రీఎంట్రీ

12:07 - April 25, 2018

అగ్రహీరోలతో నటించటమేకాదు..తమకంటు ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని వివాహానంతరం కొంతమంది..వేరే కారణాలతో మరికొంతమంది సినిమా పరిశ్రమకు దూరమైన అనంతరం కొంత విరామం తరువాత మళ్లీ సినిమాలలోకి రావటం మామూలే. కొంతమంది రీ ఎంట్రీతో మళ్లీ సక్సెస్ బాటలో వుంటే ఇంకొందరు వచ్చిన పాత్రలతో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తానంటే సంకేతాలు ఇస్తోంది.

తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన నిన్నటి తరం కథానాయికలలో అంజలా జవేరి ఒకరు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ల సరసన కథానాయికగా చేసిన ఆమె .. చక్కటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్న అంజలా జవేరీ సినిమాలకు దూరం వున్నారు. విరామం అనంతరం ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని అంటున్నారు.

తెలుగులో నిన్నటి తరం కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన నదియా .. భూమిక .. సిమ్రాన్ .. ఖుష్బూ .. మీనా రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ పారితోషికాన్ని అందుకోవడంతో పాటు, మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి వారిని చూసి స్ఫూర్తిని పొందిందో ఏమో తెలియదు గానీ, మంచి కథతో .. అవార్డులు తెచ్చిపెట్టే పాత్రలతో వస్తే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అంజలా జవేరి చెప్పుకొచ్చారు. వెంకటేశ్,చిరంజీవి వంటి అగ్రహీరోలతో చేసిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలా జవేరీ రీ ఎంట్రీ ఎలా వుండనుందో వేచి చూడాలి. 

12:48 - April 11, 2018

మానాన్నకు పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి..తెలుగు ప్రేక్షకులను గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ప్రభావితం చేసిన కథానాయికలలో సిమ్రాన్ ఒకరు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన అవలీలగా చాన్స్ లు కొట్టేసి గ్లామర్ గాల్ గా మెప్పించి 'సమర సింహా రెడ్డి' .. 'కలిసుందాం రా' .. 'నరసింహనాయుడు' .. 'మృగరాజు' వంటి సినిమాలు ఆమె అగ్రకథానాయకులతో చేసింది. అటువంటి సిమ్రాన్ వివాహం తరువాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. కానీ తమిళంలో కొంతకాలం క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, అక్కడ ముఖ్యమైన పాత్రలను చేస్తోంది.

గ్లామర్ గా కనిపిస్తున్న అమ్మ,అత్త పాత్రలు..
ప్రస్తుతం తెలుగు తెరపై అమ్మ, అత్త క్యారక్టర్లంటే హీరోయిన్ కు అక్కల్లాగా కనిపించేంత గ్లామర్ గా కనిపిస్తున్నాయి. ప్రగతి,రాశి,తులసి,రోహిణి వంటి మంచి నటీమణులు అత్తలుగా, అమ్మలుగా మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో సిమ్రాన్ కూడా అత్త పాత్రలో తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక తెలుగు సినిమాను కూడా సిమ్రాన్ అంగీకరించిందనీ .. అందులో అత్త పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథనట. అందువల్లనే అత్త పాత్ర కోసం సిమ్రాన్ ను ఓకే చెసినట్టు తెలుస్తోంది. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది .. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.        

08:12 - June 18, 2016

సినీనటి ఇలియానా టాలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వనుంది. తనకు టాలీవుడ్‌ అంటే ఇష్టమని, మళ్లీ ఇక్కడి సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది ఇల్లీ బేబీ. దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా, ఆ తర్వాత మరెన్నో చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించి, మెప్పించింది. 2012లో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి, అక్కడే అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తెలుగు సినిమాలకు దూరమైపోయింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌ సరసన 'రుస్తుం' చిత్రంలో నటిస్తున్న ఇలియానా, తానెప్పుడూ బాలీవుడ్‌లోనే సెటిల్‌ అవుదామనుకోలేదని తెలిపింది. 'బర్ఫీ' విజయవంతం కావడంతో బాలీవుడ్‌లోనే స్థిరపడతానని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, అందుకే తనకు తెలుగునాట అవకాశాలు ఇవ్వడం మానేశారని చెప్పింది. అయితే తనకు టాలీవుడ్‌ అంటే ఇష్టమని, మళ్లీ ఇక్కడి సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది. 'తెలుగులో తిరిగి నటించడాన్ని ఇష్టపడుతున్నా... టాలీవుడ్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుందన్నారు. ఇక్కడ వరుస సినిమాలు చేశా. బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి అలా లేదని' ఇల్లీ చెప్పింది. 'నేను టాలీవుడ్‌కి తిరిగి రావాలనుకుంటున్నా.. ఇప్పటికీ దర్శకులు పూరీజగన్నాథ్‌, త్రివిక్రమ్‌తోపాటు రానాతో కూడా టచ్‌లో ఉన్నా. ఇక్కడి సినిమాలే కాదు.. హైదరాబాద్‌ బిర్యానీ కూడా మిస్సవుతున్నాన'ని ఇలియానా అంటోంది. 

17:23 - March 22, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా త్వరలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతుందని టాక్. అయితే హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్ తిరిగి ఈ చిత్రంలో కమెడియన్ గా కనిపిస్తారట. అది కూడా ప్రత్యేకించి మెగాస్టార్ అభ్యర్థన మేరకు. చిరు స్వయంగా పిలిచి మరీ సునీల్ ను తన 150వ సినిమాలో కమెడియన్ నటించమని అడిగారని సమాచారం. మొదటి నుంచి చిరంజీవికి ఫ్యాన్ అయిన సునీల్.. 'అన్నయ్య' అడగ్గానే నవ్వుతూ ఓకే చెప్పేశారట. ఇదే నిజమైతే తిరిగి మనం సునీల్ కామెడీ టైమింగ్ కి కనెక్ట్ అవడం గ్యారెంటీ. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

Don't Miss

Subscribe to RSS - రీఎంట్రీ