌క్లాక్‌ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .

11:10 - April 11, 2018

చిత్తూరు : ఏపీ బెస్ట్ ప్లేస్ అని చెప్పడం జరిగిందని, దీనికి కంపెనీ వాళ్లు సానుకూలంగా స్పందించారని తెలిపారు. తిరుపతి - చెన్నై - నెల్లూరు ప్రాంతాలు పెద్ద ఇండస్ట్రీయల్ హబ్ గా మారబోతోందని, తద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాయలసీమ, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం అభినందనీయమని, దేశంలో తాము పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు షియామీ కంపెనీ ప్రతినిధి తెలిపారు. దీనిద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. 

18:36 - April 2, 2018

కడప : రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని హైకోరు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జనచైతన్యవేదిక ఆధ్వర్యంలో కడపలో జరిగిన అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమలో హైకోర్టు అనే అంశంపై ఆయన మాట్లాడారు. పరిపాలనా వికేంద్రీకరణ జరగాలన్న శివరామకృష్ణన్‌ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని జస్టిస్‌ లక్ష్మణ్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని 5జిల్లాలకే సీఎంగా వ్యవహరిస్తున్నారని సదస్సులో పాల్గొన్న సీపీఎం నేతలు విమర్శించారు. ఈనెల 4న రాయలసీమ హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

 

18:47 - March 21, 2018

కర్నూలు : ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలులో వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని వాగ్దానం చేసిన క్రమంలో రాష్ట్ర విడిపోయిన నాలుగేళ్లవుతున్నా ఇంతవరకూ ఇచ్చిన హాలను నెరవేర్చలేకపోవటంపై వామపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, వైసీపీ, జనసేన పార్టీ నేతలు హాజరయ్యారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోరుతూ రేపు జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని నేతలు పేర్కొంటున్నారు.

17:50 - March 6, 2018

గుంటూరు : రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి సచివాలయం గేట్‌-2 ముందు రాయలసీమ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో అధికారాన్ని ఒకేచోట కేంద్రీకరించకుండా.. రాయలసీమలో కనీసం హైకోర్టును ఏర్పాటు చేయాలని బైఠాయించారు. అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ చేస్తున్నారని ఆవేదన చెందదారు. వారి ఆందోళనపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:35 - February 8, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు బంద్‌ చేపట్టాయి. దీంతో కర్నూలు జిల్లాలో ఉదయం నుండే బస్సు డిపోల వద్ద వామపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

కడప జిల్లాలో...
వామపక్షాలు చేపట్టిన బంద్ కడప జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలతో పాటు వైసీపీ, కాంగ్రెస్‌లు బంద్‌లో పాల్గొన్నాయి. కడపలో స్టీలు ఫ్యాక్టరీ, హైకోర్టు ఏర్పాటుతో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీలు వెంటనే అమలు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - రాయలసీమ