రిజర్వేషన్

17:49 - September 9, 2018

విశాఖపట్నం : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాపులకు సమయం ఆసన్నమైందని కాపు సంఘం నేత ముద్రగడ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కాపు నాడు సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని..కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాటనే మరిచిపోయారని గుర్తు చేశారు. ఒకవేల రిజర్వేషన్లు అమలు చేస్తే కాపులు టిడిపి వైపు నిలబడుతారా ? లేదా ? అనే అనుమానం బాబులో ఉందన్నారు. అలాంటి అపోహలు బాబు విడనీడాలని ముద్రగడ సూచించారు. రాష్ట్రంలోని కాపు కులస్థులు ఎవరిసంచి వారిది అన్నట్లుగా ఆయా పార్టీల్లో మనుగడ సాగిస్తున్నారని అన్నారు. కాపులకు మేలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 30ని జారీ చేసిందని కానీ కాంగ్రెస్ ను కాపులు ఓడించారని తెలతిపారు. రాజ్యాధికారం కోసం పోరాడాలని కాపులకు పిలుపునిచ్చారు. 

20:25 - March 22, 2018

తెలంగాణల నీళ్ల పంచాది సుర్వైనట్టే అనిపిస్తున్నది.. ఇంక ఎండకాలం పూరాగ రానేలేదు అప్పుడే ఆడోళ్లంత బిందెలు చేతుల వట్కోని రోడ్ల మీదికొస్తున్నరు..తెలంగాణ గౌడన్నలు.. మీరంత తలా ఇంత చెక్కరి దీస్కోని నోట్లె వోస్కోండ్రి మీకు తియ్యటి ముచ్చట జెప్పిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు..ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంల సద్వులు సత్రోలున్నయ్ రా నాయనా అంటే.. ఇప్పుడు టెన్త్ ప్రశ్నా పత్రం మళ్ల లీక్ జేశిండ్రట..ఉట్టి కెగరలేనోడు.. స్వర్గానికెగిశినట్టుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చట అంటున్నడు జేఏసీ చైర్మన్ కోదండరాం సారు.. దేశం గాని దేశం బొయ్యి తిప్పలవడ్తున్నరు తెలంగాణ బిడ్డెలు..ముందే డీజీపీ అంటె పోలీసోళ్లకు పెద్దాయిననాయే.. ఇగ ఆయన సుట్టాలంటే ఎట్లుంటది కథ..? అమ్మరె కొడ్క వాని పేరేంది... ఆ హార్దిక్ ప్యాండ్య.. వాడు సప్పుడు జేక కిర్ కేట్ ఆడుకోని బత్కకా..? బాబా సాహెబ్ అంబేదర్క్ అంటే ఎవ్వడు.. తొవ్వొంట వోతుంటే పదిరూపాల నోటు దొర్కిందే అనుకో ఏం జేస్తం..ఉప్పు నిర్పకాయల పప్పు బెల్లాలు నకిలీయి తయ్యారు జేస్తున్నరంటె ఇన్నంగని..గిసొంటి ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:34 - March 22, 2018

ఢిల్లీ : రిజర్వేషన్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. 13 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. తమ పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఈ సందర్భంగా టెన్ టివి టీఆర్‌ఎస్‌ ఎంపీలు సీతారాంనాయక్‌, బాల్క సుమన్‌ లతో ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:17 - March 10, 2018

హైదరాబాద్ : గిరిజన రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన బాధ్యతలు విస్మరించి.. కేంద్రంపై నెట్టడాన్ని జీవన్‌రెడ్డి తప్పుపట్టారు. నాలుగేళ్లుగా ప్రధాని మోదీకి భేషరతుగా మద్దతు తెలిపిన కేసీఆర్‌... రిజర్వేషన్ల పెంపును ఎందుకు సాధించుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

 

14:49 - March 8, 2018

హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లభించని మోక్షం ఎప్పుడెప్పుడాని దేశవ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి అంటే 1996 నుంచి పార్లమెంట్‌లో నానుతోంది మహిళా బిల్లు. ఈ నేపథ్యంలో 2010 మార్చి 9 మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందింది. కానీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో పాస్‌ కాలేదు. అప్పటి నుండి మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతూవున్నాయి. మరి ఈ బిల్లుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిఅవసరం ఎంతైనా వుందని ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వాలని దేశవ్యాప్తంగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ ఈచర్చలో సామాజిక కార్యకర్త దేవీ, ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ, ప్రొఫెసర్ రేణుక పాల్గొన్నారు. 

