రాష్ట్రపతి

21:49 - August 14, 2017

ఢిల్లీ : 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలు సమాజం, జాతి నిర్మాణానికి దోహదం చేశాయని...ఇప్పటికి ఆయన సిద్ధాంతాలు అనుసరణీయమని రాష్ట్రపతి అన్నారు. జాతి నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున... న్యూ ఇండియా దిశగా అడుగులు వేయాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. న్యూ ఇండియా అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు, అవసరానికి సరిపడే విద్యుత్‌, మంచి రోడ్లు, ఆధునిక రైల్వే నెట్‌వర్క్‌ లాంటి అభివృద్ధి లక్ష్యాలను సాధించాలన్నారు. 

19:19 - August 14, 2017

ఢిల్లీ : దేశాధినేతగా నూతనంగా ఎన్నికైన రాంనాథ్ కోవింద్ జాతి ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు 71వ స్వాతంత్రదినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. తన తొలి ప్రసంగంలో గాంధీ, అంబేద్కర్, నెహ్రూలను ప్రస్తావించారు. స్వాతంత్రం కోసం పోరాడిన వారికి మనం రుణపడి ఉన్నామని రాష్ట్రపతి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:04 - August 11, 2017

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవిలో నియమితులైన వెంకయ్య నాయుడికి అభినందనలు తెలియచేస్తున్నట్లు ఈ సందర్భంగా గురజాడ మాటలు గుర్తు పెట్టుకోవాలని సీతారాం ఏచూరి సూచించారు. ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్య నాయుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ గా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి ప్రసంగించారు. ఇక్కడ గురజాడ అప్పారావు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. 'దేశ మంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్' అని చెప్పారని, దీనికి అనుగుణంగా పనిచేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. వెంకయ్య నాయుడు ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చొన్నారని, రాజ్యసభ పని విధానం అందరికంటే ఎక్కువ వెంకయ్యకు తెలుసన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:55 - August 11, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్ రాజకీయాలకతీతంగా పనిచేయాలని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్య నాయుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ గా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ ప్రసంగించారు. తన తరపున, తమ పార్టీ సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు ఆజాద్ తెలిపారు. ఈ సభకు వెంకయ్య కొత్తేమీ కాదని..ఎంపీగా..మంత్రిగా..పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా..పనిచేశారని, ఆ సమయంలో ఆయనతో వాదనలు జరిగేవని, సభ నుండి బయటకు వచ్చిన అనంతరం ఆత్మీయంగా మాట్లాడేవారని తెలిపారు.

వివిధ పార్టీల్లో కష్టపడి పనిచేసి పైకి వస్తుంటారని ఆ విధంగానే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు వెంకయ్య ఎదిగారన్నారు. వెంకయ్య విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదిగారని, రైతు కుటుంబం నుండి వచ్చి రాష్ట్రపతిగా ఎదిగారని పేర్కొన్నారు. చాలా కాలం పాటు వెంకయ్యతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:12 - August 11, 2017

ఢిల్లీ : భారత 15వ ఉప రాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.

అంతకంటే ముందు వెంకయ్య నాయుడు ప్రముఖులకు నివాళులర్పించారు. రాజ్ ఘాట్ కు చేరుకుని మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. దీన్ దయాళ్ విగ్రహానికి..సర్ధార్ వల్లభాయ్ పటేల్ ల కు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వెంకయ్య నాయుడుని పలువురు కలిసి అభినందనలు తెలియచేశారు. 

09:14 - August 11, 2017

ఢిల్లీ : వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పీఠం కూర్చొబోతున్నారు. కాసేపట్లో 15వ ఉప రాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

ప్రముఖులకు వెంకయ్య నివాళులు..
ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్ ఘాట్ కు చేరుకుని మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. దీన్ దయాళ్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వెంకయ్య నాయుడుని పలువురు కలిసి అభినందనలు తెలియచేశారు.

హమీద్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు..
రాజ్యాంగబద్ధమని భావించే ఈ పదవుల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల వ్యక్తులు నియామకం కావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి పదవికి నేటితో గుడ్ బై చెప్పబోతున్న హమీద్ అన్సారీ చివరి ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌లో ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయని, దేశ పౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయమ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. ఉప రాష్ట్ర‌ప‌తి హోదాలో ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సబబు కాదని పేర్కొంటున్నారు. 

08:37 - July 28, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా  కలిశారు.  రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకు మద్దతు తెలిపినందుకు సీఎం కేసీఆర్‌కు రామ్‌నాథ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.  సీఎం వెంట టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, మంత్రి జగదీష్‌రెడ్డి ఉన్నారు. 

 

17:02 - July 26, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగంపై రాజ్యసభలో దుమారం రేగింది. కోవింద్‌ జాతిపిత మహాత్మాగాంధీతో సమానంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయను పోల్చడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిజెపి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూలను అవమానమించిందని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎలా ప్రశ్నిస్తారని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆనంద్‌శర్మ వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగించాలని డిప్యూటి చైర్మన్‌ కురియన్‌ను కోరారు. టీవీలో కనిపించడానికే కాంగ్రెస్‌ నేతలు రాద్దాంతం చేస్తున్నారని జైట్లీ మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కలిగే సమాజ నిర్మాణం కోసం గాంధీ, దీన్‌దయాల్‌ కన్న కలలను సాకారం చేయాలని రాష్ట్రపతి అన్నారు.

17:13 - July 25, 2017

ఢిల్లీ : భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నియమితులయ్యారు. కాసేపటి క్రితం పార్లమెంట్ సెంట్రల్ హౌస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ఎంపీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఎన్డీయే పక్ష రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్, విపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ పడిన సంగతి తెలిసిందే.

16:54 - July 25, 2017

ఢిల్లీ : భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌. ఖేహర్ కోవింద్‌ చేత ప్రమాణం చేయించారు.  రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా కోవింద్‌ గుర్తింపు పొందారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా 21 శతఘ్నులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతిని ప్రణబ్‌ ముఖర్జీ తన ఆసనంలో కూర్చోబెట్టారు. కోవింద్‌ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ , ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విదేశీ దౌత్యాధికారులు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా తొలిసారి ప్రసంగం చేశారు. 125 కోట్ల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని కోవింద్‌ తెలిపారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - రాష్ట్రపతి