రిజర్వేషన్లు

10:20 - September 20, 2018

ఢిల్లీ : భారతదేశంలో నివసిస్తున్న వారంతా..గుర్తింపు ఉన్న భారతీయులేనన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్. కులతత్వంపై ఆర్ఎస్ఎస్ కు నమ్మకం లేదన్న ఆయన...కులమతాలకు అతీతంగా అందరూ ఎదగాల్సిన అవసరముందన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు అవసరమేనన్న భగవత్...రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఎప్పటివరకు కొనసాగాలనేది వారే నిర్ణయించుకోవాలని చెప్పారు. 
హిందూలందర్ని ఐక్యంగా ఉంచడానికే ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్‌ మోహన్ భగవత్. డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ ముగింపు సమావేశాల్లో మోహన్ భగవత్ కీలకోపన్యాసం చేశారు. దేశంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు అవసరమేనని స్పష్టం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రిజర్వేషన్ విధానానికి సంఘ్ మద్దతిస్తుందన్న ఆయన.... ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని చెప్పుకొచ్చారు. 

భారతదేశంలో నివసిస్తూ భారతీయులుగా గుర్తింపు ఉన్న వారంతా హిందువులేనని భగవత్ అన్నారు. అంతా మనవాళ్లే, అంతా కలిసిమెలిసి ఉండాలన్నదే భారతీయ సిద్ధాంతమన్న ఆయన...ఐక్యతను ప్రతి హిందువు నమ్ముతాడన్నారు. భారతీయులంతా హిందువులేన్న భగవత్... హిందువులందరినీ ఐక్యంగా ఉంచడానికే ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. హిందూ దేశం అంటే ముస్లింలకు స్థానం లేదని అర్థం చేసుకోరాదన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ ఎదగాల్సిన అవసరం ఉందన్నారు మోహన్ భగవత్, కులతత్వంపై ఆర్ఎస్ఎస్‌కు నమ్మకం లేదన్న ఆయన...అన్నిమతాలు సమానమేనని, మత మార్పిడులు అవసరం లేదన్నారు. మతమార్పిడుల కోసం మతాన్ని ఉపయోగించుకోరాదన్నారు. అసలు మతమార్పిడుల అవసరం ఏముందున్నారు. గోసంరక్షణ పేరుతో సాటి మనుషులను కొట్టిచంపడం సమర్ధనీయం కాదన్న ఆయన... మూకుమ్మడి హింసాకాండలు జరగరాదన్నారు.

07:37 - August 1, 2018
13:29 - July 30, 2018

ప్రకాశం : కాపులకు రిజర్వేషన్ విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన మంత్రి సోమిరెడ్డి స్పందించారు. కాపుల విషయంలో జగన్ యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఇచ్చే హామీలు అమలు చేయాలంటూ ఢిల్లీని అమ్మాలని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ పెట్టి కాపులను ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందని, వైసీపీ రాష్ట్రంలో బంద్ లు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. 

16:13 - July 25, 2018

మహారాష్ట్ర : మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరాఠా క్రాంతి మోర్చా చేపట్టిన మహారాష్ట్ర బంద్ కొనసాగుతోంది. బంద్‌ కారణంగా ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రజారవాణా స్తంభించింది. ఆందోళనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో అధికారులు బస్సులు నిలిపివేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు టాక్సీలను ఆశ్రయిస్తున్నారు. థానేలో ఆందోళనకారులు బస్సులను ధ్వంసం చేశారు. లోకల్‌ రైళ్లను అడ్డుకున్నారు. రోడ్లపై టైర్లను తగులబెట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. ముంబై, ఔరంగాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలపై బంద్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఔరంగాబాద్‌లో అగ్నిమాపక వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంగళవారం నాటి రాళ్లు రువ్విన ఘటనలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ... ఔరంగాబాద్‌లో ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో మరాఠాలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 

21:08 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మానించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును యాథాతథంగా అమలు చేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అగస్టు ఒకటితో పంచాయితీల కాలపరిమితి ముగుస్తుండటంతో స్పెషల్ అఫీసర్లను వేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గఉప సంఘం అభిప్రాయపడింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్‌ కమిటీ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది.

ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఈలోపు ఎన్నిక‌లు నిర్వహించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై కూడా సబ్‌కమిటీ చ‌ర్చించింది. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్లను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని...ఈ సారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణయించిన‌ట్లు ఈటల తెలిపారు.

