రిలీజ్

15:48 - October 9, 2017

సినిమా : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పద్మావతి ట్రైలర్‌ వచ్చేసింది. ట్రైలర్‌ మొత్తంలో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ క్రూరత్వాన్ని, మహారావల్‌ రతన్‌ సింగ్‌, రాణి పద్మావతి అనుబంధాన్ని, ఖిల్జీ-రతన్‌ సింగ్‌ల మధ్య జరిగే యుద్ధాన్ని చూపించారు. ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌, మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, పద్మావతి పాత్రలో దీపిక పదుకొణె నటిస్తున్నారు. రాజ్‌పుత్‌ల ఖడ్గంలో ఎంత శక్తి ఉంటుందో వారి కంకణంలోనూ అంతే శక్తి ఉంటుందని దీపిక...రాజ్‌పుత్‌ల గురించి గొప్పగా చెబుతున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. 

13:59 - August 29, 2017

హైదరాబాద్: కింగ్ నాగార్జున తన పుట్టిన రోజు సందర్భంగా హర్రర్ థ్రిల్లర్ చిత్రం రాజుగారి గది 2 చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ను సమంత చేతుల మీదుగా విడుదల కావడం విశేషం. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారిగదికి సీక్వెల్ గా రాజు గారి గది 2 చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో నాగ్ మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడు. సీరత్ కపూర్, సమంతలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థ‌మన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పీవిపి సినిమా మరియు ఓఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబ‌ర్ 13న ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

13:53 - August 22, 2017

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. చిరు పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'సైరా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ మెగా అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా.. సైరా నరసింహారెడ్డి గా మార్పు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. అదే విధంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు నటిస్తున్నారు. 

20:08 - July 31, 2017

హైదరాబాద్ : అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ప్రజా సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. ఏపీలోని మరో రెండు జిల్లాల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయాల్సి ఉందన్న పవన్‌.. తెలంగాణలో పార్టీ కమిటీలను పూర్తి చేశామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

11:08 - July 26, 2017

హైదరాబాద్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'పైసా వసూల్' ఫస్ట్ లుక్స్ ను కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. చిత్రం 'స్టంపర్' ఈ నెల 28న ఉదయం 10.22కు విడుదల చేస్తామని చెబుతూ 'స్టంపర్ కా బాప్', 'టీజర్ కా బేటా' అంటూ 24 సెకన్ల నిడివి వున్న ఫోటోలతో కూడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇందులో బాలయ్య గడ్డంతో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తుండటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

11:25 - July 24, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుండో వేచి చూస్తున్నారు. మురుగదాస్ దర్వకత్వంలో రూపొందుతున్న సినిమాలో 'మహేష్ బాబు' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'స్పైడర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్..టీజర్ విషయాల్లో కూడా లేట్ చేసిన సంగతి తెలిసిందే.

నెమ్మదిగా షూటింగ్ చేయడం వల్లే సినిమా విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఎగ్జయింట్ మ ఎంట్ ను చిత్ర బృందం అస్సలు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. జులైలో రావాల్సిన సినిమా ఆగస్టుకు వాయిదా పడడం..మళ్లీ సెప్టెంబర్ చివరి తేదీకి మార్చారని తెలుస్తోంది.

రెండు భాషల్లో విడుదలయ్యే ఈ సినిమా విడుదలపై తేదీపై క్లారిటీ రావడం లేదని టాక్. కానీ సెప్టెంబర్ 27వ తేదీన చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని..ఒక్క పాట కూడా పూర్తయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది.

'రకూల్' హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో 'మహేష్' రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. మరి సెప్టెంబర్ నెలలో వస్తాడా ? రాడా ? అనేది వెయిట్ అండ్ సీ..

11:29 - July 22, 2017

హైదరాబాద్: రాజుగారి గది-2 అక్టోబర్ 12 న విడుదలకు సిద్ధమవుతోందని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, పోస్ట్-ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయని యూనిట్ తెలిపింది. హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా లో మొట్టమొదటి సారిగా నాగార్జున తన కెరీర్ లోనే వెరైటీ రోల్ పోషిస్తున్నాడు. సమంత ఘోస్ట్ (ఆత్మ) గా నటిస్తుండడం విశేషం. సీరత్ కపూర్ హీరోయిన్. రాజుగారి గది ఫస్ట్ పార్ట్ సీక్వెల్ గా తీసిన ఈ చిత్రంలో రావు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ ప్రధాన తారాగణం.

13:21 - July 12, 2017

బాలీవుడ్ హీరోయిన్ దివ్యా దత్తాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో స్టేజ్ పైకి 'దివ్యా'ను పిలవకపోవడంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై ఏడుస్తూ వెనుతిరిగారు. నావాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్రలో 'బాబూ మోషాయ్ బందూక్ బాజ్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో 'దివ్యా దత్త' కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర ట్రైలర్ మంగళవారం విడుదల చేశారు. ఇందుకు ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి చిత్ర బృందం చేరుకోగా 'దివ్యా దత్త' మాత్రం కిందనే ఉండిపోయింది. స్టేజ్ పైకి ఆమెను పిలవకపోవడంతో కిండనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనితో దివ్య దత్త తీవ్ర ఉద్వేగానికి లోనే కన్నీళ్లు కార్చారు. ఏడుస్తూ ఈవెంట్ నుండి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చిత్ర బృందం ఆమెకు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

 

16:01 - June 30, 2017

సినిమా రంగంలో ఉన్న హీరోలు తమ తమ చిత్రాలను రిలీజ్ చేసుకొనే విషయంలో ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇతర హీరోల చిత్రాలు అదే డేట్ లో రిలీజ్ అయితే ఇబ్బందులు తప్పవని భావించి ముందే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు టాక్. మొండి వైఖరితో ముందుకెళ్లకుండా ఒకరితో ఒకరు చర్చించుకుని ముందుకెళుతున్నారు. ఇటీవలే పలు చిత్రాల రిలీజ్ విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుని వారి వారి చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న 'స్పైడర్'..జూ.ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రాల రిలీజ్ డేట్ విషయంలో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. 'జై లవ కుశ' సినిమా విడుదల సెప్టెంబర్ 21న రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేసినట్లు..కానీ 'స్పైడర్' చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన 'స్పైడర్' విడుదల చేయాలని భావించారంట. కానీ 'జై లవ కుశ' చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు 'స్పైడర్' చిత్రాన్ని సెప్టెంబర్ 22 రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రాల విడుదల తేదీల్లో స్పష్టత రానుంది.

15:08 - June 26, 2017

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ' జై లవ కుశ' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై 'ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' 'బాబీ' దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో 'ఎన్టీఆర్' మూడు పాత్రలను పోషిస్తున్నట్లు..ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారనే వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జై..లవ కుమార్..కుశల్ కుమార్ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఓ పాత్ర ఏకంగా విలన్ అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. విలన పాత్రకు హాలీవుడ్ కు చెందిన మేకప్ మెన్ రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ఫొటోలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. బుల్లితెర హిందీ నటుడు రోనిత్ రాయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రిలీజ్