14:38 - March 8, 2018

హైదరాబాద్ : ఒక పువ్వు జీవిత కాలం ఒక రోజు..ఒక మనిషి జీవిత కాలం వందేళ్లు.. ఇలా దేనికైనా ఒక కాలం, పరిమితి ఉంది. కాని మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఎప్పుడు మోక్షం లభిస్తుంది అన్న దానికి మాత్రం సమాధానం కాని, కాల పరిమితి కాని కనిపించడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తున్నాయి..పోతున్నాయి.. ఈ ఒక్క రోజు మాత్రం సర్వం నారీమణే. ఆ తరువాత పాలకులు మహిళా రిజర్వేషన్‌ బిల్లుకాని, చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యంపైన కాని నోరు మెదపరు..మెదపనివ్వరు. అలాంటి మహిళాలోకం చట్టసభలను శాసించలేకపోతోంది. చక్రం తిప్పగల సత్తా ఉన్నా పాలకుల నిస్సిగ్గు చర్యలకు , నిర్లక్ష్యానికి ఇంకా భర్త చాటు పాలనకే పరిమితం అవుతోంది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లభించని మోక్షం :
ఏళ్లకు ఏళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఈ ఏడాది చదివిన ప్రసంగాన్నే పాలకులు, ప్రతినిధులు మరోసారి చదవి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపేసి చేతులు దులుపుకుంటున్నారు. కాని చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యాన్ని పెంచే మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మాత్రం బూజును వదిలించడం లేదు.

1996 నుంచి నానుతున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు: 
పార్లమెంటులో ఎక్కువ కాలం ఆమోద ముద్ర పడకుండా ప్రతీసారి చర్చకు వస్తున్న బిల్లే మహిళా రిజర్వేషన్‌ బిల్లు. 1996 నుంచి మహిళా రిజ్వేషన్‌ బిల్లు పార్లమెంటులో నానుతూనే ఉంది. చట్టసభల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన ఈ బిల్లుకు ఇప్పటి వరకు ఆమోదముద్ర పడలేదు అంటే మహిళల పట్ల పాలకులకు ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థం అవుతుంది.

2010 మార్చి 9 రాజ్యసభ ఆమోదం : 
108 సవరణల తరువాత మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు 2010 మార్చి తొమ్మిదవ తేదీన రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. కాని లోక్‌సభలో బిల్లు అక్కడే ఉండిపోయింది. కారణం పాలకులు చెప్తున్నది మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇప్పుడు ఉన్న మద్దతు సరిపోదు అని.

చట్టసభల గడపతొక్కుతున్న మహిళల సంఖ్య నామమాత్రం: 
ఫలితం
అత్యున్నత చట్టసభ గడపతొక్కుతున్న నారీ మణుల సంఖ్య అరకొరగానే ఉంటోంది. లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం అంతంతమాత్రమే. దీనికి తెలుగు రాష్ర్టాలు కూడా అతీతమేమీ కాదు. మన రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టిన మహిళల సంఖ్య తక్కువుగానే ఉంటోంది.

లోక్‌సభకు మొదటిసారిగా 1952లో ఎన్నికలు : 
లోక్‌సభకు మొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 28 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మెజార్టీ సభ్యులను దిగువసభకు పంపిన క్రెడిట్‌ కాంగ్రెస్‌దే. తరువాత స్థానం టీడీపీది. సీపీఐ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఒక్కొక్కరు లోక్‌సభ గడపతొక్కారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. సీపీఐ నుంచి వి విమలాదేవి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1957లో లోక్‌సభకు ముగ్గురు మహిళలు : 
మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి మహిళలెవరూ ఎన్నిక కాలేదు. 2వ లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళా ప్రాతినిధ్య ప్రస్థానం ప్రారంభమైంది. 1957లో జరిగిన ఈ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు దిగువసభకు ఎన్నికయ్యారు.

1957 లోక్‌సభ ఎన్నికలు : 
కాంగ్రెస్‌ నుంచి మొత్తం 19 మంది లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1957లో ఏలూరు నియోకవర్గం నుంచి కెయం వేద కుమారి, విజయవాడ నుంచి కె అచ్చమాంబ, మెదక్‌ నుంచి సంగం లక్ష్మిభాయి లోక్‌సభ గడప తొక్కారు. 1962లో ఖమ్మం నుంచి టి లక్ష్మీకాంతం, కర్నూలు నుంచి యశోదారెడ్డి, మెదక్‌ నుంచి సంగం లక్ష్మీబాయి గెలిచారు. 1967లో టి లక్ష్మీకాంతం ఖమ్మం నుంచి, భద్రాచలం నుంచి రాధాబాయి , సంగం లక్ష్మిభాయి మెదక్‌ నుంచి దిగువసభకు ఎన్నికయ్యారు. ఇలా ప్రతీసారి చట్టసభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య నామమాత్రంగానే ఉంది. 33.33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం లభిస్తేనే కాని ఈ పరిస్థితి మారదు అన్నది అక్షర సత్యం. ఇది చేయకుండా పాలకులు ఎన్ని మహిళా దినోత్సవాలను జరిపినా అది మహిళా సాధికారితకు ఏ మాత్రం ఉపయోగపడదు అన్నది కూడా కఠిన వాస్తవం.