జూలై 31 తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంద‌ని...ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యత‌లు అప్పగించాలా లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. దీనితో పాటు బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌న్నది కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

ఇక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం సుప్రీం కోర్టులో తమ వాదనలు గట్టిగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్లనేవి విద్యా, ఉద్యోగాలపై మాత్రమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోంది. ఇక తమిళనాడు 69 శాతం ఉన్నపుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కక్క విధంగా ఎందుకు ఉండాలనే వాదనను సుప్రీం కోర్టులో వినిపిస్తామని చేప్తోంది.

13:48 - July 10, 2018

హైదరాబాద్ : పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు 61 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్‌. బీసీలకు 61 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామన్నారు. గతంలో రిజర్వేషన్లపై సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరతమన్నారు.  

 

13:21 - July 10, 2018

హైదరాబాద్ : రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి యువత ఆకాంక్షలను నెరవేర్చాలని యంగ్‌ లీడర్స్‌ సంస్థ డిమాండ్‌ చేసింది. చట్ట సభల్లో యువత వాటా అనే అంశంపై హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో  నిన్న రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా యువ, విద్యార్థి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశ జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ ఉన్న యువతకు చట్ట సభల్లో, విధాన నిర్ణయాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని యంగ్‌ లీడర్స్‌ అధ్యక్షుడు పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. చట్ట సభల్లో యువతకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని.. 65 సంవత్సరాలు పైబడిన రాజకీయ నాయకులకు చట్టసభలతో పాటు ఇతర రాజ్యాంగ పదవుల్లో అవకాశం ఇవ్వకూడదన్నారు. 

 

06:35 - July 5, 2018

బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించి వారికి బీసీ రిజర్వేషన్లు పంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ఎంబీసీ సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశాన్ని కోర్టు వరకూ తీసుకెళ్లింది. ఇప్పటికీ స్థానిక సంస్థల్లో అధికారాన్ని అందుకోలేని బీసీ కులాలు చాలా ఉన్నాయని వారికి కూడా అధికారంలో సమాన అవకాశాలు దక్కాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఎంబీసీ సంఘం ఆందోళన చేస్తోంది. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఎంబీసీ సంఘం నాయకులు ఆశయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:07 - April 23, 2018

విజయవాడ : దళితులపైన దాడులు.. మహిళ పై అత్యాచారాలు పెరిగాయన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. దళితులు చంద్రమండలంలోకి.. వెళ్లగలుగుతున్నాడు గానీ... గర్భగుడిలో పోలేకపోతున్నాడని మండిపడ్డారు. దళితులకు కేరళ ప్రభుత్వం గర్భగుడిలో వెళ్లాడానికి అవకాశం ఇచ్చిందని... అలాగే టీడీపీ కూడా దళితులకు గర్భగుడిలో ప్రవేశం కల్పించాలన్నారు. దళితులకు దేవాదాయ ధర్మదాయశాఖలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. త్వరలోనే సమావేశమై ప్రత్యేక హోదాపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు ఒక రోజు నిరాహార దీక్షకు ఎన్ని కోట్లు ఖర్చయిందో ప్రజలకు చెప్పాలని మధు డిమాండ్‌ చేశారు. 

16:39 - March 26, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాస్తోందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కేంద్ర పభుత్వాన్ని విమర్శించారు. ఎంపీలతో కేసీఆర్ భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మాట్లాడుతు..కేంద్రప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగినంతకాలం తాము రిజర్వేషన్స్ పై పోరాటాన్ని కొనసాగిస్తునే వుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జనాభా పెరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగా రిజర్వేషన్స్ ను అమలు చేయాల్సిన అవసరముందన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభయిన 5 తేదీ మార్చి నుండి రిజర్వేషన్స్ కోసం టీఆర్ఎస్ నిర్విరామంగా పోరాడతున్నామని ఎంపీ వినోద్ తెలిపారు. అలాగే కావేరీ బోర్టును ఏర్పాటు చేయాలని కర్నాటవాసులు కూడా పోరాడాతున్నారనీ..ఈ క్రమంలో మమ్మల్ని బూచిగా చూపించి ఏపీకి సమస్యలపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చింటంలేదన్నారు. ఒకే దేశం ఒకే చట్టం వుండాలని అందుకనే రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నామన్నారు. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని వినోద్ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్స్ అంశం గురించి పలు పార్టీ నేతల మద్దతును కోరామన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఈర్ తో టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల అధికారాలు రాష్ర్టాలకే అప్పగించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ భేటీలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత, ప్రభాకర్‌రెడ్డి, సుమన్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావులు పాల్గొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రిజర్వేషన్లు