రాశీ ఖన్నా

18:50 - August 9, 2018

'శతమానం భవతి' సినిమాతో హిట్ సాధించిన దర్శకుడు 'సతీష్ వేగేశ్న' మరో సినిమాను రూపొందించారు. 'దిల్' రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందింది. పెళ్లి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో జయసుధ, ప్రకాశ్ రాజ్, నరేష్, సితారలు కాకుండా ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మూవీ రివ్యూ కోసం..రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:52 - August 24, 2017

సినిమాలో అవకాశాలు ఎలా వస్తాయి ? వారి నటన..ప్రతిభ..ఇతరత్రా కారణాలతో అవకాశాలు వాటంతటవే వస్తుంటాయి. ఇందులో హీరోయిన్లకు అందం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏ మాత్రం గ్లామర్ తగ్గినా అవకాశాలు తగ్గుముఖం పడుతుంటాయి. బొద్దుగా ఉండే వారు స్లిమ్ గా మారేందుకు యమ శ్రమ పడుతుంటారు. ఈ జాబితాలో 'రాశి ఖన్నా' కూడా చేరింది.

'ఊహలు గుసగుసలాడే' సింపుల్ లవ్ స్టోరీతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈమె నటన..గ్లామర్ చూసిన ఇతర దర్శకులు..నిర్మాతలు ఆయా చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇలా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన 'రాశీ ఖన్నా' పెద్దగా విజయాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మలో బాగా మార్పు వచ్చిందంట. ఎన్టీఆర్ సరసన 'జై లవ కుశ' చిత్రం..'టచ్ చేసి చూడు' చిత్రం..వరుణ్ తేజ హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమాల్లో అమ్ముడు ఛాన్స్ కొట్టేసింది.

కానీ ఆమెకు ఆఫర్లు ఇచ్చిన వారంతా స్లిమ్ గా కావాలని సూచించారంట. దీనితో 'రాశీ ఖన్నా' స్లిమ్ గా మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందంట. బొద్దుగా ఉన్న 'రాశీ' తక్కువ సమయంలోనే స్లిమ్ గా మారిపోయిందని టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయంట. ఆమె నటించిన చిత్రాలు రిలీజ్ అయితే మాత్రం తెలియదు..ఎంత స్లిమ్ అయ్యిందో...అప్పటి వరకు వెయిట్ అండ్ సి...

17:07 - August 14, 2017

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా వాయిదాపై వచ్చిన వార్తలన్నీ కేవలం పుకార్లని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ తేల్చేసింది. అనుకున్న తేదీ సెప్టెంబరు 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని చెప్పింది. ‘లవ’ పాత్రకు సంబంధించిన టీజర్‌ను కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో ఎన్టీఆర్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల ‘లవ’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాలకు సోషల్‌మీడియాలో విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. కల్యాణ్‌రామ్‌ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

 

10:39 - April 19, 2017

టాలీవుడ్ లో రాశీ ఖన్నా పలు చిత్రాల్లో ఛాన్స్ లు అందుకుంటూ దూసుకెళుతోంది. ఇప్పటికే ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. 'ఊహలు గుసగుసలాడే'లో అమాయకంగా, 'హైపర్' లో గ్లామర్ గా కనిపించిన 'రాశీ ఖన్నా' 'సాయిధరమ్ తేజ్‌' 'సుప్రీమ్' లో బెల్లం శ్రీదేవిగా ప్రేక్షకులను అలరించింది. ఇటీవల యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సినిమాలోనూ ఆఫర్ పట్టేసింది ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మలయాళంలో అరంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధమవుతోందంట. తెలుగు, తమిళం, మలయాళంలో ఈ చిత్రానికి ఆదరణ లభించాలనే ఉద్ధేశ్యంతో ఉన్ని కృష్ణన్ ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆయా భాషాల్లో పేరు గాంచిన పలువురు నటీ నటులను సినిమాలో నటించనున్నారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా హన్సిక, శ్రీకాంత్, మంజువారియర్ లాంటి స్టార్స్ నటిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇక ఈసినిమాలో 'రాశీ ఖన్నా' విలన్ గా నటిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఓ అవినీతి పోలీసు అధికారిణిగా నటించబోతోందని మరో ప్రచారం జరుగుతోంది. రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

13:04 - April 12, 2017

జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న చిత్రం 'జై లవకుశ'..ఎన్టీఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో విశేషాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నివేదా థామస్' ఫొటోతో ఈ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ మధ్య పోస్టర్ తో మొదటి హీరోయిన్ 'రాశీ ఖన్నా' అని చిత్ర యూనిట్ కన్ ఫాం చేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, అందులో ఒకటి పూర్తిగా నెగటివ్ పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విలన్ పాత్రకు జతగా 'సమంత' నటించనుందని టాక్. ఇక 'నివేదా థామస్' జెంటిల్మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం నాని నటిస్తున్న 'నిన్ను కోరి' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

20:08 - October 22, 2015

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బెంగాల్‌ టైగర్‌' త్వరలో విడుదల కాబోతోంది. కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాస్‌ డైలాగ్స్ కు పెట్టింది పేరైన మాస్‌ మహరాజ్‌ హీరో రవితేజ. ఈ మధ్య కాస్త రూటు మార్చి చేసిన కిక్‌2 సినిమా రవితేజకి పెద్దగా కిక్‌ ఇవ్వలేదు. దీంతో మళ్లీ తనకు బిగ్గెస్ట్ హెల్ప్ అయిన మాస్‌ మసాలా కథతో చేసిన సినిమా 'బెంగాల్‌ టైగర్‌' ఈ టైటిల్‌తో ఎంత పవర్‌, ఎంత మాస్‌ ఉందో దానినే సినిమాలో చూపించటానికి ట్రై చేశారు. ఈ సందర్భంగా రవితేజ, తమన్నలు సినిమా విశేషాలు వెల్లడించారు. 

13:53 - September 23, 2015

ఎనర్జిటిక్ స్టార్ 'రామ్' హీరోగా రూపొందిన చిత్రం 'శివమ్' అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రామ్' సరసన 'రాశీ ఖన్నా' హీరోయిన్ గా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హై ఓల్టేజ్ లవ్ స్టోరీతో రూపొందిందని 'స్రవంతి' రవికిశోర్ పేర్కొన్నారు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ అన్నారు. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేశారని, కథాబలం ఉన్న చిత్రమన్నారు. ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు.
 

Don't Miss

Subscribe to RSS - రాశీ ఖన్నా