14:21 - December 2, 2017

చిత్తూరు : ఏ నాటి నుండో డిమాండ్ ఉన్న కాపు..బలిజలను బీసీల్లో చేరుస్తూ టిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాపు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి వద్ద కాపు..బలిజ నేతలు శ్రీవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. మంచి ఉద్యోగ, ఉన్నత ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని బాబు చెబుతూ వస్తున్నారని, అదే విధంగా చేశారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:10 - December 1, 2017

విజయవాడ : కాపుల రిజర్వేషన్ లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ లో సుదీర్ఘంగా దీనిపై చర్చించింది. ఈ భేటీ కంటే ముందుగా మంజునాథ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. కేబినెట్ లో మంజునాథ కమీషన్ సభ్యులు పాల్గొన్నారు.

గత ఎన్నో సంవత్సరాలుగా కాపులను బీసీల్లో చేర్చాలని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో పాదయాత్ర చేసిన సందర్భంలో కాపులను బీసీల్లో చేర్చుస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాపుల రిజర్వేషన్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రభుత్వం పలు హాహీలు గుప్పించింది.

ఇదిలా ఉంటే మంజునాథ కమిషన్ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం..దీనిపై ఏపీ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. చివరకు కాపు బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాపుల కోసం బీసీ ఎఫ్ కేటగిరి ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం కేబినెట్ మరోసారి భేటీ అయి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ అంశాన్ని 57 శాతానికి పెంచాలని..తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ తరహాలో రిజర్వేషన్ కల్పించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. మరి కేంద్రం..ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

14:36 - November 30, 2017

విజయవాడ : ఏపీ శాసనసభలో గురువారం రెండు తీర్మానాలను ఆమోదించారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతం..మహిళలకు రిజర్వేషన్ అంశాలపై తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అంతకంటే ముందు సీఎం చంద్రబాబు మాట్లాడారు. పిల్లలను లేబర్ గా మారిస్తే కఠినంగా శిక్షిస్తామని..పీడీ యాక్టు ప్రయోగిస్తామని ఆనాడు చెప్పడం జరిగిందని సభకు తెలిపారు. మహిళా పార్లమెంట్ సదస్సు..చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్..తీర్మానాలను ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతం కృషి స్పీకర్ కోడెల ఎనలేని కృషి చేశారని..ఇందుకు శాసనసభ అభినందిస్తోందన్నారు. అమరావతిలో మహిళా పార్లమెంట్ జరగడం అభినందనీయమని..ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం గర్వకారణమన్నారు. ఒక స్పూర్తిదాయక కార్యక్రమమన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సుకు అందరూ సహకరించారని, అందరూ సహకరించిన బట్టే విజయవంతమైందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. మహిళలకు 33.33 రిజర్వేషన్ కోసం బాబు తీర్మానం ప్రవేశ పెట్టారు. అనేక మంది వీరవనితలు పుట్టిన ఘనతలో మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారని,

మహిళలు ఆకాశంలో సగభాగమనేది అక్షరసత్యమని..భారతీయ కుటుంబ వ్యవస్థలో మహిళలే నిజమైన యజమానులన్నారు. కార్పొరేట్ సంస్థలను ఒంటి చేత్తో పాలిస్తున్నారని..క్రీడారంగాల్లో..ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మహిళలు ముందున్నారని..చట్టసభలో వీరి ప్రాతినిధ్యం పెరగాలని సభ భావిస్తోందన్నారు. చట్టసభల్లో వీరికి సరియైన ప్రాతినిధ్యం లేకపోవడం సభ విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. 

07:56 - November 27, 2017

రిజ్వేషన్ల కోసం ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేపట్టే ధర్నాకు డీఎంకే మద్దతు ప్రకటించింది. రిజర్వేషన్లు అనేవి రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి...కేంద్రం జోక్యం..ఇతర రాష్ట్రాల పోలిక అంశాన్ని స్టాలిన్ లేవనెత్తుతున్నారు...మరోవైపు వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీకి చెందిన గిడ్డి ఈశ్వరీ టిడిపి కండువా కప్పుకోనున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ), చంద్రశేఖరరెడ్డి (టీఆర్ఎస్), దినకరన్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - రిజర్వేషన్